breaking news
-
మానవత్వాన్ని ప్రశ్నార్థకం చేసిన కానిస్టేబుల్ హత్యోదంతం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆపద వస్తే పోలీసు కావాలి.. వెంటనే రావాలి.. అలాంటి పోలీసుకు ప్రాణాపాయ స్థితి వస్తే మాత్రం చోద్యం చూడాలి.. నిజామాబాద్ నగరం నడిబొడ్డున శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్యోదంతం సమాజంలో కొడిగడుతున్న మానవత్వాన్ని, పౌర బాధ్యతలను మరోసారి ఎత్తిచూపింది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ గుండెల్లో దుండగుడు కత్తితో పొడిస్తే చుట్టూ వందలమంది గుడ్లప్పగించి చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ స్పందించలేదు. ప్రమోద్ను ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేయాలని పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ విఠల్ అరగంటపాటు బతిమాలినా ఒక్కరూ అడుగు ముందుకేయలేదు. పైగా ఏదో వేడుక జరుగుతున్నట్లు తమ మొబైళ్లలో వీడియోలు, ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ గడిపారు. ఆటోవాలాలు సైతం సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. సుమారు 30 నిమిషాలపాటు ఎస్ఐ విఠల్ ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ స్పందించలేదు. అటువైపు నుంచి వెళ్తున్న ఓ అంబులెన్స్‌ను ఆపినప్పటికీ ఆపకుండా వెళ్లడం గమనార్హం. చివరికి ఆదుకున్నది పోలీసే..వినాయక నగర్ మీదుగా తన వాహనంలో వెళ్తున్న మోపాల్ మండల సబ్ఇన్స్పెక్టర్ సుస్మిత జనం గుమిగూడి ఉండడాన్ని చూసి ఆగారు. కత్తిపోటుకు గురైంది కానిస్టేబుల్ ప్రమోద్ అనే విషయం తెలియకపోయినా తన వాహనంలో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించి ప్రమోద్ మార్గమధ్యలోనే మరణించాడు. ఈ ఘటనలో ప్రజల తీరుపై పోలీసులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సమాజానికి భద్రత కల్పిస్తున్న తమకే ఆపదలో సహాయం చేయటానికి ఒక్కరూ ముందుకు రాలేదని ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు.ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగొద్దుపోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర విచారకరం. ఈ చర్యను ఖండిస్తున్నాం. విధి నిర్వహ ణలో ప్రమోద్ చేసిన త్యాగం అత్యున్నతమైనది. సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న శాంతిభద్రతల విభాగంలో పోలీసు సిబ్బందికే భద్రత లేకుండా పోయింది. రౌడీషీటర్లు స్వేచ్ఛగా తిరిగే స్థాయికి శాంతిభద్రతలు దిగజారడం శోచనీయం. రౌడీషీటర్ షేక్ రియాజ్‌ను తక్షణమే పట్టుకోవాలి. అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలి. ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగకుండా, కరడుగట్టిన నేరస్తులకు అత్యంత కఠిన శిక్ష విధించేలా ప్రభుత్వం ముందుకెళ్లాలి.– ధర్మపురి అర్వింద్, ఎంపీ కానిస్టేబుల్ హత్యపై డీజీపీ సీరియస్ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షించాలని ఐజీకి ఆదేశంసాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రమోద్‌పై ఒక చైన్ స్నాచర్ దాడి చేసి హత్య చేసిన సంఘటనను డీజీపీ బి.శివధర్‌రెడ్డి సీరియస్‌గా తీసుకు న్నారు. సిన్సియర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ నేరాలను చేస్తున్న నిందితుడు షేక్ రియాద్‌ను సమాచారం లభించిన వెంటనే పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తున్న కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి హత్య చేసి పరారైన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయా లని నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదే శించారు. మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డిని సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షి ంచాలని సూచించారు. మరణించిన కానిస్టే బుల్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి అవసరమైన సహాయం చేయాలన్నారు. లభించిన ఆధారాలను బట్టి గాలింపు చేపట్టాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీచేశారు. -
