breaking news
Bordeaux
-
ప్రకృతి చేస్తున్న హెచ్చరిక
వర్తమానంలో లాభార్జన కోసం భవిష్యత్తును బలిపెట్టే నయా ఉదారవాద విధానాలు ప్రపంచాన్ని ప్రమాదపుటంచులకు తీసుకెళ్తున్నాయి. దశాబ్దాలుగా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియాల్లో చోటుచేసుకుంటున్న కార్చిచ్చుల్ని పట్టించుకుని పర్యావరణ అనుకూల విధానాలు పాటించని ఫలితంగా ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 37 కోట్ల ఎకరాల్లోని అడవులు, పొదలు తగలబడ్డాయని ఒక అంచనా. ఇలా కార్చిచ్చులో చిక్కుకున్న ప్రాంతం మంగోలియా దేశ విస్తీర్ణానికి సమానమని చెబుతున్నారు.స్పెయిన్, ఫ్రాన్స్ అటవీప్రాంతాల్లో, కెనడా, రష్యాల్లో గత వారం రోజు లుగా వ్యాపిస్తున్న మంటల వల్ల ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్ కార్చిచ్చులైతే ఊహించశక్యం కానంత స్థాయిలో ఉన్నాయి. వాటిని అదుపు చేయగలిగా మని ఆ రెండు దేశాలూ చెబుతున్నా జనంలో భయాందోళనలు ఉపశమించలేదు. నైరుతి ఫ్రాన్స్‌లో పారిస్‌కు నాలుగు రెట్లు పెద్దదైన విస్తీర్ణంలోని అడవి తగలబడటంవల్లగిరోండ్ ప్రాంతంలోని జనావాసాలనుంచి రెండున్నర లక్షలమంది పౌరుల్ని ఆదరా బాదరాగా తరలించాల్సివచ్చింది.ముఖ్యంగా బోర్డావ్ నగరంవైపు ఆ మంటలు వ్యాపిస్తున్న తీరు జనాన్ని హడలెత్తించింది. అటు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ లక్షమందిని తరలించారు. దాని శివారు ప్రాంతాల్లో పలు జనావాసాలు తగలబడిపోయాయి. ఆ రెండూ యుద్ధ రంగాన్ని తలపింపజేస్తున్నాయని మీడియా కథనం. జరగాల్సిన నష్టం జరిగాక మంటల్ని ఏదోమేరకు అదుపు చేయటం సాధ్యమే. కానీ వాటివల్ల వ్యాపించే పొగవల్ల గాలి నాణ్యత దెబ్బతింటుంది. కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లతో కూడిన సూక్ష్మ ధూళి కణాలు పీల్చేగాలిలో వ్యాపించి ఊపిరి తిత్తులు, గుండెసంబంధ వ్యాధులతో ప్రజారోగ్యం క్షీణిస్తుంది. అరుదైన వృక్షసంపద, జీవవైవిధ్యం బుగ్గిపాలవుతుంది. దాని కారణంగా వడగాడ్పులు చెలరేగి జనంఅల్లాడిపోతారు. ఈ ఖండాల్లో ఏటా కార్చిచ్చులవల్ల 3,40,000 అకాల మరణాలుసంభ విస్తున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి. 2023లో ప్రపంచ కర్బన ఉద్గారాల్లో కెనడా కార్చిచ్చుల వాటా 23 శాతమని అంచనా వేశారు. యూరప్ ఖండం అత్యంత వేగంగా వేడెక్కుతున్నదని యూరోపియన్ యూనియన్(ఈయూ) పర్యవేక్షణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఫ్రాన్స్ కార్చిచ్చువల్ల ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాల్లోని పలు ప్రాంతాల్లో పొగ, ధూళితో కూడిన నీటియావిరి వ్యాపించి, అది మేఘాలుగా మారి, ప్రమాదకరమైన పెనుగాలులు, పిడుగుపాట్లు సంభవించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.సాధారణంగా ఇలాంటి కార్చిచ్చులు మానవతప్పిదాలతోనే మొదలవుతాయి. కానీ వాతావరణ మార్పుల పర్యవసానంగా అవి వేగంగా విస్తరిస్తాయి. ఈ విషయంలో శాస్త్రవేత్తలు స్థూలంగా అంగీకారానికొచ్చినా, తమ నమూనాలు అందుకోలేనంత స్థాయిలో ఇవి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ తీవ్రతను పసిగట్టడానికి కొత్త ఉపకరణాలు అవసరం కావొచ్చన్నది వారి అభిప్రాయం. ఇప్పుడు స్పెయిన్, ఫ్రాన్సుల్లో మంటలు వ్యాపించిన అడవుల్లో పిక్నిక్లు, క్యాంప్ ఫైర్లు ఎక్కువ. అజాగ్రత్తగా ఉండే మనుషులవల్ల నిప్పు రాజుకోవటం, గాలిలో తేమ శాతం తక్కువుండే రాత్రివేళ మోడువారిన చెట్లు, ఎండుటాకులు అంటుకుని మంటలు వేగంగా వ్యాపించడం రివాజు. గత కొన్నేళ్లుగా ఈ కార్చిచ్చులవల్ల ఉత్పత్తయ్యే వేడి, పొగ ఆధారంగా పైరోక్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షరహిత పెనుగాలులతో కూడిన తుపానులు ఏర్పడుతున్నాయి. తీవ్రమైన ఆ వేడిగాలుల కారణంగా ఎక్కడెక్కడో పడే పిడుగులు మరిన్ని అగ్నిప్రమాదాలకూ, కార్చిచ్చులకూ దారితీస్తున్నాయి. విషపూరిత పొగ, బొగ్గు రేణువులతో ఉండే ఈ మేఘాలు అణు విస్ఫోటంలో వచ్చే పొగ మాదిరే దీర్ఘకాలం వాతావరణంలో అలుముకుని సూర్యరశ్మిని అడ్డుకుంటాయి. 2019–20లో ఆస్ట్రేలియా ఇలాంటి వాతావరణాన్ని చవిచూసింది. దానికి ‘బ్లాక్ సమ్మర్’ అని పేరుపెట్టారు. ఇకనైనా వాతావరణంతో ఆటలాడటం ప్రమాదకరమని ప్రభుత్వాలు గుర్తించాలి. గుప్పెడు కార్పొరేట్ సంస్థల లాభార్జన కోసం వాతావరణాన్ని బలిపెడితే ఊహకందని ఉత్పాతాలు కాటేస్తాయి. పర్యావరణం ధ్వంసమై మానవాళి మనుగడే పెను ప్రమాదంలో పడుతుంది. తాజా పరిణామాలు చేస్తున్న హెచ్చరిక ఇదే. -
చుక్కేసుకుంటారా?. చుక్కల్లోకి చూసి..
-
ఇటలీని గెలిచారు
యూరో సెమీఫైనల్లో జర్మనీ నరాలు తెగే ఉత్కంఠకు ఇది పరాకాష్ట.. కొదమ సింహాల్లాంటి జట్లు.. అన్నింటా సమ ఉజ్జీలే.. దీనికి తగ్గట్టుగానే మైదానంలో నువ్వా.. నేనా అనే రీతిలో జర్మనీ, ఇటలీల మధ్య జరిగిన యూరో క్వార్టర్ ఫైనల్ ఉర్రూతలూగించింది. నిర్ణీత సమయంలో ఫలితం తేలని ఈ మ్యాచ్ సుదీర్ఘ పెనాల్టీ షూటౌట్‌కి దారి తీసింది. ఓ యుద్ధంలా సాగిన ఈ పోరులో చివరికి జర్మనీ జట్టు తొలిసారిగా ఇటలీ కోటను బద్దలు కొట్టి సెమీస్‌కు చేరింది. బోర్డియాక్స్: యూరో కప్‌లో ప్రపంచ చాంపియన్ జర్మనీ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎలాంటి మేజర్ టోర్నమెంట్లో ఎదురైనా తమను చావుదెబ్బ తీస్తున్న ఇటలీపై ప్రతీకారం తీర్చుకుని సెమీస్‌కు చేరుకుంది. శనివారం హోరాహోరీగా జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీయగా 6-5 తేడాతో జర్మనీ నెగ్గింది. దీంతో తొమ్మిదో ప్రయత్నంలో దిగ్విజయంగా తమ ‘ఇటలీ గాయాన్ని’ నయం చేసుకుంది. 