breaking news
-
రింకూ సింగ్ సూపర్ సెంచరీ..
రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా కాన్పూర్ వేదికగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ ఆటగాడు రింకూ సింగ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 185 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో రింకూ తన ఎనిమిదవ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.అతడు తన బ్యాటింగ్‌ను 124 పరుగులతో కొనసాగిస్తున్నాడు. విప్రజ్ నిగమ్, ఆర్యన్లతో కలిసి రింకూ కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఉత్తరప్రదేశ్ 143 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. యూపీ ఇంకా 100 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో రింకూతో పాటు శివమ్ శర్మ(9) ఉన్నారు. అంతకుముందు మాధవ్ కౌశిక్(54), ఆర్యన్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆంధ్ర బౌలర్లలో ఇప్పటివరకు రిక్కీ భుయ్, పృథ్వీ రాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శశికాంత్, సౌరభ్ కుమార్‌లతో తలా వికెట్ పడగొట్టారు. ఇక ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 470 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బ్యాటర్లలో కేఎస్ భరత్(142), షేక్ రషీద్(136) సెంచరీలతో సత్తాచాటారు. రింకూ సింగ్ ఈ మ్యాచ్ తర్వాత టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు.చదవండి: IND vs AUS: 25 ఫోర్లు,8 సిక్స్‌లు.. పెర్త్‌లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ! -
మహేష్ ఎక్కడ? నమ్రతకు ఫ్యాన్స్ ప్రశ్న...!
దీపావళి పండుగ సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా జరుపుకోవడం మాత్రమే కాదు బిజీ జీవితంలో అరుదుగా మాత్రమే కలవగలుగుతున్న సన్నిహితులకు, పరిచయస్థులకు దీపావళి బాష్ పేరిట పార్టీలు ఇవ్వడానికి కూడా ఇదే చక్కని సందర్భంగా స్టార్స్ భావిస్తారు. దాంతో ఈ సమయంలో దీపావళి పార్టీలు జోరుగా సాగుతాయి. మన టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్లో ఇవి ఒక సంప్రదాయంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో ముంబైలో ఝాన్సీరెడ్డి అనే సన్నిహితులు ఇచ్చిన ఈ పార్టీకి పలువురు బంధుమిత్రులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి ఆమె సోదరి శిల్పా శిరోడ్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పార్టీలో మహేష్, నమ్రతల కుమార్తె తాజా యాడ్ వరల్డ్ యంగెస్ట్ సెన్సేషన్ సితార కూడా పాల్గొంది.ఈ సందర్భంగా నమ్రత తమ ఘట్టమనేని అభిమానులతో తన దీపావళి వేడుకల విశేషాలను పంచుకున్నారు. తన కుమార్తె సితార ఘట్టమనేని సోదరి శిల్పా శిరోద్కర్‌తో తాము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఆ ఛాయా చిత్రాలను పంచుకుంటూ, నమ్రత ‘వెచ్చదనం, వెలుగులు అద్భుతమైన వ్యక్తులతో నిండిన సాయంత్రం... నిజంగా మరపురాని దీపావళి రాత్రులు... మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు‘ అంటూ క్యాప్షన్‌లో రాశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ నగర ప్రముఖులు పింకీ రెడ్డి వంటివారు కూడా నమ్రత బృందంలో కనిపించారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ అభిమాన కధానాయకుడు లేకుండా ఆయన భార్య వేడుకలు జరుపుకుంటే.. అడగకుండా ఉంటారా? అందుకే ఆ ఫొటోల కింద కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు ఎక్కడ అంటూ పలువురు ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఒకరు, ‘మన సూపర్ స్టార్ ఎక్కడ?‘ అని ఆరా తీయగా మరికొందరు, ‘బాబు ఎక్కడ‘ అనీ అడిగారు. నమ్రతను తన కుమార్తెతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలను షేర్ చేయమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభ్యర్ధించారు. మరోవైపు రాజమౌళి తీస్తున్న సినిమా షూటింగ్లో మహేష్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కేన్ మామ వచ్చేశాడు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత విలియమ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సెలక్టర్లు అతడికి అవకాశమిచ్చారు. అతడితో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్ కూడా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ వ్యవహరించాడు. అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ గాయం కారణంగా దూరమయ్యాడు.