అనంతపురం అబ్బాయిల సక్సెస్ స్టోరీ.. యూట్యూబర్లుగా రాణిస్తోన్న యువత
సోషల్ మీడియా వచ్చాక ఎవరెవరో ఫేమస్ అయిపోతున్నారు. అలాగే అనంతపురానికి చెందిన ఇద్దరు యువకులు అలీ రొద్దం, తన్వీర్ మావ సైతం యూట్యూబర్లుగా దూసుకెళ్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్నారు. తాజాగా వీరిద్దరు సాక్షి ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ యూట్యూబ్ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు. ఆ విశేషాలేంటో మీరు కూడా చూసేయండి. -
INS విక్రాంత్‌లో మోదీ దీపావళి వేడుకలు.. పాకిస్తాన్‌కు కౌంటర్
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొని సైనికులతో సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటు కూడా మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది. సైనికులే భారత్ బలం. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు, దీపావళికి వెలిగించే దీపాల లాంటివి. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది. పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయి.#WATCH | Prime Minister Narendra Modi says, "The night spent yesterday on INS Vikrant is hard to put into words. I saw the immense energy and enthusiasm you all were filled with. When I saw you singing patriotic songs yesterday, and the way you described Operation Sindoor in your… pic.twitter.com/UrGF2gngn6— ANI (@ANI) October 20, 2025ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాకు ప్రతీక. ఆపరేషన్ సిందూర్ సమయంలో పరాక్రమం చూపించిన త్రివిధ దళాలకు సెల్యూట్. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే శత్రువులకు నిద్ర కూడా పట్టదు. ఐఎన్ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక. బ్రహ్మోస్, ఆకాశ్ మిస్కైల్ తమ సత్తా ఏంటో చూపించాయి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరం’ అని చెప్పుకొచ్చారు.#WATCH | Prime Minister Narendra Modi says, "... Just a few months ago, we witnessed how the very name Vikrant sent waves of fear across Pakistan. Such is its might — a name that shatters the enemy’s courage even before the battle begins. This is the power of INS Vikrant... On… pic.twitter.com/TL03Z9CFdg— ANI (@ANI) October 20, 2025ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత తొలి దీపావళిలో మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. 2014 నుంచి సాయుధ దళాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ..‘దీపావళి వెలుగుల పండగ మన జీవితాలను సౌభాగ్యంతో, సంతోషంతో నింపాలి. సానుకూలత మన చుట్టూ వ్యాపించాలి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.Greetings on the occasion of Diwali. May this festival of lights illuminate our lives with harmony, happiness and prosperity. May the spirit of positivity prevail all around us.— Narendra Modi (@narendramodi) October 20, 2025 -
లోకేశ్ పోస్టులపై భగ్గుమంటున్న కర్ణాటక వాసులు
