breaking news
To apply online
-
లడ్డూ వితరణ సేవకు నమోదు చేసుకోండిలా..
తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ఇష్టపడని వారు ఉండరు. నిత్యం 3 లక్షల లడ్డూలను భక్తులు అందుకుంటుంటారు. ఈ ప్రసాదాన్ని అందుకోవడమే కాదు... అందివ్వడం కూడా అదృష్టమనే భావిస్తారు చాలామంది. అందుకే లడ్డూ ప్రసాద వితరణ సేవకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సేవకు ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి? నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి? తదితర విషయాలు... ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. * ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. shttp://112.133.198.195:2202/frmEnrollement.aspx లింక్‌ను క్లిక్ చేయాలి. * ఇక్కడ మీకు దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. వ్యక్తిగత సమాచారం, కమ్యునికేషన్ వివరాలు, సేవ చేయాలనుకునే తేదీ తదితర వివరాలు ఇవ్వాలి. * 100 కేబీ పరిమాణానికి ఎక్కువ కాకుండా సర్వీసు ఐడీ, ఫొటోలను అప్లోడ్ చేయాలి. * అన్ని పూర్తి చేశాక మీకు ఒక రిఫరెన్స్ నంబరు వస్తుంది. * మీరు పెట్టుకున్న దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవాలంటే http://112.133.198.195:2202/frmStatusSearch.aspx లింక్‌లో మీ ఎకనాలెడ్జ్ నంబరు ఎంటర్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ను తెలిపితే దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది. నియమ నిబంధనలు... * ఎన్రోల్ అయినవారు లడ్డు ప్రసాదం టోకెన్లు నిర్ణీత ధరకు భక్తులకు విక్రయించాలి. * 65 సంవత్సరాలలోపు ఉన్న వారే ఇందుకు అర్హులు. * హిందువులు అయిన పురుషులను మాత్రమే లడ్డు సేవకు అనుమతిస్తారు. * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అందులో రిటైర్ అయిన వారు, బ్యాంక్, ఇన్సూరెన్స్ ఉద్యోగులు ఈ సేవ చేయొచ్చు. * ఇది స్వచ్ఛందంగా చేసే సేవ. ఎటువంటి రుసుం భక్తులకు చెల్లించరు. * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. సేవ చేయాల్సిన రోజులు, ప్రదేశాలు... * రెండు రకాల స్లాట్లు ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. * అందులో ఒకటి 4 రోజుల స్లాట్, రెండవది 5 రోజుల స్లాట్. * 4 రోజుల స్లాట్ గురువారం నుంచి ఆదివారం వరకు ఉంటుంది. * మొదటి మూడు రోజులు లడ్డు ప్రసాద కౌంటర్లలో పనిచేయాలి. చివరి రోజు ప్రధాన ఆలయం లోపల సేవ చేసే అవకాశం కల్పిస్తారు. * 5 రోజుల స్లాట్ ఆదివారం నుంచి గురువారం వరకు ఉంటుంది. చివరి రోజున మాత్రం ప్రధాన ఆలయం లోపల సేవ చేసే అవకాశం కల్పిస్తారు. * 4 రోజుల స్లాట్ వారు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల లోపు, 5 రోజుల స్లాట్ వారు శనివారం మధ్యాహ్నం రెండు గంటల లోపల తిరుమలలో ఉన్న బస్‌స్టాండ్ వద్దనున్న శ్రీవారి సేవా సదన్‌లో ముందుగా రిపోర్ట్ ఇవ్వాలి. * అన్ని స్లాట్ సేవకులకు చివరి రోజున శ్రీవారి దర్శనం కల్పిస్తారు. * నామినల్ రుసుం రూ. 10 తీసుకుని శ్రీవారి లడ్డూను సేవకులకు అందిస్తారు. రిపోర్ట్ సమయంలో చేయాల్సినవి... * ఒక రోజు ముందుగానే శ్రీవారి సేవా సదన్‌లో రిపోర్ట్ చేయాలి. * రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రెండు ఐడీ ప్రూఫ్‌లు, పెన్షన్ లేక, ఉద్యోగ ఐడెంటిటీ కార్డ్ నఖలు, ఒరిజినల్ సర్వీసు ఐడెంటిటీ కార్డ్ తప్పకుండా తీసుకెళ్లాలి. నోట్: హిందూ సంప్రదాయం ప్రకారం నడుచుకోవాలి. సేవ చేయాలనుకునే వారిపై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు ఉండకూడదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి. -
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
మచిలీపట్నం : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు శిక్షణ పొందేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి ఎం.చినబాబు గురువారం తెలిపారు. నవంబరు 5వ తేదీలోగా ఈ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాలని చెప్పారు. దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు మించకుండా ఉండాలని, డిగ్రీ విద్యార్హతతో పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకు అన్ని అర్హతలు కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా కోర్సు చదువుతున్నా, ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నా ఉచిత శిక్షణకు అనర్హులని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం నవంబరు 16న కామన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని, ఇక్కడ అర్హత పొందిన అభ్యర్థులకు విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్లో డిసెంబరు ఒకటో తేదీ నుంచి శిక్షణ ఇస్తామని తెలిపారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని అభ్యర్థులకు విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను http://apbcwelfare.cgg.gov.in లోనమోదు చేసుకోవాలన్నారు. వివరాల కోసం ఫోన్ నం: 0866-433008లో సంప్రదించాలన్నారు. -
10 నుంచి సెట్ దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్, ఏపీ సెట్స్) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెట్ సభ్య కార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు... వచ్చే ఏడాది జనవరి 4 జరిగే సెట్‌కు అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.100 అపరాధ రుసుముతో నవంబరు 1 నుంచి 8 వరకు, రూ.200 అపరాధ రుసముతో 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 27 సబ్జెక్టులకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నాయి. రెగ్యులర్, దూరవిద్యలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు సెట్‌కు అర్హులు. కాగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను ఇక నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) చేపట్టనునట్లు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.