breaking news
Buyback Plan
-
రూ.86 కోట్ల బైబ్యాక్ పూర్తి చేసిన సాస్ యూనికార్న్
సాఫ్ట్వేర్-యాస్-ఏ-సర్వీస్ (సాస్) యూనికార్న్ డార్విన్‌బాక్స్ రూ.86 కోట్ల ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈసాప్) బైబ్యాక్‌ను పూర్తి చేసినట్లు తెలిపింది. భారత్, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా, మిడిల్ఈస్ట్లో సర్వీసులు అందిస్తున్న ఈ కంపెనీకి చెందిన 11 కార్యాలయాల్లోని 350 మందికి పైగా ఉద్యోగులు ఈ బైబ్యాక్ ద్వారా లబ్ధి పొందినట్లు కంపెనీ పేర్కొంది. తాజాగా సమకూర్చుకున్న రూ.86 కోట్ల బైబ్యాక్ గడిచిన నాలుగేళ్ల కాలంలో మూడోది కావడం గమనార్హం.ఈ సందర్భంగా డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకులు చైతన్య పెద్ది మాట్లాడుతూ..‘డార్విన్‌బాక్స్‌లో ప్రతిభ కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. కంపెనీతోపాటు వారూ ఎదిగేలా చూడటం మా ఉద్దేశం. సంపద సృష్టిలోనూ సంస్థతోపాటు ఉద్యోగులు ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నాం. కంపెనీ మెరుగైన పనితీరుతో మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడటానికి పరిశ్రమకు చెందిన కొంతమంది మేధావులు మాతో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో దూసుకుపోయేందుకు కంపెనీ ఆర్ అండ్ డీ సామర్థ్యాలను రెట్టింపు చేస్తోంది. ఈ ప్రయాణంలో మరికొందరు ప్రతిభావంతులను ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. మార్చి 2025లో కంపెనీ తన సాంకేతికతను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయంగా విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి పార్ట్నర్స్ గ్రూప్, కేకేఆర్ నుంచి నిధులు సేకరించింది. ఆ నిధుల సేకరణలో భాగంగా 140 మిలియన్ డాలర్ల(సుమారు రూ.120 కోట్లు)ను సమకూర్చుకుంది.కంపెనీ ఎంసీపీ (మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్) సర్వర్‌తో సహా బహుళ ఏఐ ఉత్పత్తులను ప్రారంభించినట్లు తెలిపింది. ఇది ఏదైనా అనుకూలమైన ఏఐ ఏజెంట్‌కు సదరు ప్లాట్ఫామ్లో హెచ్ఆర్ డేటా, వర్క్ ఫ్లోలతో సురక్షితంగా సంభాషించడానికి వీలు కల్పిస్తుంది. ‘డార్విన్ బాక్స్ సెన్స్’ అనే జెనరేటివ్ ఏఐ ఇంజిన్‌ను కూడా విడుదల చేసినట్లు చెప్పింది. ఇది 40 ఎంబెడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందిస్తుంది. గత ఏడాదిలో 10 ప్రాంతాల్లో మల్టీ కంట్రీ పేరోల్ సొల్యూషన్స్‌ను అందించినట్లు పేర్కొంది. ‘కంపెనీ విలువను పెంచేవారికి తగిన భాగస్వామ్యం ఉండాలని సంస్థ విశ్వసిస్తోంది. నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయిలో వృద్ధిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నా అందుకు సమానంగా ఉద్యోగులకూ అర్థవంతమైన ఫలాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఉద్యోగులు సంస్థను తమదిగా భావించే సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం’ అని డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు జయంత్ పాలేటి అన్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్‌కార్డులున్నాయా?2015లో స్థాపించబడిన పీక్ ఎక్స్‌వీ, లైట్‌స్పీడ్ వంటి కంపెనీల నియామకాలు, ఆన్‌బోర్డింగ్, ఉద్యోగుల హాజరు నిర్వహణతో సహా వారి హెచ్ఆర్ అవసరాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. స్టార్ బక్స్, మెక్ డొనాల్డ్స్, ఆక్సా, సిగ్నా, వీవర్క్, ఎయిర్ టెల్, వేదాంత వంటి బ్రాండ్లతో సహా 1,000 సంస్థలకు ఇది సేవలు అందిస్తుంది. -
ధనుకా అగ్రిటెక్- ఇన్ఫో ఎడ్జ్.. జూమ్
వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 274 పాయింట్లు జంప్‌చేసి 37,294ను తాకగా.. నిఫ్టీ 82 పాయింట్లు బలపడి 10,983 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా అగ్రికెమికల్స్ కంపెనీ ధనుకా అగ్రిటెక్, ఆన్లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ధనుకా అగ్రిటెక్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు వెల్లడించడంతో ధనుకా అగ్రిటెక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 871 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 936 వరకూ దూసుకెళ్లింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! ఈ నెల 22న(బుధవారం) బోర్డు సమావేశంకానున్నట్లు ధనుకా అగ్రిటెక్ వెల్లడించింది. సమావేశంలో భాగంగా బోర్డు ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించనున్నట్లు తాజాగా తెలియజేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్) ఫలితాలను సైతం వెల్లడించనున్నట్లు వివరించింది. జూన్ చివరికల్లా కంపెనీలో ప్రమోటర్లు 75 శాతం వాటాను కలిగి ఉన్నారు. మిగిలిన 25 శాతం వాటాలో మ్యూచువల్ ఫండ్స్‌కు 12.83 శాతం వాటా ఉంది. రిటైలర్ల వాటా 8.57 శాతంగా నమోదైంది. ఇన్ఫో ఎడ్జ్ ఇండియా ఆన్లైన్ బీమా రంగ సేవలందించే పాలసీ బజార్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించడంతో ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 3.25 శాతం జంప్‌చేసి రూ. 3211 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3238 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! నౌకరీ, జీవన్సాథీ, 99 ఏకర్స్.కామ్ల మాతృ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా జొమాటో, పాలసీ బజార్, మెరిట్‌నేషన్ తదితర ఇంటర్నెట్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. రూ. 1,100 కోట్ల సమీకరణకు పాలసీ బజార్ పబ్లిక్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. పాలసీ బజార్ ఐపీవో ద్వారా కంపెనీ షేరుకి రూ. 190 స్థాయిలో అదనపు విలువ చేకూరగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
టీసీఎస్‌కు బైబ్యాక్ కిక్
సాక్షి,ముంబై: ఐటీ సేవల దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కౌంటర్ భారీ లాభాలతో ట్రేడ్అవుతోంది. ఈ నెల15న సొంత షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను పరిశీలించనుందన్నవార్తలతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. భారీ కొనుగోళ్లతో టీసీఎస్ షేరు దాదాపు 3 శాతం పుంజుకుంది. బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 15న సమావేశం నిర్వహిస్తున్నట్లు టీసీఎస్ మంగళవారం తెలియజేసింది. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలలో కొంతమేర వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే షేర్ల బైబ్యాక్‌కు వెచ్చించాలని కంపెనీ ప్రణాళికలు వేసింది. కాగా గత ఏడాది రూ .16,000 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్‌ను నిర్వహించింది టీసీఎస్. మొత్తం ఈక్విటీలో 3 శాతం లేదా 5.61 కోట్ల షేర్లను ఈక్విటీ వాటాకి 2,850 రూపాయల ధర వద్ద కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
హెచ్‌సీఎల్ బైబ్యాక్ ఆఫర్... ధరెంతో తెలుసా?
న్యూఢిల్లీ : దేశంలో నాలుగో అతిపెద్ద సాఫ్ట్ వేర్ సర్వీసుల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తను ప్రకటించిన 3,500 కోట్ల బైబ్యాక్ ప్లాన్ లో ఒక్కో షేరుకు 1000 రూపాయలను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. అంటే ప్రస్తుత ట్రేడింగ్ ధరకు ఇది 17 శాతం ప్రీమియం. దామాషా ప్రాతిపదికన టెండర్ ప్రక్రియలో ఒక్కో ఈక్విటీ షేరుకు 1000 రూపాయల క్యాష్ ను ఆఫర్ చేయనున్నట్టు బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చెప్పింది. ప్రస్తుతం ఒక్కో షేరు 852.35 రూపాయల వద్ద ట్రేడవుతుందని, ఈ ప్రస్తుత ట్రేడింగ్ ధరకు 17 శాతం ఎక్కువగా బైబ్యాక్ ఆఫర్ ధర ఉన్నట్టు తెలిపింది. పూర్తిగా చెల్లించే ఈక్విటీ షేరు క్యాపిటల్ మొత్తంలో ఈ 3,500 కోట్ల రూపాయల బైబ్యాక్ సైజు 16.39 శాతం, 13.62 శాతంగా ఉన్నట్టు తెలిసింది. మే 25వ తేదీన కంపెనీ తన ఈక్విటీ షేర్ హోల్డర్స్ కు లెటర్ ద్వారా వీటిని ఆఫర్ చేస్తోంది. ఐటీ కంపెనీల్లో నగదు నిల్వలు ఎక్కువగా ఉండటంతో బైబ్యాక్స్ లేదా డివిడెండ్స్ ఆఫర్ చేయాలని ఒత్తిడి నెలకొంది. దీంతో గత నెలే టీసీఎస్ 16వేల కోట్ల రూపాయల బైబ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రస్తుతం ఇది కొనసాగింపు దశలో ఉంది. టీసీఎస్ ప్రత్యర్థి ఇన్ఫోసిస్ కూడా ఈ ఏడాదిలో రూ.13వేల కోట్ల రూపాయలను డివిడెండ్ లేదా బైబ్యాక్ రూపంలో ఇన్వెస్టర్లకు రిటర్న్ ఇవ్వనున్నట్టు తెలిపింది. కాగా, 2016 డిసెంబర్ 31 వరకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వద్ద నగదు, నగదుతో సమానమైన నిల్వలు రూ.2,214.5 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.10,506.9 కోట్లున్నాయి.