breaking news
-
ఐడియా అదిరింది.. డబ్బు మిగిలింది!
కలిసివుంటే కలదు అంటుంటారు మన పెద్దలు. దీనికి చాలా ఉదాహరణలు కూడా చెబుతారు. కలిసివుంటే డబ్బు కూడా ఆదా చేయొచ్చు అంటున్నారు గుజరాతీలు. వ్యాపార నిర్వహణ, డబ్బు సంపాదనలో గుజరాతీల ప్రావీణ్యం గురించి ప్రపంచమంతా తెలుసు. ఎక్కడికి వెళ్లినా ఇట్టే కలిసిపోయేతత్వం వారి సొంతం. వర్తకాన్ని ఒడుపుగా నిర్వహించడం, బలమైన సమాజ సంబంధాలతో ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నెగ్గుకొస్తుంటారు. అంతేకాదు తమవారికి దన్నుగా నిలిచి పైకి తీసుకురావడంలో వారికి వారే సాటి. తాజాగా గుజరాత్‌లోని జైన్ సామాజికవర్గం (Jain Community) ఓ ఆసక్తికర విషయంతో వార్తల్లో నిలిచింది.మనం మాంచి కాస్ట్లీ కారు కొనాలంటే ఏం చేస్తాం? దగ్గరలోని కార్ల షోరూంకు (Car Showroom) వెళ్లి మోడల్ సెలెక్ట్ చేసుకుని, రేటు మాట్లాడుకుంటాం. ఓ మంచి ముహూర్తం చూసుకుని కారును ఇంటికి తెచ్చుకుంటాం. గుజరాత్‌లోని జైన్ కమ్యునిటీ వాళ్లు మనలా చేయలేదు. దేశవ్యాప్తంగా ఉన్న తమవాళ్లలో ఎవరెవరు ఖరీదైన కొనాలనుకుంటున్నారో ముందుగా వాకబు చేశారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) ఇలాంటి వారి వివరాలను సేకరించింది. ఎవరెవరికి ఏయే మోడల్ కారు కావాలో తెలుసుకుంది. మొత్తం 186 కొత్త కార్లు లెక్కకువచ్చాయి. ఇందులో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ సహా 15 రకాల టాప్ బ్రాండ్స్ ఉన్నాయి.ఒకేసారి 186 కార్లను కొనుగోలు చేసేందుకు JITO నేరుగా రంగంలోకి దిగింది. ఆయా కార్ల కంపెనీలకు చెందిన డీలర్లతో బేరసారాలు సాగించింది. ఒకేసారి ఎక్కువ కార్లు అమ్ముడవుతుండడంతో విక్రేతలు కూడా మార్కెట్ ధర కంటే తక్కువకు ఇచ్చేందుకు మొగ్గుచూపారు. JITO బేరసారాలతో తమ సభ్యులకు రూ. 21.22 కోట్ల డిస్కౌంట్ లభించింది. రూ. 149.54 కోట్ల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం, వాటన్నింటినీ దేశవ్యాప్తంగా ఒకేరోజు డెలివరీ చేయడం వరకు అంతా పక్కాగా జరిగింది. తామంతా ఐకమత్యంగా ఉండడం వల్లే ఇలాంటివి చేయగలుతున్నామని JITO అపెక్స్ వైస్-చైర్మన్ హిమాన్షు షా తెలిపారు.అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నజైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో దేశవ్యాప్తంగా 65 వేల మంది సభ్యులు ఉన్నారు. సామూహిక కొనుగోలుతో భారీగా లబ్ధిపొందిన JITO తమ సభ్యుల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దేశమంతా తమ సభ్యుల అవసరాలు తెలుసుకుని వారికి కావాల్సిన వాటిని టోకుగా కొని ప్రయోజనం పొందెలా ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆభరణాలు, ఇతర వస్తువుల సామూహిక కొనుగోలుకు రెడీ అవుతోంది.121 జేసీబీలు.. రూ. 4 కోట్లు ఆదాజైన్ కమ్యునిటీ మాత్రమే కాదు భర్వాడ్ సామాజికవర్గం (Bharwad Community) కూడా ఇదేవిధంగా తమ సభ్యులకు ప్రయోజనం చేకూర్చింది. తమ కమ్యునిటీలోని యువత ఉపాధి కోసం గుజరాత్‌లోని భర్వాద్ యువ సంఘటన్ ఇటీవల 121 జేసీబీ యంత్రాల కొనుగోలుకు ముందుకు వచ్చింది. ఆయా వ్యాపార సంస్థలతో బేరాలు సాగించి ఒక్కొ యూనిట్‌కు రూ. 3.3 లక్షల తగ్గింపు పొంది రూ. 4 కోట్లు ఆదా చేసింది. యువత తమ కాళ్లపై తాము నిలబడటానికి తోడ్పాటు అందిస్తున్నామని భర్వాద్ యువ సంఘటన్ అధ్యక్షుడు దిలీప్ భర్వాద్ చెప్పారు. తాము ష్యూరిటీ ఇవ్వడంతో బలమైన క్రెడిట్ స్కోర్లు లేని వారు కూడా పాన్, ఆధార్ ధృవీకరణ ఆధారంగా జీరో డౌన్ పేమెంట్‌తో JCBలను పొందారని వెల్లడించారు.చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్చూశారుగా కలిసి కొంటే ఎంత లాభమో.. అవి లగ్జరీ కార్లు (luxury cars) అయినా, భారీ యంత్రాలు అయినా. సామూహిక కొనుగోలు శక్తితో ఇన్ని ప్రయోజనాలుంటాయని గుజరాత్ కమ్యునిటీలు నిరూపిస్తున్నాయి. సో.. కలిసివుంటే సుఖపడటమే కాదు.. డబ్బు కూడా ఆదా చేయొచ్చు! -
