breaking news
Aerial attacks
-
దాడుల్లో ఆరుగురు భారతీయుల మృతి
న్యూఢిల్లీ: యెమెన్‌లో జరిగిన వైమానిక దాడుల్లో ఆరుగురు భారతీయులు మృతి చెందారు. ఈ నెల 8న యెమెన్‌లోకి రెండు బోట్లలో చొరబడిన 21 మంది భారతీయులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణదళాలు వైమానిక దాడులు చేశాయి. 14 మంది తప్పించుకోగా, ఒకరు గల్లంతయ్యారు. చనిపోయిన ఆరుగురికీ హొడైడాలో అంత్యక్రియలు జరిపామని భారత్ తెలిపింది. -
సిరియాలో వైమానిక దాడులు: 82 మంది మృతి
బీరుట్: సిరియా రాజధాని డమాస్కస్‌లో ఆదివారం తిరుగుబాటుదారుల అధీనంలోని మార్కెట్‌పై ప్రభుత్వ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 82 మంది మరణించారు. 200కు పైగా మంది గాయపడ్డారు. డమాస్కస్ శివారులో రద్దీగా ఉన్న మార్కెట్‌పై ప్రభుత్వ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం నాటి ఈ దాడి సిరియాలో ఐదేళ్లుగా కొనసాగుతున్న సంక్షోభంలో ప్రభుత్వం జరిపిన అతిపెద్ద దాడుల్లో ఒకటని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ఐదేళ్లలో సిరియా ప్రభుత్వం రెబెల్స్ స్థావరాలపై జరిపిన దాడుల్లో వేలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారని, మొత్తంగా సిరియా అంతర్యుద్ధంలో 2.50 లక్షల మంది చనిపోగా, లక్షలాది మంది గాయపడ్డారని వెల్లడించారు.