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి పునర్విభజితమైన కొత్త రాష్ట్రాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మంత్రి లోకేశ్ చేస్తున్న వరుస ట్వీట్లపై కర్ణాటకవాసులు భగ్గుమంటున్నారు. లోకేశ్ ట్వీట్లతో జాతీయస్థాయిలో ఏపీ పరువు పోతుండటంతో పాటు కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారిపై స్థానికుల ఆగ్రహావేశాలకు దారితీస్తున్నాయి. ఇదే విషయాన్ని చాలామంది ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చాలామంది ఏపీ ప్రజలు పని చేసుకుంటున్నారని, పోస్టు చేసేముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎక్స్‌లో ట్వీట్ చేస్తున్నారు. తాజాగా లోకేశ్ పెట్టిన పోస్టుతో కూటమి సర్కారు ఆర్థిక నిర్వహణ తీరును కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా నిలదీశారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడాన్ని కర్ణాటక వాసులు తట్టుకోలేకపోతున్నారంటూ పరోక్షంగా లోకేశ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు జాతీయస్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఏపీ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని, ఇప్పుడు ఇది పెట్టుబడులకు కూడా వ్యాప్తి చెందడంతో పొరుగువారి కడుపులో మంట మొదలైందంటూ లోకేశ్ గురువారం ఎక్స్‌లో చేసిన ఈ వ్యాఖ్యపై కర్ణాటక మంత్రి అంతే ఘాటుగా స్పందించారు.గతంలోనూ ఇదే తీరు బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అనో.. లేక ఏదైనా కంపెనీ కర్ణాటకలో పెట్టుబడులపై ఆలోచిస్తున్నట్లు ఒక చిన్న వార్త వస్తే చాలు వెంటనే లోకేశ్ ఎక్స్‌లో పోస్టులు పెడుతుండటం కర్ణాటక వాసుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది. గతంలో ఇదేవిధంగా ఒకసారి లోకేశ్ పోస్టు చేస్తే ప్రియాంక్ ఖర్గే ఇదేవిధంగా ఘాటుగా స్పందించారు. బలహీనమైన ఎకో సిస్టమ్ ఉన్నవాళ్లు బలమైన వాళ్లపై ఆధారపడి జీవించడం సహజమంటూ పరాన్నజీవిగా అభివర్ణించారు. మీ ఘనత.. ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్ల అప్పులు చేయడం ప్రియాంక్ ఖర్గే ఏం ట్వీట్ చేశారంటే.. ప్రతి ఒక్కరు ఆహారంలో కాస్తాకూస్తో స్పైసీని ఆస్వాదిస్తారని, కానీ ఇది పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన మేరకే పరిమితం చేస్తామన్నారు. ఆర్థికవేత్తలు కూడా బడ్జెట్ నిర్వహణలో సమతుల్యతను పాటిస్తారు. ఏపీ ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్లు అప్పులు తీసుకుందని, రాష్ట్ర జీఎసీడీపీలో అప్పుల వాటా 2.61 శాతం నుంచి 3.61 శాతానికి పెరగడం ద్వారా ఏపీ ఆర్థికవ్యవస్థ దిగజారిపోయిందంటూ పోస్టు చేశారు. -
ఈ తియ్యటి పండుతో షుగర్‌కి చెక్ : తాజా అధ్యయనం
అమ్మో యాపిల్, అమ్మో మామిడి పండా? అమ్మో సీతాఫలమా? మధురమైన అలాంటి పండ్లు మన చేత అమ్మో అనిపిస్తున్నాయి అంటే... నిస్సందేహంగా అది డయాబెటిస్ సమస్య వల్లే అని చెప్పొచ్చు. దాంతో చాలా కాలంగా తియ్యటి పండ్లు అనేవి షుగర్ వ్యాధి ఉన్నవారికి దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా జరుగుతున్న కొన్ని అధ్యయనాలు ఈ ఆలోచనలకు విరుద్ధమైన ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అలాంటిదే ఆ తాజా అధ్యయన ఫలితం. ఇది పండ్లు తినడం వల్ల డయాబెటిస్ తగ్గుతుందని చెప్పడం మరింత విశేషం. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ సహజమైన మధురమైన తీపికి పేరుగాంచిన మామిడి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించవచ్చునట. తాజా పరిశోధనలు దీనిని వెల్లడించాయి. జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో, తక్కువ చక్కెర ఉన్న స్నాక్స్ ఎంచుకున్న వారితో పోలిస్తే, వాటికి బదులుగా రోజూ మామిడి పండ్లు తినే వ్యక్తుల రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపడింది. అంతేకాదు వారు శరీర కొవ్వును సైతం తగ్గించుకుంటారని తేలింది. గత ఆగస్టులో ‘‘డైలీ మ్యాంగో ఇంటెక్ ఇంప్రూవ్స్ గ్లైసెమిక్ అండ్ బాడీ కంపోజిషన్ అవుట్‌కమ్స్ ఇన్ అడల్ట్స్ విత్ ప్రిడియాబెటిస్: ఎ రాండమైజ్డ్ కంట్రోల్డ్ స్టడీ’’ అనే శీర్షికతో ఫుడ్స్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ఫలితాలు, మొత్తం ఆహారాలలో చక్కెర పోషక సందర్భం చక్కెర కంటెంట్ కంటే చాలా కీలక పాత్ర పోషిస్తుందని నొక్కి చెబుతున్నాయి.