breaking news
Allari
-
నడవలేని స్థితిలో ఉన్నా.. నటి సుభాషిణి భావోద్వేగం
యాంకర్ సుమ తన మాటలతోనే కాదు.. మంచి మనసుతోనూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఐదేళ్లుగా ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ కార్యక్రమం ద్వారా పేదలు, వృద్ధులకు అండగా నిలుస్తూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ఆర్థిక సాయం అందజేస్తున్నారు.తాజాగా ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న నటి అల్లరి సుభాషిణి.. సుమ తనకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.నడవలేని పరిస్థితిలో ఉన్నానుతన ఆరోగ్యం సహకరించకపోయినా సుమ కోసం ఈ కార్యక్రమానికి వచ్చినట్లు సుభాషిణి తెలిపారు. ఒకానొక సమయంలో నడవలేని పరిస్థితిలో ఉన్నానని, అలాంటి కష్టకాలంలో సుమ తనకు ఎంతో అండగా నిలిచారని చెప్పారు. ‘నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేని పరిస్థితిలో ఉన్నాను. అయినా సుమగారి కోసం ఇక్కడికి వచ్చాను. ఆమె నిజంగా గొప్ప వ్యక్తి. సుమ చేసిన సాయం అంతా ఇంతా కాదు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.సుమ నా ప్రాణదాత‘ఈరోజు ఇలా నిలబడగలుగుతున్నానంటే అందుకు కారణం సుమనే. ఆమె ద్వారా నాకు సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల, పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మరో జన్మంటూ ఉంటే సుమలాంటి కూతురు తనకు పుట్టాలి’అని మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.(ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్..? ఓ సూపర్‌స్టార్ కొడుకుతో హీరోయిన్!)సుభాషిణి విషయానికి వస్తే..అల్లరి సుభాషిణి అసలు పేరు తిరుమల సుభాషిణి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఆమె చిన్నతనంలోనే నాటక రంగంలోకి అడుగుపెట్టారు. ‘చింతామణి’ వంటి నాటకాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’ (2002) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ‘అల్లరి సుభాషిణి’గా పేరు సంపాదించారు. ‘శ్రీ ఆంజనేయం’, ‘కితకితలు’, ‘సుడిగాడు’ వంటి చిత్రాల్లో హాస్య, సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు. ఈవీవీ సత్యనారాయణ, కృష్ణవంశీ వంటి ప్రముఖ దర్శకుల సినిమాల్లోనూ కనిపించారు. (ఇదీ చదవండి: నాని ది ప్యారడైజ్.. మహేశ్ బాబు తనయుడి షాకింగ్ రివ్యూ..!)సుమ నాకు చేసిన హెల్ప్ ఇంతా అంతా కాదు.. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే సుమనే కారణం. సుమ నా ప్రాణదాత! - #Subhashini Festival for Joys #5thAnniversary Celebrations https://t.co/0ApJKuRbCn— Telugu70mm (@Telugu70mmweb) October 24, 2026 -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నవాళ్లు కనుమరుగైపోతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్గా తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. మూవీ సూపర్ హిట్ అయినా అదృష్టం కలిసిరాలేదు. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్వేత అగర్వాల్. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు కానీ అల్లరి నరేశ్ తొలి మూవీ 'అల్లరి' మూవీలో హీరోయిన్ అంటే గుర్తుపడతారేమో! ఒకవేళ ఇది కాదంటే ప్రభాస్ 'రాఘవేంద్ర' సినిమాలో ఓ హీరోయిన్ అంటే గుర్తురావొచ్చు. ఈ రెండు మూవీస్‌తో బాగానే గుర్తింపు తెచ్చుకుందీ ముంబై చిన్నది. కానీ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మూవీస్ చేసింది కానీ పెద్దగా లక్ కలిసిరాలేదు. దీంతో 2010లో రిలీజైన 'షాపిత్' అనే హిందీ మూవీ తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. 2020లో ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఓ కూతురు కూడా పుట్టింది. ఆ చిన్నారి ఫొటోలని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది.అప్పట్లో 'అల్లరి' సినిమాలో అప్పు అనే పాత్రలో ఆకట్టుకున్న శ్వేత.. స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు. తర్వాత ప్రభాస్ 'రాఘవేంద్ర' మూవీలో చేసింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. 'గమ్యం' మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది కానీ ఈమెని దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు. దీంతో ఫ్యామిలీ ఉమన్‌గా సెటిలైపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) View this post on Instagram A post shared by Shweta Agarwal Jha (@shwetaagarwaljha) View this post on Instagram A post shared by Debinna Bonnerjee (@debinabon) -
‘అల్లరి’ రవిబాబు దర్శకత్వంలో?
‘విక్టరీ’ వెంకటేశ్ ఏ సినిమాలో చేస్తున్నారు? ఇప్పుడు అభిమానుల్లో ఇదే చర్చ. త్వరలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకనుంది. ఇప్పటికే కొంత మంది దర్శకులు వెంకీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట. ఈ జాబితాలో ముందున్న పేరు రవిబాబు. వెంకీ కోసం ఇప్పటికే ఓ స్క్రిప్ట్ తయారు చేశారని, త్వరలోనే ఈ సినిమా మొదలవునుందని సమాచారం. -
సునీల్‌తో నరేశ్‌కి పరేషాన్!


