breaking news
-
రన్‌వేకు అటు పౌర విమానాలు ఇటు ఐఏఎఫ్ జెట్లు!
సాక్షి, హైదరాబాద్: సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రన్‌వే.. దానికి ఓవైపు విమానాశ్రయం.. మరోవైపు భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) స్టేషన్. అంటే పౌర విమానాలు, ఎయిర్‌ఫోర్స్ విమానాలకు కామన్ రన్‌వే అన్నమాట. ఇదీ సమీప భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న ఆదిలాబాద్ విమానాశ్రయ ముఖచిత్రం. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. తొలుత చిన్న విమానాశ్రయాన్నే నిర్మించాలని భావించినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్‌లోనూ భారీ విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఏఏఐ నిర్ణయించింది.ఎయిర్‌బస్ ఏ–320, బోయింగ్–737 రకం విమానాల రాకపోకలకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఆమోదం తెలిపింది. అలాగే రాత్రివేళల్లోనూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు జరిగేలా వసతుల కల్పనకు కూడా సమ్మతించింది. దీంతో రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రాజెక్టులో వరంగల్ విమానాశ్రయ ప్రతిపాదన తర్వాత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రెండో విమానాశ్రయం ఇదే కానుంది. వరంగల్ విమానాశ్రయంతోపాటే దీన్ని కూడా నిర్మించనున్నారు.ఇప్పటికే అన్ని రకాల సర్వేలు ముగిసి టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా తుది సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఏఐ కోరింది. దానికి ఇక్కడి నుంచి సమాధానాలు ఢిల్లీకి చేరాయి. వాటి ఆధారంగా మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది.దాదాపు 650 ఎకరాల్లో నిర్మాణం..ఆదిలాబాద్ పట్టణ శివారులోని శాంతినగర్‌లో నిజాంకాలం నాటి ఎయిర్‌స్ట్రిప్ ఉంది. అక్కడకు కేవలం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు మాత్రమే అడపాదడపా వస్తుంటాయి. వీఐపీలు వచ్చినప్పుడు అక్కడి హెలిపాడ్‌ను వాడుతుంటారు. ఈ హెలిపోర్టును ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌గా మార్చుకోవాలని చాలాకాలంగా ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది. తొలి నుంచీ హెలిపోర్టుకు చెందిన 369 ఎకరాల స్థలం దాని అధీనంలోనే ఉంది.అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం కోసం ప్రతిపాదించగా అందుకు ఐఏఎఫ్ సమ్మతించి ఉమ్మడి అవసరాలకు వాడుకునేలా దాన్ని నిర్మించేందుకు అంగీకరిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 250–300 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు.తాజాగా అన్ని అడ్డంకులు తీరిపోవడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే 30 ఏళ్ల అవసరాలు తీర్చేలా ఇక్కడ నైట్ ల్యాండింగ్‌తో కూడిన పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న ఏఏఐ తాజాగా ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌బస్–380, బోయింగ్–777 విమానాలు (అతిపెద్ద విమానాలు) దిగే సామర్థ్యంతో కూడిన రన్‌వే అవసరమా లేక ఎయిర్‌బస్–ఏ320, బోయింగ్–737 రకం విమానాలు దిగే సామర్థ్యంతో కూడిన రన్‌వే కావాలా అని ప్రశ్నించింది.ఎయిర్‌బస్–ఏ320, బోయింగ్–737 స్థాయి విమానాలు దిగే రన్‌వే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో 2.8 కి.మీ. నుంచి 3 కి.మీ. పొడవైన రన్‌వే నిర్మాణానికి నిర్ణయించారు. దానికి ఓవైపు ప్రయాణికుల విమానాలు నిలిచే స్థలం, ప్రయాణికుల ప్రాంగణం మరోవైపు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నిర్మించనున్నారు. సాధారణ ప్రయాణికులు, పౌర విమానాలు రెండో వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయనున్నారు. వాయుసేనకు దాదాపు 50–80 ఎకరాల స్థలం కేటాయించి మిగతా మొత్తాన్ని ప్రయాణికుల విమానాశ్రయానికి వినియోగించనున్నారు. -
‘రోడ్డొక నరకం.. చావనివ్వండి’: ప్రధాని మోదీకి గ్రామస్తుల లేఖ