లాథమ్‌తో పాటు మొహమ్మద్ అబ్బాస్ ఫిన్ అల్లెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విల్ ఓ'రూర్కే , గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. టీ20ల్లో సత్తాచాటుతున్న జాక్ ఫాల్క్స్కు కివీస్ సెలక్టర్లు వన్డేలకు పిలుపునిచ్చారు.ప్రస్తుతం కివీస్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. తొలి టీ20 వర్షర్పాణం కాగా.. రెండో టీ20 సోమవారం జరగనుంది. అక్టోబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
అమ్మాయిల పిచ్చి! నువ్వు చూశావా? రమ్యకు నాగ్ కౌంటర్
బిగ్‌బాస్ షోలో (Bigg Boss Telugu 9) వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) అక్షింతలు వేస్తున్నాడు. నోరుంది కదా అని అందరిమీదా పెత్తనం చెలాయించాలని చూసిన మాధురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేశాడు. మాటతీరు మార్చుకోమని హెచ్చరించాడు. ఇప్పుడిక రమ్య వంతు వచ్చింది. ఈమె వచ్చీరావడంతోనే కల్యాణ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని అతడిపై ముద్ర వేసింది. రమ్య కామెంట్స్.. నోరెళ్లబెట్టిన కల్యాణ్నిజానికి కల్యాణ్ (Pawan Kalyan Padala) చూపులు, ప్రవర్తన.. కాస్త తేడాగా ఉన్నప్పటికీ మరీ అమ్మాయిల పిచ్చి అనేయడం తప్పుగానే అనిపించింది! నాపై చేతులు వేసి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే లాగిపెట్టి ఒక్కటిచ్చేస్తాను అని రమ్య మాట్లాడిన వీడియోను కన్ఫెషన్ రూమ్‌లో ప్లే చేశాడు నాగ్. అది చూసి నోరెళ్లబెట్టాడు కల్యాణ్. ఒకరిని అమ్మాయిల పిచ్చి అనడానికి నువ్వేమీ అతడిని జీవితాంతం చూడలేదని కౌంటరిచ్చాడు నాగ్. ఫుల్ క్లారిటీకల్యాణ్ అమ్మాయిలతో ప్రవర్తించే తీరు సరిగా ఉందా? లేదా? అని ప్రేక్షకుల్ని అడగ్గా సగం మంది అవునని, మిగతా సగం మంది కాదని బదులిచ్చారు. ప్రేక్షకుల రెస్పాన్స్‌కు కల్యాణ్ షాకయ్యాడు. అంటే జనాల్లో తనపై ఏ విషయంలో వ్యతిరేకత ఉందో ఈ ఎపిసోడ్‌తో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా మారాడు. ఇంకా ఆటపై ఫోకస్ పెడితే మాత్రం కల్యాణ్ విన్నింగ్ రేస్‌లో దూసుకుపోవడం ఖాయం! చదవండి: మాధురికి క్లాస్ పీకిన నాగార్జున.. తీరు మార్చుకోమని హెచ్చరిక! -
ఒక్క డీఏతో ‘పండుగ’ చేసుకోమంటారా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేసి దీపావళి కానుక అంటూ ఒక్క డీఏ ఇచ్చి సరిపెట్టడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు రావాల్సిన నాలుగు డీఏల్లో ఒక దాన్ని.. అది కూడా 16 నెలల తర్వాత ఇవ్వడాన్ని గొప్పగా చెప్పుకోవడంపై వారంతా మండిపడుతున్నారు. వాట్సప్ గ్రూపుల్లో చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే 10 రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు 27% ఐఆర్ ఇస్తే, చంద్రబాబు 2024 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో పెద్దఎత్తున జరుగుతోంది. ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన జగన్ ఏ ప్రభుత్వం ఉన్నా ఏడాదికి రెండుసార్లు డీఏ ఇస్తుంది. కానీ నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంటే చంద్రబాబు ఇప్పుడు ఒకటి ఇవ్వడానికే పెద్ద హడావుడి చేయడం ఉద్యోగ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘ సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత సీఎం చంద్రబాబు వారితో సమావేశమవడం వంటి పరిణామాలను చూసి, ఐఆర్, పీఆర్సీసహా తమ డిమాండ్ల పరిష్కారం దిశలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని ఉద్యోగులు ఎదురు చూశారు.