breaking news
Assembly premises
-
అసెంబ్లీ ఆవరణలో మద్యం బాటిళ్ల కలకలం..
Empty Liquor Bottles Found in Bihar Assembly Premises: బిహార్ అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణం చేసిన మరుసటి రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా విపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. రాష్ట్రం మొత్తం మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలి. అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు వెలుగు చూసినందుకు గాను సీఎం నితిశ్ కుమార్ రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. (చదవండి: లాలూ.. పుత్రోత్సాహం) ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ.. ‘‘ఇది చాలా తీవ్రమైన విషయం.. విచారణ జరపడం ముఖ్యం.. స్పీకర్ అనుమతిస్తే ఈ అంశంపై దర్యాప్తు చేయమని చీఫ్ సెక్రటరీ, డీజీపీని కోరతాం’’ అని తెలిపారు. బిహార్‌లోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)కి చెందిన నాలుగు పార్టీల శాసనసభ్యులు, సీఎం నితీశ్ కుమార్ మద్యపాన నిషేధ నిర్ణయానికి అనుకూలంగా సోమవారం తీర్మానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ చర్యకు మద్దతు ఇవ్వాలని వారు ఏకగ్రీవంగా తీర్మానించారు. (చదవండి: గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి ఆపేందుకు ప్రియుడి స్కెచ్.. ఏకంగా సీఎంకే) రాష్ట్రంలో మద్యం మాఫియాను నియంత్రించడంలో నితీష్ కుమార్ ప్రభుత్వం విఫలమైందని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజునే ప్రతిపక్షాలు విమర్శించాయి. నితీష్ కుమార్ ప్రకటించని మద్యపాన నిషేధాన్ని కేవలం కంటితుడుపు చర్యగా పేర్కొన్నారు తేజస్వీ యాదవ్. "నితీష్ కుమార్ ప్రభుత్వంలోని పోలీసులు మద్యం వినియోగదారులను అరెస్టు చేస్తున్నారు, అయితే అసలు నిందితులుగా ఉన్న మద్యం మాఫియాడాన్లు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అధికారులు పేదలను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు" అని విమర్శించారు. చదవండి: రణరంగంగా బిహార్ అసెంబ్లీ.. మగాడివైతే చంపు.. -
టీఆర్ఎస్లోకి సండ్రకు ఆహ్వానం
అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రసమయి, వేముల వీరేశం, బాలరాజు టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల మధ్య బుధవారం ఆసక్తికర చర్చ జరిగింది. టీఆర్ఎస్లోకి రావాలంటూ సండ్రను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. ‘మీరే టీడీపీలోకి రండి.. దొరల పాలన మనకొద్దు’అని సండ్ర చమత్కరించారు. బడుగులకు ఎన్టీఆర్ అండగా నిలిచారని సండ్ర అనగా.. ఎన్టీఆర్ కూడా దొరే అని బాలరాజు సమాధానం ఇచ్చారు. ‘ఆయన దొరనే కానీ ఆలోచనలు బడుగులవి..’అని సండ్ర చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ బడుగుల గురించి బాగా ఆలోచిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా జవాబిచ్చారు. -
అసెంబ్లీ వద్ద వైఎస్సాఆర్ కాంగ్రెస్ ధర్నా!
-
మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవు
-
'బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కారకుడు కిరణే'
-
రాత్రంగా అసెంబ్లీ ప్రాంగణంలోనే : వైఎఎస్ఆర్ సిపి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో నిరసన కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాత్రంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండాలని ఆ పార్టీ శాసనసభ్యులు నిర్ణయించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును బీఏసీలో చర్చించకుండా, సభ అనుమతి లేకుండా చర్చకు అనుమతించడం దారుణం అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అందుకు నిరసనగా అసెంబ్లీలోనే వారు ఆందోళన చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికం, అత్యంత దుర్మార్గమైన చర్యగా వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, శాసనసభలో సమైక్య రాష్ట్రం తీర్మానం చేయాలని వైఎస్ఆర్ సిపి శాసనసభ్యులు శాసనసభ సెక్రటరీకి ప్రైవేట్‌మెంబర్ తీర్మానాన్ని అందజేశారు. ఈ పార్టీ సభ్యులు గతంలో ఇచ్చిన నోటీసును శాసన సభాపతి తిరస్కరించిన విషయం తెలసిందే. దాంతో మరో నోటీస్ ఇచ్చారు.