breaking news
-
అమ్మాయితో అసభ్య వీడియో కాల్స్? నా కెరీర్ నాశనం..!
ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ (Ajmal Ameer) అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడాడంటూ ఓ వీడియో క్లిప్పింగ్ నెట్టింట వైరల్‌గా మారింది. హద్దులు దాటి మాట్లాడటంతో పాటు చాటింగ్ కూడా చేశాడంటూ ప్రచారం జరిగింది. ఈ వివాదంపై అజ్మల్ స్పందించాడు. అవన్నీ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఫేక్ వీడియో కాల్స్ అని కొట్టిపారేశాడు.నాకు పీఆర్ లేదుఅజ్మల్ మాట్లాడుతూ.. ఈ కల్పిత కథలు, ఏఐ వాయిస్ ఇమిటేటింగ్, ఎడిటింగ్స్.. నన్ను కానీ, నా కెరీర్‌ను కానీ నాశనం చేయలేవు. దేవుడి దయ వల్ల రెండు పెద్ద (తెలుగు, తమిళ) ఇండస్ట్రీలలో నేనేంటో నిరూపించుకోగలిగాను. నాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుని సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. నా ఇమేజ్ను కాపాడేందుకు నాకెటువంటి మేనేజర్ లేడు, పీఆర్ అసలే లేదు. రెండురోజులుగా నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది.సినిమాఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడ్డ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీవల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరే నా ధైర్యం అని వీడియో రిలీజ్ చేశాడు. అజ్మల్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 14 అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. రంగం మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. రచ్చ, అభినేత్రి 2, వ్యూహం, బడ్డీ, గోట్(The Greatest of All Time) వంటి పలు సినిమాలతో అలరించాడు. View this post on Instagram A post shared by Ajmal Amir (@ajmal_amir) చదవండి: నీకెందుకే అంత యాటిట్యూడ్? రీతూపై విషం కక్కిన ఆయేషా -
BCCI: పిరికిపందల దాడి.. అఫ్గన్ బోర్డుకు మద్దతుగా బీసీసీఐ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెటర్ల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB)కు సంఘీభావం ప్రకటించింది. తమ క్రికెటర్ల మరణానికి కారణమైన దేశంతో.. అఫ్గన్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోవడాన్ని బీసీసీఐ స్వాగతించింది.పిరికిపందల దాడి.. ఈ మేరకు.. ‘‘సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌లో పిరికిపందలు జరిపిన సీమాంతర వైమానిక దాడుల్లో అఫ్గనిస్తాన్ యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వీరి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.ఈ కష్ట సమయంలో బీసీసీఐ అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా నిలుస్తుంది. అఫ్గన్ క్రికెట్ ప్రపంచానికి, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మీ దుఃఖాన్ని మేమూ పంచుకుంటాం. ఇందుకు కారణమైన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.తీవ్రంగా కలచివేస్తోందివైమానిక దాడుల్లో మరణించిన అమాయక ప్రజలు.. ముఖ్యంగా క్రీడల్ని భవిష్యత్తుగా ఎంచుకున్న వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అఫ్గనిస్తాన్ ప్రజలకు బీసీసీఐ హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తోంది. వారి బాధను మేమూ పంచుకుంటాము’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేరిట బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.కాగా పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ వైఖరికి నిరసనగా పాకిస్తాన్‌తో ఆడాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు అఫ్గన్ బోర్డు ప్రకటించింది.ఆట కంటే దేశమే ముఖ్యంఅఫ్గన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌తో పాటు పలువురు క్రికెటర్లు బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఆట కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. కాగా రావల్పిండి వేదికగా నవంబరు 19 నుంచి పాకిస్తాన్- శ్రీలంక- అఫ్గనిస్తాన్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది.అయితే, పాక్ దుశ్చర్య కారణంగా అఫ్గన్ బోర్డు ఈ సిరీస్‌ను బహిష్కరించగా.. తాము మరో జట్టు కోసం వెతుకుతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘‘అప్గనిస్తాన్ తప్పుకొన్నా ట్రై సిరీస్ కచ్చితంగా జరుగుతుంది. అఫ్గన్ జట్టు స్థానాన్ని భర్తీ చేయగల టీమ్ కోసం చూస్తున్నాం’’ అని పీసీబీ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.చదవండి: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
కొడుకును వెళ్లగొట్టినా.. కోడలికి హక్కుంటది
న్యూఢిల్లీ: కుటుంబ కలహాల కారణంగా తమ ఆస్తిపై కుమారుడికి హక్కు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వారి ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు కోడలికి (కుమారుడి భార్యకు) ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంతో అత్తగారింట్లోకి అడుగుపెట్టి కాపురం ఉన్న కోడలికి ఆ ఇంట్లో నివసించే హక్కును తిరస్కరించటం గృహసింహ చట్టం ప్రకారం సాధ్యం కాదని ఈ నెల 16న జస్టిస్ సంజీవ్నారుల్ స్పష్టంచేశారు. ఆ ఇంట్లో నుంచి కోడలిని వెళ్లగొట్టాలంటే చట్టప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదీ కేసు.. ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం తమ కుమారుడికి 2010లో వివాహం జరిపించింది. అప్పటినుంచి అత్త, మామ, కొడుకు, కోడలు ఒకే ఇంట్లో ఉన్నారు. అయితే, 2011 నుంచి తల్లిదండ్రులతో కుమారుడికి గొడవలు మొదలు కావటంతో కొంతకాలం కొడుకు, కోడలు తమ సొంత ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఆస్తిపై కొడుక్కు ఎలాంటి హక్కులు లేవని తల్లిదండ్రి ప్రకటించారు. ఆ ఆస్తి తమ స్వార్జితమని, దానిపై తమకే పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత కొంతకాలానికి కోడలు తిరిగి అత్తగారింటికి రావాలని నిర్ణయించుకుంది. కానీ, అప్పటికే ఆమె వస్తువులన్నీ ఆ ఇంట్లో నుంచి తీసివేశారు. అయినా, ఆమె ఆంట్లోకి తిరిగి వచ్చింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ అత్తమామ హైకోర్టును ఆశ్రయించారు.తమ కుమారుడినే త్యజించామని, అలాంటప్పుడు కోడలికి తమ ఇంట్లో నివసించే హక్కు లేదని వాదించారు. ఈ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. కోడలిగా అత్తగారింట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆమెకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. అత్తమామలు తన భర్తకు హక్కులు నిరాకరించినా, ఆమె హక్కులను కాదనలేరని తేల్చి చెప్పింది. అత్తమామ ఇంట్లో మొదటి అంతస్తులో, కోడలు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించాలని సూచించింది.గృహసింహ చట్టంలోని సెక్షన్ 17(1) ప్రకారం కుటుంబసభ్యురాలిగా ఉన్న మహిళలకు వారి ఉమ్మడి ఇంట్లో నివసించే అధికారం, హక్కు ఉంటాయని తెలిపింది. సెక్షన్ 17(2) ప్రకారం ఆ మహిళలను ఉమ్మడి ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలంటే కచ్చితంగా చట్టప్రకారమే వెళ్లాలని స్పష్టంచేసింది. కొడుకు కోడలు తమ ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని నాశనం చేశారన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. కొడుకు, కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయినంత మాత్రాన ఉమ్మడి కుటుంబ వాతావరణం చెడిపోయినట్లు కాదని వివరణ ఇచ్చింది. -