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-48)అధ్వాన్నస్థితికి చేరడం, తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం, దీనికితోడు పరిపాలనా అధికారుల నిర్లక్ష్యానికి విసిగివేసారిన నైగావ్, చించోటి, వాసాయి ప్రాంతాలకు పలువురు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి రోడ్డుపై అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొనేకన్నా.. చావడమే మేలు అంటూ, తమకు చనిపోయేందుకు అనుమతినివ్వాలంటూ వారంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.ఎన్‌హెచ్-48 వెంబడి ఉన్న ససునావ్ఘర్, మల్జిపడ, ససుపడ, బోబత్ పడ,పథర్పడ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఒకప్పుడు ఈ మార్గంలో ఒక గంట ప్రయాణం చేసే సమయం ఇప్పుడు విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఐదు నుంచి ఆరు గంటలకు పెరిగిందని వారు మీడియాకు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జీవించడం కంటే చనిపోవడమే మంచిదని నిరసనలకు నాయకత్వం వహిస్తున్న స్థానిక ఎన్జీఓ కార్యకర్త సుశాంత్ పాటిల్ అన్నారు. ఆయన ప్రధాన మంత్రికి రాసిన లేఖలో.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇతర అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్థానికుల దైనందిన జీవితం అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. ఈ సమస్య గురించి అధికారులకు తెలియజేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని, వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని లేఖలో ఆయన కోరారు.ఎన్‌హెచ్-48 మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటమే కాకుండా, గుంతలతో నిండిన రహదారి మరింత అస్తవ్యస్తంగా మారిందని, దీనికితోడు ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో నరకం కనిపిస్తున్నదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు కారణమైన అధికారులపై చర్య తీసుకునే వరకు గ్రామస్తులు నిరసన కొనసాగిస్తారని పాటిల్ తెలిపారు. థానేలోని గైముఖ్ ఘాట్ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనుల కారణంగా ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ సంబంధితన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటిని స్థానిక అధికారులు విస్మరించారని పాటిల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నిరసనల అనంతరం ఎంబీవీవీ పోలీసు కమిషనర్ నికేత్ కౌశిక్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. చించోటి ట్రాఫిక్ బ్రాంచ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హైవే ట్రాఫిక్ నిర్వహణ విధులను వాసాయి, విరార్ ట్రాఫిక్ బ్రాంచ్‌లకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. -
చౌటుప్పల్‌లో చెడ్డీగ్యాంగ్!
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో చెడ్డీగ్యాంగ్ హల్చల్ చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో గల అంజనసాయి మెడోస్ వెంచర్లోకి చొరబడ్డారు. తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. చేతిలో మారణాయుధాలతో ముగ్గురు దొంగలు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్నకొండూర్ గ్రామానికి చెందిన డొప్ప నరేష్ సెంట్రింగ్ పని చేస్తుంటాడు. అంజనసాయి మెడోస్ వెంచర్‌లోని కృష్ణవేణి హైస్కూల్ వెనుక వైపున ఉన్న చీకూరి శ్రీనివాస్ ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోని బంధువుల నివాసంలో జరిగిన ఫంక్షన్ కోసం ఈనెల 16న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. శుక్రవారం తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించాడు. ఆందోళనకు గురై వెంటనే బీరువా తెరిచి చూడగా.. 8గ్రాముల బంగారం, 8.5తులాల వెండితోపాటుగా నగదు కన్పించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడకు చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించారు. చెడ్డీగ్యాంగ్ పనేనని అనుమానం ముగ్గురు సభ్యులు గల బృందం ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ముగ్గురు దొంగలు ముసుగులు ధరించారు. అందులో ఒక వ్యక్తి డ్రాయర్ మాత్రమే ధరించి, ఒంటికి నూనె రాసుకుని ఉన్నాడు. మరో ఇద్దరు వ్యక్తులు చేతుల్లో మారణాయుధాలు పట్టుకున్నారు. అయితే దొంగతనానికి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనా లేక స్థానికంగా ఉండే దొంగలే ముసుగులు ధరించి హల్చల్ చేశారా అని తెలియాల్సి ఉంది. బాధితుడు డొప్ప నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చౌటుప్పల్‌లోని అంజనసాయి మెడోస్ వెంచర్లో ఘటన -
