‘బ్లడీ రోమియో’ నాని లుక్ రెడీ.. వీడియో షేర్ చేసిన చిత్రబృందం
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకులను పలకరించిన ఆయన.. త్వరలోనే దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘బ్లడీ రోమియో’తో సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి నాని పాత్ర లుక్ టెస్ట్ చేశారు. దసరా కానుకగా ఈ లుక్‌ను విడుదల చేయాలని చిత్ర బృంద భావిస్తోంది. ఈమేరకు సోషల్ మీడియా వేదికంగా ఓ ప్రత్యేక వీడియో పంచుకుంది. దీనిని ఎక్స్ వేదికంగా హీరో నాని షేర్ చేశారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ‘బ్లడీ రోమియో’ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని చెప్పారు. ఇందులో యాక్షన్, వైలెన్స్ ఉన్నప్పటికీ మరీ రా అండ్ రస్టిక్‌గా ఉండదని తెలిపారు.‘ఇది చాలా చమత్కారమైన సినిమా. స్టైలిష్ యాక్షన్ ఉంటుంది. సుజీత్ ఈ సినిమాకి ఓ కొత్త ట్రీట్మెంట్ ఇవ్వనున్నాడు. కేవలం తెలుగులోనే కాదు.. ఈ జానర్లో ఇలాంటి సినిమా ఇంతవరకూ ఎక్కడా చూడలేదు. ఈ చిత్రం థియేటర్లలో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ‘ది ప్యారడైజ్’కు పూర్తి కాంట్రాస్ట్‌గా, చాలా రెఫ్రెషింగ్‌గా ఉంటుంద’ అని పేర్కొన్నారు. నాని చేసిన ఈ వ్యాఖ్యలతో ‘బ్లడీ రోమియో’పై అంచనాలు మరింత పెరిగాయి.ఇదీ చదవండి: ఓటీటీలోకి నాని ‘ది ప్యారడైజ్’.. కొత్త మార్పులతో స్ట్రీమింగ్..!I AM #BloodyRomeo Let’s go. @SujeethSign @BloodyRomeoFilm https://t.co/2ZEqwIONIg— Nani (@NameisNani) October 10, 2026