breaking news
Bomb warn
-
గుంతకల్లు రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
-
గుంతకల్లు రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్లు రైల్వేస్టేషన్లో మంగళవారం బాంబు కలకలం సృష్టించింది. గోవా నుంచి హౌరా వెళ్తున్న అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు సౌత్‌వెస్ట్రన్ రైల్వే ఉన్నత అధికారికి గుర్తుతెలియని ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రైలు గుంతకల్లు రైల్వేస్టేషన్లో ఆపారు. నిఘా వర్గాల సమాచారంతో ఆర్పీఎఫ్, జీఆర్పీ, బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌తో రైలును తనిఖీ చేశారు. కాగా, పేలుడు పదార్థాలు లాంటి ఏమీ లేదని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.