ఆఫ్ఘనిస్తాన్ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది.ఇవాళే మొదలైన (అక్టోబర్ 20) ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలో ఆఫ్ఘనిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే బ్రాడ్ ఈవాన్స్ ఒక్కసారిగా చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. ఈవాన్స్ తన కెరీర్లో రెండో టెస్ట్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే కూడా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులకే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను జియా ఉర్ రెహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ కర్రన్ (2), నిక్ వెల్చ్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి. చదవండి: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత -
దుల్కర్ సల్మాన్ థ్రిల్లర్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
గతేడాది లక్కీ భాస్కర్‌తో సూపర్ హిట్ కొట్టిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన హీరోగా నటించిన కాంత మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. దీపావళి సందర్భంగా కాంత రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకు దుల్కర్‌తో పాటు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. 1950ల్లో మద్రాసులో జరిగే పీరియాడికల్ హర్రర్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఈ కథ ఒక ప్రముఖ చిత్రనిర్మాత రహస్య జీవితం చుట్టే తిరుగుతుంది. ఇటీవల వచ్చిన కొత్త లోకా సూపర్ హిట్ కావడంతోనే కాంతను వాయిదా వేశారు. వచ్చేనెలలో విడుదల చేయనున్నారు. Diwali just got a whole lot more explosive!💥#Kaantha will be lighting up theatres worldwide from NOVEMBER 14th!⚡Wishing you all a happy Diwali and we’ll see you in the theatres very soon.✨❤A @SpiritMediaIN and @DQsWayfarerFilm production 🎬#Kaantha #DulquerSalmaan… pic.twitter.com/dJqhbA5uev— Rana Daggubati (@RanaDaggubati) October 20, 2025 -
INS విక్రాంత్‌లో మోదీ దీపావళి వేడుకలు.. పాకిస్తాన్‌కు కౌంటర్
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొని సైనికులతో సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటు కూడా మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐఎన్ఎస్ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది. సైనికులే భారత్ బలం. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు, దీపావళికి వెలిగించే దీపాల లాంటివి. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది. పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయి.#WATCH | Prime Minister Narendra Modi says, "The night spent yesterday on INS Vikrant is hard to put into words. I saw the immense energy and enthusiasm you all were filled with. When I saw you singing patriotic songs yesterday, and the way you described Operation Sindoor in your… pic.twitter.com/UrGF2gngn6— ANI (@ANI) October 20, 2025ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాకు ప్రతీక. ఆపరేషన్ సిందూర్ సమయంలో పరాక్రమం చూపించిన త్రివిధ దళాలకు సెల్యూట్. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే శత్రువులకు నిద్ర కూడా పట్టదు. ఐఎన్ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక. బ్రహ్మోస్, ఆకాశ్ మిస్కైల్ తమ సత్తా ఏంటో చూపించాయి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరం’ అని చెప్పుకొచ్చారు.#WATCH | Prime Minister Narendra Modi says, "... Just a few months ago, we witnessed how the very name Vikrant sent waves of fear across Pakistan. Such is its might — a name that shatters the enemy’s courage even before the battle begins. This is the power of INS Vikrant... On… pic.twitter.com/TL03Z9CFdg— ANI (@ANI) October 20, 2025ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత తొలి దీపావళిలో మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. 2014 నుంచి సాయుధ దళాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ..‘దీపావళి వెలుగుల పండగ మన జీవితాలను సౌభాగ్యంతో, సంతోషంతో నింపాలి. సానుకూలత మన చుట్టూ వ్యాపించాలి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.Greetings on the occasion of Diwali. May this festival of lights illuminate our lives with harmony, happiness and prosperity. May the spirit of positivity prevail all around us.— Narendra Modi (@narendramodi) October 20, 2025 -
