breaking news
the capital of the farmers
-
జాతీయస్థాయికి ‘రాజధాని’ అన్యాయం
మంగళగిరి: రాజధాని కోసం బలవంతపు భూసమీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలసివచ్చే రాజకీయపక్షాల, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంతరైతులతో కలిసి ఐక్యకార్యాచరణ వేదికను ఏర్పాటు చేయాలని రాజధాని రైతు, రైతుకూలీల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఐక్య చర్చావేదిక తీర్మానించింది. ఇప్పటి వరకు జరిగిన భూసమీకరణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. భూసేకరణ చట్టాన్ని మార్చడంపై ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే చేపట్టిన దీక్షకు మద్దతు తెలపాలని నిర్ణయించింది. ఒక బృందం ఢిల్లీ వెళ్లి హజారే దీక్షకు మద్దతు తెలపడంతో పాటు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని వివిధ రాజకీయపక్షాల నాయకులు, ముఖ్యనేతలకు వివరించాలని తీర్మానించింది. సమితి ఆధ్వర్యంలో స్థానిక చిల్లపల్లి నాగేశ్వరావు కల్యాణమండపంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల నేతలతో పాటు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు , రైతులు భారీగా పాల్గొన్నారు. నష్టాలపై అవగాహన కల్పిద్దాం తొలుత వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ భూసమీకరణ వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తే 29 గ్రామాల్లో అంగీకార పత్రాలు ఇచ్చిన రైతుల్లో సగం మందికిపైగా వెనక్కి తీసుకునే అవకాశముందని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పోరాడదామని చెప్పారని తెలిపారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ సీఆర్డీఏ పేరుతో భూములను తీసుకుని వాటితో వ్యాపారం చేసి రాజధాని నిర్మిస్తావా, నిధులు లేనిది ఎలా నిర్మాణం సాగిస్తావు.. సీఎంగా అనుభవం ఉన్న వ్యక్తికి తెలియదా.. అని చంద్రబాబును ప్రశ్నించారు. గ్రామాలవారీ కమిటీలు అవసరం వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ భూసమీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించేందుకు గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మాజీ మత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ భూములు లాక్కోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.కృష్ణాడెల్టా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ ఉద్యమాన్ని జాతీయస్థాయికి వెళ్లేలా కార్యాచరణను రూపొందించాలని కోరారు. అంగీకార పత్రాలు ఇస్తే ఆత్మహత్యలే.. న్యాయవాది మల్లెల శేషగిగరిరావు మాట్లాడుతూ అంగీకారపత్రంతో ప్రభుత్వం ఇచ్చే రశీదుకు విలువ లేదన్నారు. అఖిల భారత రైతుసంఘం నాయకుడు కుమారస్వామి, రైతు నేతలు అనుమోలు గాంధీ, ఎంపీపీ పచ్చల రత్నకమారి, జనచైతన్యవేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీ వెంటే.. మేము
అరండల్‌పేట (గుంటూరు) : రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో రైతులు ధైర్యంగా ఉండాలనీ, మీ వెంట మేమున్నామనీ, చివరి వరకు మీ తరఫున నిలబడి పోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన రాజధాని రైతుల, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సోమవారం తుళ్లూరు మండల రైతులకు భరోసానిచ్చింది. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకోమని రైతులు, కౌలు రైతులు, కూలీలు ,కుల వృత్తులు చేసుకునే వారి హక్కులను పరిరక్షించేందుకు అడుగడుగునా వెంట నడిచివస్తామని హామీ ఇచ్చింది. రాజధాని రైతుల, కూలీల, హక్కుల పరిరక్షణ కమిటీ కన్వీనర్, పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో మాజీ మంత్రి పార్ధసారథి, సీనీయర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), కొడాలి నాని, కోన రఘుపతి, ఉప్పులేటి కల్పన, ముస్తఫా, గొట్టిపాటి రవికుమార్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త క్రిస్టినా, తాడికొండ నియోజకవర్గ నాయకులు కత్తెర సురేష్ తదితరులు తుళ్లూరు మండలం బోరుపాలెం, లింగాయపాలెం, మందడం గ్రామాల్లో పర్యటించారు. తొలుత బోరుపాలెం గ్రామంలో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులతో సమావేశం అయ్యారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎట్టి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే రైతు కూలీలు, కౌలు రౌతులు ఈ భూములపై ఆధారపడి ఉన్నామని, రాజధానికి భూములు ఇస్తే తమ బతుకులు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రరాజధాని అందరికి సంబంధించిందని, టీడీపీ నాయకులకో, చంద్రబాబుకో సంబంధించిన అంశం కాదన్నారు. కొంత మంది రైతులు రాజధానికి తమ భూములు పోతున్నాయని, రాత్రిళ్లు నిద్రకూడా పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లింగాయపాలెం గ్రామంలో ... ఇక్కడ వైఎస్సార్ సీపీ నేతలు స్వయంగా పొలాల్లోకి వెళ్ళి పంటలను పరిశీలించారు. అక్కడ ఎన్ని పంటలు పండుతున్నాయి, ఎంత దిగుమతి వస్తుంది, ప్రస్తుత పరిస్థితులు రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతులు మాట్లాడారు. రాజధాని కోసం ప్రాణాలు అయినా ఇస్తాం కానీ, ఎట్టి పరిస్థితుల్లో సెంటు భూమి కూడా వదులుకొనేది లేదన్నారు. తమ భూములతో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా అని ప్రశ్నించారు. ఏదో పది మంది రైతులు భూములు ఇస్తామంటే అందరు రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. భూములు ఇచ్చి జానెడు పొట్ట కోసం ఎక్కడకు వెళ్లాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మందడం గ్రామంలో.... ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో రైతులు మాట్లాడారు. తమకు ఏసీ ఇల్లు అవసరం లేదని, తమ బతుకులు తమను బతకనిస్తే చాలని తేల్చి చెప్పారు. మరెక్కడైనా రాజధాని నిర్మించుకోవాలని సూచించారు. కరకట్టకు ఆనుకుని ఉన్న పది గ్రామాలను రాజధాని భూముల జాబితాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజధానికి 30వేల ఎకరాలు ఎందుకు? రాజధాని నిర్మాణానికి 30వేల ఎకరాలు సేకరించడం ఎందుకో అర్థం కావడం లేదు. దేశంలోని ఏరాష్ట్ర రాజధాని కూడా ఇన్ని వేల ఎకరాల్లో లేదు. కేవలం ఆరు నుంచి 800ల ఎకరాల్లో రాజధాని నిర్మించుకోవచ్చు. మూడు పంటలు పండే బంగారు భూములను తీసుకుని ఇందులో రాజధాని నిర్మిస్తామంటే ఒప్పుకోం. అసలు ఇప్పటి వరకు భూసమీకరణకు విధి విధానాలు ఏంటో కూడా సరిగా చెప్పలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడైనా సేకరించిన భూములకు సకాలంలో నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. - ఎన్.మల్లేశ్వరరావు, రైతు, బోరుపాలెం నెలకు రూ. 5వేలు జీవన భృతిగా ఇవ్వాలి మా గ్రామంలో 1500 మంది రైతు కూలీలు వ్యవసాయ భూములపై ఆధారపడి ఉన్నాం. వ్యవసాయ భూములు ఉంటేనే మాకు జీవనోపాధి . ఇప్పుడు ఈ భూములు లాక్కుంటే మాకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది. ఒక వేళ రాజధానికి భూములు తీసుకుంటే ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 5వేలు చొప్పున జీవన భృతి అందజేయాలి. కౌలు రైతులకు బంగారు ఆభరణాలపై ఉన్న రుణాలను రద్దు చేయాలి. - వీరరాఘవులు, రైతు కూలీ, బోరుపాలెం చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో నమ్మం. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు. అలాగే రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న ఆదర్శ రైతులను తొలగించారు. ఇప్పటి వరకు రుణ మాఫీ జరుగలేదు. అసలు చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో నమ్మం. కష్ణానది కరకట్ట గ్రామాల ప్రజలు, రైతులు, భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. దౌర్జన్యం చేసి భూములు లాక్కుంటామంటే సహించేది లేదు. ఇక్కడ ఎకరాకు రూ. లక్ష కౌలు వస్తోంది. ఇక మీరిచ్చే రూ. 25వేలు దేనికి సరిపోతుంది. - దాసరి కోటేశ్వరరావు, రైతు, బోరుపాలెం ప్రజలను కాదంటే పతనం తప్పదు - ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ సీపీ కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నారని కొన్ని పత్రికల్లో కథనాలు చూసి నిజమే అనుకున్నామని, అయితే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందన్నారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, వాస్తవ పరిస్థితులు తెలుసుకుని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి మాత్రమే ఇక్కడకు వచ్చామన్నారు. ఇందులో రాజకీయాలకు తావులేదని ఆయన చెప్పారు. {పజల మనోభావాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వమైనా పనిచేయాలని లేకుంటే ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. రెండు దఫాలుగా ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, బోరుపాలెం, లింగాయపాలెం, మంద డం గ్రామాల్లో పర్యటించామని, అన్ని గ్రామా ల్లో రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని చెప్పారని ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, రైతుల పక్షాన పోరాడతామని ధర్మాన హామీ ఇచ్చారు. తప్పకుండా రైతుల, కూలీల హక్కులను పరిరక్షిస్తామన్నారు. నాకు పింఛను ఇప్పించాలి మూడు నెలలుగా పింఛను రావడం లేదు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పింఛను మంజూ రైంది. నాకు సెంటు భూమి కూడా లేదు. అయినా నా పేరును పింఛను లిస్టులో నుంచి తొలగించామని అధికారులు చెబుతున్నారు. ఎందుకు తొలగించారో చెప్పడం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు కలగజేసుకుని నాకు పింఛను ఇప్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నా. - బొంతల కోటేశ్వరమ్మ, వృద్ధురాలు, బోరుపాలెం రైతులను ముష్టివాళ్లగా మార్చకండి రాజధానికి భూములు తీసుకుంటే నష్టపరిహారం ఎప్పటికి ఇస్తారో, చంద్రబాబు మాటమీద నిలబడతాడోలేదోనన్న భయంతో ఇప్పటి వరకు 3,800 ఎకరాల భూమిని రైతులు అమ్ముకున్నారు.ల్యాండ్ పూలింగ్ అంటే ఏమిటో ఎవరికి తెలియదు. ఇక్కడ ఎకరా భూమి రూ. 2 కోట్ల వరకు ఉంది. సంపదను సష్టించే భూములను కాకుండా వేరేప్రాంతంలో భూములు తీసుకొవచ్చు. ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్ధత లేదు. వైఎస్సార్సీపీ నాయకులు అసెంబ్లీలో రైతుల తరఫున పోరాడి మా భూములు పోకుండా చూడాలి. రైతులను ముష్టివారిగా మార్చవద్దు. - గాంధీ, రైతు, లింగాయపాలెం కూలీ ఆదాయం రోజుకు రూ. 800 మాగ్రామంలో 2500 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 365 రోజులు పని ఉంటుంది. నాలుగు పంటలు పండిస్తాం. ఇక్కడ కూలీలకు రోజుకు రూ. 