120 నిమిషాల్లోనూ రెండు జట్ల నుంచి భీకర పోరు ఎదురుకావడంతో స్కోరు 1-1తో సమమైంది. మీసట్ ఓజిల్ (65వ నిమిషంలో) జర్మనీ నుంచి గోల్ చేయగా లియొనార్డో బోనుక్కి (78) పెనాల్టీ స్పాట్ ద్వారా ఇటలీకి గోల్ అందించాడు. ఇక ఆ తర్వాత హైడ్రామా కొనసాగిన షూటౌట్లో ముందుగా ఐదు ప్రయత్నాల్లో రెండు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత వరుసగా నాలుగు ప్రయత్నాల్లో జర్మనీ సఫలం కాగా ఇటలీ మూడు సార్లు మాత్రమే లక్ష్యాన్ని చేరడంతో పరాజయం పాలైంది. ఓవరాల్‌గా ఇందులో 18 షూటౌట్లు నమోదు కావడం విశేషం. వ్యూహం మార్చిన జర్మనీ: ఇటలీపై ఎలాగైనా ఈసారి పైచేయి సాధించాలనే కసితో ఉన్న జర్మనీ కోచ్ తమ సంప్రదాయ 4-3-3 కూర్పుతో కాకుండా 3-5-2తో బరిలోకి దించారు. దీంతో మిడ్‌ఫీల్డ్‌లో బంతిని ఎక్కువగా తమ ఆధీనంలోనే ఉంచుకుంది. 20వ నిమిషంలో ఇటలీ డిఫెన్స్‌ను తప్పిస్తూ హమ్మెల్స్ ఇచ్చిన పాస్‌ను పెనాల్టీ ఏరియాలో అందుకున్న గోమెజ్ కాస్త ఎత్తులో గోల్ పోస్టులోకి పంపడంతో కీపర్ అడ్డుకున్నాడు. అలాగే 41, 42వ నిమిషాల్లో గోమెజ్, ముల్లర్ ప్రయత్నాలు తృటిలో తప్పాయి. అయితే 43వ నిమిషంలో ఇటలీ నుంచి స్టురారోకు చక్కటి అవకాశం దక్కినా బంతి కార్నర్ నుంచి వెళ్లిపోయింది. ద్వితీయార్ధం 65వ నిమిషంలో జర్మనీ బోణీ చేయగలిగింది. హెక్టర్ ఇచ్చిన పాస్‌ను అతి సమీపం నుంచి ఓజిల్ ఎడమ కాలితో గోల్‌గా మలిచాడు. అయితే 78వ నిమిషంలో పెనాల్టీ ఏరియాలో బంతి బోటెంగ్ చేతికి తాకడంతో ఇటలీకి పెనాల్టీ అవకాశం దక్కింది. బోనుక్కి తక్కువ ఎత్తులో బంతిని రైట్ కార్నర్‌లోకి పంపి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్ల నుంచి ఎన్ని దాడులు జరిగినా గోల్ కీపర్లు సమర్థవంతంగా అడ్డుకుని మరో గోల్ కాకుండా చూశారు. అదనపు 30 నిమిషాల సమయంలోనూ గోల్ రాకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది. డ్రామా.. డ్రామా: పెనాల్టీ షూటౌట్లో అనూహ్యంగా ఇరు జట్ల స్టార్ ఆటగాళ్లు విఫలం కావడం ఆశ్చర్యపరిచింది. తొలి ఐదు ప్రయత్నాల్లో థామస్ ముల్లర్, మీసట్ ఓజిల్.. ఇటలీ నుంచి పెల్లే, బోనుక్కి వరుసగా ఫెయిలయ్యారు. దీంతో ఇరు జట్లు 2-2తో సమానంగా నిలిచాయి. ఆ తర్వాత పుంజుకున్న రెండు జట్లు వరుసగా మూడు ప్రయత్నాల్లో విజయం సాధించాయి. అయితే నాలుగో చాన్స్‌లో ఇటలీ ఆటగాడు డార్మియాన్ ఎడమ వైపు తక్కువ ఎత్తులో పంపిన షాట్‌ను కీపర్ మాన్యువల్ న్యూయర్ సులువుగా అడ్డుకున్నాడు. ఇక జర్మనీ నుంచి హెక్టర్ ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్ చేయడంతో జట్టు సంబరాల్లో మునిగింది. చివరి వరకూ పోరాడిన ఇటలీ గోల్‌కీపర్ బుఫాన్ ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ఇటలీపై జర్మనీ నెగ్గడం ఇదే తొలిసారి. 1 యూరో కప్‌లో ఓ మ్యాచ్‌లో 18 పెనాల్టీ షూటౌట్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. 1980లో 9-8తో చెకొస్లోవేకియా ఇటలీపై గెలిచింది.