ఎవరీ పుష్పం ప్రియా చౌదరి..? రాజకీయాల్లో సరికొత్త ఫైర్ బ్రాండ్లా..
విదేశీ విద్య నేపథ్యంతో రాజకీయాల్లో సరికొత్త బ్రాండ్లా ప్రభంజనం సృష్టించాలనుకుంటోంది. మత, కులాలకు అతితంగా ఫైర్‌బ్రాండ్ పాలిటిక్స్‌తో దూసుకుపోవాలనుకుంటోంది. అంతేగాదు బిహార్ రాష్ట్రానికి సరికొత్త పాలిటిక్స్‌ని పరించయం చేస్తూ..నాయకురాలిగా పెనుమార్పుకి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. ఆమె పొలిటికల్ వ్యూహం, డ్రెస్సింగ్ విధానం రాజకీయనాయకుల వేషధారణ, ఆలోచనలకే అత్యంత విరుద్ధం. గెలుస్తుందో లేదో తెలియదు గానీ..ఆమె ఆహార్యం నుంచి..రాజకీయ వ్యూహాల వరకు ప్రతీది అత్యంత విభిన్నం. యువ రాజకీయ నాయకురాలికి సీఎం రేసులో గెలిస్తే..సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడమే కాదు..పాలిటిక్స్‌లో యువ సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ ఎవరామె..? రాజకీయాల్లో ఎలాంటి బ్రాండ్ సెట్ చేయాలనుకుంటుంది అంటే..ఆ అమ్మాయే యునైటెడ్ కింగ్డమ్ నుండి తిరిగి వచ్చిన పుష్పం ప్రియా చౌదరి. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలనేది ఆమె ప్రగాఢ ఆకాంక్ష. 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించిన పుష్పం ప్రియా చౌదరి కుల, మతాలకు అతీతంగా సరికొత్త బ్రాండ్ రాజకీయాలను బిహార్ రాష్ట్రానికి పరిచయం చేయాలనుకుంటోంది. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి..సరికొత్త నారీశక్తిగా ఓ వెలుగు వెలగాలనే ఉత్సాహంతో ఉంది. ఆమె బిహార్‌లోని దర్భంగా నుంచి పోటీ చేస్తోంది. ప్రియా 2020లో తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా మెగా అడ్వర్టైస్మెంట్ ఇచ్చి మరీ..రాజకీయల్లోకి ప్రవేశించింది. అయితే ఆమె గెలుపుని అందుకునేంత వరకు నలుపు దుస్తులు, బ్లాక్మాస్క్లోనే ఉండాలని ప్రతిజ్ఞ చేయడం విశేషం. కుటుంబ నేపథ్యం..పుష్పం ప్రియ దర్భంగాకు చెందిన మాజీ జెడీయూ శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ నుంచి గెలిచిన జేడీయూ నాయకుడు. జూన్ 13, 1987న జన్మించిన పుష్పం ప్రియ దర్బంగాలోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆ తర్వాత యూకేలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2019లో సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్మెంట్ రీసెర్చ్‌లో మాస్టర్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తించేసిందామె. అతేగాదు తన పార్టీ పేరు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని చెబుతోందామె. ది ప్లూరల్స్ పార్టీ అనగా అన్ని కులాల, మతాల ప్రజలు కలిసి పాలించడం అని సరికొత్త అర్థం వివరించింది. ఇంతవరకు ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పదాలను ఉచ్ఛరించిలేకపోయారు. మరి ఈ పదం వారికి ఎలా అలవాటవుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రంగు దుస్తులే ఎందుకంటే..రాజకీయ నాయకులు అనగానే తెల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారనేది తనకు అస్సలు తెలియదని అంటోంది. అయతే తాను మాత్రం నలుపు రంగు దుస్తులనే ధరిస్తానని, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే వరకు ఇలా నల్లటి దుస్తులు, ముసుగుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయినా అందరి రాజకీయ నాయకులలా కాదని, తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని అంటోంది. కాగా, ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ..అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ కంటూ తీవ్రమైన నాయకుడని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు బిహార్‌ని పాలించిన వారి జాబితాలో అత్యత్తుమ ముఖ్యమంతిగా పేర్కొనడం విశేషం. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యహకర్తగానే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించకూడదంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.(చదవండి: ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..) -
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ దొరికాడు
సాక్షి.హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య కేసు నిందితుడు దొరికినట్లు నిజామాబాద్ సీపీ చైతన్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిందితుడు రియాజ్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. అందులో..‘నిజామాబాద్ టౌన్ 6 పోలిస్‌స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో ఆసిఫ్,రియాజ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు రియాజ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం,అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు’ పేర్కొన్నారు. -
రన్‌వేకు అటు పౌర విమానాలు ఇటు ఐఏఎఫ్ జెట్లు!
సాక్షి, హైదరాబాద్: సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రన్‌వే.. దానికి ఓవైపు విమానాశ్రయం.. మరోవైపు భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) స్టేషన్. అంటే పౌర విమానాలు, ఎయిర్‌ఫోర్స్ విమానాలకు కామన్ రన్‌వే అన్నమాట. ఇదీ సమీప భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న ఆదిలాబాద్ విమానాశ్రయ ముఖచిత్రం. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. తొలుత చిన్న విమానాశ్రయాన్నే నిర్మించాలని భావించినా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్‌లోనూ భారీ విమానాశ్రయాన్నే నిర్మించాలని తాజాగా ఏఏఐ నిర్ణయించింది.ఎయిర్‌బస్ ఏ–320, బోయింగ్–737 రకం విమానాల రాకపోకలకు వీలుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఆమోదం తెలిపింది. అలాగే రాత్రివేళల్లోనూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు జరిగేలా వసతుల కల్పనకు కూడా సమ్మతించింది. దీంతో రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణ ప్రాజెక్టులో వరంగల్ విమానాశ్రయ ప్రతిపాదన తర్వాత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రెండో విమానాశ్రయం ఇదే కానుంది. వరంగల్ విమానాశ్రయంతోపాటే దీన్ని కూడా నిర్మించనున్నారు.ఇప్పటికే అన్ని రకాల సర్వేలు ముగిసి టెండర్లు పిలిచేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా తుది సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఏఐ కోరింది. దానికి ఇక్కడి నుంచి సమాధానాలు ఢిల్లీకి చేరాయి. వాటి ఆధారంగా మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది.దాదాపు 650 ఎకరాల్లో నిర్మాణం..ఆదిలాబాద్ పట్టణ శివారులోని శాంతినగర్‌లో నిజాంకాలం నాటి ఎయిర్‌స్ట్రిప్ ఉంది. అక్కడకు కేవలం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు మాత్రమే అడపాదడపా వస్తుంటాయి. వీఐపీలు వచ్చినప్పుడు అక్కడి హెలిపాడ్‌ను వాడుతుంటారు. ఈ హెలిపోర్టును ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌గా మార్చుకోవాలని చాలాకాలంగా ఐఏఎఫ్ ప్రయత్నిస్తోంది. తొలి నుంచీ హెలిపోర్టుకు చెందిన 369 ఎకరాల స్థలం దాని అధీనంలోనే ఉంది.