800లు వస్తోంది. అందరం సంతోషంగా ఉన్నాం. ఎక్కడైనా మెట్ట భూముల్లో రాజధాని నిర్మించుకోండి. ఈ కరకట్ట భూములైన 5వేల ఎకరాలు రాజధాని నుంచి మినహాయించాలి. లేకుంటే ఏపోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. - మాదల మహేంద్ర, రైతు, లింగాయపాలెం జానెడు పొట్ట కోసం ఎక్కడికి పోవాల ఇక్కడ పంటలు పండే భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. రైతుల పంట భూములు లాగేసుకుంటే మేము ఎలా బతకాలి. రోజు నిద్రలేని రాాత్రులు గడుపుతున్నాం. పచ్చని పంటపొలాలను ఎందుకు లాక్కుంటున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. జానెడు పొట్ట కోసం మేము ఎక్కడికి పోవాలి. రాజధానిలో మమ్మల్ని బతకనిస్తారా... తీసుకెళ్ళి మమ్మల్ని అడవుల్లో వదిలి పెడతారా. - భాను, వ్యవసాయ కూలీ, లింగాయపాలెం పోరాటానికి సిద్ధమవుతాం. చంద్రబాబు రైతుల కోసం ఇప్పటి వరకు చేసిందేమీలేదు. ఇక్కడ మేమంతా పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉన్నాము. ఈ భూమి మీదే ఆధారపడి ఏళ్ళతరబడి జీవిస్తున్నాము. రుణమాఫీ కూడా చేయని చంద్రబాబును నమ్మలేము. ప్రభుత్వంలోని భూ సమీకరణపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. వ్యవసాయ రైతులు, కూలీలు, కౌలు రైతులు, ఉపాధి కోల్పోతారు. భూములు దక్కించుకునేందుకు పోరాటానికి సిద్ధమవుతాం. - బి.సాంబశివరావు, రైతు, మందడం చంద్రబాబు మారిపోయారు. ఇక్కడ భూములు ఇచ్చేందుకు ఏఒక్క రైతుకు ఇష్టం లేదు. చంద్రబాబు సింగపూర్బాబుగా మారిపోయారు. సింగపూర్ భౌగోళిక స్వరూపానికి, ఇక్కడికి ఎంతో తేడా ఉంది. పది మంది రైతులు చెబితే అందరూరైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం చేయడం సమంజసం కాదు. కృష్ణానది కరకట్టన కేవలం ధనికులు ఉండాలన్న కోరికతోనే చంద్రబాబు ఇక్కడ రైతుల నుంచి భూములు లాక్కుంటున్నాడు. - జక్రయ్య, కౌలు రైతు, మందడం ఎవరిపై ఆధారపడాలి మాకు అర ఎకరం పొలం ఉంది. నాన్న పక్షవాతంతో బాధపడుతున్నారు. నెలకు వైద్య ఖర్చులకు అనేక ఇబ్బందులు పడుతున్నాం. అన్నయ్య వడ్రంగిపనులు చేస్తున్నాడు. అయితే మాకున్న అర ఎకరం పొలం ఇచ్చి ఎవరిపై ఆధారపడాలి. ఎట్టిపరిస్థితుల్లో భూమి ఇచ్చే పరిస్థితి లేదు. - సాయిలత, మహిళ రైతు, మందడం కన్నీటితో వేడుకుంటున్నా.. భూములు లాక్కోవద్దు.. మాది తాళాయపాలెం, మాకు ఎకరం పొలం ఉంది. నా భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు వైద్య ఖర్చులు నెలకు రూ. 50వేలు అవుతుంది. ఇప్పటికే రూ. 15 లక్షలు అప్పు చేశాను. రాజధాని ప్రకటించిన తరువాత కనీసం అప్పుడు కూడా ఇవ్వడం లేదు. ఈ ఎకరం పొలం కూడా ప్రభుత్వం లాక్కుంటే మేము ఎలా బతకాలి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. - కొండెపాటి రాములు, రైతు, మందడం -
మేమున్నాం..
భూసమీకరణపై రాజధాని గ్రామ రైతులకు వైఎస్సార్ సీపీ భరోసా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి అవసరమైతే బలవంతంగా భూ సేకరణ చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టింది. తొలిదశలో భూ సమీకరణ చేస్తామన్న తుళ్లూరు మండలంలోని 14 గ్రామాల్లో ఒకటైన మందడంలో ఆదివారం వైఎస్సార్ సీపీ నేతలు పర్యటించారు. రైతుల్లో మనోధైర్యం నింపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మా శవాల మీదుగా రాజధాని నిర్మించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారని మందడం రైతులు ఆవేదన వెలిబుచ్చారు. రైతుల మధ్య ఐక్యత లేకుండా తెలుగుదేశం పార్టీ గండి కొడు తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూములులాక్కుంటే బతికేదెలా అని భావోద్వేగానికి గురయ్యారు. అన్నదాతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని కోరారు. మందడం(తుళ్లూరు) ప్రజాభీష్టాన్ని కాదని రాజధాని నిర్మించలేరు, రైతులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం భూములు తీసుకోలేదు, ఒకవేళ ఆ పరిస్థితే ఎదురైతే రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ నిలబడి పోరాటం చేస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ అన్నారు. ఆదివారం మర్రి రాజశేఖర్‌తో కలిసి ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ముస్తఫా, తాడికొండ ఇన్చార్జి హెనీ క్రిస్టినా, సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్ తదితరులు మందడం గ్రామం వెళ్లి రైతులతో సమావేశమయ్యారు.