మామిడి ప్రయోజనాల వెనుక సైన్స్ఈ సందర్భంగా సైన్స్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, జార్జ్ మాసన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ స్టడీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రైదే బసిరి మాట్లాడుతూ ఆహారంలో ఎంత చక్కెర ఉందో దాని గురించి మాత్రమే కాదు, మొత్తం పోషక సమతుల్యత గురించి వివరించారు. ఉదాహరణకు, మామిడి పండ్లు ఒక ప్రత్యేకమైన సమతుల్యతను అందిస్తాయి అవి సహజమైన చక్కెరలను కలిగి ఉన్నప్పటికీ, వీటితో పాటు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అవసరమైన విటమిన్లు ఉంటాయి. ఈ కలయిక నెమ్మదిగా చక్కెర శోషణకు సహాయపడుతుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.అయితే దీనికి విరుద్ధంగా, ప్రాసెస్ చేసిన తృణæధాన్యాలు లేదా ప్యాక్ చేసిన తక్కువ చక్కెర కలిగిన స్నాక్స్ వంటివి ఈ సహజ సమతుల్యతను కలిగి ఉండవు తద్వారా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది సంతృప్తిని ప్రోత్సహిస్తుంది, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతూ అతిగా తినకుండా నిరోధిస్తుంది, ఇది బరువు నిర్వహణకు సహాయపడుతుంది.గ్లైసెమిక్ ఇండెక్స్, సురక్షిత వినియోగ చిట్కాలుమామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ మితమైన పరిధిలోకి వచ్చేలా 51–56 మధ్య స్కోర్ చేస్తుంది, ఇది నారింజ రసంతో పోల్చదగిన పరిధి. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఎడిఎ) చెబుతున్న ప్రకారం, ఇది మామిడి పండ్లను తక్కువ నుంచి మధ్యస్థ వర్గంలో ఉంచుతుంది, ఇది మితమైన వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. చక్కెరలు జోడించకుండా తాజాగా, ఫ్రోజెన్ లేదా సరైన విధంగా నిల్వ చేసిన పండ్లను మాత్రమే ఎంచుకోవాలని ఎడిఎ సూచిస్తోంది. ఒక సాధారణ పండు ద్వారా దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి, ఇది ఒక కప్పు మామిడిలో మూడింట రెండు వంతులకు సమానం. అయితే ఎండిన పండ్ల పరిమాణం తక్కువగా ఉండటం వల్ల అవి చక్కెరలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి, కాబట్టి తాజా పండ్లు ఎండిన రకాల కంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటాయని ఏడిఎ పేర్కొంది.అదనపు ఆరోగ్య ప్రయోజనాలురక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా, మామిడి పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి. 2011లో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం దీన్ని వెల్లడించింది. ఫ్రీజ్–డ్రైడ్ మామిడితో కూడిన ఆహారం ఎలుకలకు తినిపించడం వల్ల లిపిడ్ లేదా ఫెనోఫైబ్రేట్ రోసిగ్లిటాజోన్ వంటి చక్కెర–తగ్గించే మందులతో చికిత్స పొందిన వాటితో పోలిస్తే తక్కువ శరీర కొవ్వు, తగ్గిన కొలెస్ట్రాల్ మెరుగైన గ్లూకోజ్ స్థాయిలు కనిపిస్తాయని గమనించారు. మామిడి వంటి పండ్లను ఒకరి ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజంగా తీపి కోరికలు తీరడమే కాకుండా జీవక్రియ ఆరోగ్యానికి కూడా మద్దతు లభిస్తుందని, ఈ ఉష్ణమండల పండును సమతుల్య జీవనానికి ఆశ్చర్యకరంగా స్మార్ట్ ఎంపికగా మారుస్తుందని పరిశోధన నొక్కి చెబుతుంది.