breaking news
bangarupalem
-
జగన్ దెబ్బకు దిగొచ్చిన కూటమి.. పెరిగిన మామిడి మద్దతు ధర
-
ఒక్క పర్యటన రూ. 260 కోట్లు..! జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
-
YS Avinash: ప్రజా నాయకుడు జగన్ మీ పతనం మొదలైంది
-
YS జగన్ పర్యటనలో నారా రక్తపాతం
-
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన దిగ్విజయమైంది: భూమన
-
బాబుకు జగన్ అంటే అంతులేని ప్రేమ !
-
పోలీసులు దాడిచేసిన కార్య కర్తకు అండగా వైఎస్ జగన్
-
ఈ వీడియో బాబు, పవన్ చూస్తే ఇక నిద్ర పట్టదు..
-
ఆంక్షల కంచెలు, వలయాలు.. తలలు పగలుగొట్టే లాఠీలు.. నిలిచాడు - గెలిచాడు
-
నా తల పగలగొట్టడానికి కారణం ఇదే.. జగనన్న అంటే వాళ్లకు వణుకు
-
YS జగన్ టూర్ ను అడ్డుకోవడానికే పోలీసు వ్యవస్థ ఉందా..?: అంబటి
-
అడుగడుగునా అడ్డంకులు.. నేడు వైఎస్ జగన్ పర్యటన
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుతున్న చెట్లను రైతన్నలే పెకిలిస్తున్న దుస్థితి ఎందుకు దాపురించింది? కోత ఖర్చులు కూడా దక్కక మామిడి కాయలు చెట్లపైనే కుళ్లిపోతున్నాయి.. రోడ్లపై పారబోస్తున్నా సర్కారులో చలనం ఉండదా? మిర్చి.. ధాన్యం.. పొగాకు.. మామిడి..! ఏడాదిగా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులను ఓదార్చి భరోసా కల్పించేందుకు మాజీ సీఎం వస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం? అని అన్నదాతలు మండిపడుతున్నారు. అడుగడుగునా పోలీసుల దిగ్బంధం.. జగన్ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం.. రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం.. జగన్ కోసం వచ్చే రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరించడం.. కటౌట్లు, ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం లాంటి కుయుక్తులతో చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు.కూటమి నేతల బెదిరింపులు...దారుణంగా ధరల పతనంతో కుదేలైన మామిడి రైతుల దుస్థితిని నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళెం మార్కెట్‌ను సందర్శించనున్న మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ముఖ్యనేత ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా.. మరోవైపు కూటమి నేతలు రైతులు, వ్యాపారులపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రానున్నట్లు పసిగట్టడంతో అడ్డుకునేందుకు పోలీసులు మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ శ్రేణులందరికీ నోటీసులు జారీ చేశారు. కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులకు ఫోన్ చేసి వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లొద్దని హెచ్చరించినట్లు సమాచారం. వైఎస్ జగన్ బంగారుపాళెం వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కూటమి సర్కారులో హడావుడి మొదలైంది. కిలో మామిడి రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రూ.6 చొప్పున మాత్రమే చెల్లిస్తామని రైతులతో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటున్నాయి. ర్యాంపుల వద్ద కేవలం రూ.2కే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ నేరుగా మార్కెట్ యార్డు వద్దకు వచ్చి రైతులతో మాట్లాడనుండటంతో చంద్రబాబు సర్కారులో వణుకు ప్రారంభమైంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా...మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. వైఎస్ జగన్ ఇటీవల నెల్లూరులో పర్యటించాల్సి ఉన్నా.. హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బంగారుపాళెం పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలకు తెర తీశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైఎస్ జగన్ పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండవని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెప్పటంతో.. ఎట్టకేలకు అనుమతులు ఇస్తూనే హెలిప్యాడ్ వద్ద కేవలం 30 మంది, మార్కెట్ యార్డులో 500 మంది మాత్రమే ఉండాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం ఉదయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సుమారు 400 మందికి నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు తరలి వెళ్లటానికి వీల్లేదని ఆదేశించారు. బంగారుపాళెం వైపు వెళ్లే మార్గంలో వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బంగారుపాళెం మామిడి కాయల మార్కెట్‌కు వైఎస్ జగన్ వస్తున్న నేపథ్యంలో పూతలపట్టు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జయప్రకాష్ వ్యాపారులను పిలిపించుకుని సమావేశం అయినట్లు సమాచారం. బుధవారం కొనుగోళ్లు ఆపేయాలని, మార్కెట్‌కు రావద్దని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్‌ను అడ్డుకుంటామని ప్రకటించిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి.నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా... మామిడి రైతులకు భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాళ్యం మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.20 గంటలకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌కు చేరుకుని మామిడి రైతులతో సమావేశమవుతారు. వారి కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు.కటౌట్లు కూల్చివేతపై స్థానికుల నిరసనబంగారుపాళెం: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని జంబువారిపల్లె పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన బ్యానర్లు, కటౌట్లను మంగళవారం రాత్రి పోలీసులు కూల్చి వేయించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని నగదు చెల్లించి స్వాగత కటౌట్లు, బ్యానర్లు రహదారి పక్కన ఏర్పాటు చేశారు. అయితే వీటికి అనుమతులు లేవంటూ పోలీసులు జేసీబీని తీసుకొచ్చి సుమారు 30 బ్యానర్లు, కటౌట్లను కూల్చివేశారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని ఏర్పాటు చేసుకున్న వాటిని కూల్చడం ఏమిటని పూతలపట్టు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్ పోలీసులను ప్రశ్నించారు. తమకు కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయని ఓ సీఐ పేర్కొనడం గమనార్హం. పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. -
నా బావ ఏడీ.. అత్త, మామకు ఏమైంది?