మూవీ రివ్యూవర్స్‌పై కె-ర్యాంప్ నిర్మాత ఆవేదన
ఈ దీపావళి సందర్భంగా కిరణ్ అబ్బవరం నటించిన ‘కె- ర్యాంప్’(K- Ramp Review) సినిమా నేడు (అక్టోబర్ 18) విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే, తాజాగా ఈ చిత్ర నిర్మాత రాజేశ్ దండ రివ్యూవర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాకి కొందరు ఇచ్చిన రేటింగ్స్ చూసి చాలా బాధపడినట్లు ఆయన పేర్కొన్నారు. కొందరు రివ్యూవర్లు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆవేదన చెందారు.మీడియా సమావేశంలో కె- ర్యాంప్ చిత్ర నిర్మాత రాజేశ్ ఇలా అన్నారు. 'ఈ సినిమా కేవలం నవ్వుకునేందుకు మాత్రమే తీశాం. ఇందులో లాజిక్స్ వెతకాలని చూస్తే ఏం చేయలేం. మా సినిమాకు రివ్యూవర్లు ఇచ్చిన రేటింగ్స్ చూసి చాలా బాధపడ్డాను. మీ అభిప్రాయాన్ని నేను తప్పకుండా అంగీకరిస్తాను. కానీ, ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. మా లాంటి చిన్న నిర్మాతల మీద వివక్ష చూపుతున్నారు. సోషల్‌మీడియాలో కొన్ని సినిమాలకు ఫస్టాఫ్ రివ్యూ ఇచ్చేసి కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాతే సెకండాఫ్ రివ్యూ ఇస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు..?మరికొందరు మాత్రం రివ్యూ షేర్ చేసి చాల సమయం తర్వాతే రేటింగ్ ఇస్తున్నారు. నేను చిన్న నిర్మాతననే ఇలా చేస్తున్నారా.. ఈ సమస్య నాకు మాత్రమే కాదు . ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీరు రివ్యూ ఇచ్చేందుకు బాహుబలి లాంటి సినిమాకు ఎంత శ్రద్ధ పెడుతారో కె- ర్యాంప్ లాంటి చిత్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ, కొందరు వివక్ష చూపుతున్నారు. ఇలాంటి దోరణి ఇకనైనా మారాలి.' అని ఆయన అన్నారు.నిర్మాత రాజేశ్ వ్యాఖ్యలపై నెటిజన్లు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా బాగుందంటూ ఆయనకు ఆండగా నిలబడుతున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం నటన సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఆపై హీరోయిన్ యుక్తి తరేజా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నప్పటికీ అంతే రేంజ్లో దుమ్మురేపిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ట్రంప్ రాజు కాదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జనం తిరుగుబాటు ప్రారంభించారు. ‘నో కింగ్స్’ పేరిట శనివారం దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ట్రంప్ రాజు కాదని, ఇక్కడ రాజులెవరూ లేరని, నిరంకుశ పరిపాలన ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దేశాన్ని నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. నియంతృత్వ పరిపాలనను ప్రతిఘటించడం, నిరసన తెలపడమే అసలైన దేశభక్తి అని ప్రజలు తేల్చిచెప్పారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్తోపాటు బోస్టన్, అట్లాంటా, షికాగో తదితర నగరాల్లో నిరసనకారులు కదం తొక్కారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్ సహా వివిధ నగరాల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. గాలితో నింపిన దుస్తుల్లాంటివి ధరించారు. అమెరికా రాజ్యాంగ ప్రవేశికను ముద్రించిన బ్యానర్లపై సంతకాలు చేశారు. తాము ముమ్మాటికీ అసలైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. నియంతగా మారుతున్న ట్రంప్ నిరసన ప్రదర్శనలపై అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అవన్నీ ‘అమెరికాను ద్వేషించే’ ర్యాలీలు అంటూ ఆరోపించింది. ట్రంప్ మద్దతుదారులు సైతం ఈ ర్యాలీలను తప్పుపట్టారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా జనం సామూహికంగా నిరసన తెలపడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కొన్నిరోజుల క్రితం అమెరికాలో షట్టౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సేవలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రంప్ నిర్వాకం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని వారు మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుపట్టారు. నిరంకుశ అధికారం చెల్లబోదని తేల్చిచెప్పారు. ట్రంప్ విధానాలు తమకు ఎంతమాత్రం నచ్చడం లేదని ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికురాలు షాన్ హోవార్డ్ చెప్పారు. తాను గతంలో ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ముందుకెళ్తోందని, వలసదారులను అక్రమంగా నిర్బంధించడం ఏమిటని మండిపడ్డారు. ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహరించడం సరైంది కాదన్నారు. ఇదంతా ‘అన్–అమెరికన్’ అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ నియంతగా మారిపోతున్నారని మరో నిరసనకారుడు ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, నిరసన కార్యక్రమాల విషయంలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలియజేశారు. జెట్ విమానంలో ‘కింగ్ ట్రంప్’ తనకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ‘నో కింగ్స్’ నినాదాన్ని హేళన చేస్తూ కింగ్ ట్రంప్ పేరిట ఒక కృత్రిమ మేధ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో కిరీటం ధరించిన ట్రంప్ జెట్ విమానంలో కూర్చొని దూసుకెళ్తున్నారు. బాంబుల తరహాలో ఈ విమానం బురదను చిమ్ముతోంది. ఆ బురదంతా అమెరికాలో నగరాల్లోని నిరసనకారులను కమ్మేస్తోంది. ట్రంప్ తనను తాను బలమైన రాజుగా పరోక్షంగా ప్రకటించుకున్నారు. నిరసన ర్యాలీలను లెక్కచేయబోనని, బురదతో సన్మానిస్తానని సంకేతాలు పంపించారు. -
ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు
టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కమార్ రెడ్డి (Nitish Kumar Reddy)పై భారత దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ప్రశంసలు కురిపించాడు. ఈ ఆంధ్ర ఆటగాడు మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని పేర్కొన్నాడు.అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో జట్టులోకి వచ్చిన నితీశ్ రెడ్డి.. ఇప్పటికే టెస్టుల్లో కీలక ఆటగాడిగా మారాడు. అంతకుముందే టీ20 ఫార్మాట్లోనూ అరంగేట్రం చేసిన ఈ విశాఖ కుర్రాడు.. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌తో వన్డేల్లోనూ అడుగుపెట్టాడు.ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా టీమిండియా దిగ్గజ సారథి రోహిత్ శర్మ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్నాడు నితీశ్ రెడ్డి. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘క్యాప్ నంబర్ 260. నితీశ్ రెడ్డి. నీ ఆటిట్యూడ్, నైపుణ్యాలతో కెరీర్‌ను గొప్పగా ఆరంభించావు. ఇదే జోరును కొనసాగిస్తే వందకు 110 శాతం.. నువ్వు టీమిండియాతో సుదీర్ఘకాలం పాటు ప్రయాణం చేస్తావని చెప్పగలను. ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదగబోతున్నావని అనిపిస్తోంది. నీపై నాకు ఆ నమ్మకం ఉంది. ప్రతి ఫార్మాట్లోనూ ఆడాలన్న నీ కల నెరవేరింది. అందరూ నీకు తోడుగా ఉంటారునీకు జట్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆటగాడిగా నీకేం కావాలో అన్నీ సమకూరుస్తుంది. ఎప్పుడు, ఏం కావాలన్నా అందరూ నీకు తోడుగా ఉంటారు. ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. గుడ్ లక్. నీ కెరీర్ గొప్పగా ఉండాలి’’ అంటూ రోహిత్ శర్మ నితీశ్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆసీస్‌తో తొలి వన్డేలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రెడ్డి 11 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున టీ20 మ్యాచ్‌లు, తొమ్మిది టెస్టులు ఆడిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టెస్టుల్లో ఎనిమిది, టీ20లలో మూడు వికెట్లు తీశాడు.అపుడు కోహ్లి.. ఇపుడు రోహిత్అదే విధంగా ఈ కుడిచేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో టెస్టుల్లో 386, టీ20లలో 90 పరుగులు ఉన్నాయి. కాగా గతేడాది పెర్త్ వేదికగా భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న 22 ఏళ్ల నితీశ్ రెడ్డి.. తాజాగా అదే వేదిక మీద రోహిత్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకోవడం విశేషం. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోయే ఈ క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గిల్ సేనకు ఓటమిఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.ఇక డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా తమ ముందు 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య గురువారం అడిలైడ్ వేదికగా రెండో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ
లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో చారిటీ ఈవెంట్ "పింక్ బాల్" ఈవెంట్ గ్లామర్‌కు ప్రతిరూపంగా మారింది. బ్రిటిష్ మ్యూజియం డైరెక్టర్ నికోలస్ కల్లినన్‌తో కలిసి, రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ దీనికి సహ అధ్యక్షత వహించారు. అలాగే ఆమె తల్లి, రిలయన్స్ ఫౌండర్ చైర్పర్సన్ ,NMACC వ్యవస్థాపకురాలు పింక్ బాల్ థీమ్‌లో అద్భుతమైన లుక్‌లో మెరిసారు.కీలకమైన కారణాల కోసం నిధులను సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమంలో బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్‌తోపాటు, ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, దాతలు, సామాజిక ,రాజకీయ ఉన్నత వర్గాలకు చెందిన 800 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తగా, గొప్ప దాతగా పేరుగాంచిన నీతా అంబానీ తనదైనఫ్యాషన్ లుక్‌తో అలరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేసిన ఈ ఈవెంట్ ఏన్షియంట్ ఇండియా: లివింగ్ ట్రెడిషన్స్'తో పాటు జరిగిన పింక్-నేపథ్య సోయిరీలో సాగింది.పింక్ బాల్ సహ చైర్‌గా, ఇషా అంబానీ లుక్‌లో వారసత్వం, కళాత్మకత ఉట్టిపడింది. అబు జాని సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండ్ మేడ్ కోచర్ డ్రెస్‌లో మెరిసి పోయింది. పింక్ ధీమ్కు తగ్గట్టుగా బ్లష్ పింక్ చామోయిస్ శాటిన్ జాకెట్ , గులాబీ రంగు జర్డోజీలో ముత్యాలు, సీక్విన్స్ ,స్ఫటికాలతో డిజైన్ స్కర్ట్‌ను ధరించింది.35 మందికి పైగా కళాకారులుదీన్ని తయారు చేయడానికి 3,670 గంటలు శ్రమించారు. దీనికి సంబంధించిన వీడియోను సందీప్ ఖోస్లా షేర్ చేశారు. కార్సెట్ బ్లౌజ్‌ను డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టైల్ చేశారు. అలాగే నీతా అంబానీ స్వదేశ్లో తయారు చేసిన కాంచీవరం, మల్బరీ సిల్క్ చీరలో అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) ఈ కార్యక్రమానికి మిక్ జాగర్, జానెట్ జాక్సన్, నవోమి కాంప్‌బెల్, సర్ నార్మన్ ఫోస్టర్, లేడీ కిట్టి స్పెన్సర్, ల్యూక్ ఎవాన్స్ , జేమ్స్ నార్టన్ వంటి అనేక మంది సృజనాత్మక ప్రముఖులు హాజరయ్యారు. హాజరైన ప్రతీవ్యక్తి సీటు కోసం 2,000 పౌండ్లు చెల్లించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) -
దబంగ్ ఢిల్లీ మరో విజయం
ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు ఖాతాలో మరో విజయం చేరింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఢిల్లీ జట్టు శుక్రవారం జరిగిన పోరులో 37–31 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. ఢిల్లీ తరఫున అక్షిత్ ధుల్ 12 పాయింట్లతో సత్తా చాటగా... నవీన్ 6, ఫజల్ 5 పాయింట్లు సాధించారు. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో ఢిల్లీ 16 మ్యాచ్‌లు ఆడి 13 విజయాలు, 3 పరాజయాలతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 42–29 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను చిత్తుచేసింది. జైపూర్ తరఫున అలీ సమది 13 పాయింట్లు, నితిన్ 11 పాయింట్లతో రాణించగా... యోధాస్ తరఫున సురేందర్ 12 పాయింట్లతో పోరాడాడు. గ్రూప్ అడుగున ఉన్న జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 51–49తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్‌తో పుణేరి పల్టన్, బెంగాల్ వారియర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
లోకేశ్ పోస్టులపై భగ్గుమంటున్న కర్ణాటక వాసులు
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి పునర్విభజితమైన కొత్త రాష్ట్రాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మంత్రి లోకేశ్ చేస్తున్న వరుస ట్వీట్లపై కర్ణాటకవాసులు భగ్గుమంటున్నారు. లోకేశ్ ట్వీట్లతో జాతీయస్థాయిలో ఏపీ పరువు పోతుండటంతో పాటు కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారిపై స్థానికుల ఆగ్రహావేశాలకు దారితీస్తున్నాయి. ఇదే విషయాన్ని చాలామంది ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చాలామంది ఏపీ ప్రజలు పని చేసుకుంటున్నారని, పోస్టు చేసేముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎక్స్‌లో ట్వీట్ చేస్తున్నారు. తాజాగా లోకేశ్ పెట్టిన పోస్టుతో కూటమి సర్కారు ఆర్థిక నిర్వహణ తీరును కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా నిలదీశారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడాన్ని కర్ణాటక వాసులు తట్టుకోలేకపోతున్నారంటూ పరోక్షంగా లోకేశ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు జాతీయస్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఏపీ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని, ఇప్పుడు ఇది పెట్టుబడులకు కూడా వ్యాప్తి చెందడంతో పొరుగువారి కడుపులో మంట మొదలైందంటూ లోకేశ్ గురువారం ఎక్స్‌లో చేసిన ఈ వ్యాఖ్యపై కర్ణాటక మంత్రి అంతే ఘాటుగా స్పందించారు.గతంలోనూ ఇదే తీరు బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అనో.. లేక ఏదైనా కంపెనీ కర్ణాటకలో పెట్టుబడులపై ఆలోచిస్తున్నట్లు ఒక చిన్న వార్త వస్తే చాలు వెంటనే లోకేశ్ ఎక్స్‌లో పోస్టులు పెడుతుండటం కర్ణాటక వాసుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది. గతంలో ఇదేవిధంగా ఒకసారి లోకేశ్ పోస్టు చేస్తే ప్రియాంక్ ఖర్గే ఇదేవిధంగా ఘాటుగా స్పందించారు. బలహీనమైన ఎకో సిస్టమ్ ఉన్నవాళ్లు బలమైన వాళ్లపై ఆధారపడి జీవించడం సహజమంటూ పరాన్నజీవిగా అభివర్ణించారు. మీ ఘనత.. ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్ల అప్పులు చేయడం ప్రియాంక్ ఖర్గే ఏం ట్వీట్ చేశారంటే.. ప్రతి ఒక్కరు ఆహారంలో కాస్తాకూస్తో స్పైసీని ఆస్వాదిస్తారని, కానీ ఇది పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన మేరకే పరిమితం చేస్తామన్నారు. ఆర్థికవేత్తలు కూడా బడ్జెట్ నిర్వహణలో సమతుల్యతను పాటిస్తారు. ఏపీ ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్లు అప్పులు తీసుకుందని, రాష్ట్ర జీఎసీడీపీలో అప్పుల వాటా 2.61 శాతం నుంచి 3.61 శాతానికి పెరగడం ద్వారా ఏపీ ఆర్థికవ్యవస్థ దిగజారిపోయిందంటూ పోస్టు చేశారు. -
ఆశలు రేపి... ఆఖర్లో కూల్చారు!
