breaking news
cart race
-
పాపం.. ! ఆ చిన్నారి తోపుడు బండిపై తండ్రిని..
మధ్యప్రదేశ్లో ఓ చిన్నారి తండ్రిని తోపుడు బండిపై తీసుకువెళ్లున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొట్టడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఓ ఆరేళ్ల చిన్నారి. తోపుడు బండిపై తండ్రిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తోపుడు బండి ముందు ఆ చిన్నారి తల్లి లాగుతున్నట్లు కనిపించింది. సుమారు మూడు కిలోమీటర్లు వరకు అలానే తీసుకువెళ్లినట్లు ఆ వీడియోలో తెలుస్తుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీలో చోటు చేసుకుంది. ఆ కుటుంబం అంబులెన్స్ కోసం ప్రభుత్వాస్పత్రికి కాల్ చేసిన ఫలితం లేకుండాపోయింది. దాదాపు 20 నిమిషాల నిరీక్షణ తర్వాత కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని తోపుడు బండిపై సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. शायद मध्य प्रदेश की एंबुलेंस गरीबों के लिए नहीं है,lr इसलिए मरीज़ को ठेले पर लिटाकर अस्पताल ले जाया जा रहा है!! वीडियो मे मरीज़ की पत्नी और बेटे ठेले को धक्का लगाकर ले जा रहे है!#MadhyaPradesh #सिंगरौलीhttps://t.co/7uIlBCDFZq pic.twitter.com/VD6N5nSUow — Sadaf Afreen صدف (@s_afreen7) February 11, 2023 (చదవండి: బైక్పై దూసుకెళ్తూ మొబైల్ దొంగ దుర్మరణం! ) -
బండిని లాగిన పొట్టేళ్లు..!
వీపనగండ్ల (మహబూబ్నగర్) : పొట్టేళ్లు కూడా బరువు లాగుతాయా? అవుననే సమాధానం వస్తుంది. మహబూబ్నగర్ జిల్లా వీపనగండ్లలో శుక్రవారం జరిగిన ఎద్దుల బండి లాగుడు పోటీల సందర్భంగా ఈ విడ్డూరం చోటుచేసుకుంది. పొట్టేళ్లు ప్రత్యేక బండిపై నలుగురిని 1500 అడుగుల మేర లాగి తమ శక్తిని చూపాయి. రంగారెడ్డి జిల్లా షామీర్పేటకు చెందిన వెంకటేశ్వర్రావుకు చెందిన రెండు పొట్టేళ్లు బండిపై నలుగురు మనుషులు ఉండగా సులువుగా లాగి పోటీలను తిలకిస్తున్న వందలాది మందిని ఉత్తేజ పరిచాయి. పోటీల నిర్వాహకులు రూ.2500లను ప్రోత్సాహక బహుమతిగా రైతుకు అందజేశారు. కాగా ప్రత్యేకంగా రూపొందించిన బండిలో పొట్టేళ్లు లాగుతుండగా తాను ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్లు వెళ్లి వస్తానని వెంకటేశ్వర్రావు చెబుతున్నారు.