breaking news
to appeal
-
సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న జయలలిత
-
సుప్రీం కోర్టును ఆశ్రయించనున్న జయలలిత
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. జయలలిత తరపున ఆమె న్యాయవాదులు బుధవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటీషన్ను దాఖలు చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయకు కర్ణాటక హైకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ జయ దాఖలు చేసిన పిటీషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.