INS విక్రాంత్‌లో మోదీ దీపావళి వేడుకలు.. పాకిస్తాన్‌కు కౌంటర్‌ | PM Modi Wishes Nation On Diwali, Ayodhya Sets World Record With 26 Lakh Lamps, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

INS విక్రాంత్‌లో మోదీ దీపావళి వేడుకలు.. పాకిస్తాన్‌కు కౌంటర్‌

Oct 20 2025 11:11 AM | Updated on Oct 20 2025 11:47 AM

PM Modi Greetings on the occasion of Diwali

సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.గోవా సముద్ర తీరంలోని ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొని సైనికులతో సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటు కూడా మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోదీ గోవాలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను సందర్శించారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది. సైనికులే భారత్‌ బలం. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఉంది. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు, దీపావళికి వెలిగించే దీపాల లాంటివి. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది. పాక్‌ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయి.

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియాకు ప్రతీక. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పరాక్రమం చూపించిన త్రివిధ దళాలకు సెల్యూట్‌. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పేరు వింటే శత్రువులకు నిద్ర కూడా పట్టదు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక. బ్రహ్మోస్‌, ఆకాశ్‌ మిస్కైల్‌ తమ సత్తా ఏంటో చూపించాయి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరం’  అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సింధూర్‌ విజయం తర్వాత తొలి దీపావళిలో మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. 2014 నుంచి సాయుధ దళాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోదీ..‘దీపావళి వెలుగుల పండగ మన జీవితాలను సౌభాగ్యంతో, సంతోషంతో నింపాలి. సానుకూలత మన చుట్టూ వ్యాపించాలి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement