breaking news
Advised
-
జీవిత బీమాపై ఈ అపోహలొద్దు..
భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు, దీర్ఘకాలిక పొదుపునకు, రిటైర్మెంట్ అనంతరం ఆదాయానికి హామీనిచ్చే సాధనంగా జీవిత బీమా అవసరంపై అవగాహన క్రమంగా పెరుగుతోంది. దీనితో పరిశ్రమ కూడా వృద్ధి చెందుతోంది. జీవిత బీమా సంస్థలు టెక్నాలజీని ఉపయోగించి కస్టమర్లకు సరళతరమైన సాధనాలను అందిస్తున్నాయి. అయినప్పటికీ జీవిత బీమాపై కొన్ని అపోహలు ఉంటున్నాయి. అందరికీ బీమా భద్రత లక్ష్యం సాకారం కావాలంటే వీటిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమతో పాటు తమకెంతో ప్రియమైన వారికి ఆర్థిక భద్రత కల్పించనివ్వకుండా వెనక్కు లాగుతున్న అపోహల్లో కొన్నింటిని చూస్తే..అపోహ 1: యువతకు లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం లేదుకొత్తగా ఆర్జన ప్రారంభించిన యువతలో చాలా మంది అప్పుడే తాము జీవిత బీమా తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ వీలైనంత ముందుగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలం కవరేజీ లభిస్తుంది. ప్రీమియంల భారం తక్కువగా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వానికి కూడా పటిష్టమైన పునాది ఏర్పడుతుంది. అందుకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించి తొందరగా రిటైర్ అవ్వాలనుకునే కొత్త తరం యంగ్‌స్టర్స్ కోసం జీవిత బీమా సంస్థలు ప్రత్యేకంగా పలు సేవింగ్స్ ప్రోడక్టులను ప్రవేశపెట్టాయి. అత్యంత తక్కువగా నెలకు రూ. 1,000 నుంచి ప్రారంభమయ్యే ఇన్వెస్ట్మెంట్ ఆధారిత పథకాలను అందిస్తున్నాయి. అపోహ 2: ఇది అర్థం కాని సంక్లిష్టమైన వ్యవహారం మొబైల్ ఆధారిత ప్లాట్‌ఫాంలు, డిజిటల్ ప్రక్రియలు, అదే రోజున పాలసీ జారీ తదితర అంశాల దన్నుతో జీవిత బీమాను అర్థం చేసుకోవడం, కొనుగోలు చేయడం నేడు మరింత సులభతరంగా ఉంటోంది. ఒకప్పుడు సంక్లిష్టమైన వ్యవహారంగా అనిపించిన ఈ ప్రక్రియ ప్రస్తుతం భాష, పథకాలపరంగా కూడా చాలా సరళంగా మారింది. అపోహ 3: క్లెయిమ్‌లు సెటిల్మెంట్ కష్టందేశీయంగా చాలా మటుకు జీవితబీమా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి స్థిరంగా 98 శాతం నుంచి 99 శాతం స్థాయిలో ఉంటోంది. కొన్ని సంస్థలు, నిబంధనలకు అనుగుణంగా ఉన్న క్లెయిమ్‌లను, అన్ని పత్రాలు అందిన మరుసటి రోజే సెటిల్ చేస్తున్నాయి. అపోహ 4: ఇది చాలా ఖరీదైన, తాహతుకు మించిన వ్యవహారంపొగ తాగని ఓ 30 ఏళ్ల వ్యక్తి రూ.1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే, రోజుకు రూ. 30 కన్నా తక్కువే ప్రీమియం ఉంటుంది. ఇది కెఫేలో కాఫీ ఖరీదు కన్నా తక్కువే. అంతేగాకుండా ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది, పాలసీదారుపై ఆధారపడిన వారికి ఆదాయ భర్తీ సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. గృహ రుణంలాంటి ఆర్థిక రుణభారాలను క్లియర్ చేసుకునేందుకు తోడ్పడుతుంది. అపోహ 5: మరణానంతరం మాత్రమే ఉపయోగకరంకొత్త తరహా లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు, పాలసీదార్లకు జీవితకాలంలోనే పలు ప్రయోజనాల అందించే విధంగా ఉంటున్నాయి. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ తీసుకుంటే, నిర్దిష్ట అనారోగ్యాల చికిత్సకయ్యే ఖర్చులను చెల్లించేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా కుటుంబ అవసరాల కోసం దాచిపెట్టే పొదుపు మొత్తాన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవిత బీమా కేవలం భద్రతకే పరిమితం కాకుండా పలు భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడే స్మార్ట్ సాధనంగా ఉంటోంది. దేశం ఆర్థిక సమ్మిళితత్వం వైపుగా వెళ్తున్న నేపథ్యంలో కాలం చెల్లిన అపోహల నుంచి బైటపడాల్సిన సమయమిది. ఈ క్రమంలోనే ప్రజలు ఆర్థికంగా సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడంలో సహాయకరంగా ఉండే సరళమైన పథకాలను, ప్రక్రియలను అందించడంపై ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరింతగా దృష్టి పెడుతోంది.వికాస్ గుప్తాచీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ఇదీ చదవండి: జాయింట్ ఖాతాకు నామినీ అవసరమా..? -
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి... అసెంబ్లీకి రావాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు త్వరగా కోలుకుని శాసనసభకు రావాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్.. కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, వైద్యులతోనూ మాట్లాడారు. తర్వాత ఆస్పత్రి బయట రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ను పరామర్శించాను. క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఇప్పటికే ఆదేశించాం. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నా. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరముంది. ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నా..’’అని రేవంత్ అన్నారు. కేటీఆర్, హరీశ్‌లను కలసిన పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యశోద ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గానికి చెందిన ఓ కార్యకర్తను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చానని.. అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడానని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని కేటీఆర్, హరీశ్‌రావు చెప్పారన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, కేసీఆర్ త్వర గా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. కేసీఆర్‌కు వీహెచ్, కోదండరెడ్డి పరామర్శ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కోదండరెడ్డి పరామర్శించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన ఇద్దరు నేతలు కేసీఆర్‌ను కలిశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొలుత కేసీఆర్‌ను కలిసేందుకు ఆసుపత్రి వర్గాలు అనుమతించకపోవడంతో.. మాజీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఇద్దరు కాంగ్రెస్ నేతలను లోపలికి తీసుకెళ్లారు. మరో రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్? సాధారణంగా తుంటి మారి్పడి సర్జరీ చేయించుకున్న అనంతరం రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. అయితే వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ డిశ్చార్జిని కొద్దిగా పొడిగించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన బాగానే కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు సాధారణ మందుల వాడకం, సులభమైన వ్యాయామాలు తప్ప మరే ప్రత్యేకమైన వైద్య సేవలూ అవసరం లేదని అంటున్నారు. దీంతో ఆయనను మరో 2, 3 రోజుల్లోనే డిశ్చార్జి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పూర్తిగా కోలుకుని తన కార్యకలాపాలు య «థావిధిగా నిర్వర్తించేందుకు మరి కొన్ని వారా లు పడుతుందని వైద్యులు అంటున్నారు. -
ఉక్కపోత.. ‘ఎండ’ మోత
నరసాపురం: సెప్టెంబర్ మాసం.. సాధారణంగా వాన కాలం.. ఎడతెరపి లేని వర్షాలు కురవాల్సిన సమయం.. అయితే పరిస్థితి భిన్నంగా ఉంది. పది రోజుల ముందు వరకు కుండపోత వర్షాలు, వరదలు భయపెట్టాయి. ఇలాంటి స్థితిలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం, ఉక్కపోతతో జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐదు రోజులుగా జిల్లాలోని అన్ని పట్టణాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతంలో కూడా భారీ హెచ్చుతగ్గులు నమోదవుతుండటం ఉక్కపోతకు కారణమవుతోంది. పగలు, రాత్రి