breaking news
Ciudad Juarez
-
హైవేపై ఘోర రోడ్డుప్రమాదం: 10 మంది మృతి
మెక్సికో: అతివేగంగా వస్తున్న ఓ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో 10 మంది దుర్మరణం చెందగా, 33 మందికి గాయలయ్యాయి. ఈ ఘటన మెక్సికోలోని సీయోదాద్ జురేజ్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు మెక్సికో అధికారులు శనివారం వెల్లడించారు. టెక్సస్‌లోని రీయో గ్రాండె మీదుగా టోరెంటో నుంచి జురేజ్కు వెళుతున్న బస్సు మెట్రోపొలిస్ వద్ద వెనుక నుంచి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది మృతిచెందారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను సీయోదాద్ జురేజ్ ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
మోస్ట్ డేంజరస్ నగరాలివే!
ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఈ రోజుల్లో క్షణాల్లో వెళ్లిపోవడం పెద్ద కష్టమేమి కాదు. అయితే, వెళ్లే ముందు మనం ఎలాంటి ప్రాంతాలకు వెళ్తున్నామనే విషయంపై కనీసం అవగాహన ఉంటే ఎలాంటి సమస్యలు, ప్రమాదాలు లేకుండా బయటపడొచ్చంటున్నారు కొందరు అధ్యయనకారులు. ప్రపంచంలోని ఎక్కడికైనా వెళ్లొచ్చు కానీ ముఖ్యంగా ఈ కింద తెలిపిన పది ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్లకూడదట. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో నేర ప్రవృత్తి అత్యధికంగా ఉండటమే కాకుండా డ్రగ్ మాఫియా మూఠాలు ఎక్కువగా ఉండి పర్యాటకులపై విరుచుకుపడతారంటున్నారు. దోచుకోవడానికి హత్యలు చేయడానికి కూడా వెనుకాడరంట. ప్రపంచంలో అత్యంత అపాయకరమైన టాప్ టెన్ ప్రాంతాలివే.. 1. కారకాస్, వెనిజులా 2. సియుడాడ్ జువారెజ్, మెక్సికో 3. కేప్‌టౌన్, దక్షిణాఫ్రికా 4. రియోడిజనిరో, బ్రెజిల్ 5. గ్వాటెమాలా సిటీ, గ్వాటెమాల 6. అకాపుల్కో, మెక్సికో 7. బాగ్దాద్, ఇరాక్ 8. కాబూల్, అఫ్గనిస్థాన్ 9. కరాచీ, పాకిస్థాన్ 10. శాన్ పెడ్రో సులా, హాండురాస్