breaking news
on and off
-
మిస్డ్ కాల్‌తో లైట్స్ ‘ఆన్ అండ్ ఆఫ్’
మామిడికుదురు: ‘పట్టపగలే వెలుగుతున్న వీధి లైట్లు’ అంటూ తరచు పేపర్లో వార్తలు చూస్తుంటాం. ఇక నుంచి వీటికి ముగింపు పలికేలా వీధి లైట్ల ఆఫ్, ఆన్ విధానాన్ని సెల్‌కు అనుసంధానం చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా మామిడికుదురులో ఇటీవల రెండుచోట్ల ప్రవేశ పెట్టగా ఎంతో మెరుగ్గా ఉందని పంచాయతీ ఉద్యోగులంటున్నారు. లైట్ల మీటరు ఉండే స్తంభం వద్ద ఏర్పాటు చే సిన పరికరంలో సిమ్ కార్డు అమర్చి, ఆ నెంబర్‌ను అసిస్టెంట్ లైన్‌మన్ సెల్లో రిజిస్టర్ చేశారు. ఆయన సాయంత్రమయ్యే సరికి తన నెంబర్ నుంచి మీటర్ వద్దనున్న నంబర్‌కు మిస్డ్ కాల్ చేస్తే వీధి లైట్లు వెలుగుతాయి. అలాగే ఆరిపోతారుు కూడా. విద్యుత్ సరఫరా నిలిచి పోయినా, వీధి లైట్లను వేళకు ఆన్ లేదా ఆఫ్ చేయకపోయినా అసిస్టెంట్ లైన్‌మన్ సెల్‌కు ఆటోమేటిక్‌గా మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే ఆయన మిస్డ్ కాల్ చేస్తే ఆరిపోరుున లైట్లు వెలుగుతాయి. లేదా వెలుగుతున్న లైట్లు రిపోతాయి. ఈ విధానాన్ని జిల్లావ్యాప్తంగా ప్రవేశ పెట్టేందుకు పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. -
ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో సాగర్ నీటివిడుదల
మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ పరిధిలోని మొదటిజోన్ కు ఆగస్టు 10వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు నీటిని విడుదల చేసేందుకు ఎన్ఎస్పీ అధికారులు ప్రణాళిక రూపొం దించారు. ఖరీఫ్ సాగుకు గాను ఈ నీటివిడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఉంటుంది. విడతల వారీ నీటి విడుదల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎన్ఎస్పీ అధికారులు క్షేత్ర పర్యటన నిర్వహించి, ఆపై నీటివిడుదల కొనసాగించనున్నారు. శుక్రవారం మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ కార్యాలయంలో రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు, అధికారులతో సీఈ యల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటివిడుదలపై వారి అభిప్రాయాలు కూడా సేకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మననీరు-మన ప్రణాళిక’ అనే లక్ష్యంతో సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు రైతులతో ఈ అవగాహన సదస్సు నిర్వహించినట్లు యల్లారెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాలో 3,04,000 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 16,000 ఎకరాలకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలోకి ఇప్పటి వరకు 125 టీఎంసీల వరదనీరు చేరిందన్నారు. ఎగువ కృష్ణా నుంచి వచ్చే వరదను అంచనా వేసి రెండోజోన్‌కు నీటి విడుదలపై మరో 10రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్డీఓ కిషన్‌రావు మాట్లాడుతూ రైతులు సాగునీటి తీరువాను ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. మెయిన్ కెనాల్, మేజర్ల కాల్వలు, తూములను రైతులు ఎవరైనా స్వార్థం కోసం ధ్వంసం చేస్తే చట్టరీత్యా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదవుతాయన్నారు. సమావేశంలో ఎన్ఎస్ఫీ ఎస్ఈ సుధాకర్, డిప్యూటీ ఎస్ఈ నాగేశ్వరరావు, ఎడమకాల్వ నీటిసంఘం మాజీ చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, వైస్‌చైర్మన్ మల్గిరెడ్డి లింగారెడ్డి,ఈఈ రత్తయ్య, ఏఓ జయప్రద ఉన్నారు.