breaking news
ayyanna patrudiu
-
Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
-
అయ్యన్న నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు తన నోరును అదుపులో పెట్టుకోవాలని లేకపోతే పిచ్చికుక్కను తరిమి కొట్టినట్లు కొడతామని విశాఖ జిల్లా వైఎస్సార్ సీపీ నాయకుడు గుడివాడ అమరనాథ్ హెచ్చరించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అయ్యన్నను నామరూపాలు లేకుండా చేస్తామని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం ప్రత్యేక హోదా కోసం నర్సిపట్నంలో చేపట్టిన రిలే నిరహార దీక్షలో ఆయన మాట్లాడారు. కాగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టిన వైఎస్సార్ సీపీ ఎంపీలకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నాయి. పెందుర్తి నియోజక వర్గ ఇన్చార్జ్ అదీప్ రాజ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గాజువాకలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తిప్పల నాగరెడ్డి ఆధ్వర్యంలో 3వ రోజూ దీక్షలు కొనసాగుతున్నాయి. నర్సీపట్నం కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ ఆధ్వవర్యంలో హోదా సాధన కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంకు ముందు వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు రాస్తారాకో, బైఠాయింపులు చేపట్టారు. తగరపువలసలో భీమిలి నియోజకవర్గం ఇన్ చార్జ్ అక్కరమాని విజయనిర్మల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఎంపీలకు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. -
కేంద్ర సహకారం లేదు: అయ్యన్నపాత్రుడు
ఉంగుటూరు (పశ్చిమగోదావరి): రాష్ట్రాభివృద్ధి కేంద్రంపైనే ఆధారపడి ఉందని.. అయితే కేంద్ర ప్రభుత్వం అందుకు పూర్తిస్థాయిలో సహకరించటం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరంలో ఆదివారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 19సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారని చెప్పారు. అయినా ప్రయోజనం లేకపోయిందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పంచాయతీలు లేదా ప్రజలు 10 శాతం నిధులను విరాళంగా ఇస్తే 90 శాతం ఉపాధి హామీ పథకం నిధులను మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇస్తామని చెప్పారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.