breaking news
ATM Looty
-
ఏటీఎంకు నిప్పు.. తెరుచుకోలేదని తగలబెట్టేశాడు!
ఏటీఎంలో దొంగతనానికి వచ్చిన దుండగుడు.. అది తెరుచుకోకపోవడంతో నిప్పుపెట్టిన ఘటన ముంబై నగరంలోని బొరివాలీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సతార ప్రాంతానికి చెందిన విలాస్ శిలేవంత్ (22)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ముంబై నగరంలోని బొరివాలీ వెస్ట్ ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షింపోలీ బ్రాంచ్ ఉంది. దానికి ఆనుకునే ఏటీఎం సెంటర్ కూడా ఉంది. నవంబర్ 11న తెల్లవారు జామున 4.35 గంటల ప్రాంతంలో ఈ ఏటీఎం సెంటర్లోని ఏటీఎం మిషన్ మంటల్లో కాలిపోయిన దృశ్యాన్ని గమనించిన బ్యాంక్ సర్వేలెన్స్ సిబ్బంది బ్యాంక్ మేనేజర్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడి చేరుకుని పరిశీలించగా ఏటీఎంను ఎవరో తెరవడానికి ప్రయత్నించారని తెలిసింది. దీంతో పోలీసులకు విషయం తెలియజేశారు. 25 నుంచి 30 ఏళ్లున్న యువకుడు ఏటీఎం కేంద్రంలోకి చొరబడినట్లుగా సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైంది. నిందితుడు ఏటీఎం మిషన్‌ను బద్దలుకొట్టడానికి ప్రయత్నించాడని, సాధ్యం కాకపోవడంతో నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఏటీఎం ముందు భాగానికి నిప్పుంటించినప్పటికీ అందులోని క్యాష్ వ్యాలెట్‌ను మాత్రం తెరవలేకపోయాడని పేర్కొన్నారు. -
ఏటీఎంనే ఎత్తుకెళ్లిన దుండగులు
సాక్షి, శ్రీకాకుళం : నగరాలు, పట్టణాల్లో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు గ్రామీణ ప్రాంతాల వైపు కన్నేశారు. ఇది వరకూ ఏటీఎం సెంటర్లో అమాయకులను ఏమార్చి నగదు దోచుకున్న వీరు ఇప్పుడు ఏకంగా ఏటీఎంలను ఎత్తుకుపోతున్నారు. ఇటీవల కొత్తూరులో ఘటన మరవకముందే తాజాగా ఎచ్చెర్ల ఆర్ముడు రిజర్వు పోలీస్ కార్యాలయానికి ఆనుకున్న ఏటీఎం సెంటర్లో నగదు యంత్రాన్ని పట్టుకుపోయారు. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ సంఘటన జరగడం గమనార్హం. విశేషమేమంటే ఇదే ఏటీఎం సెంటర్లో మూణ్నెల్ల క్రితం బ్యాటరీలు చోరీ చేయగా, తాజా ఘటనతో అధికారుల భద్రతాపరమైన చర్యల్లో డొల్లతనం మరోమారు బహిర్గతమైంది. ఈ విషయం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈ నెల 4న ఏటీఎంలో రూ. 20 లక్షలు లోడ్ చేశారు. బ్యాంకు అధికారుల లెక్క మేరకు రూ. 8.23 లక్షలు ఏటీఎంలో ఉన్నాయి. 700 కిలోలు కలిగిన ఏటీఎం యంత్రం అమర్చిన కింద భాగం హుక్కులు తొలగించారు. యంత్రం విలు వ రూ.4 లక్షలు ఉంటుంది. తమను గుర్తించకుం డా ముందుగానే సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం వాహనంలో తరలించారు. దీన్ని తొలగించడానికి గంటా యాభై నిమిషాలు పడుతుంది. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఈ ఏటీఎం సర్వీస్ నుంచి సంబంధాలు తెగిపోయినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. పక్కా వ్యూహంతోనే... ఆర్ముడు రిజర్వు పోలీసుల విజ్ఞప్తి మేరకు 2017 జనవరి 10న ఈ ఏటీఎంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అప్పటి ఎస్సీ త్రివిక్రమ్‌వర్మ దీన్ని ప్రారంభించారు. ఇదే ఏటీఎంలో ఈ ఏడాది ఏప్రిల్ 25న బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. మూడు నెలల వ్యవధిలో ప్రస్తుతం ఏటీఎం చోరీకి గురయ్యింది. ఈ రెండు ఘటనలు పరిశీలిస్తే... అప్పట్లో చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులే ప్రస్తుతం చోరీ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ హైవే పెట్రోలింగ్ పోలీసుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నిత్యం రాత్రిళ్లు తనిఖీలు చేస్తున్న వీరు జాతీయ రహదారి పక్కనే ఏటీఎంలో చోరీ తీరును గుర్తించకపోవడం గమనార్హం. పక్కా వ్యూహంతో చేసిన ఈ చోరీలో అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉందా? స్థానిక చోరులు పాత్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనంలో కనీసం నలుగురు వరకు ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. ఎస్పీ పరిశీలన... ఎచ్చెర్ల ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ముప్పిడి నరేష్ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి, డీఎస్పీ చక్రవర్తి, సీఐ మల్లేశ్వరావు, ఎస్సై రాజేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్పీ పోలీస్ అధికారులతో సమీక్షించారు. క్లూస్, ఫ్లోరోనిక్స్ బృందాలు చోరీ తీరు పరిశీలించాయి. ధ్వంసం చేసిన సీసీ కెమెరాలు, గోడలు, గ్లాస్‌లుపై ఉన్న వేలిముద్రలు సేకరించాయి. బ్యాంకు అధికారులు, ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారి రామ్‌జీ, ఏటీఎం జనరల్ మేనేజర్ గణేష్ పరిశీలించారు. -
సెక్యూరిటీ గార్డ్ హత్య.. ఏటీఎం లూటీ!
పట్నా: బిహార్ రాజధాని పట్నాలో శనివారం ఉదయం దారుణం జరిగింది. దుండగులు ఏటీఎంకు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డును హతమార్చి.. ఏటీఎంలో ఉన్న నగదును లూటీ చేశారు. మౌర్యలోక్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ బ్యాంకు ఏటీఎం వద్ద ఈ ఘటన జరిగింది. దీపక్ కుమార్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. మౌర్యలోక్ అనేది పట్నాలో అత్యంత విలాసవంతమైన ప్రదేశం. ఇక్కడ పోలీసు సిబ్బంది నిరంతరం గస్తీ కాస్తుంటారు. సెక్యూరిటీ జోన్‌గా పరిగణించే ఈ ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడం స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ దారుణంపై మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన నిర్వహించారు.