అధిక రక్త చక్కెర సంకేతాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, అధిక రక్త చక్కెర, హైపర్ గ్లసీమియా అని పేర్కొనే ప్రారంభ సంకేతాలు క్రమ క్రమంగా కనిపిస్తాయి అధిక దాహం లేదా ఆకలి, తరచుగా మూత్రవిసర్జన, తలనొప్పి అస్పష్టమైన దృష్టి ఉండవచ్చు. పెరుగుతున్న గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి శరీరం కష్టపడడం వల్లే ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఎక్కువ కాలం పాటు అదుపు చేయకుండా వదిలేస్తే, దీర్ఘకాలిక హైపర్ గ్లసీమియా నిరంతర అలసట, అనూహ్యంగా బరువు తగ్గడం, చర్మ ఇన్ఫెక్షన్లు, త్వరగా నయం కాని కోతలు లేదా పుండ్లు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ హెచ్చరిక సంకేతాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే సకాలంలో జీవనశైలి మార్పులు, వైద్య జోక్యం వల్ల నరాల దెబ్బతినడం వంటి మధుమేహ సంబంధిత తీవ్రమైన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెరను ఎలా అదుపులో ఉంచుకోవాలి?ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి, ఫైబర్, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు పిండి లేని కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. శుద్ధి చేసిన చక్కెరలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీపి పానీయాలను బాగా పరిమితం చేయండి. గ్లూకోజ్‌లో హెచ్చుతగ్గులు తగ్గుదలను నివారించడానికి చిన్న, సాధారణ భోజనం తినండి. చురుకైన నడక లేదా యోగా వంటి రోజువారీ వ్యాయామంతో కనీసం 30 నిమిషాలు చేస్తూ చురుకుగా ఉండండి. ఒత్తిడి హార్మోన్లు రక్తంలో చక్కెరను పెంచుతాయి కాబట్టి ధ్యానం లేదా లోతైన శ్వాస ద్వారా ఒత్తిడిని నియంత్రించండి. తగినంత నిద్ర పొందండి హైడ్రేటెడ్‌గా ఉండండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి చక్కెరను ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడానికి తరచు వైద్య సలహాను అనుసరించండి. -
దీపావళి పండుగ.. ఆ స్థానమేంటో ఇప్పుడు అర్థమైంది.. అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి అనసూయ దీపావళి వైబ్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. పండుగను సెలబ్రేట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఇంట్లో నా సోదరీమణులతో కలిసి ఎంతో ఉత్సాహంగా దీపావళిని జరుకునేదాన్ని అని పోస్ట్ చేసింది. కానీ ఇప్పుడేమే ఒక భార్యగా, తల్లిగా.. నేను అన్నింటినీ చాలా భిన్నంగా చూస్తున్నట్లు అనసూయ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.అనసూయ ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా చిన్నప్పుడు దీపావళి కోసం ఏడాది పొడవునా నా కళ్లు ఎదురు చూసేవి. ఆ రోజుల్లో తెల్లవారుజామునే మంగళారతి.. పాపాజీ ఆశీస్సులు ఇచ్చే ఆ మధురమైన క్షణం.. అలాగే పాకెట్ మనీ.. నేను, నా సోదరీమణులు దాని కోసం ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఎదురు చూసేవాళ్లం. ఇంట్లో తయారుచేసిన స్వీట్ల వాసనతో ఆనందంతో నిండిపోయేది. కొత్త బట్టలు.. రంగురంగుల రంగోలి.. ఇంటిని వెలిగించే దీపాల వరుసలు.. క్రాకర్స్, చిచ్చుబుడ్డీలు, ఉల్లిపాయ బాంబులతో సంతోషంగా జరుపుకునేవాళ్లం. కానీ నేడు.. ఒక భార్యగా, తల్లిగా అన్నింటినీ చాలా భిన్నంగా చూస్తున్నా. అప్పుడు అమ్మ అన్ని చిరునవ్వుల వెనుక కొంచెం ఆందోళన చెందుతున్నట్లు నాకిప్పుడు అర్థమైంది.. ఆమె మా బాల్యంలో కురిపించిన ఆనందం, ప్రేమ, వెలుగు అంతా మేము అస్వాదించామని' పోస్ట్ చేసింది.కానీ ఇప్పుడు నేను అమ్మ స్థానంలో ఉన్న వ్యక్తినని.. అది ఒక అందమైన అనుభవమని గ్రహించానని అనసూయ రాసుకొచ్చింది. ప్రతి ఇంట్లోని మహిళలకు అపారమైన గౌరవం మన పండుగలను జ్ఞాపకాలుగా మార్చిందని వెల్లడించింది. ఈ రోజు.. నేను అలసిపోయినా చాలా సంతృప్తిగా ఉన్నా.. నా చిన్ననాటి దీపావళిని మిస్ అవుతున్నా. కానీ ఏదో ఒక రోజు.. నా పిల్లలు ఈ దీపావళిని తిరిగి చూసుకుని.. నాలాగే అదే రకమైన ఫీలింగ్‌ను అనుభవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ దీపాల కాంతి అందరి జీవితాల్లో చాలా కాలం పాటు నిలిచి ఉండాలని, ప్రేమ, ఆనందంతో నిండిన మీ అందరికీ, మీ ప్రియమైన వారికి సంతోషకరమైన, ప్రకాశవంతమైన, సురక్షితమైన దీపావళి శుభాకాంక్షలు అంటూ అనసూయ విషెస్ తెలిపింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