కానీ అంత కసరత్తు తర్వాత డీఏ తప్ప ఇతర ఏ ముఖ్యమైన ప్రకటనా లేకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు హతాశులయ్యారు. వైఎస్ జగన్ 2019–24 మధ్య ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చారని, చంద్రబాబు 2014–19 మధ్య ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా డీఏల కోసం పోరాటం తప్పని పరిస్థితి నెలకొందనేది ఉద్యోగ సంఘాల ఆవేదనగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలుగా ఐఆర్ విషయాన్ని పట్టించుకోకపోవడంపై నిరాశ చెందుతున్నారు. పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే లేదా? వెసులుబాటు ఉన్నప్పుడు పీఆర్సీ ఇస్తామనడం, దాని గురించి అడగవద్దనడం ఏమిటని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ రెండు, మూడేళ్ల తర్వాతైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే కనీసం కమిషన్‌ను నియమించేవారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 12వ పీఆర్సీ కమిషన్ ఉనికిలో లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కోటరీ ఒత్తిడితో పీఆర్సీ కమిషనర్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంద్రబాబు మరొకరిని నియమించలేదు. పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉంటే కనీసం కమిషనర్‌ను నియమించడానికి అంగీకరించేవారు.కమిషన్ ఏర్పాటైతే పరిశీలన, అధ్యయనం తర్వాత ఏడాదికో, రెండేళ్లకో నివేదిక ఇచ్చేది. ఆ తర్వాత దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు, ప్రభుత్వం సమాలోచనలు జరిపి ఒక ఏడాది తర్వాతైనా ఆ నివేదికనో, అందులోని కొన్ని అంశాలనో ఆమోదించి, పీఆర్సీ ఇవ్వడానికి వీలవుతుంది. అయితే పరిస్థితి చూస్తుంటే, 2029 ఎన్నికల్లోపు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. బకాయిలపైనా మోసమే ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.34,125 కోట్లు ఎప్పుడు ఎంత ఇస్తారో కూడా చెప్పకపోవడాన్ని బట్టి ఉద్యోగులు ఆ విషయంలోనూ మోసపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ బకాయిల్లో పోలీసులకు సంబంధించి ఇవ్వాల్సిన రెండు ఎర్న్డ్ లీవుల్లో ఒకటి ఇవ్వడానికి అంగీకరించారు. దాని విలువ రూ.210 కోట్లు. ఆ మొత్తాన్ని రెండు విడతలుగా నవంబర్, డిసెంబర్లో ఇస్తామని చెప్పారు. అంటే రూ.34 వేల కోట్లకుపైగా బకాయిల్లో రూ.210 కోట్ల బకాయిలను జనవరికి విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు.మిగిలిన రూ.33,915 కోట్ల బకాయిలు ఎప్పటికి వస్తాయో ఆ దేవుడేకి తెలియాలనేలా పరిస్థితి ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. పోలీసులకు ఇస్తామన్న ఎర్న్డ్ లీవులపైనా చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చారు. రెండు ఎర్న్డ్ లీవ్‌లు ఇవ్వడానికి గతంలోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒప్పుకున్నారు. గత సంక్రాంతికే వాటిని ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తానన్న రెండింటిలో ఒక దానికి ఎగనామం పెట్టి ఒకటి ఇవ్వడానికి తలూపడంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. సీపీఎస్‌పైనా కప్పదాటు వైఖరి కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాలను సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగైన అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తెస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబదీ్ధకరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టం చేయగా చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కారు. మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై మళ్లీ పాత విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఆప్కాస్‌ను ఎత్తివేయడానికి సిద్ధమవుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. సచివాలయాల ఉద్యోగుల ఆవేదన సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమను వాలంటీర్లుగా మార్చి పింఛన్లు, సర్వేలు వంటి పనులు చేయించుకుంటూనే, ఆ వ్యవస్థ పట్ల సీఎం చంద్రబాబు తక్కువగా మాట్లాడటం వారిని బాధిస్తోంది. పరిపాలనా వ్యవస్థను గడపగడపకూ తీసుకెళ్లేందుకు గత జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థ ద్వారా 1.26 లక్షల మందిని నియమించి చక్కటి ఫలితాలు సాధించగా, ప్రస్తుతం తమకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడమే కాకుండా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకు దారితీస్తోంది.