అక్కడ రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం కోసం ప్రతిపాదించగా అందుకు ఐఏఎఫ్ సమ్మతించి ఉమ్మడి అవసరాలకు వాడుకునేలా దాన్ని నిర్మించేందుకు అంగీకరిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 250–300 ఎకరాల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు.తాజాగా అన్ని అడ్డంకులు తీరిపోవడంతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే 30 ఏళ్ల అవసరాలు తీర్చేలా ఇక్కడ నైట్ ల్యాండింగ్‌తో కూడిన పెద్ద విమానాశ్రయాన్నే నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న ఏఏఐ తాజాగా ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌బస్–380, బోయింగ్–777 విమానాలు (అతిపెద్ద విమానాలు) దిగే సామర్థ్యంతో కూడిన రన్‌వే అవసరమా లేక ఎయిర్‌బస్–ఏ320, బోయింగ్–737 రకం విమానాలు దిగే సామర్థ్యంతో కూడిన రన్‌వే కావాలా అని ప్రశ్నించింది.ఎయిర్‌బస్–ఏ320, బోయింగ్–737 స్థాయి విమానాలు దిగే రన్‌వే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో 2.8 కి.మీ. నుంచి 3 కి.మీ. పొడవైన రన్‌వే నిర్మాణానికి నిర్ణయించారు. దానికి ఓవైపు ప్రయాణికుల విమానాలు నిలిచే స్థలం, ప్రయాణికుల ప్రాంగణం మరోవైపు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నిర్మించనున్నారు. సాధారణ ప్రయాణికులు, పౌర విమానాలు రెండో వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయనున్నారు. వాయుసేనకు దాదాపు 50–80 ఎకరాల స్థలం కేటాయించి మిగతా మొత్తాన్ని ప్రయాణికుల విమానాశ్రయానికి వినియోగించనున్నారు. -
హమ్మయ్య! నోబెల్‌ని మర్చపోయారు!
-
చెత్త షాట్ ఆడి ఔట్.. కట్ చేస్తే! పాప్ కార్న్ తింటూ రిలాక్స్(వీడియో)
టీమిండియా టెస్టు కెప్టెన్సీని అద్బుతమైన సెంచరీతో ఆరంభించిన శుభ్‌మన్ గిల్.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. భారత వన్డే సారథిగా తొలి మ్యాచ్‌లో గిల్ విఫలమయ్యాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఔటైన సమయంలో బాధ్యతయతంగా ఆడాల్సిన గిల్.. పేలవ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. భారత ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన నాథన్ ఈల్లీస్.. తొలి బంతిని గిల్‌కు లైగ్ సైడ్ డెలివరీగా సంధించాడు. బౌలర్ ట్రాప్‌లో పడ్డ గిల్ ఆ డెలివరీని డౌన్‌ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో వికెట్ కీపర్ ఫిలిప్ తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే గిల్ ఔటయ్యాక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన గిల్.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పాప్ కార్న్ తింటూ రిలాక్స్‌గా కన్పించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొంచెం బాధ లేకుండా పాప్ కార్న్ తింటూ రిలాక్స్ అవుతున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదించారు. ఇంకా 17 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లి(0), శ్రేయస్ అయ్యర్(11) తీవ్ర నిరాశపరిచారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు😭😭 #RohitSharma𓃵 #ShubmanGillpic.twitter.com/DCNj5q3Spu— 𝓗𝓲𝓽𝓶𝓪𝓷 (@Slefless45) October 19, 2025 -
ఎవడ్రా సామి నువ్వు.. పాక్‌ను ఇంతలా వణికిస్తున్నావ్?