‘రోడ్డొక నరకం.. చావనివ్వండి’: ప్రధాని మోదీకి గ్రామస్తుల లేఖ
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-48)అధ్వాన్నస్థితికి చేరడం, తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం, దీనికితోడు పరిపాలనా అధికారుల నిర్లక్ష్యానికి విసిగివేసారిన నైగావ్, చించోటి, వాసాయి ప్రాంతాలకు పలువురు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి రోడ్డుపై అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొనేకన్నా.. చావడమే మేలు అంటూ, తమకు చనిపోయేందుకు అనుమతినివ్వాలంటూ వారంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.ఎన్‌హెచ్-48 వెంబడి ఉన్న ససునావ్ఘర్, మల్జిపడ, ససుపడ, బోబత్ పడ,పథర్పడ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఒకప్పుడు ఈ మార్గంలో ఒక గంట ప్రయాణం చేసే సమయం ఇప్పుడు విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఐదు నుంచి ఆరు గంటలకు పెరిగిందని వారు మీడియాకు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జీవించడం కంటే చనిపోవడమే మంచిదని నిరసనలకు నాయకత్వం వహిస్తున్న స్థానిక ఎన్జీఓ కార్యకర్త సుశాంత్ పాటిల్ అన్నారు. ఆయన ప్రధాన మంత్రికి రాసిన లేఖలో.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇతర అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్థానికుల దైనందిన జీవితం అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. ఈ సమస్య గురించి అధికారులకు తెలియజేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని, వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని లేఖలో ఆయన కోరారు.ఎన్‌హెచ్-48 మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటమే కాకుండా, గుంతలతో నిండిన రహదారి మరింత అస్తవ్యస్తంగా మారిందని, దీనికితోడు ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో నరకం కనిపిస్తున్నదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు కారణమైన అధికారులపై చర్య తీసుకునే వరకు గ్రామస్తులు నిరసన కొనసాగిస్తారని పాటిల్ తెలిపారు. థానేలోని గైముఖ్ ఘాట్ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనుల కారణంగా ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ సంబంధితన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటిని స్థానిక అధికారులు విస్మరించారని పాటిల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నిరసనల అనంతరం ఎంబీవీవీ పోలీసు కమిషనర్ నికేత్ కౌశిక్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. చించోటి ట్రాఫిక్ బ్రాంచ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హైవే ట్రాఫిక్ నిర్వహణ విధులను వాసాయి, విరార్ ట్రాఫిక్ బ్రాంచ్‌లకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఆఫ్ఘనిస్తాన్ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది.ఇవాళే మొదలైన (అక్టోబర్ 20) ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలో ఆఫ్ఘనిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే బ్రాడ్ ఈవాన్స్ ఒక్కసారిగా చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. ఈవాన్స్ తన కెరీర్లో రెండో టెస్ట్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే కూడా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులకే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను జియా ఉర్ రెహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ కర్రన్ (2), నిక్ వెల్చ్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి. చదవండి: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత -
35 ఏళ్ల స్నేహబంధం.. మిత్రమా, చూసి ఎన్నాళ్లయిందో!