సాల్ట్, బ్రూక్ విధ్వంసం.. రషీద్ మాయాజాలం.. ఇంగ్లండ్ ఘన విజయం
మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 20) రెండో టీ20 జరిగింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో (New Zealand vs England) పర్యాటక జట్టు 65 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. మూడో టీ20 ఆక్లాండ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది. అనంతరం 26, 29, నవంబర్ 1 తేదీల్లో మౌంట్ మౌంగనూయ్, హ్యామిల్టన్, వెల్లింగ్టన్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.సాల్ట్, బ్రూక్ విధ్వంసంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (Phil Salt) (56 బంతుల్లో 85; 11 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) (35 బంతుల్లో 78; 5 సిక్సర్లు, 6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు.జేకబ్ బేతెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ బాంటన్ (12 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోస్ బట్లర్ (4) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 2, డఫీ, బ్రేస్‌వెల్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేసిన స్కోర్ టీ20ల్లో న్యూజిలాండ్‌పై రెండో అత్యధికం. రషీద్ మాయాజాలం237 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఓటమి ఖరారయ్యాక కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (36) బ్యాట్ ఝులిపించాడు. టిమ్ సీఫర్ట్ (39), చాప్మన్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆదిల్ రషీద్ (Adil Rashid) (4-0-32-4) తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. అతనికి లూక్ వుడ్ (4-0-36-2), బ్రైడన్ కార్స్ (3-0-27-2), లియామ్ డాసన్ (4-0-38-2) సహకరించారు. వీరి ధాటికి న్యూజిలాండ్ 18 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 10 మంది ఆటగాళ్లు క్యాచ్ ఔట్ల రూపంలో ఔటయ్యారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇలా జరగడం కేవలం 13వ సారి మాత్రమే.చదవండి: ఆల్ ఫార్మాట్ గ్రేట్‌గా ఎదుగుతాడు: నితీశ్ రెడ్డిపై రోహిత్ శర్మ ప్రశంసలు -
బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన విష్ణు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.అయితే, సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న కూడా మాగంటి సునీత మరోసారి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల స్క్రూటినీలో ఏదైనా తేడా వస్తే విష్ణు బరిలో ఉంటారని తెలుస్తోంది. -
కొడుకును వెళ్లగొట్టినా.. కోడలికి హక్కుంటది
న్యూఢిల్లీ: కుటుంబ కలహాల కారణంగా తమ ఆస్తిపై కుమారుడికి హక్కు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వారి ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు కోడలికి (కుమారుడి భార్యకు) ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంతో అత్తగారింట్లోకి అడుగుపెట్టి కాపురం ఉన్న కోడలికి ఆ ఇంట్లో నివసించే హక్కును తిరస్కరించటం గృహసింహ చట్టం ప్రకారం సాధ్యం కాదని ఈ నెల 16న జస్టిస్ సంజీవ్నారుల్ స్పష్టంచేశారు. ఆ ఇంట్లో నుంచి కోడలిని వెళ్లగొట్టాలంటే చట్టప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదీ కేసు.. ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం తమ కుమారుడికి 2010లో వివాహం జరిపించింది. అప్పటినుంచి అత్త, మామ, కొడుకు, కోడలు ఒకే ఇంట్లో ఉన్నారు. అయితే, 2011 నుంచి తల్లిదండ్రులతో కుమారుడికి గొడవలు మొదలు కావటంతో కొంతకాలం కొడుకు, కోడలు తమ సొంత ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఆస్తిపై కొడుక్కు ఎలాంటి హక్కులు లేవని తల్లిదండ్రి ప్రకటించారు. ఆ ఆస్తి తమ స్వార్జితమని, దానిపై తమకే పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత కొంతకాలానికి కోడలు తిరిగి అత్తగారింటికి రావాలని నిర్ణయించుకుంది. కానీ, అప్పటికే ఆమె వస్తువులన్నీ ఆ ఇంట్లో నుంచి తీసివేశారు. అయినా, ఆమె ఆంట్లోకి తిరిగి వచ్చింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ అత్తమామ హైకోర్టును ఆశ్రయించారు.