గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా?
ఈమె ఓ మోడల్. సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్ లాంటి అందగత్తెలతో పోటీపడింది. కొద్దిలో మిస్ ఇండియా టైటిల్ చేజార్చుకుంది. అక్కడ మిస్ అయినా సరే పలు హిట్ సినిమాల్లో హీరోయిన్గా చేసింది. సినిమాలతో పాటు సీరియల్స్‌లో కూడా నటించింది. కానీ ఏమైందో ఏమో గానీ సడన్‌గా సన్యాసినిగా మారిపోయి అందరికీ షాకిచ్చింది. మరి ఇంతలా చెప్పాం కదా.. ఈమె ఎవరో కనిపెట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బర్ఖా మదన్. పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఈమె.. యాక్టింగ్ అంటే ఆసక్తి ఉండటంతో మోడలింగ్ రంగంలోకి వచ్చింది. 1994లోనే 'ఫెమినా మిస్ ఇండియా' పోటీలో పాల్గొంది. అదే ఏడాది సుస్మితా సేన్, ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్లు పాల్గొన్నారు. దీంతో ఈమె తొలి రన్నరప్‌గా నిలిచింది. అనంతరం 'మిస్ టూరిజం వరల్ వైడ్' పోటీలోనూ రన్నరప్ అయ్యింది.
(ఇదీ చదవండి: అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన)
అలా మోడలింగ్ వల్ల ఫేమ్ తెచ్చుకున్న బర్భా మదన్.. 1996లో 'ఖిలాడీయో కా ఖిలాడీ' సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత 2012 వరకు మరో ఆరు మూవీస్ మాత్రమే చేసింది. వీటిలో రామ్ గోపాల్ వర్మ తీసిన 'భూత్' కూడా ఉంది. ఇందులో దెయ్యంగా అద్భుత నటన కనబరిన బర్ఖా.. నాలుగు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో అకస్మాత్తుగా సన్యాసినిగా మారిపోయింది.
2012లోనే బౌద్ధ మతాన్ని స్వీకరించాలని బర్ఖా మదన్ అనుకుంది. కానీ ఓ రెండు మూడేళ్ల తర్వాత అది కుదిరింది. ఎప్పుడైతే సన్యాసిగా మారిందో తన పేరుని 'గ్యాల్టెన్ సామ్టెన్' అని మార్చుకుంది. ప్రస్తుతం ఈమె పర్వతాలు, ఆశ్రమాల్లో తిరుగుతూ కనిపిస్తోంది. ఇన్ స్టాలోనూ పోస్ట్ పెట్టినా సరే దానిలోనూ ఆధ్యాత్మిక అంశాలే ఉంటున్నాయి. అప్పట్లో ఈమె సినిమాలు చూసినవాళ్లు.. ప్రస్తుతం ఈమె లుక్ చూసి అవాక్కవుతున్నారు.
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?)
View this post on Instagram
A post shared by Barkha Madan (@barkhamadan17)