సాక్షి, చిత్తూరు : కొత్త స్థలం కొన్నామనే సంతోషం ఆ కుటుంబానికి ఎంతో సేపు నిలవలేదు. రిజిస్టేషన్ కాకుండానే ఆ కుటుంబం కానిరాని లోకాలకు చేరుకుంది. బంగారుపాళెం మండలం పాలమాకులపల్లె వద్ద ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి మితిమీరిన వేగమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఆగిఉన్న కంటైనర్ వెనుక కారు సగందాకా దూసుకుపోవడం చూస్తుంటే కారు వేగం వంద కిలోమీటర్లకు పైగానే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు కారు ముందుసీట్లో కూర్చున తండ్రీ కొడుకులు సీటు బెల్ట్ ధరించి ఉన్నారు. ఎదురుగా వచ్చిన టీవీఎస్ మోపెడ్‌ను చూసిన వెంటనే వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అదుపు తప్పి ఘోర ప్రమాదానికి గురయ్యారు. మోపెడ్‌పై వెళుతున్న వ్యక్తితో సహా కారులోని మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వెనుకడోర్ తెరుచుకోవడంతో దక్కిన ప్రాణాలు ప్రమాదం జరిగిన కారులో వెనుకవైపు కూర్చున శిరీష మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడింది. ముందు కూర్చున వారు సీట్ బెల్టు ధరించారు. వెనుకవైపు కూర్చున అత్తాకోడళ్లు మాత్రం బెల్టు పెట్టుకోనట్టు కనిపిస్తోంది. అయినా వేగంగా ఢీకొన్న ధాటికి కారు వెనుకడోర్ ఒకటి మాత్రం ఓపెన్ కావడంతోనే శిరీష కారులోంచి రోడ్డుపై పడి గాయాల పాలైంది. హైవేపై అవగాహ లేకపోవడం పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్ నుంచి కేజీ సత్రం వరకు జరిగే ప్రమాదాలను పరిశీలిస్తే ఎక్కువగా బయటి ప్రాంతాలకు చెందిన వారివే కావడం గమనార్హం! సాధారణంగా బెంగళూరు సిటీ దాటాక హొస్కోట్ నుంచి జాతీయ రహదారి వేగంగా వాహనలను నడిపేందుకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అక్కడి నుంచి రాష్ట్ర సరిహద్దు నంగిళిదాకా వాహనాలు వంద కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో వస్తుంటాయి. ఆపై రాష్ట్ర సరిహద్దు నుంచి చిత్తూరు బైపాస్ దాకా ఇటీవల నిర్మించిన పనుల కారణంగా హైవేలో ఎక్కడెక్కడ మార్గం ఎలా ఉందనే దానిపై కర్ణాటక నుంచి వచ్చే వాహనదారులకు పెద్దగా అవగాహన ఉండదు. అక్కడి రోడ్డులాగే ఉంటుందని భావించి వందకుపై వేగంగా రావడం ఇక్కడి హైవేలో ప్రమాదాలకు గురికావడం కొంతకాలంగా చోటుచేసుకుంటోంది. ఏదేమైనా మితిమీరిన వేగం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. బాధితులను ఓదార్చిన ఎమ్మెల్యే బాబు రోడ్డు ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బంగారుపాళెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీషను పరామర్శించి ఓదార్చారు. అక్కడే ఉన్న మృతుడు శ్రీనివాసరెడ్డి పెద్దకుమారుడు వివేకానందరెడ్డితో మాట్లాడారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం చేయించాలని డాక్టర్లు, పోలీసులను ఆదేశించారు. అలాగే మృతదేహాలను వారి స్వగామమైన ఉదయగిరికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు పోలీసులకు సూచించారు. ప్రాణాలు కాపాడని ఎయిర్ బెలూన్లు వోల్వో కంపెనీకి చెందిన ఖరీదైన కారులో నాణ్యమైన ఎయిర్ బెలూన్లు ఓపెన్ అయి పగిలి పోయాయంటే మితిమీరిన వేగమే దుర్ఘటనకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి కారు బోల్తా కొట్టినా లేక ముందుభాగం ఒత్తిడికి గురైనా బెలూన్లు విచ్చుకుని లోపలున్న వారికి రక్షణ కవచంలా మారుతాయి. కానీ ఈ ఘటనలో కారులోని వారి ప్రాణాలకు ఇవి రక్షించలేకపోయాయి. నా బావ ఎక్కడ..? రోడ్డు ప్రమాదంలో అత్త, మామ, భర్త చనిపోయారు. గాయపడిన శిరీషను అపస్మాకర స్థితిలో ఉండడంతో 108లో బంగారుపాళెం ఆసుపత్రికి తరలించారు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన శిరీష ‘‘నా బావ ఏడీ.. అత్త, మామకు ఏమైంది? ఎలా ఉన్నారు... బావా ఎక్కడ?’’ అంటూ అక్కడకు వచ్చిన వారిని ఆత్రుతగా అడుగుతూ, కన్నీటిపర్యంతమై చుట్టు పక్కలా వెతుకుతుంటే అక్కడికి చేరుకున్న స్థానికులు విచలితులయ్యారు. వాస్తవానికి శిరీషకు ఏడునెలల క్రితమే వెంకటేష్రెడ్డితో వివాహమైంది. విధి చిన్నచూపు చూసి ప్రమాదంలో ఆమె భర్తను సైతం కబళించింది. -
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, చిత్తూరు : జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ద్మురణం చెందారు. బంగారుపాళెం మండలం మొగలి వద్ద ఇవాళ ఉదయం ఓ కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఎదురుగా వచ్చిన టీవీఎస్ మోపెడ్‌ను చూసిన వెంటనే వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అదుపు తప్పి లారీని ఢికొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు, బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మృతులు బెంగుళూరుకు చెందిన వారు. వీరంతా బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు శ్రీనివాసులు, రత్నమ్మ, వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు. మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. -
శవ రాజకీయం చేస్తున్న చంద్రబాబు
► అక్రమ కేసులు దారుణం ► పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ బంగారుపాళెం: తెలుగుదేశం పార్టీ ఎంపీ దివాకర్‌రెడ్డికి చెందిన ట్రావెల్స్‌ను రక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శవరాజకీయం చేస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ విమర్శించారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు, క్షతగాత్రులను పరామర్శించడం ప్రధాన ప్రతిపక్షం బాధ్యత అన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి వెళ్లారన్నారు. మృతులకు పోస్టుమార్టం చేయకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంపై అక్కడ అధికారులను ప్రశ్నించిన జగన్‌పై అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి వైద్యులు తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. దివాకర్ ట్రావెల్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు మూడుసార్లు ఘోర రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది చనిపోయారన్నారు. అటువంటి ట్రావెల్స్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత ప్రతిపక్ష నేతకు ఉందని ఆయన పేర్కొన్నారు. -
పెళ్లి నిశ్చయమైన యువతి కిడ్నాప్, రక్షించిన పోలీసులు
పలమనేరు : చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో శుక్రవారం ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పెళ్లి నిశ్చయమైన ఆమెను అదే గ్రామానికి చెందిన ఓ వివాహితుడు మరో ఇద్దరు కలిసి కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా పోలీసులు అప్రమత్తమై కిడ్నాపర్ల నుంచి రక్షించారు. బంగారుపాళెంలోని జెండావీధికి చెందిన చాంద్‌బాషా ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్. ఇతనికి పెళ్లై పిల్లలున్నారు. అతని పరిసర ప్రాంతానికే చెందిన అదే సామాజికవర్గానికి చెందిన యువతిని ఇష్టపడ్డాడు. అప్పటికే ఆమెకు మరో యువకునితో నిశ్చితార్థమైంది. త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. తనను ఇష్టపడలేదనే కోపంతో చాంద్‌బాషా అతని అనుచరులు సలీమ్, సన్ను కలసి పక్క వీధిలో వెళ్తున్న ఆ యువతిని అంబులెన్స్‌లోకి బలవంతంగా ఎక్కించుకుని బయలుదేరారు. దీన్ని ఆ ప్రాంతవాసులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. బంగారుపాళెం పోలీసులు పలమనేరు వైపు వస్తున్న ఆ వాహనాన్ని వెంబడించారు. వెంటనే ఇక్కడి పోలీసులకు సమాచారమివ్వగా అప్రమత్తమయ్యారు. ఆ వాహ నం పలమనేరు దాటి వెళ్తుండగా చెన్నూరు వద్ద పట్టుకున్నారు. చాంద్‌బాషా, సలీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సన్ను అంబులెన్స్‌లో నుంచి దూకి పరారయ్యాడు.