కెప్టెన్‌గా సిరాజ్.. ప్రత్యర్థి 134 పరుగులకే ఆలౌట్
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. దేశీ రెడ్‌బాల్ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. తాజా సీజన్లో తొలి మ్యాచ్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ వేదికగా సిరాజ్ సేన.. త్రిపురతో మ్యాచ్ మొదలుపెట్టింది.బిక్రమ్‌కుమార్ దాస్ అర్ధ శతకంటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న త్రిపుర శుభారంభం అందుకుంది. ఓపెనర్లలో బిక్రమ్‌కుమార్ దాస్ అర్ధ శతకం (107 బంతుల్లో 50) బాదగా.. హ్రితురాజ్ రాయ్ (70 బంతుల్లో 33) ఫర్వాలేదనిపించాడు. అయితే, వీళ్లిద్దరు అవుటైన తర్వాత త్రిపుర బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది.126-3 టు 134-10 హైదరాబాద్ బౌలర్ల ధాటికి తాళలేక 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో 126 పరుగులకు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన త్రిపుర.. మరో ఎనిమిది పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేయడం గమనార్హం. శ్రీదం పాల్, హనుమ విహారి, సెంతు సర్కార్, సందీప్ సర్కార్, పర్వేజ్ సుల్తాన్ డకౌట్ కాగా.. కెప్టెన్ మణిశంకర్ మురాసింగ్, రజత్ డే, అభిజిత్ కె సర్కార్ ఒక్కో పరుగు చేశారు. మందీప్ సింగ్ 24 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.హైదరాబాద్ బౌలర్లలో స్పిన్నర్లు అనికేత్ రెడ్డి ఐదు వికెట్లతో అద్భుతం చేయగా.. తనయ్ త్యాగరాజన్ మూడు వికెట్లతో మెరిశాడు. రుతిక్ యాదవ్ మెండేకు ఒక వికెట్ దక్కింది. కెప్టెన్ సిరాజ్ తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో 25 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.చదవండి: సౌతాఫ్రికాతో టెస్టు.. ఆసీస్ బౌలర్ ప్రపంచ రికార్డు