అది కాబూల్‌లోని ఓ మారుమూల కొండ ప్రాంతం. ఓ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం నిదానంగా వెళ్తోంది. ఓ క్షిపణి రయ్‌మంటూ దూసుకొచ్చి ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ‘హమ్మయ్యా..’ అంటూ పాక్ సైన్యం సంబురాలు చేసుకుంది. కట్ చేస్తే.. ఆ మరుసటిరోజే ‘నేను అమరుడ్ని..’ అనే రేంజ్లో ఓ వ్యక్తి వాయిస్‌తో ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అంతే పాక్ సైనికాధికారుల ముఖంలో సంతోషం పోయి.. మళ్లీ తలపట్టుకున్నారు. పాకిస్తాన్-అఫ్గనిస్తాన్ మధ్య గత 10 రోజులుగా పరస్పర దాడులతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నది చూస్తున్నదే!. ఈ దరిమిలా 48 గంటల కాల్పుల విరమణతో పరిస్థితి కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు జగ్రి దోస్తులుగా ఉన్న ఈ రెండు దేశాలు దుష్మన్లుగా మారడానికి కారణం.. ఒకే ఒక్కడు. వాడి పేరు నూర్ వాలి మోహ్సూద్(Noor Wali Mehsud). పాక్‌కు కొరకరాని కొయ్యగా(వ్యక్తిగా) మారిన ఇతని గురించి ఇంటర్నెట్లో ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు. నూర్ వాలి మెహ్సూద్(47).. ఒకప్పుడు తాలిబాన్ ఉద్యమంలో భాగమైన వ్యక్తి. అయితే ఆ తర్వాతి కాలంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తూ.. పాక్‌ను వణికిస్తున్నాడు. ఇతని నేతృత్వంలో టీటీపీ సంస్థ పాక్ గడ్డపై పలు దాడులు జరిపింది. మరీ ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీసు ఔట్‌పోస్టులను లెక్కలేన్నంటిని నాశనం చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఇతని నేతృత్వంలో జరిగిన దాడులతో పాక్‌కు తీరని నష్టమే వాటిల్లింది. అలా.. తమ దేశ భద్రతా వ్యవస్థకు నూర్ వాలి మెహ్సూద్ పెనుముప్పుగా మారడంతో పాక్ ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించింది. అయితే.. నూర్ మొండి పట్టు వల్లే ఆ చర్చలు విఫలం కావడం గమనార్హం. తాజాగా ఇతగాడి చర్యల వల్ల పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పాక్ సైన్యం.. అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్ వాలి దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. తన క్షేమసమాచారాన్ని తెలియజేస్తూ ఆ మరుసటిరోజే ఆడియో క్లిప్ ఒకటి నూర్ బయటకు వదిలాడు. ఈ టీటీపీ ఏంటసలు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పలు నిషేధిత సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్. అయితే.. ఇది ఏర్పడడానికి ఒక బలమైన కారణం ఉంది. లాల్ మసీదు ఏరియా.. ఇస్లామాబాద్‌లో ఒకప్పుడు మతపరమైన కేంద్రంగా విరజిల్లేది. మౌలానాలు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ ఘాజీ సారథ్యంలో షరియా చట్టం అమలు కోసం ఉద్యమించారు. అయితే.. ఉద్యమం మాటున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అప్పటి సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వం ఆపరేషన్ సైలెన్స్ పేరిట చర్యకు ఉపక్రమించింది. జులై 3-11 తేదీ మధ్య ఈ దాడిలో 100 మంది మరణించగా.. 11 మంది సైనికులు, 200 మంది పౌరులు గాయపడ్డారు.మరణించిన వాళ్లంతా మిలిటెంట్లేనని ముషారఫ్ నాడు ప్రకటించారు. లాల్ మసీద్ ఘటన భావోద్వేగంగా, మతపరంగా ప్రజలను ప్రభావితం చేసింది. అయితే.. ఈ ఘటనను ఇస్లాం మీద దాడిగా భావించిన పలు గ్రూపులు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రతీకారంగా కలసి TTPను డిసెంబర్ 2007లో ప్రకటించాయి. దీని లక్ష్యం.. అప్పటి ముష్రాఫ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, పాకిస్తాన్లో షరియా చట్టం అమలయ్యేలా చూడడం. కాలక్రమంలో.. ఇది పాక్ సరిహద్దు ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని పాక్ భూభాగంపై తరచూ దాడులు చేస్తూ వస్తోంది.నూర్ సారథ్యం.. మరో మలుపు!2018లో అఫ్గన్ సరిహద్దులో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో టీటీపీ కీలక నేతలు ముగ్గురూ మరణించారు. దీంతో నూర్ వాలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నూర్ వాలి మెహ్సూద్ సారథ్యంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కొత్త పంథా ఎంచుకుంది. టీటీపీ అంటే అప్పటిదాకా పాక్ అమాయక పౌరులను బలిగొన్న కరుడుగట్టిన ఉగ్రసంస్థగా ముద్రపడిపోయింది. 2014లో ఓ పాఠశాలలో జరిపిన దాడిలో 130 మంది చిన్నారులు మరణించడం.. ఇందుకు ఓ ఉదాహరణ కూడా. అయితే మత పండితుడైన నూర్.. తన సారధ్యంలో అలాంటివి జరగకూడదని బలంగా తీర్మానించాడు. పాక్ సైన్యం అనేది ఇస్లాంకు వ్యతిరేకంగా.. 