breaking news
Aphiliyesanla
-
సింగిల్ జడ్జి తీర్పును సవరిస్తాం
ఇంజనీరింగ్ ప్రవేశాలపై హైకోర్టు ధర్మాసనం లేకపోతే విద్యార్థులు నష్టపోతారు తెలంగాణ ప్రభుత్వ ఆత్రుతలో అర్థం ఉంది బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు లేకుండా కాలేజీల నిర్వహణ సరికాదు తనిఖీల కోసం ఏఐసీటీఈ, జేఎన్టీయూ అధికారులతో కమిటీలుఇప్పటికిప్పుడు సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇవ్వలేం తదుపరి విచారణ బుధవారానికి వాయిదా హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అఫిలియేషన్ల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అవసరమైన మేరకు సవరిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తీర్పును సవరించని పక్షంలో విద్యార్థులు నష్టపోతారని, తమకు కాలేజీల ప్రయోజనాల కంటే విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది. నిబంధనల మేరకు బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు ఉన్న కాలేజీలకే అఫిలియేషన్లు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆత్రుతలో అర్థం ఉందని అభిప్రాయపడింది. తుది అఫిలియేషన్‌కు ముందు ఆయా కాలేజీల్లో పూర్తిస్థాయి తనిఖీలు చేసే బాధ్యతను ఏఐసీటీఈ మాత్రమేగాక హైదరాబాద్ జేఎన్టీయూ కూడా చేపట్టాలని పేర్కొంది. కాలేజీల తనిఖీల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తామని, అందులో జేఎన్టీయూ, ఏఐసీటీఈల నుంచి ఇద్దరు చొప్పున ఉంటారని తెలిపింది. సింగిల్ జడ్జి తీర్పుపై తాము ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వలేమన్న ధర్మాసనం... సింగిల్ జడ్జి వద్ద ఎన్ని కాలేజీలు పిటిషన్లు దాఖలు చేశాయో అన్ని కాలేజీలను ప్రతివాదులుగా చేరుస్తూ అప్పీళ్లు దాఖలు చేయాలని జేఎన్టీయూను ఆదేశించింది. అన్ని అప్పీళ్లలో వాదనలు విన్న తరువాతే తగిన ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టం చేసింది. మంగళవారానికల్లా అన్ని అప్పీళ్లు దాఖలు చేస్తే బుధవారం వాటిపై విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీటీఈ అనుమతి ఉండి ఈ విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ పొందలేకపోయిన ఇంజనీరింగ్ కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్ ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ జేఎన్టీయూ అప్పీలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 100 కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వలేదు.. తొలుత జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిబంధనల మేరకు సౌకర్యాలు లేకపోవడంతో దాదాపు 100 కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వలేదని, అందుకే ఆ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయని న్యాయమూర్తికి తెలిపారు. ఆ కాలేజీల పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. ఏఐసీఈటీ అనుమతినిచ్చింది కాబట్టి తమను అఫిలియేషన్ ఇవ్వాలని ఆదేశించారని, దీనిపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని చెప్పారు. సింగిల్ జడ్జి తీర్పులోని ప్రధాన అంశాలను వినిపించారు. విద్యార్థులు నష్టపోతారు.. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సింగిల్ జడ్జి తీర్పులో ఓ చోట తనిఖీల నివేదికను ఏఐసీటీఈ నుంచి అందుకున్న తరువాత ఆయా కాలేజీలకు 2015-16 విద్యా సంవత్సరానికి జేఎన్టీయూ అఫిలియేషన్ ‘ఇవ్వాలి’ అని పేర్కొనడం గురించి ప్రస్తావించింది. ఈ విషయంలో తాము సింగిల్ జడ్జి తీర్పును సవరిస్తామని, లేనిపక్షంలో విద్యార్థులు నష్టపోతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ఒకవేళ అంతిమంగా ఈ కాలేజీలకు అఫిలియేషన్ రాకపోతే నష్టపోయేది విద్యార్థులే. సుప్రీం తీర్పు ప్రకారం అఫిలియేషన్ రాని కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ఫీజును వెనక్కి ఇవ్వాలి. అంతే తప్ప వారిని వేరే కాలేజీలో చేర్చాలని సుప్రీంకోర్టు చెప్పలేదు. అఫిలియేషన్ రాకుంటే విద్యార్థులు ఇంటికి వెళ్లడం మినహా మరో మార్గం లేదు. కాబట్టి మాకు విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం. నిబంధనల మేరకు బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు లేకుండా కాలేజీలు నడపడానికి వీల్లేదు. చాలా కాలేజీల్లో నకిలీ బోధనా సిబ్బంది ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో దీనిని నేను ప్రత్యక్షంగా చూశాను. బోధనా సిబ్బంది, ల్యాబ్‌లు ఉన్న కాలేజీలకే అఫిలియేషన్లు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆతృతలో అర్థం ఉంది. ఆ ఆతృతను మేం అర్థం చేసుకుంటున్నాం..’’ అని జస్టిస్ బొసాలే వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను ఈ నెల 15న చేపడతామని, అప్పటివరకు అన్ని అప్పీళ్లను తమ ముందుంచాలని జేఎన్టీయూకు ఆదేశించారు. -
డీఎడ్ కాలేజీల్లో అఫిలియేషన్ తనిఖీలు
ఈ సారైనా పక్కాగా జరిగేనా? ఏటా అడ్డగోలు నివేదికలు చివరకు న్యాయ వివాదాలు.. కౌన్సెలింగ్ ఆలస్యం హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారం మళ్లీ మొదలైంది. విద్యాశాఖ ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని 272 ప్రైవే టు డీఎడ్ కాలేజీలలో తనిఖీలు నిర్వహించనుంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధన లను పాటించని కాలేజీలకు కూడా అనుబంధ గుర్తింపు కోసం అన్నీ బాగున్నాయన్న నివేదికలు ఇవ్వడం, ఆ తరువాత మళ్లీ లోపాలు ఉన్నాయంటూ పాఠశాల విద్యాశాఖ మెలికపెట్టడం ఆనవాయితీగా మారింది. దీంతో న్యాయ వివాదాలు, నెలల తరబడి కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈసారైనా పక్కాగా తనిఖీలు చేపట్టి నివేదికలు ఇస్తారా? లేదా? అనే గందరగోళం నెలకొంది. మరీ ఆలస్యం కాకుండా చూస్తేనే.. రాష్ట్రంలో డీఎడ్ ప్రవేశాలు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. విద్యాశాఖ ఈ నెల 8న వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించింది. ఆగస్టు 9న డీఈఈసెట్ నిర్వహిస్తోంది. ఇక మొదటి దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను సెప్టెంబర్ 1నుంచి నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో డీఈఈసెట్ నిర్వహించేందుకు యాక్ట్‌కు సవరణ చేపట్టాల్సి ఉండటంతో సంబంధిత ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపేసరికి ఆలస్యమైంది. ఇటీవలే ఫైల్ క్లియర్ కావడంతో విద్యాశాఖ డీఈఈసెట్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. నిర్ణీత వ్యవధిలో ప్రవేశాలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.