బండిని లాగిన పొట్టేళ్లు..! | Rams participate in Bullock cart Race | Sakshi
Sakshi News home page

బండిని లాగిన పొట్టేళ్లు..!

May 15 2015 4:33 PM | Updated on Sep 3 2017 2:06 AM

బండిని లాగిన పొట్టేళ్లు..!

బండిని లాగిన పొట్టేళ్లు..!

పొట్టేళ్లు కూడా బరువు లాగుతాయా? అవుననే సమాధానం వస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్లలో శుక్రవారం జరిగిన ఎద్దుల బండి లాగుడు పోటీల సందర్భంగా ఈ విడ్డూరం చోటుచేసుకుంది.

వీపనగండ్ల (మహబూబ్‌నగర్) : పొట్టేళ్లు కూడా బరువు లాగుతాయా? అవుననే సమాధానం వస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్లలో శుక్రవారం జరిగిన ఎద్దుల బండి లాగుడు పోటీల సందర్భంగా ఈ విడ్డూరం చోటుచేసుకుంది. పొట్టేళ్లు ప్రత్యేక బండిపై నలుగురిని 1500 అడుగుల మేర లాగి తమ శక్తిని చూపాయి. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేటకు చెందిన వెంకటేశ్వర్‌రావుకు చెందిన రెండు పొట్టేళ్లు బండిపై నలుగురు మనుషులు ఉండగా సులువుగా లాగి పోటీలను తిలకిస్తున్న వందలాది మందిని ఉత్తేజ పరిచాయి. పోటీల నిర్వాహకులు రూ.2500లను ప్రోత్సాహక బహుమతిగా రైతుకు అందజేశారు. కాగా ప్రత్యేకంగా రూపొందించిన బండిలో పొట్టేళ్లు లాగుతుండగా తాను ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్లు వెళ్లి వస్తానని వెంకటేశ్వర్‌రావు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement