breaking news
Buddisam
-
లుంబిని నుంచి కుశినగర్ వరకు...!
బుద్ధుడికి జన్మనిచ్చిన లుంబినివనం.. సిద్ధార్థుడికి జ్ఞానోదయమైన బోద్‌గయ. తొలి అష్టాంగమార్గాన్ని విన్న సారనాథ్.. సారనాథ్‌లో శ్రీలంక చైత్యం మూలగంధకుటి. బౌద్ధానికి రాజ గౌరవాన్నిచ్చిన రాజగృహ.. బుద్ధుడి ప్రకృతి విహారకేంద్రం వేణువనం. సమ్యక్ జీవనసాఫల్య క్షేత్రం శ్రావస్థి.. చివరి ప్రబోధాన్ని విన్న మాతాకుటీర్. బుద్ధుని అవశిష్ఠ నిర్మాణం రామభార్ స్థూప.. బుద్ధుడి తుదిశ్వాసకు మౌనసాక్షి కుశినగర. ఒకే పర్యటనలో వీటన్నింటినీ చూడాలంటే... ఐఆర్సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైనెక్కాలి.1వ రోజు..ఢిల్లీ నుంచి గయకు ప్రయాణం. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌కి చేరాలి. చిన్న వెల్కమ్ తర్వాత ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ ఎక్కాలి. ట్రైన్ రెండున్నరకు బయలుదేరుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు భోజనం రైల్లోనే అందిస్తారు. ప్రయాణం కొనసాగుతుంది.2వ రోజురైలు ప్రయాణం కొనసాగుతుంటుంది. రైల్లో ఉదయం టీ, రిఫ్రెష్మెంట్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. గయకు చేరిన తర్వాత రైలు దిగి బోద్‌గయకు ప్రయాణం. బోద్‌గయలో హోటల్ గదిలో చెక్ ఇన్. కొంత సేపు విశ్రాంతి తర్వాత బోధగయ విహారం, మహాబోధి వృక్షం, మహాబోధి ఆలయ దర్శనం, నిరంజన నది తీరాన విహారం. బోద్‌గయలోని థాయ్ టెంపుల్, జపనీస్ టెంపుల్, బుద్ధ విగ్రహ వీక్షణం. రాత్రి భోజనం, బస హోటల్లో. నిరాడంబరం సుసంపన్నంగాబోధగయలో చూడాల్సిన ప్రదేశాల్లో ప్రధానమైనది బోధివృక్షం. దాన్ని మహాబోధి అంటారు. బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్రదేశం ఇది. ఇక్కడ మహా ఆలయ నిర్మాణం జరిగింది. అదే మహాబోధి ఆలయం. ఈ ఆలయానికి ఓ అరకిలోమీటరు దూరాన మాయా సరోవర్ తీరాన ఉంది వాట్థాయ్ టెంపుల్. బోద్‌గయలోని వివిధ బౌద్ధాలయాన్నీ దేనికదే ప్రత్యేకమైన నిర్మాణశైలితో ఆకర్షణీయంగా ఉంటాయి. నిరాడంబరతను ఇంత సుసంపన్నంగా వ్యక్తం చేయవచ్చా అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇది 1956లో ధాయ్‌లాండ్ ప్రభుత్వం నిర్మించిన ఆలయం. భారత్– థాయ్‌లాండ్ దేశాల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రధాని నెహ్రూ కోరిన మీదట థాయ్ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని చేపట్టింది. బంగారు పూత పై కప్పు నిర్మాణంలోని సునిశితత్వం అబ్బురపరుస్తుంది. ఈ ఆలయానికి సమీపంలో ఎనభై అడుగుల గ్రేట్ బుద్ధ స్టాట్యూ ఉంది. ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహంలో శిల్పనైపుణ్యం అద్భుతం. ఇక జపనీస్ టెంపుల్ ఇండోసాన్ నిప్పన్ జపనీస్ టెంపుల్ ప్రశాంతతకు ప్రతీకలా ఉంటుంది. 3వరోజుబోద్గయ నుంచి నలంద, రాజ్‌గిర్, గయ, వారణాసికి ప్రయాణం. ఉదయం బో«ద్గయలోని హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి రాజ్‌గిర్ వైపు సాగిపోవాలి. రాజ్‌గిర్‌లో బింబిసార జైల్, గ్రద్ధకూట పర్వతం, వేణువన్ పర్యటన తర్వాత లంచ్‌కి హోటల్‌కి రావాలి. భోజనం తర్వాత నలందకు ప్రయాణం. నలందలో యూనివర్సిటీ శిథిలాల వీక్షణం, నలంద మ్యూజియం సందర్శనం తర్వాత గయకు ప్రయాణం. గయ రైల్వేస్టేషన్‌కు చేరి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ రైలెక్కాలి. రైలు వారణాసికి వైపు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లోనే.భీమ – జరాసంధుల యుద్ధక్షేత్రంరాజ్గిర్ అసలు పేరు రాజగృహ. ప్రాచీనకాలం నాటి నివాస ప్రదేశం. మహాభారత కాలంలో జరాసంధుని రాజ్యం గిరివ్రజ ఇదే. భీముడితో జరాసంధుడు యుద్ధం చేసిన ప్రదేశం. మగధ రాజ్యానికి కొంతకాలం రాజధాని కూడా. రాజు నివసించే నగరం కావడంతో రాజగృహ అనే పేరు వచ్చింది. బుద్ధుడు తొలి బోధన సారనాథ్‌లో చేశాడు. రాజగృహలో రాజుల సమావేశంలో బోధన చేయడంతో బౌద్ధానికి విశేషమైన ప్రచారం వచ్చింది. సామాన్యులతో పాటు మగధ సామ్రాజ్య స్థాపకుడు బింబిసారుడికి కూడా బుద్ధుడు ఇక్కడే బోధనలు చేశాడు. రాజ్‌గిర్ విశ్వశాంతి స్తూపం నుంచి కనిపించే గ్రద్ధకూట పర్వతం మీద బుద్ధుడు కొంతకాలం ధ్యానం చేసుకున్నాడు. జైన 24వ తీర్థంకరుడు మహావీరుడు కూడా కొంతకాలం ఇక్కడ నివసించాడు. బింబిసారుడిని అతడి కొడుకు అజాతశత్రు జైలులో బంధించాడు. ఆ జైలు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. బుద్ధుడు రాజ్‌గిర్‌లో నివసించిన కాలంలో పగలంతా బోధనలు చేస్తూ సాంత్వన కోసం సమీపంలోని వేణువన్లో సమయం గడిపేవాడు.నాటి సరస్వతి నిలయంనలంద ప్రపంచంలోనే తొలి రెసిడెన్సియల్ యూనివర్సిటీ. బౌద్ధ మహావిహార పేరుతో విలసిల్లింది. క్రీ.శ ఐదవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు విద్యార్థులతో కళకళలాడింది. ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే నిర్మాణంలో అనుసరించిన ఇంజనీరింగ్ స్కిల్ అబ్బురపరుస్తుంది. విద్యార్థులకు ఒక్కో గది, పుస్తకాలు దుస్తులకు అరలు ఉన్నాయి. నీరు వెలుపలకు వెళ్లడానికి నిర్మాణంలోనే పైపుల ఏర్పాటు ఉంది. జానపద కథల్లో చంద్రుడి వెలుతురు పడి ప్రకాశించే చంద్రశిలలను ఇక్కడ చూడవచ్చు. అతి పెద్ద లైబ్రరీలోని గ్రంథాలను రాశిపోసి భక్తియార్ ఖిల్జీ తగుల పెట్టాడని చెబుతారు. గ్రంథాలు తగలబడిన చోట ఇటుకలు నల్లగా మాడిపోయి ఉన్నాయి. నలందలో మహావిహార తర్వాత ఆర్కియలాజికల్ మ్యూజియం. సూర్యమందిర్, చైనా యాత్రికుడు హ్యూయాన్ త్సాంగ్ మందిరాలను చూడవచ్చు. 4వ రోజువారణాసి నుంచి సారనాథ్, నౌతన్వాకు ప్రయాణం. గయ నుంచి వారణాసికి వస్తున్న రైల్లో ఉదయాన్నే టీ, బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. రిఫ్రెష్మెంట్ పూర్తి చేసుకుని వారణాసిలో రైలు దిగిన తర్వాత సారనాథ్‌కు ప్రయాణం. సారనాథ్‌లో ధమేక్ స్థూప, సారనాథ్ మ్యూజియం, అశోక పిల్లర్, మూలగంధకుటి విహార్‌కు ప్రయాణం. హోటల్లో చెక్ ఇన్, లంచ్ తర్వాత గంగానది తీరాన హారతి వీక్షణం. రాత్రికి రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రైలు నౌతన్వా వైపు సాగి΄ోతుంది. నౌతన్వా మనదేశంలో చివరి రైల్వేస్టేషన్.సారనాథ్ బుద్ధుడుబోధగయలో జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు తొలి ప్రవచనాన్ని వెలువరించిన ప్రదేశం సారనాథ్. బౌద్ధానికి సంబంధించిన నమూనా చిత్రాల్లో బోధిచెట్టు కింద కూర్చున్న బుద్ధుడు, ఎదురుగా ఐదుగురు శిష్యులు ఉంటారు. అది సారనాథ్‌లో ఇచ్చిన ప్రవచనానికి ప్రతీకాత్మక చిత్రం. సారనాథ్‌లోని బౌద్ధ స్థూపం పేరు ధమేక్ స్థూపం. దానిని అధ్యయనం చేస్తే బౌద్ధ పరమార్థం అవగతమవుతుంది. భారత ప్రభుత్వం అధికారిక ముద్రగా స్వీకరించిన నాలుగు సింహాల పిల్లర్ ఇక్కడిదే. ఇక్కడి మ్యూజియం ఒక బౌద్ధ అధ్యయన కేంద్రం. నిర్వహణ కూడా బాగుంటుంది. మూలగంధ కుటీర్ నిర్మాణకౌశలంలో మహోన్నతమైనదనే చెప్పాలి. ఓ వందేళ్ల కిందట బుద్ధుడి అవశిష్ఠాన్ని ప్రతిష్ఠించి నిర్మించిన ఆలయం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఇప్పుడు మనం చూసే బోధివృక్షం శ్రీలంలోని అనూరాధపురా నుంచి సేకరించిన ఒక బోధి మొక్క. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన బోధగయ బోధివృక్షం నుంచి ఒక మొక్కను అశోకుడి కూతురు సంఘమిత్ర... అనూరాధపురాకు తీసుకువెళ్లింది. బో«ద్గయలోని చెట్టు విధ్వంసం అయినప్పుడు అనూరాధపుర వృక్షం నుంచి సేకరించి తెచ్చిన మొక్కల్లో ఒకటి బో«ద్‌గయలో మరొక దానిని సారనాథ్‌లో నాటారు. 5వ రోజుఉదయాన్నే టీ, బ్రేక్‌ఫాస్ట్ రైల్లోనే. నౌతన్వా రైల్వేస్టేషన్‌కు చేరిన తర్వాత రైలు దిగి నేపాల్‌లో ప్రవేశించి లుంబినికి చేరాలి. పర్యాటకులు పాస్సోర్ట్, వీసా దగ్గర ఉంచుకోవాలి. నేపాల్ వీసా లేని వాళ్లు ఆన్ అరైవల్ వీసా కోసం (అక్కడికి చేరిన తర్వాత జారీ చేసే వీసా) ఫీజు తోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు ఉండాలి. లుంబినిలో హోటల్లో చెక్ఇన్, మధ్యాహ్న భోజనం తర్వాత లుంబిని సైట్ సీయింగ్. రాత్రి భోజనం, బస లుంబినిలో.లుంబినిలో పుట్టాడునౌత్వానా రైల్వే స్టేషన్ చాలా చిన్న స్టేషన్. నిజానికి ప్రత్యేకంగా చెప్పు కోవాల్సిన ప్రదేశం కాదు. కానీ భారత్– నేపాల్ సరిహద్దులో మనదేశం నిర్వహిస్తున్న చివరి స్టేషన్. నేపాల్‌కి వెళ్లాలంటే ఇక్కడ దిగి రోడ్డుమార్గాన సరిహద్దు ప్రదేశం సునౌలి దగ్గర పాస్‌పోర్ట్ మీద స్టాంప్ వేయించుకోవాలి. ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే క్రీ.పూ 544లో బుద్ధుడు పుట్టిన లుంబినిలో ఉంటాం. లుంబిని బుద్ధుడు పుట్టిన ప్రదేశంలో మాయాదేవి ఆలయాన్ని నిర్మించారు. ధవళం మీద ప్రసరించిన కాంతి వెలుగులతో ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుందీ ఆలయం. లుంబినిలో నిర్మించిన మహాస్థూ΄ాన్ని వరల్డ్ పీస్ పగోడాగా గుర్తిస్తారు. లుంబిని మొత్తాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది యునెస్కో.6వ రోజులుంబిని హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్. కుశినగరకు ప్రయాణం. కుశినగరలో లంచ్ తర్వాత మహాపరినిర్వాణ టెంపుల్, రామ్భర్ స్థూప, మాతా కుటీర్ టెంపుల్‌తోపాటు ఇతర దర్శనీయ స్థలాల వీక్షణం. అక్కడి నుంచి గోరఖ్‌పూర్‌కు ప్రయాణం. గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్లో ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ ఎక్కి బలరామ్‌పూర్‌కు సాగి΄ోవాలి. డిన్నర్ ట్రైన్లోనే. (శ్రావస్థికి వెళ్లడానికి)బుద్ధుడి నిర్యాణంనే΄ాల్లో పుట్టిన సిద్ధార్థుడు భారతదేశంలో బుద్ధుడయ్యాడు. ఎనభై ఏళ్లు జీవించిన తర్వాత భారతదేశంలోనే చివరి నిద్రకుపక్రమించాడు. ఉత్తరప్రదేశ్‌లోని కుశినగరలో బుద్ధుడు తుది శ్వాస వదిలిన చోట మహాపరి నిర్యాణ ఆలయాన్ని నిర్మించారు. దాని వెనుక నిర్వాణ చైత్య (పరినిర్వాణ స్థూప) ఉంది. ఇక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరాన బుద్ధుడి అవశిష్ఠంతో నిర్మించిన రామభార్ స్థూప కూడా గొప్ప ప్రాశస్త్యం కలిగిన బౌద్ధ నిర్మాణం. ఇక ఇక్కడ చూడాల్సిన వాటిలో మాతా కుటీర్ టెంపుల్ ముఖ్యమైనది. బుద్ధుడు తొలి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం సారనాథ్ అయితే చివరి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం మాతా కుటీర్ టెంపుల్.7వరోజుఉదయం టీ తాగిన తర్వాత బలరామ్‌పూర్ రైల్వేస్టేషన్లో రైలు దిగి శ్రావస్థికి ప్రయాణం. 15 కిమీల దూరం. శ్రావస్థిలో హోటల్ గదిలో చెక్ ఇన్. రిఫ్రెష్మెంట్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సైట్ సీయింగ్‌కి బయలుదేరాలి. జేతవన విహార, పక్కి సెహాత్ మహేత్ వీక్షణం. మధ్యాహ్న భోజనం తర్వాత కొంత సేపు విశ్రాంతి. ఆ తర్వాత బలరామ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు ప్రయాణం. రైలెక్కిన తర్వాత రైలు ఆగ్రాకు సాగి΄ోతుంది. రాత్రి భోజనం రైల్లో.శ్రావస్థి... ప్రపంచ శాంతిరవంశ్రావస్థి ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం, జనపదాల కాలంలో కోసల రాజ్యానికి రాజధాని నగరం. రాముడి కుమారుడు లవుడు పాలించిన నగరమని చెబుతారు. జ్ఞానోదయమైన తరవాత బుద్ధుడు చాలా కాలం ఈ ప్రదేశంలో నివసించాడు. బుద్ధుడి జీవితంలో అనేక అద్భుతాలు ఇక్కడే జరిగాయని చెబుతారు. వందలాది బోధనలు వెలువరించడంతోపాటు అనేక మందిని సమ్యక్ జీవనం వైపు ప్రభావితం చేసిన ప్రదేశం. నాటి చౌద్ధ జ్ఞాపకాల పునర్నిర్మాణాలను చూడవచ్చు. ఇక్కడ పర్యటించిన బౌద్ధులు శ్రావస్థి సమీపంలోని ఆనందబోధి వృక్షం కింద కొంత సేపు ధ్యానంలో గడుపుతారు. బౌద్ధం ఆకాంక్ష అయిన ప్రపంచ శాంతికి ప్రతీకగా ఇక్కడ ప్రపంచ శాంతి గంట ఉంది. ఈ ప్రదేశం బౌద్ధంతో΄ాటు జైనానికి కూడా ప్రత్యేకమైనదే.జేతవన వీక్షణంబుద్ధుడు ప్రవచనాలను బోధిస్తూ పర్యటిస్తున్న క్రమంలో వేణువనంలో కొంతకాలం నివసించిన తర్వాత జేతవనంలో నివసించాడు. ఇక్కడ పెద్ద విహారం ఉండేది. ఇప్పుడు మనం చూడగలిగింది ఆ విహారానికి ఆనవాలుగా మిగిలిన శిథిలాలను మాత్రమే. బుద్ధుడి కోసం ఈ విహారాన్ని నిర్మించింది శ్రావస్థి నగరంలోని సంపన్నుడైన వ్యాపారి ఆనంద పిండిక. బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత జీవితాన్ని సమాజసేవ కోసం అంకితం చేసిన ఆనంద పిండిక విశాలమైన స్థలాన్ని కొని విహారాన్ని నిర్మించాడు. ఈ ప్రదేశాన్ని శ్రావస్థి యువరాజు జేత పేరుతో జేతవనంగా పిలిచేవారు. అదే జేతవన విహారంగా వాడుకలోకి వచ్చింది. 8వ రోజుఉదయం టీ తర్వాత రైలు ఆగ్రాకు చేరుతుంది. రిఫ్రెష్మెంట్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి రైలు దిగి సైట్‌సీయింగ్‌కి వెళ్లాలి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్ వీక్షణం తర్వాత ఆగ్రా రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. మధ్యాహ్న భోజనం రైల్లోనే. ‘బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్’ సాయంత్రం టీ తర్వాత ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. టూర్ నిర్వహకులు పర్యాటకులకు వీడ్కోలు చెబుతారు.బియాండ్ ద తాజ్!తాజ్‌మహల్ రకరకాల వాస్తుశైలిల సమ్మిళితం. ఇండో– ఇస్లామిక్ నిర్మాణ శైలికి మొఘల్ ఆర్కిటెక్చర్‌ని జోడిస్తే వచ్చిన రూపం. ముంతాజ్ మరణం తర్వాత మొఘల్ పాలకుడు షాజహాన్ని తీవ్రమైన దుంఖం నుంచి సాంత్వన కలిగించిన నిర్మాణం కూడా. ముంతాజ్ మరణం తర్వాత షాజహాన్ విచారంతో తనకిష్టమైన సంగీతం, ఆహారం, దుస్తుల పట్ల కూడా ఆసక్తి లేకుండా గడిపాడు. ఆగ్రా సమీపంలో రాజా మొదటి జయ్సింగ్ నిర్మించిన గొప్ప నిర్మాణం ఉందని తెలిసిన తర్వాత రాజుతో అంగీకారం కుదుర్చుకుని ముంతాజ్ సమాధి కోసం తీసుకున్నాడని చరిత్రకారులు నిర్ధారించారు. ముంతాజ్ మరణించినప్పుడు ఆమె శవపేటికను మధ్యప్రదేశ్, బుర్హాన్పూర్లో తపతి నది తీరాన అహుఖానా అనే భవనంలో సమాధి చేశారు. జయ్సింగ్తో ఒప్పందం తర్వాత ఆ భవనానికి కొన్ని మార్పులు చేసి ముంతాజ్ శవపేటికను ఇక్కడికి తరలించారు. ఆ తర్వాత షాజహాన్‌ను కూడా ఇక్కడే ఖననం చేశారు. తాజ్‌మహల్‌లో ఆ రెండు సమాధులను చూడవచ్చు. తాజ్‌మహల్ వెనుక దాగిన వాస్తవాలను తెలుసుకునే కొద్దీ ప్రేమ చాలా గొప్పదని ఒప్పుకుని తీరాల్సిందే.ప్యాకేజీల సంగతిదీ.. ఐఆర్సీటీసీ బుద్ధిస్ట్ సర్క్యూట్ టూరిస్ట్ ట్రైన్ ప్రస్తుతం కొత్త ఆఫర్లతో ΄్యాకేజ్ ప్రకటించింది. ఇది ఎనిమిది రోజుల యాత్ర. ఢిల్లీ నుంచి మొదలై ఢిల్లీకి చేరడంతో పూర్తవుతుంది. ఇవి విదేశీయులు, ఎన్ఆర్ఐల కోసం ఉద్దేశించిన ప్యాకేజ్‌లు, కాబట్టి ప్యాకేజ్ ధరలు యూఎస్ డాలర్లలో ఉంటాయి. మనదేశంలో నివసిస్తున్న భారతీయులు కూడా ఆసక్తి ఉంటే ఈ ప్యాకేజ్‌లో టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్యాకేజ్‌లో సూచించిన డాలర్ల సరిపడిన రూపాయలు చెల్లించి టూర్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు ఏసీ ఫస్ట్ క్లాస్‌లో టూర్ మొత్తానికి 1400 డాలర్టు. ఒక రోజుకు 175 డాలర్లు.ఏసీ టూ టయర్‌లో టూర్ మొత్తానికి 1160 డాలర్లు, ఒక్క రోజుకు 145 డాలర్లు.ఏసీ ఫస్ట్ క్లాస్ కూపేలో టూర్ మొత్తానికి 1550 డాలర్లు, ఒక్క రోజుకు 175 డాలర్లు.టూర్ మొదలయ్యే తేదీలు డిసెంబర్ 20, జనవరి (2026) 3, ఫిబ్రవరి 21, మార్చి 21.ఇవి వర్తించవు!వీసా ఫీజులు ప్యాకేజ్‌లో వర్తించవు., లాండ్రీ, మందులు, మద్యం, ఇతర పానీయాలు ఉండవు. పర్యటన కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడం, పర్యటన పూర్తయిన తర్వాత రైల్వేస్టేషన్ నుంచి వెళ్లే రవాణా సౌకర్యం ఇందులో ఉండదు. పర్యాటక ప్రదేశాల్లోకి కెమెరాలను అనుమతించడానికి ఫీజులు కూడా ప్యాకేజ్‌లో వర్తించవు.ఇవి వర్తిస్తాయి!రైలు ప్రయాణం, రైలు దిగిన తర్వాత పర్యాటక ప్రదేశాలకు ఏసీ వాహనంలో రోడ్డు రవాణా, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బస, భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్. వీటితోపాటు ఇంగ్లిష్, హిందీ మాట్లాడే టూర్ ఎస్కార్ట్ కూడా పర్యటన ఆద్యంతం వెంట ఉంటారు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: కర్నాటక టూర్..పర్యాటక దివ్యధామం..!) -
ఇదే చైనా కుటిల నీతి..
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా వ్యూహాలు, ఆక్రమిత ప్రాంతాల్లో చైనా ఏ విధంగా వ్యవహరిస్తుంది వంటి అంశాల గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆక్రమిత ప్రాంతాల్లో చైనా పాటించే విధనాలు ఏంటో చూడండి. ప్రపంచంలో ప్రతి దానికి చైనా తన సొంత పేర్లు పెడుతుంది. భూమి కానీ.. మనుషులు కానీ ఏదైనా సరే. బలవంతంగా ఆక్రమించిన ప్రాంతంలో మనుషులను తన డిక్షన్లోకి మార్చుకుంటుంది డ్రాగన్ దేశం. దానిలో భాగంగానే ముస్లింలను చైనా సంస్కృతిలో కలపడానికి గాను ఇస్లామిక్ పేర్ల మీద నిషేధం విధించింది. అంతేకాక వారికి సంబంధించిన మత గ్రంథాలను తనకు అనుకూలంగా మార్చుకుంది చైనా. ఆఖరికి మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని సైతం వదలలేదు. అక్కడి మీడియా, ప్రెస్ నోట్లలో వారి పేర్లను చైనీస్‌లోకి అనువాదం చేసి సు జీషెంగ్, టాంగ్నాడే తెలాంగ్పు అని పేర్కొంటుంది. విషయాలను స్వంతం చేసుకోవడమే ఇక్కడ దాని ప్రధాన ఆలోచన. (చదవండి: వెయ్యి మందికి పైగా చైనీయుల వీసాలు రద్దు!) ఇక చైనా తాను ఆక్రమించిన ప్రాంతాల చరిత్రను మార్చడానికి వాటికి కొత్త పేర్లను పెడతుంది. 