ముందుగా వారి సమస్యలు, ఆవేదనను విన్నారు. అనంతరం మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, ఓ వర్గానికి చెందిన పత్రికలు, మీడియాలలో 80 నుంచి 90 శాతం మంది రైతులు భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారంటూ కథనాలు వస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులు అందుకు భిన్నంగా వుండడాన్ని చూస్తే ఆశ్చర్యంగా వుందన్నారు. సారవంతమైన ఈ భూములను రైతులను కాదని ప్రభుత్వం తీసుకోలేదని, ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే రైతులకు అండగా వైఎస్సార్ సీపీ నిలబడి పోరాటం చేస్తోందని ఆయన అభయం ఇచ్చారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో బినామీ భూములు వున్న నేతలు చాలమంది వు న్నారు. వారి భూముల్లో ప్రభుత్వం రాజధాని నిర్మిస్తే బాగుంటుంది. చెమటోడ్చి సంపాదించుకున్న భూములను బలవంతంగా లాక్కోవాలని చూడటం ఈప్రభుత్వానికి తగదు. ఇక్కడి పరిస్థితులను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి రైతుకు బాసటగా నిలుస్తామన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో చిన్న,సన్నకారు రైతులే ఎక్కువ నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం మూడు పంటలు పండే భూములు తీసుకునే అవకాశం లేదు. ముఖ్యంగా ఈ ప్రాంత భూములు నిర్మాణాలకు అనువైనవి కావన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ తాడికొండ నియోజకవర్గ ప్రజలకు అండగా వుంటానన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి హెనీక్రిస్టినా మాట్లాడుతూ.. రైతులు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరు. ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి, రాజధానికి భూములు ఇమ్మంటే ఇచ్చేపరిస్థితిలో తుళ్లూరు మండల రైతులు లేరు. రైతుల పక్షాన పోరాటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్, మండల పార్టీ నాయకులు కొమ్మినేని కృష్ణారావు, నాయుడు నాగేశ్వరరావు, బత్తులకిషోర్, కొప్పుల శేషగిరిరావు, ఎస్సీసెల్ నాయ కులు ఆరేపల్లి జోజి, తాడికొండ నాయకులు తియ్యగూర బ్రహ్మారెడ్డి, నాయకులు అక్కల లక్ష్మీనారాయణరెడ్డి, కటికల సాంబిరెడ్డి, పుట్టి సుబ్బారావు, అమర్నాథ్ రెడ్డి, రైతు నాయకులు మల్లెల శేషగిరిరావు,బెజ వాడ రమేష్,ఆలూరి శ్రీనివాసరావు ఇంకా గ్రామ రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నేతల ఎదుట మందడం రైతులు వెలిబుచ్చిన బాధలు అక్కడ ఉన్న అందరి కళ్లను చెమర్చాయి. భూములపై వారికున్న మమకారాన్ని తెలియజేశాయి. పంటలు పండించేందుకు వారు పడుతున్న కష్టాలను తెలియ జెప్పాయి. తెలుగుదేశం ప్రభుత్వం భూములు లాక్కుంటే రైతు అనాథలవు తారని తెలియజెప్పారు. ఆ పరిస్థితే వస్తే వారి శవాల మీద రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. ఆ రైతుల్లో కొందరి మాటలు ఇలా... టీ కప్పులు కడిగి భూమి కొనుక్కున్నా... అర ఎకరం పొలం వున్న రైతులు తమ బిడ్డలను ఇంజనీర్లు, డాక్టర్లను చేశారు. అలాంటి భూములను ఎట్టిపరిస్థితిల్లో ఇచ్చేది లేదు. రుణ మాఫీకి డబ్బులు లేని చంద్రబాబు రైతులకు కౌలు చెల్లించేందుకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు. టీ కప్పులు కడిగి 22 సంవత్సరాల క్రితం 72 సెంట్లు భూమి కొన్నాను. ఇప్పడు ఆ భూమి పోతే ఎలా బతకాలి. - ఆలూరి శ్రీనివాసరావు,రైతు