తమ కుమారుడినే త్యజించామని, అలాంటప్పుడు కోడలికి తమ ఇంట్లో నివసించే హక్కు లేదని వాదించారు. ఈ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. కోడలిగా అత్తగారింట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆమెకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. అత్తమామలు తన భర్తకు హక్కులు నిరాకరించినా, ఆమె హక్కులను కాదనలేరని తేల్చి చెప్పింది. అత్తమామ ఇంట్లో మొదటి అంతస్తులో, కోడలు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించాలని సూచించింది.గృహసింహ చట్టంలోని సెక్షన్ 17(1) ప్రకారం కుటుంబసభ్యురాలిగా ఉన్న మహిళలకు వారి ఉమ్మడి ఇంట్లో నివసించే అధికారం, హక్కు ఉంటాయని తెలిపింది. సెక్షన్ 17(2) ప్రకారం ఆ మహిళలను ఉమ్మడి ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలంటే కచ్చితంగా చట్టప్రకారమే వెళ్లాలని స్పష్టంచేసింది. కొడుకు కోడలు తమ ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని నాశనం చేశారన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. కొడుకు, కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయినంత మాత్రాన ఉమ్మడి కుటుంబ వాతావరణం చెడిపోయినట్లు కాదని వివరణ ఇచ్చింది. -
ట్రంప్ రాజు కాదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జనం తిరుగుబాటు ప్రారంభించారు. ‘నో కింగ్స్’ పేరిట శనివారం దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ట్రంప్ రాజు కాదని, ఇక్కడ రాజులెవరూ లేరని, నిరంకుశ పరిపాలన ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దేశాన్ని నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. నియంతృత్వ పరిపాలనను ప్రతిఘటించడం, నిరసన తెలపడమే అసలైన దేశభక్తి అని ప్రజలు తేల్చిచెప్పారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్తోపాటు బోస్టన్, అట్లాంటా, షికాగో తదితర నగరాల్లో నిరసనకారులు కదం తొక్కారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్ సహా వివిధ నగరాల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. గాలితో నింపిన దుస్తుల్లాంటివి ధరించారు. అమెరికా రాజ్యాంగ ప్రవేశికను ముద్రించిన బ్యానర్లపై సంతకాలు చేశారు. తాము ముమ్మాటికీ అసలైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. నియంతగా మారుతున్న ట్రంప్ నిరసన ప్రదర్శనలపై అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అవన్నీ ‘అమెరికాను ద్వేషించే’ ర్యాలీలు అంటూ ఆరోపించింది. ట్రంప్ మద్దతుదారులు సైతం ఈ ర్యాలీలను తప్పుపట్టారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా జనం సామూహికంగా నిరసన తెలపడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కొన్నిరోజుల క్రితం అమెరికాలో షట్టౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సేవలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రంప్ నిర్వాకం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని వారు మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుపట్టారు. నిరంకుశ అధికారం చెల్లబోదని తేల్చిచెప్పారు. ట్రంప్ విధానాలు తమకు ఎంతమాత్రం నచ్చడం లేదని ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికురాలు షాన్ హోవార్డ్ చెప్పారు. తాను గతంలో ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ముందుకెళ్తోందని, వలసదారులను అక్రమంగా నిర్బంధించడం ఏమిటని మండిపడ్డారు. ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహరించడం సరైంది కాదన్నారు. ఇదంతా ‘అన్–అమెరికన్’ అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ నియంతగా మారిపోతున్నారని మరో నిరసనకారుడు ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, నిరసన కార్యక్రమాల విషయంలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలియజేశారు. జెట్ విమానంలో ‘కింగ్ ట్రంప్’ తనకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ‘నో కింగ్స్’ నినాదాన్ని హేళన చేస్తూ కింగ్ ట్రంప్ పేరిట ఒక కృత్రిమ మేధ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో కిరీటం ధరించిన ట్రంప్ జెట్ విమానంలో కూర్చొని దూసుకెళ్తున్నారు. బాంబుల తరహాలో ఈ విమానం బురదను చిమ్ముతోంది. ఆ బురదంతా అమెరికాలో నగరాల్లోని నిరసనకారులను కమ్మేస్తోంది. ట్రంప్ తనను తాను బలమైన రాజుగా పరోక్షంగా ప్రకటించుకున్నారు. నిరసన ర్యాలీలను లెక్కచేయబోనని, బురదతో సన్మానిస్తానని సంకేతాలు పంపించారు.