తేడాలేకుండా తేమశాతం సాధారణం కన్నా అధికంగా నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తేమశాతంలో హెచ్చుతగ్గులు జిల్లాలో కొన్ని రోజులుగా గాలిలో తేమశాతం పెరుగుతోంది. వారం రోజులుగా పగలు 45 నుంచి 50 శాతం, వేకువజాము 80 నుంచి 85 శాతం తేమ నమోదవుతోంది. కొన్నిప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తగ్గిన ఏసీల వాడకం ఎయిర్ కండీషనర్ల వాడకంతో కరోనా వ్యాపిస్తుందనే వార్తలతో జనం ఏసీల వాడకాన్ని తగ్గించారు. ఎండలు, ఉక్కపోత ఉన్నా కొందరు ఏసీల జోలికి వెళ్లడం లేదు. జిల్లాలో దాదాపు 70 శాతం మంది వరకు ఇళ్లల్లో ఏసీల వాడకం తగ్గించినట్టు అంచనా. ఉక్కపోతతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. మారిన వాతావరణంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. వారం రోజులు ఇదే పరిస్థితి మరో వారం రోజుల పాటు ఇదే మాదిరిగా ఎండలు ఉండొచ్చు. ప్రస్తుతం మే నెలకు సమానంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐదారేళ్లలో సెపె్టంబర్లో ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదుకాలేదు. ప్రస్తుతం పగటి పూట గాలిలో తేమ 45 నుంచి 50 శాతానికి కాస్త ఎక్కువగా నమోదవుతోంది. ఎండతో పాటు ఉక్కపోత పెరిగింది. వర్షాలు పడితే వాతావరణం చల్లబడుతుంది. – ఎన్.నర్సింహారావు, నరసాపురం వాతావరణశాఖ అధికారి జాగ్రత్తగా ఉండాలి ఓ పక్క కరోనా ముప్పు, మరోపక్క ఎండ, ఉక్కపోతతో ప్రతిఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆస్మా రోగులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత వాతావరణంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. జ్వరాలు రావచ్చు. చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగడం వంటివి చేయాలి. –డాక్టర్ బళ్ల మురళి, ఎండీ, నరసాపురం -
సత్యా నాదెళ్ళకు సలహా ఇచ్చిన బుడతడు!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ళ ఇటీవల ఇండియా సందర్శించిన సందర్భంలో అనేకమంది ప్రముఖలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో చర్చలు జరిపారు. అభివృద్ధికి సహకరించే ఎన్నో ప్రశ్నలు సంధించి సమాధానాలకోసం సహనంతో వేచి చూశారు. అయితే ఆయన ప్రశ్నలకు సమాధానంగాని, సలహాలు గాని ఇచ్చేందుకు పత్రికా ప్రతినిధులు, నిపుణులు వంటివారెవ్వరూ ముందుకు రాలేదు. అయితే ఓ ఎనిమిదేళ్ళ ఏస్ డెవలపర్ మాత్రం సత్యా నాదెళ్ళకు తనదైన శైలిలో సలహాలు, సూచనలను అందించి ఆహూతులనూ అబ్బుర పరిచాడు. సాధారణంగా ఎనిమిదేళ్ళ పిల్లలు అంటే వీడియో గేమ్ లు ఆడటంలో బిజీ బిజీగా గడుపుతుంటారు. కానీ ఈ ఎనిమిదేళ్ళ కుర్రాడు మాత్రం 'లెట్ దేర్ బి లైట్' పేరున ఓ కొత్త గేమింగ్ యాప్ ను అభివృద్ధి చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ గేమ్ లో వినియోగదారులు తమ పట్టణాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కర్మాగారాల నిర్మాణం, వ్యవసాయ అభివృద్ధి వంటివి చేపట్టేలా రూపొందిస్తున్నాడు. అయితే ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానంలో ఉన్న మీరు సైతం పారిశ్రామికాభివృద్ధి, వ్యవసాయం సమతుల్యతను కలిగి ఉండేలా ప్రయత్నిస్తే కాలుష్య పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉంటుందని, దీంతో స్థిరమైన అభివృద్ధిని కూడ సాధించవచ్చని ఆ యువ డెవలపర్ తనదైన రీతిలో మైక్రోసాఫ్ట్ సీఈవో కు సలహా ఇచ్చాడు. ఇంకేముందీ... ఆ చిన్నారి మేధావి సలహాకు సరైన సమాధానం ఇవ్వాల్సి పని సత్యా నాదెళ్ళ వంతైంది. అంతేకాక ఆ ఛైల్డ్ డెవలపర్... తాను భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ సీఈవో కావాలని ప్రయత్నిస్తున్నానని, ప్రపంచంలోని అన్ని టెక్నాలజీ కంపెనీలు తన అధీనంలో పనిచేసేట్టు చేస్తానని చెప్పాడా వండర్ బాయ్...