ఉద్యోగులంటే చంద్రబాబుకు అలుసా..! ఉద్యోగులపై పెడుతున్న వ్యయాన్ని వైఎస్ జగన్ అనవసరంగా పెంచేశారన్న బాధ ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మనసులో వారి పట్ల వ్యతిరేకతను నింపుకునే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారని, ఇప్పుడు మాత్రం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.అనుద్పాతక వ్యయం పెరిగిపోతుందని చెబుతున్న ఆయన, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు అలవికాని హామీలు ఎందుకు ఇచ్చారని, తద్వారా వారిని ఎందుకు మోసం చేశారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమకు చంద్రబాబు చేసిన ద్రోహం తీరనిదని, నమ్మించి గొంతు కోయడంలో ఆయన దిట్టన్న విషయం మరోసారి రుజువైందని ఉద్యోగులు వాపోతున్నారు. -
ముమ్మాటికీ ప్రైవేటీకరణే
సాక్షి, అమరావతి: ‘పీపీపీకి.. ప్రైవేటీకరణకు చాలా తేడా ఉంది. మేం వైద్య కళాశాలలను పీపీపీలో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధానంలో విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు’ కొత్త వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఇది. చేస్తున్న ప్రచారానికి.. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. విద్యార్థులకు నష్టం ఉండదంటూనే ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ ఫీజుల దోపిడీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తద్వారా అస్మదీయుల ఆదాయం పెంపునకు ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్ సీట్లకు గండికొట్టి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదింటిని పీపీపీ పేరిట ప్రభుత్వం ప్రైవేట్‌కు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. ఆలిండియా కోటా సీట్లు యాజమాన్య కోటాకే.. కొత్తగా నిరి్మంచిన వైద్య కళాశాలలపై ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషీ లేకుండా ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. ఆలిండియా కోటా విధానానికి స్వస్తి పలకడం ద్వారా కళాశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ అణుమాత్రం కూడా ఉండబోదని బాబు సర్కార్ ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా కారుచౌకగా కళాశాలలను కైవసం చేసుకునే వ్యక్తులు వైద్య విద్యారంగంలోనూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వీలుగా ప్రభుత్వ కోటాలోని 110 సీట్లను యాజమాన్య కోటాకు మళ్లించి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. ఒక్కో కళాశాలలో 11 చొప్పున.. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలల్లో 15 శాతం ఎంబీబీఎస్ సీట్లు ఆలిండియా కోటాకు కేటాయిస్తారు. పీపీపీకి ఇస్తున్న 10 వైద్య కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈ కళాశాలలు వంద శాతం ప్రైవేట్ వ్యక్తుల అజమాయిïÙలోనే నడుస్తాయనే విషయాన్ని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఆల్ ఇండియా కోటా ఎత్తేయడం వల్ల మన విద్యార్థులు ఒక్కో కళాశాలలో 11 చొప్పున కన్వినర్ కోటా సీట్లను నష్టపోనున్నారు. ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం అంటే 22 సీట్లు ఆలిండియా కోటాకు, మిగిలిన 128 సీట్లలో సగం (64) రాష్ట్ర స్థాయిలో కనీ్వనర్ కోటాకు, 45 సెల్ఫ్ ఫైనాన్స్, 19 ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే ఆలిండియా, రాష్ట్ర కనీ్వనర్ కోటా కలిపి 86 సీట్లు ప్రభుత్వ కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లకు రూ.15 వేలు మాత్రమే ఫీజు ఉంటుంది. ఆలిండియా కోటా రద్దుచేసి ప్రైవేట్ వైద్య కళాశాలల తరహాలో 150 సీట్లలో సగం కన్వినర్ కోటాకు, మిగిలిన సగం యాజమాన్య కోటా (బీ, సీ) కింద భర్తీ అవుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ప్రస్తుత విధానంలో ప్రభుత్వ కోటా కింద 86 సీట్లు కొత్త వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉండగా.. వాటిని ప్రైవేట్‌కు కట్టబెట్టడం వల్ల ఒక్కో కళాశాలలో 11 సీట్లకు గండి పడనుంది. 