1950-60 మధ్య టిబెట్ విషయంలో ఇదే జరిగింది. దాని పేరును జిజాంగ్(వెస్ట్రన్ త్సాంగ్)గా మార్చగా.. తూర్పు తుర్కెస్తాన్ పేరును జిన్జియాంగ్గా మార్చింది. జిజాంగ్ అంటే పాశ్యాత్య ధూళి అని అర్థం. టిబెట్లను అవమానించే ఉద్దేశంతో చైనా ఈ పేరు పెట్టింది. పేరు మార్చడం పూర్తయ్యాక ఆ ప్రాంతానికి సంబంధించి అసంబద్ధమైన వాదనలను తెర మీదకు తెస్తుంది. టిబెట్ విషయంలో ఇదే జరగింది. టిబెటన్ బౌద్ధమతం ఇన్నర్ మంగోలియాలో ఉద్భవించింది అనే హాస్యాస్పదమైన వాదనను తెరమీదకు తెచ్చింది. ఇక్కడ చైనా ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. టిబెటన్ల మీద భారతీయ ప్రభావాన్ని దూరం చేయడం. ఇస్లామిక్ పేర్లను నిషేధించడం ముస్లిం ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించిన చైనా అక్కడి వారిని పూర్తిగా తనలో కలుపుకుంటుంది. దానిలో భాగంగానే ఇస్లామిక్ పేర్లను నిషేధిస్తుంది. ప్రస్తుతం జిన్జియాంగ్గా పిలువబడే తూర్పు తుర్కెస్తాన్‌లోని చురుకైన ప్రాంతాల్లో నుంచి ఇస్లాం ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించడానికి చైనా దేశంలో 29 ఇస్లామిక్ పేర్లను నిషేధించింది. ఫలితంగా ఇక్కడి ప్రజలు ఈ పేర్లతో జననమరణాలను రిజిస్టర్ చేయడం.. పూర్వీకుల ఆస్తులను సొంతం చేసుకోవడం అసాధ్యం. అంతేకాక ఈ పేరు ఉంటే పాఠశాలలు మొదలు.. యూనివర్సిటీల వరకు ఎక్కడా ప్రవేశం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభించవు. ఇక్కడ చైనా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉయ్ఘర్ సమాజాన్ని పూర్తిగా లొంగదీసుకుని తనలో కలుపుకోవడమే. (చదవండి: ముదురుతున్న వివాదం) ఇంటర్నెట్‌ని ప్రభావవంతంగా వాడటం చైనా జనాభా 1.42 బిలియన్లు. ప్రపంచ మొత్తం జనాభాలో ఐదొంతుల మంది ఇక్కడే ఉన్నారు. ప్రజలను ప్రభావితం చేయగల శక్తి ఇంటర్నెట్కి ఉందని అర్థం చేసుకున్న చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(సీసీపీ) ఇంటర్నెట్‌ని చాలా జాగ్రత్తగా వినియోగిస్తుంది. చైనా విదేశాంగ విధానాలకు అనుగుణంగా దేశీయ, ప్రపంచ రంగాలపై అభిప్రాయాలను ప్రభావితం చేయడానికి షాంఘై యూనిట్ 61398 వంటి పీఎల్ఏ సైబర్ క్రైమ్ బ్రిగేడ్‌ను సీసీపీ చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. గ్రంథాలు, పుస్తకాలను అనువదించడం టిబెటన్ జనాభాను చైనీస్ భాషలో చదవమని బలవంతం చేయడానికి చైనా వేదాంత సంస్థలలోని అన్ని బౌద్ధ గ్రంథాలను అనువదించడం ప్రారంభించింది. ఫిబ్రవరి 2018 లో లాసా జోఖాంగ్ ఆలయాన్ని తగలబెట్టడం.. టిబెటన్ బౌద్ధమతంలో అత్యంత పవిత్రమైన, గౌరవనీయమైన ప్రదేశాలలో పాత బౌద్ధ గ్రంధాలన్నింటినీ తగలబెట్టే ప్రయత్నం చేసింది. వీటిని నాశనం చేసి చైనీస్ భాషలో కొత్త పుస్తకాలు ప్రచురించింది. ఇక్కడ దాని ప్రధాన ఉద్దేశం ఇక మీదట ఆక్రమిత టిబెట్‌లోని కొత్త తరం సన్యాసులు బీజింగ్‌కు దగ్గరగా ఉండటమే కాక వారి మీద సీసీపీ ప్రభావంతో ఉంటుంది. ఇటువంటి చర్యలతో, చైనా అది ఆక్రమించిన కమ్యూనిటీలు, భూముల గుర్తింపును పూర్తిగా మార్చివేస్తోంది. దీనిలో భాగంగా హాన్ సమాజం, మధ్య సామ్రాజ్యం జాంగ్గువో మినహా అన్నింటినీ తుడిచివేసింది. -
కనుమరుగవుతున్న చరిత్ర..!
సాక్షి, యాదాద్రి : జైనం, బౌద్ధం, వీరశైవం, వైష్ణవ సంప్రదాయాలకు నిలయమైన పురాతన ఆలయాలు పాలకుల ఆలనాపాలనా లేక కనుమరుగవుతున్నాయి. ఆధ్యాత్మిక, చరిత్రక నేపథ్యం కలిగిన యాదాద్రిభువనగిరి జిల్లాలో వందల ఏళ్ల నాటి చరిత్ర కనుమరుగవుతుంది. ఆదిమ మానవుని మనుగడకు సంబంధించిన సమాధుల నుంచి వివిధ మతాలకు చెందిన ఆలయాలు, రాతి విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. కొండలపై, గుట్టలపై చారి త్రక సంపద ఆనవాళ్లు కోల్పోతుంది. వెలుగుచూస్తున్న ఆలయాలు జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం సైదాపురం గుట్టపై ఆలయం వెలుగుచూసింది. 16వ శతాబ్ధానికి సంబం ధించిన వైష్ణవ ఆలయంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో భువనగిరిలో వటుక భైరవుని విగ్రహం రెండు సంవత్సరాల క్రితం బయటపడింది. అలాగే సైదాపురం గ్రామంలో కోట గోడల ఆనవాళ్లు లభించాయి. రాయగిరి వెంకటేశ్వరాలయం కోనేటి వద్ద గల శివలింగం, ఇతర విగ్రహాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. ఆత్మకూరు(ఎం), అమ్మనబోలు, మాటూరు, రఘునాథపురం, మాసాయిపేట, గొలనుకొండ, ఆలేరు, ఇక్కుర్తి, కొలనుపాక ఇలా పలుచోట్ల తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు, ఆలయాలు ఆదరణకు నోచుకోవడం లేదు. భువనగిరి మండలంలో బయటపడ్డ కాకతీయుల కాలం నాటి శాసనాలు ఎన్నో నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని రక్షిం చాల్సిన అవసరం ఉంది. గుప్తనిధుల కోసం తవ్వకాలు.. జిల్లాలోని పలు దేవాలయాలు, గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారు. ప్రధానంగా శివాలయాల్లో నంది, శివలింగాలను తవ్వేశారు. జిల్లాలో సుమారు వంద ఆలయాల్లోని విగ్రహాలు, శివలింగాలను గుప్త నిధుల కోసం తవ్వేశారు. కొండలపై, గుట్టలపై గల ఆలయాలు ధ్వంసమయ్యాయి. గుట్టలను పగులగొడుతున్న సమయంలో పురాతన కాలం నాటి ఆలయాలు కనుమరుగవుతున్నాయి. ఆదిమ మానవుడికి సంబంధించిన సమాధులను తవ్వేసి రైతులు పొలాలుగా మార్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పురావస్తు శాఖ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వందల సంవత్సరాల సంపద భావితరాలకు లభించకుండాపోతోంది. ఆలయాలపై అధ్యయనం చేయాలి పురాతన ఆలయాలు, వాటి చరిత్రపై ప్రభుత్వం అధ్యయనం చేయాలి. యాదాద్రిభువనగిరి జిల్లాలో జైన, బౌద్ధ, వీరశైవ, వైష్ణవ, సంప్రదాయాలకు సంబంధించిన ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. చాలా వరకు కనుమరుగయ్యాయి. మిగిలిన వాటిని రక్షించుకోవాలి. ఎక్కడైనా ఒక నూతన ఆలయం, విగ్రహం బయటపడితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా కలెక్టర్, ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ ప్రాంతంలో శైవం, వైష్ణవ మతాలు రాజుల కాలంలో ఉన్నత స్థితిలో కొనసాగాయి. వాటికి సంబంధించిన ఆనవాళ్లు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన వాటిపై పరిశోధనలు జరిపి చరిత్రకు సాక్ష్యంగా నిలపాలి. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి. –ఎస్.హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకుడు పురాతన దేవాలయాలను రక్షించాలి ప్రభుత్వం చారిత్రక సంపదను కాపాడటానికి చర్యలు తీసుకోవాలి. వెలుగులోకి వచ్చిన పురాతన దేవాలయాలను గుర్తించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలి. తద్వారా రక్షణ కల్పించడానికి వీలవుతుంది. మరుగున పడిన చారిత్రక సంపదను వెలుగులోకి తీసుకురావాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలి. పురాతన ఆలయాలకు రక్షణ కల్పించాలి. -తోట భాను, విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి జిల్లాల సహకార్యదర్శి -
శరవేగంగా బుద్ధవనం ప్రాజెక్ట్ పనులు
నాగార్జునసాగర్ ప్రాంతం.. బుద్ధ పరిమళంతో విరాజిల్లుతోంది. బుద్ధవనం ప్రాజెక్టు పనులు ఊపందుకోవడంతో పలు దేశాలనుంచి బౌద్ధ భిక్షువుల తాకిడి పెరిగింది. ప్రపంచం లోనే అన్ని ప్రాంతాల బౌద్ధ ఆనవాళ్ల నమూనాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు చూసేందుకు దేశవిదేశాల నుంచి బౌద్ధ యాత్రికులు సాగర్బాట పడుతున్నారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ వద్ద 275 ఎకరాల్లో బుద్ధవనం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. బుద్ధుడి జీవిత విశేషమంతా ఈ వనంలో ఆవిష్కరిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. ఎప్పుడో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు గతంలో నిధుల లేమితో మూలనపడ్డాయి. ఇటీవల బౌద్ధ యాత్రికుల తాకిడి పెరగడంతో పనుల్లో వేగం పెరిగింది. పలు దేశాలకు చెందిన బౌద్ధ సంప్రదాయాలు నెలకొని ఉండేలా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. శ్రీపర్వతారామంలో 8 భాగాలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మహాస్తూపం, బుద్ధచరిత వనం, ధ్యానవనం, జాతక పార్కు, స్తూపాపార్కు విభాగాల్లో నిర్మాణాలు ఓకొలిక్కి వచ్చాయి. కృష్ణావ్యాలీ పార్కు (కృష్ణా,గోదావరి నదుల వెంట విరాజిల్లిన బౌద్ధ సంప్రదాయాలకు అనుగుణమైనరీతిలో) ఆచార్యనాగార్జున రిసర్చ్సెంటర్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతర్జాతీయ బౌద్ధ సంప్రదాయాలకనుగుణంగా ఈ అధ్యయన కేంద్రంలో ప్రపంచంలోని బౌద్ధ సంప్రదాయ దేశాలన్నింటిని భాగస్వాములను చేస్తున్నారు. ఆయా దేశాల ఆరామాలు, మ్యూజియాలు ఏర్పాటు చేసుకునేందుకు శ్రీపర్వతారామంలో స్థలాలను కేటాయిస్తున్నారు. టిబెట్ దేశీయులకు 5 ఎకరాలు, బుద్ధిస్ట్ అసోసియన్ ఆఫ్ అమెరికాకు 5 ఎకరాలు, శ్రీలంక దేశీయులకు 5 ఎకరాలు, విపశ్శనకేంద్రానికి 30ఎకరాలు ఇచ్చారు. ఇప్పటికే శ్రీలంక దేశీయులు 27 అడుగుల నమూనా బుద్ధ అవకన విగ్రహం, బుద్ధునిపాదాలు, ధర్మగంట ఏర్పాటు చేశారు. గత డిసెంబర్లో డిసెంబర్ 25న శ్రీపర్వతారామాన్ని తైవాన్‌కు చెందిన బౌద్ధులు సందర్శించారు. దీనిలో ఫోగ్యాంగ్షాన్ తరహాలో లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. అలాగే ఇదే నెలలో మలేషియా దేశస్తులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈనెల మొదటి వారంలో స్విట్జర్లాండ్, బర్మా, నేపాల్ దేశీయులు వచ్చారు. పర్యాటకులకు స్వర్గధామమే .. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దేశంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉంది. బుద్ధవనం ప్రాజెక్టు పూర్తయితే విదేశీ యాత్రికుల సంఖ్య కూడా ఇక్కడ పెరగనుంది. బుద్ధుడి ఆనవాళ్లు, జీవిత చరిత్రతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు పనులను చూసి విదేశీయులు అబ్బురపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు బౌద్ధానికి చారిత్రక నిలువుటద్దంగా ఉన్న నాగార్జునకొండలోని మ్యూజియం ప్రపంచంలోనే పెద్దది. నాగార్జునసాగర్, నదీతరం, జలపాతాలు, నల్లమల అభయారణ్యం, నాగార్జునకొండలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. బద్ధవనం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనుంది. నాగార్జునసాగర్ నూతన సొబగులద్దుకొని ప్రపంచంలోనే ప్రముఖ బౌద్ద ఆధ్యాత్మిక కేంద్రం కానుంది. -
రోబో బుద్ధాకర్షక మంత్రం!
బీజింగ్: తమ మతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రకటనలు, ప్రచారాలు, సాక్ష్యాలు చెప్పించడం లాంటివి చేయడం మనకు తెలిసిన పద్ధతి. అది మామూలుగా చేసేదే కదా! అందులో కొత్తే ముంది అంటున్నారు చైనాలోని బీజింగ్‌లో ఉన్న బుద్ధుడి ఫాలోవర్స్ ఏకంగా రోబోను తయారుచేసి ప్రజలను బుద్ధిజం వైపు ఆకర్షించే ప్రయత్నంలో పడ్డారు. కార్టూన్ తరహాలో ఉండే ఈ రోబోకు పసుపు రంగు బట్టను, నున్నని తలతో మంత్రాలను చెప్పగలిగే విధంగా తయారు చేసేశారు. దీంతో పాటు బుద్ధిజం గురించి 20 చిన్నచిన్న ప్రశ్నలకు ఈ రోబో టకటకా సమాధానం ఇచ్చేయగలదు. బుద్ధిజాన్ని స్వీకరించిన వారు రోజూ వారీ దినచర్య ఎలా పాటించాలో కూడా ఈ రోబో నేర్పిస్తుంది. ఓ టెక్నాలజీ కంపెనీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) నిపుణులు కలిసి చైనాకు చెందిన యూనివర్సిటీ సాయంతో సమకాలీన బుద్ధ కల్చర్‌ను ఈ రోబోకు ధారపోశారు. దీనిని అమలుచేసిన కొద్దిరోజులకే చైనాలో దాదాపు 3లక్షల మంది ఫాలో అవడం ప్రారంభించేశారు.


