breaking news
on 27th
-
27న జూనియర్ ఫుట్‌బాల్ జట్ల ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు : మెదక్‌లో అక్టోబర్ ఐదునుంచి ఏడు వరకు నిర్వహించే జూనియర్ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొనే జిల్లా బాలుర జట్లను ఈనెల 27న స్థానిక స్టేడియంలో ఎంపిక చేయనున్నట్లు ఫుట్‌బాల్ జిల్లా అసోసియేషన్ ప్రతినిధి గజానంద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆ రోజు ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలని వివరాలకు 9440765228 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
27న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా కేంద్రమైన కడప పాత రిమ్స్‌లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఈనెల 27వ తేదిన నిరుదోయగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి వి.సుస్మితప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంపికైన వారికి వేతనం కింద నెలకు రూ. 8–10 వేల వరకు ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులు కడప, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, మాధవరం, సుండుపల్లె, ఖాజీపేట, ప్రొద్దుటూరు, బద్వేలు ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఇతర వివరాలకు 98663 04624 నెంబరులో సంప్రదించాలన్నారు.