breaking news
climax portion
-
క్లైమాక్స్ గురించి సల్మాన్ భయపడ్డాడు
తమిళ్ సేతు చిత్రం, తెలుగులో శేషుగా, బాలీవుడ్లో తేరే నామ్‌గా రీమేక్ చేశారు. సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్‌ఖాన్ హీరోగా నటించాడు. 2003లో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, రాధే పాత్రలో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్ ఖాన్ విశేషంగా ఆకట్టుకున్నాడు. అయితే సల్లూభాయ్‌కు ఎంతో పేరు తెచ్చిన ఈ సినిమా ముగింపు మాత్రం అతనికి అస్సలు నచ్చలేదట. ఈ విషయాన్ని దర్శకుడు సతీష్ కౌశిక్ స్వయంగా వెల్లడించాడు. ఈ చిత్ర క్లైమాక్స్ ద్వారా మనం యువతకు తప్పుడు సందేశం ఇస్తున్నామని ఆయన విచారం వ్యక్తం చేశాడని తెలిపాడు. (అది తెలిసి షాకయ్యాను: మాధురీ దీక్షిత్) తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆనాటి విషయాలను పంచుకున్నాడు. "మీరు నమ్మరు గానీ, తేరే నామ్ షూటింగ్ సమయంలో సల్మాన్ ఓ మాట అన్నాడు. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు, ఆ విషయం పక్కన పెడితే క్లైమాక్స్ సన్నివేశంలో యువతకు చెడు సందేశం ఇస్తున్నామని, దీని ద్వారా యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందాడు. ఒక ప్రేక్షకుడిగా, దర్శకుడిగా చెప్పాలంటే... నెగెటివ్, పాజిటివ్ అన్ని రకాల పాత్రలు సినిమాలో ఉండాల్సిందే. కానీ క్లైమాక్స్‌లో మాత్రం తేరే నామ్ సినిమాలో లాగా చెడుదే విజయంగా చూపించకూడదు" అని సతీష్ పేర్కొన్నాడు. (25వేల మందికి సల్మాన్ సాయం) -
బాహుబలి-2 కోసం హాలీవుడ్ మొత్తం దిగింది!
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి-2 కోసం హాలీవుడ్ నుంచి పలువురు నిపుణులు దిగిపోయారు. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇది పది వారాల పాటు కొనసాగనుంది. కొన్ని నెలల పాటు ముందుగా ప్లాన్ చేసి, రిహార్సల్స్ వేసుకున్న తర్వాత క్లైమాక్స్ షూటింగ్ మొదలుపెట్టామని, ఇప్పటినుంచి ఆగస్టు వరకు తుది షెడ్యూలులో భారీ యుద్ధ సన్నివేశం షూట్ చేస్తామని సినిమా వర్గాలు వెల్లడించాయి. గత రెండు నెలలుగా ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ యుద్ధ సన్నివేశం షూటింగ్ కోసం హాలీవుడ్ నుంచి నిపుణుల బృందం పెద్ద ఎత్తున దిగింది. గతంలో లింగా, బాహుబలి సినిమాలకు యాక్షన్ డైరెక్షన్ చేసిన లీ వీట్టేకర్ ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చాడు. అతడితో పాటు బ్రాడ్ అలన్, అతడి బృందం మొత్తం దిగింది. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాతో పాటు 'ద హంగర్ గేమ్స్' సిరీస్‌కు పనిచేసిన లార్నెల్ స్టోవాల్, 'ద హాబిట్' సినిమాకు పనిచేసిన మోర్న్ వాన్ టాండర్ లాంటివాళ్లు ఈ క్లైమాక్స్ సన్నివేశాలకు కీలకంగా మారనున్నారు. వీళ్లందరినీ సమన్వయం చేసుకుంటూ రాజమౌళి క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే ఈ సినిమా 2017 ఏప్రిల్ 18న విడుదల కావాలి.