లక్ష్యఛేదనలో 253/4 స్కోరు వద్ద భారత్ 30 బంతుల్లో 36 పరుగుల సమీకరణమపుడు గెలుపే... భారత్‌వైపు తొంగిచూస్తోంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో హిట్టర్ రిచా ఘోష్, ఫిఫ్టీ చేసిన దీప్తిశర్మ అవుటవడంతోనే మహిళల జట్టు గెలుపునకు దూరమైంది. క్రీజులో ఉన్న అమన్‌జోత్, స్నేహ్రాణా సింగిల్స్‌కే పరిమితం కావడం... భారీ షాట్లు ఆడలేకపోవడంతో గెలుపు దారితప్పి ఓటమిబాట పట్టింది.ఇండోర్: ఇక గెలుపు ఖాయమేలే... విజయానికి చేరువయ్యామని అనుకుంటుండగా ఊహించని ఫలితం భారత శిబిరాన్ని ముంచేసింది. విజయం ఆశలు రేపిన మహిళలు ఆఖరికొచ్చేసరికి తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో గెలుపుదాకా వచ్చిన భారత్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంగ్లండ్ అమ్మాయిల చేతిలో ఓడిపోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్‌నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించింది. అమీ జోన్స్ (68 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధశతకం చేసింది. దీప్తిశర్మ (4/51) ప్రత్యర్థి బ్యాటింగ్‌కు దెబ్బతీయగా, శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓడింది. స్మృతి మంధానా (94 బంతుల్లో 88; 8 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70; 10 ఫోర్లు), దీప్తిశర్మ (57 బంతుల్లో 50; 5 ఫోర్లు)ల అర్ధశతకాల మోత బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రత్యర్థి బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2 వికెట్లు తీసింది. కదంతొక్కిన హీథర్‌నైట్ ఓపెనర్ బ్యూమోంట్ (22) తక్కువ స్కోరుకే అవుటైనా... మరో ఓపెనర్ అమీ జోన్స్ ఫిఫ్టీతో, టాపార్డర్ బ్యాటర్ హీథర్‌నైట్ శతకంతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. కెపె్టన్ నాట్ సీవర్ బ్రంట్ (38; 4 ఫోర్లు), హీథర్‌నైట్ మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. దీప్తి శర్మ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరు మరింత పెరగకుండా చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ప్రతీక (6) వికెట్‌ను కోల్పోయినప్పటికీ స్మృతి, హర్లీన్ (24), కెపె్టన్ హర్మన్, దీప్తిల రాణింపుతో విజయంవైపు అడుగులు వేసింది. అయితే 234 స్కోరు వద్ద మంధాన అవుటవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. రిచా, దీప్తిలు అవుటవడంతో పరాజయం ఖాయమైంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: బ్యూమోంట్ (బి) దీప్తి 22; అమీ జోన్స్ (సి) మంధాన (బి) దీప్తి 56; హీథర్‌నైట్ (రనౌట్) 109; నాట్ సీవర్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) శ్రీచరణి 38; సోఫియా (సి) దీప్తి (బి) శ్రీచరణి 15; ఎమా లంబ్ (సి) మంధాన (బి) దీప్తి 11; అలైస్ క్యాప్సీ (సి) హర్లీన్ (బి) దీప్తి 2; చార్లీ (నాటౌట్) 19; సోఫీ ఎకిల్‌స్టోన్ రనౌట్ 3; లిన్సే స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–73, 2–98, 3–211, 4–249, 5–254, 6–257, 7–276, 8–280. బౌలింగ్: రేణుక 8–0–37–0, క్రాంతి 8–0–46–0, స్నేహ్ రాణా 10–0–56–0, శ్రీచరణి 10–0–68–2, దీప్తిశర్మ 10–0–51–4, అమన్‌జోత్ 4–0–26–0. భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (సి) అమీజోన్స్ (బి) లారెన్ బెల్ 6; స్మృతి (సి) క్యాప్సీ (బి) లిన్సే స్మిత్ 88; హర్లీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చార్లీ 24; హర్మన్‌ప్రీత్ (సి) ఎమా లంబ్ (బి) నాట్ సీవర్ 70; దీప్తి (సి) సోఫియా (బి) ఎకిల్‌స్టోన్ 50; రిచా (సి) హీథర్‌నైట్ (బి) నాట్ సీవర్ 8; అమన్‌జోత్ (నాటౌట్) 18; స్నేహ్ రాణా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–13, 2–42, 3–167, 4–234, 5–256, 6–262. బౌలింగ్: లారెన్ బెల్ 9–0–52–1, లిన్సే స్మిత్ 10–0–40–1, నాట్ సీవర్ 8–0–47–2, చార్లీ డీన్ 10–0–67–1, సోఫీ ఎకిల్‌స్టోన్ 10–0–58–1, అలైస్ క్యాప్సీ 3–0–20–0.