78 ఏళ్లుగా పాక్ ప్రజలను బందీఖానాలో ఉంచిందని, రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టిపోయిందని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పౌరుల జోలికి పోకూడదని.. కేవలం పాక్ ఆర్మీ, అవసరమైతేనే పోలీసులను లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీ కేడర్‌కు సూచించాడు. అలా టీటీపీపై పడ్డ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేశాడు నూర్. 2021లో అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో.. TTPకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం కలిగింది. ప్రత్యేకించి.. పాక్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. పాక్ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే.. నూర్ వాలి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడని, తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వ సహకారంతోనే మరింత రెచ్చిపోతున్నాడని. అంతేకాదు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఇస్లాం మతాన్ని వక్రీకరిస్తోందని, అలాంటి సంస్థకు భారతదేశమూ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఖండించింది, తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది. -
IND vs AUS: కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని భయపడ్డా: సూర్యకుమార్
భారత క్రికెట్ జట్టు యువ రక్తంతో నిండిపోతోంది. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ మార్పు కూడా జరిగింది. టెస్టులకు రోహిత్ శర్మ (Rohit Sharma) స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించగా.. వన్డే కెప్టెన్సీ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని తప్పించింది.ఇక ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ స్థానాన్ని యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ (Shubman Gill) భర్తీ చేశాడు. ఇప్పటికే టెస్టు సారథిగా ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్‌ను 2-2తో సమం చేసిన గిల్.. ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేశాడు.త్వరలోనే టీ20 పగ్గాలు కూడా అతడికేఈ క్రమంలో వన్డే సారథిగా తొలి ప్రయత్నంలోనే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గిల్‌కు కఠిన సవాలు ఎదురుకానుంది. ఇదిలా ఉంటే.. మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలని భావిస్తున్నామని.. త్వరలోనే టీ20 పగ్గాలు గిల్‌కు అప్పగిస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘గిల్ రెండు ఫార్మాట్లకు కెప్టెన్ కావడం పట్ల సంతోషంగా ఉంది. తను అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే, టీ20 కెప్టెన్సీ విషయంలో నేను అబద్ధం చెప్పను.కెప్టెన్సీ చేజారుతుందనే భయంఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కెప్టెన్సీ చేజారుతుందనే భయం ఉంటుంది. అయితే, ఆ భయం నుంచే నన్ను నేను మరింత మెరుగుపరచుకోవాలనే ప్రేరణ కూడా వస్తుంది. మైదానం లోపల, వెలుపల గిల్‌తో నా రిలేషన్ అత్యద్భుతంగా ఉంది. సోదర భావంతో మెలుగుతాం.మనిషిగా, ఆటగాడిగా తను ఎలాంటివాడో నాకు పూర్తిగా తెలుసు. తను ఈ స్థాయికి చేరడం పట్ల సంతోషంగా ఉంది. అందరికీ అతడు స్ఫూర్తిగా నిలిచాడు కూడా!’’ అని సూర్యకుమార్ యాదవ్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. కాగా అక్టోబరు 18- నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.ఆసియా కప్ విజేతగాఇందుకోసం గిల్ సారథ్యంలోని వన్డే జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకోగా.. సూర్య సేన టీ20 సిరీస్‌కు ముందు అక్కడికి చేరుకుంటుంది. కాగా ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా ఇటీవలే చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్‌మన్ గిల్ -
ఫలించిన వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగంలో వైద్య విద్య వ్యవస్థ బలోపేతానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేసిన అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల అందుబాటును పెంచడం కోసం వీలైనంత ఎక్కువ మంది వైద్యులను తయారు చేయడానికి వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 750 ఎంబీబీఎస్ సీట్లతో 2023–24లో ప్రారంభించారు. ఇప్పుడు ఈ కళాశాలల్లో మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఐదు కళాశాలల్లో మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్, అనస్థీషియా విభాగాల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. ప్రస్తుత 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఈ సీట్లలో అడ్మిషన్లు జరుగనున్నాయి. దీంతో పీజీ చదివే డాక్టర్ల ద్వారా ఆ ఆస్పత్రుల్లో రోగుల సంరక్షణ మరింత మెరుగు పడనుంది.వందకు పైగా సీట్లకు అవకాశం వైద్య కళాశాలల కోసం ఐదు చోట్ల జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా గత ప్రభుత్వంలో అభివృద్ధి చేశారు. ఈ ఆస్పత్రుల్లో పీజీ సీట్లు మంజూరుకు వీలుగా ఐపీ, ఓపీ, సర్జరీలు, ఇతర వనరులు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో వందకుపైగా సీట్లు ఐదు కళాశాలల్లో సమకూరాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేటుకు కట్టబెట్టడంపై పెట్టిన శ్రద్ధ.. వైద్య విద్య బలోపేతంపై పెట్టలేదు. కళాశాలల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ఫ్యాకల్టీ పోస్టులను సకాలంలో భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేని కారణంగానే ఎన్ఎంసీ 60 సీట్లే మంజూరు చేసినట్టు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే మరో 40కి పైగా సీట్లు సమకూరేవని డీఎంఈ వర్గాలు అంటున్నాయి.గత ప్రభుత్వ హయాంలో పీజీ సీట్ల పంట2019కి ముందు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కేవలం 970 పీజీ సీట్లు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు.. ఇలా అన్ని పోస్టులు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా చర్యలు తీసుకున్నారు. రోగుల తాకిడికి అనుగుణంగా పలు కళాశాలల్లో కొత్తగా పోస్టులు సృష్టించారు. ఈ చర్యల ఫలితంగా కళాశాలలకు పెద్ద ఎత్తున పీజీ సీట్లను ఎన్ఎంసి మంజూరు చేసింది. ఈ క్రమంలో ఐదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య రెట్టింపు అయింది. 800 మేర పీజీ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాయి. జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త వైద్య కళాశాలల ద్వారా ఇప్పుడు మరిన్ని పీజీ సీట్లు మన మెడికోలకు అందుబాటులోకి రావడం గమనార్హం.కొత్త వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లు» ఏలూరు కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4 » మచిలీపట్నం కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ పీడియాట్రిక్స్ 4» నంద్యాల కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎంఎస్ ఓబీజీ 4, ఎండీ అనస్థీషియా 4» రాజమండ్రి కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ పీడియాట్రిక్స్ 4, ఎంఎస్ ఓబీజీ 4» విజయనగరం కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ ఓబీజీ 4 -
తోషిబా.. భారీ విస్తరణ..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జపాన్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,232 కోట్లు (55 బిలియన్ యెన్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. దీనితో 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపవుతుందని సంస్థ వివరించింది. ప్రాథమిక అంచనాలకు మించి విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో జపాన్‌లోని హమాకవాసాకి కార్యకలాపాలపై, హైదరాబాద్‌లోని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డి్రస్టిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా)పై గణనీయంగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ‘గ్లోబల్‌గా విద్యుత్‌కి డిమాండ్ పెరుగుతుండటంతో సరఫరా పరికరాల (టీఅండ్‌డీ) లభ్యత మరింత కీలకంగా మారింది. ప్రస్తుత మౌలిక సదుపాయాలు పాతబడిపోతుండటం, పునరుత్పాదక విద్యుత్ పెరుగుతుండటం, కొత్త డేటా సెంటర్ల నిర్మాణం మొదలైన అంశాల దన్నుతో 2030 నాటికి జపాన్‌లో టీఅండ్‌డీ పరికరాలకు డిమాండ్ భారీగా పెరగనుంది. అలాగే, భారత్‌లో కూడా పట్టణ ప్రాంత జనాభా, పునరుత్పాదక విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతుండటంతో విద్యుత్‌కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది‘ అని తోషిబా వైస్ ప్రెసిడెంట్ హిరోషి కనెటా తెలిపారు. ఈ నేపథ్యంలో హై–వోల్టేజ్ టీఅండ్‌డీ పరికరాల సరఫరాను పెంచే దిశగా, తాము ప్రస్తుత ప్లాంట్లను ఆధునీకరించుకుంటూ, కొత్త ప్లాంట్లను నిర్మిస్తూ, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు వివరించారు.