8 బీ కేటగిరీకి, మూడు ఎన్ఆర్ఐ కోటా కిందకు వెళతాయి. తద్వారా ఏడాదికి బీ కేటగిరి సీటుకు రూ.13.20 లక్షలు, సీ కేటగిరి సీటుకు రూ.39.60 లక్షలు చొప్పున ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం సమకూరనుంది.ఈ లెక్కన 10 వైద్య కళాశాలల్లో 110 సీట్లు యాజమాన్య కోటాకు మళ్లించి ఏడాదికి బీ కేటగిరి సీట్ల రూపంలో రూ.10.56 కోట్లు, సీ కేటగిరి సీట్ల రూపంలో రూ.11.88 కోట్ల చొప్పున విద్యార్థుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు ముక్కుపిండి వసూలు చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. విద్యార్థులకు తీరని ద్రోహం ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎంబీబీఎస్ చదివేవారు మెడికల్ పీజీ కోర్సులు చదవాలంటే.. అడ్మిషన్ల సమయంలో స్థానికేతరులుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో మార్పు వస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్, ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు వస్తే తప్ప.. మిగిలిన సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఇష్టపడటం లేదు. నీట్ యూజీలో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులు ఆలిండియా కోటా కింద రాష్ట్ర కళాశాలల్లోనే చేరుతున్నారు. ఈ పోకడ రానురాను ఇంకా పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులపై ఫీజుల భారం మోపుతుండటమే కాకుండా.. ఏకంగా 110 సీట్లను యాజమాన్య కోటాకు మళ్లించడంపై విద్యార్థి లోకం మండిపడుతోంది. -
Telangana: పోతే రూ.10 వేలు.. వస్తే నాలుగెకరాలు
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.సరైన ధర రాకపోవడం వల్లే..భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్‌ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు. -
రికార్డుల దీపోత్సవం
అయోధ్య: దీపావళి వేళ భారతదేశమంతటా టపాసుల మోత మోగుతుంటే ఆధ్యాత్మిక నగరి అయోధ్య ఒక్కసారిగా గిన్నిస్ రికార్డుల మోత మోగించింది. ఇందుకు సరయూ నదీతీర ఘాట్లు వేదికగా నిలిచాయి. దీపావళి సందర్భంగా ప్రతిఏటా నిర్వహించే దీపోత్సవంలో భాగంగా ఈ సారి మరిన్ని ఎక్కువ ప్రమిదలను వెలిగించి కొత్త గిన్నిస్ ప్రపంచరికార్డ్‌ను అయోధ్యవాసులు సృష్టించారు. ఒకేసారి 26,17,215 దీపపు ప్రమిదలను ఆదివారం రాత్రి సరయూ నదీ ఘాట్ల వెంట వెలిగించారు. డ్రోన్ల సాయంతో ప్రమిదలను లెక్కించి గిన్నిస్ పుస్తక ప్రతినిధులు ప్రపంచ రికార్డ్‌ను ధ్రువీకరించారు. 2,128 మంది ఒకేసారి హారతి పట్టి మరో గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పారు. యూపీ పర్యాటక శాఖ, అయోధ్య పాలనా యంత్రాంగం, రామ్మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం సమష్టిగా ఒకేసారి 26 లక్షలకుపైగా దీపం ప్రమిదలను వెలిగించి ఈ కొత్త రికార్డ్‌ను సృష్టించారు. హారతి కార్యక్రమాన్ని పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం, సరయూ హారతి సమితులు సంయుక్తంగా చేపట్టాయి. సరయూ వెంట 56 ఘాట్లలో దీపాలు వెలిగించారు. ముఖ్యంగా 10వ నంబర్ ఘాట్‌లో 80,000 ప్రమిదలతో చేసిన స్వస్తిక్ గుర్తు డ్రోన్ నుంచి చూస్తే ఎంతగానో ఆకట్టుకుంటోంది.అయోధ్యకు పోటెత్తిన అశేష భక్తజనంఈ ఏడాది జనవరి నుంచి జూన్కాలంలో ఏకంగా 23.82 కోట్ల మంది భక్తులు అయోధ్య నగరం, అయోధ్య భవ్య రామమందిరాన్ని దర్శించుకున్నారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. దీపోత్సవం సందర్భంగా ఇటీవల దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. -
తమిళనాడులో కుండపోత వర్షం.. చెన్నై పరిస్థితి దారుణం..
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై విమానాశ్రయంలో రన్‌వేపైకి నీళ్లు చేరడంతో ఎక్కడికక్కడే విమానాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఆదివారం రాత్రి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో, నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తూర్పు తీర రోడ్డు (ECR) వెంబడి ఉన్న వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, నీలంకరై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు మోకాలి లోతు నీటితో ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.మరోవైపు.. భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీశారు. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందించాలని ఆదేశించారు. Heavy rain @aaichnairport. The runways are water-logged. @NewIndianXpress @ChennaiRains @praddy06 @IMDWeather #Chennaiairport #TamilNadu #ChennaiRains pic.twitter.com/lxlx6bdLYe— S V Krishna Chaitanya (@Krish_TNIE) October 20, 2025భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా ప్రకారం.. చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుచ్చేరి, కారైకల్, పరిసర జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 22 వరకు తమిళనాడు తీరప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.@ChennaiRains @RainStorm_TN Heavy rains with gusty wind at Thoraipakkam #wetdiwali pic.twitter.com/rMl98JVZwV— Lakshmanan S (@Laxman190566) October 20, 2025కొండ ప్రాంతాలైన నీలగిరి, కల్లార్, కూనూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో నీలగిరి మౌంటైన్ రైల్వే (NMR)లో రైలు సర్వీసులు రద్దు చేసింది. చెట్లు కూలిపోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగిందని దక్షిణ రైల్వే తెలిపింది. అక్టోబర్ 19న మెట్టుపాళయం–ఉదగమండలం (రైలు నం. 56136 మరియు 06171), ఉదగమండలం–మెట్టుపాళయం (రైలు నం. 56137) సహా మూడు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. Heavy rain on the bypass road in Chinnamanur, Theni districtand drizzling continues @ChennaiRains @MasRainman @RainStorm_TN @kalyanasundarsv @praddy06 pic.twitter.com/tudC0r5Gbn— Michael 🌿 (@michaelraj_GD) October 19, 2025 -
నువ్వో డ్రగ్ డీలర్
పామ్ బీచ్(అమెరికా): అగ్రరాజ్యాధినేతననే అహంకారంతో తనకు నచ్చని ప్రతి దేశంపై ఆంక్షలు, నిషేధాజ్ఞల కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు. కొలంబియాలో తయారైన మాదకద్రవ్యాలు అమెరికాలోకి పోటెత్తుతున్నాయని, ఇందుకు గుస్తావోనే కారణమని ఆయనపై అంతెత్తున లేచారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్ చేశారు. ‘‘గుస్తావో ఒక పెద్ద అక్రమ మాదకద్రవ్యాల డీలర్. పేరు ప్రఖ్యాతలు లేని, అసలు ప్రాముఖ్యతే లేని రాజకీయనేత. కొలంబియా డ్రగ్స్ దందాను వెంటనే ఆపేయాలి. లేదంటే మిమ్మల్ని బాధపెడుతూ మేమే బలవంతంగా ఆపుతాం. కొలంబియా వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ స్థాయిలో మాదకద్రవ్యాల తయారీని గుస్తావో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దేశీయంగా డ్రగ్స్‌ను ఆయన అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అమెరికా నుంచి భారీస్థాయిలో నగదు సబ్సిడీలు, వెసులుబాట్లు పొందుతూ కూడా గుస్తావో డ్రగ్స్ ఉరవడికి అమెరికాలోకి రాకుండా ఆపలేకపోతున్నారు. ఇది నిజంగా అమెరికాను మోసంచేయడమే. ఇకపై కొలంబియాకు అమెరికా చేసే సాయం ఆపేస్తా’’అని ట్రంప్ హెచ్చరించారు.