breaking news
alankaram
-
శ్రీ దుర్గాదేవి అలంకారం. .పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి: శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి: శ్రీమహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. అన్నపూర్ణాదేవిగా బెజవాడ దుర్గమ్మ (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి: 2వరోజు శ్రీ గాయత్రీ మాతగా అమ్మవారు.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఈసారి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కాదు..!
గణపతి నవరాత్రలు ముగిసిన వెంటనే దేవి నవరాత్రులు కోలాహలం మొదలవుతుంది. ఊరు, వాడ, గ్రామంలోని ప్రతి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వాలంకరంణలతో ముస్తాబవుతుంది. అందులోనూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కాగా, ఈ నవరాత్రులు ఎప్పటిలా తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరగడం విశేషం. చివరి రోజు విజయ దశమితో కలిపి పదకొండు రోజులు పాటు నిర్వహించనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇలా దుర్గమ్మ పది అవతారాల రూపంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే..ప్రతి పదేళ్లకు ఒక సారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకు ముందు ఇలా 2016లో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయినీదేవిగా అలంకరించారు. మళ్లీ ఈ ఏడాది అమ్మవారిని కాత్యాయినీదేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులు ఈసారి పది రోజులు జరగనున్నాయి. ఇక చివరిరోజు విజయదశమి కలసి దసరా అంటారు. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో మొత్తం 11 రోజులు 11 అవతారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుందని పండితులు చెబుతున్నారు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దుర్గమ్మ పదకొండు అలంకారాలు ఇవే..!.సెప్టెంబర్ 22 - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారంసెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రి దేవి అలకారంసెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంసెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారంసెప్టెంబర్ 26 - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారంసెప్టెంబర్ 27 - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంసెప్టెంబర్ 28 - శ్రీ మహా చండీదేవి అలంకారంసెప్టెంబర్ 29 - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారంసెప్టెంబర్ 30 - శ్రీ దుర్గా దేవి అలంకారంఅక్టోబర్ 1 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంఅక్టోబర్ 2 - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంగమనిక: ఈ కథనంలో తెలియజేసిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాల్లో, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. (చదవండి: విష్ణు సేనాపతి విష్వక్సేనుడు) -
ఇంద్రకీలాద్రి: శ్రీదుర్గాదేవి అలంకరణలో విజవాడ దుర్గమ్మ (ఫోటోలు)
-
దసరా మహోత్సవాల రెండో రోజు.. శ్రీ గాయత్రిదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు (ఫోటోలు)
-
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకరణ విశిష్టత
-
శరన్నవరాత్రి మహోత్సవాలు: శ్రీగాయత్రీ దేవిగా దుర్గమ్మ దర్శనం
-
శరన్నవరాత్రి మహోత్సవాలు: శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ
-
నేడు మల్లన్న అలంకార దర్శనం
- ఆర్జిత సేవలు నిలుపుదల - సుప్రభాత, మహామంగళహారతిసేవలు రద్దు శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనభాగ్యం నూతన సంవత్సరాది సందర్భంగా భక్తులందరికీ మల్లన్న అలంకార దర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త శనివారం తెలిపారు. ఆదివారం వేకువజామున స్వామిఅమ్మవార్లకు జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవా టికెట్లను కూడా రద్దు చేశామన్నారు. అలాగే స్వామివార్ల గర్భాలయంలో జరిగే అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో శ్రీచక్రం ముందు జరిగే కుంకుమార్చన తదితర ఆర్జితసేవలన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి అలంకార దర్శనాన్ని కొనసాగిస్తామని అన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు. ఇందులో భాగంగా వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహామంగళహారతి సేవలు ఏకాంతంగా జరిపి 5.30గంటల నుంచి స్వామివార్ల అలంకార దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. -
శ్రీశైలంలో నేడు..
శ్రీశైలం: శరన్నవరాత్రోత్సవాలో్ల భాగంగా శనివారం ఎనిమిదో రోజు శ్రీ భ్రమరాంబాదేవిని మహాగౌరిగా అలంకరించి ప్రత్యేకపూజలను చేస్తారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై ఆవహింపజేసి వాహనపూజలను నిర్వహిస్తారు. మహాగౌరి అలంకారం, నందివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను పురవీధులో్ల ఊరేగిస్తారు. ఆ తరువాత కల్యాణోత్సవం, శయనోత్సవసేవలు నిర్వహిస్తారు.