సాక్షి,హైదరాబాద్: వారిద్దరూ పోలీసులు ఉన్నతాధికారులు. 1990 బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ ఐపీఎస్ అధికారులు. ఎస్వీపీ ఎన్‌పీఏలోనే శిక్షణ పొందారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. కాగా.. ఎన్పీఏ నుంచి బయటకు వచ్చిన ఐదేళ్లకు బ్యాచ్ రీయూనియన్‌లో ఈ ద్వయం కలుసుకున్నారు. ఆపై సమాచార మార్పిడి, ఫోన్ ద్వారా సంభాషణలు జరుగుతున్నా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం వీరికి రాలేదు. అయితే అలాంటి అరుదైన కలయికకు వేదికైంది నగరంలోని శివరాంపల్లిలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీ. (ఎస్వీపీ ఎన్పీఏ)లో శుక్రవారం ఆ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. అదే అకాడెమీలో 35 ఏళ్ల క్రితం శిక్షణ పొందిన ఈ ఇద్దరు అత్యున్నత అధికారులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వీరిలో ఒకరు తెలంగాణ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ), ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ అయితే... రెండో వారు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి. 30 ఏళ్ల తర్వాత.. శిక్షణ నుంచి బయటకు వచి్చన తర్వాత అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్, దల్జీత్ సింగ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్లకు వెళ్లారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. 30 ఏళ్ల తర్వాత శుక్రవారం మళ్లీ ఆ అవకాశం వచి్చంది. ఎస్వీపీ ఎన్పీఏలో జరిగిన 77వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్‌కు దల్జీత్ సింగ్ చౌదరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న అంజనీకుమార్ సైతం ఎస్వీపీ ఎన్‌పీఏకు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఇతర పోలీసు అధికారులకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. -
కొడుకును వెళ్లగొట్టినా.. కోడలికి హక్కుంటది
న్యూఢిల్లీ: కుటుంబ కలహాల కారణంగా తమ ఆస్తిపై కుమారుడికి హక్కు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వారి ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు కోడలికి (కుమారుడి భార్యకు) ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంతో అత్తగారింట్లోకి అడుగుపెట్టి కాపురం ఉన్న కోడలికి ఆ ఇంట్లో నివసించే హక్కును తిరస్కరించటం గృహసింహ చట్టం ప్రకారం సాధ్యం కాదని ఈ నెల 16న జస్టిస్ సంజీవ్నారుల్ స్పష్టంచేశారు. ఆ ఇంట్లో నుంచి కోడలిని వెళ్లగొట్టాలంటే చట్టప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదీ కేసు.. ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం తమ కుమారుడికి 2010లో వివాహం జరిపించింది. అప్పటినుంచి అత్త, మామ, కొడుకు, కోడలు ఒకే ఇంట్లో ఉన్నారు. అయితే, 2011 నుంచి తల్లిదండ్రులతో కుమారుడికి గొడవలు మొదలు కావటంతో కొంతకాలం కొడుకు, కోడలు తమ సొంత ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఆస్తిపై కొడుక్కు ఎలాంటి హక్కులు లేవని తల్లిదండ్రి ప్రకటించారు. ఆ ఆస్తి తమ స్వార్జితమని, దానిపై తమకే పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత కొంతకాలానికి కోడలు తిరిగి అత్తగారింటికి రావాలని నిర్ణయించుకుంది. కానీ, అప్పటికే ఆమె వస్తువులన్నీ ఆ ఇంట్లో నుంచి తీసివేశారు. అయినా, ఆమె ఆంట్లోకి తిరిగి వచ్చింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ అత్తమామ హైకోర్టును ఆశ్రయించారు.తమ కుమారుడినే త్యజించామని, అలాంటప్పుడు కోడలికి తమ ఇంట్లో నివసించే హక్కు లేదని వాదించారు. ఈ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. కోడలిగా అత్తగారింట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆమెకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. అత్తమామలు తన భర్తకు హక్కులు నిరాకరించినా, ఆమె హక్కులను కాదనలేరని తేల్చి చెప్పింది. అత్తమామ ఇంట్లో మొదటి అంతస్తులో, కోడలు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించాలని సూచించింది.గృహసింహ చట్టంలోని సెక్షన్ 17(1) ప్రకారం కుటుంబసభ్యురాలిగా ఉన్న మహిళలకు వారి ఉమ్మడి ఇంట్లో నివసించే అధికారం, హక్కు ఉంటాయని తెలిపింది. సెక్షన్ 17(2) ప్రకారం ఆ మహిళలను ఉమ్మడి ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలంటే కచ్చితంగా చట్టప్రకారమే వెళ్లాలని స్పష్టంచేసింది. కొడుకు కోడలు తమ ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని నాశనం చేశారన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. కొడుకు, కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయినంత మాత్రాన ఉమ్మడి కుటుంబ వాతావరణం చెడిపోయినట్లు కాదని వివరణ ఇచ్చింది.