ముమ్మాటికీ ప్రైవేటీకరణే | All India quota lifted in new government medical colleges | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ ప్రైవేటీకరణే

Oct 20 2025 4:17 AM | Updated on Oct 20 2025 6:00 AM

All India quota lifted in new government medical colleges

ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల్లో ఆలిండియా కోటా ఎత్తివేత

తమవారి ఆదాయం పెంపునకు 110 ఎంబీబీఎస్‌ సీట్లు యాజమాన్య కోటాగా మార్పు 

పీపీపీ పేరిట ఫీజుల దోపిడీకి చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ 

ప్రస్తుత విధానంలో ఆలిండియా కోటా 22, స్టేట్‌ కోటా 64 చొప్పున   86 ప్రభుత్వ కోటా సీట్లు 

ప్రైవేటీకరిస్తున్న ఒక్కో వైద్య కళాశాలలో 11 చొప్పున సీట్లు యాజమాన్య కోటాకు మళ్లింపు 

ప్రతి కళాశాలలో ప్రభుత్వ కోటాలోని 8 సీట్లు బీ కేటగిరీ, 3 సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటాకు మళ్లింపు  

సాక్షి, అమరావతి: ‘పీపీపీకి.. ప్రైవేటీకరణకు చాలా తేడా ఉంది. మేం వైద్య కళాశాలలను పీపీపీలో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధానంలో విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు’ కొ­త్త వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు ప్రభు­త్వం చేస్తున్న ప్రచారం ఇది. చేస్తున్న ప్రచారానికి.. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. 

విద్యార్థులకు నష్టం ఉండదంటూనే ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ ఫీజుల దోపిడీకి రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు. తద్వా­రా అస్మదీయుల ఆదాయం పెంపునకు ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు గండికొట్టి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాధించిన 17 కొత్త ప్రభు­త్వ వైద్య కళాశాలల్లో పదింటిని పీపీపీ పేరిట ప్ర­భుత్వం ప్రైవేట్‌కు కట్టబెడుతున్న విషయం తెలిసిందే.   

ఆలిండియా కోటా సీట్లు యాజమాన్య కోటాకే.. 
కొత్తగా నిరి్మంచిన వైద్య కళాశాలలపై ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషీ లేకుండా ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. ఆలిండియా కోటా విధానానికి స్వస్తి పలకడం ద్వారా కళాశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ అణుమాత్రం కూడా ఉండబోదని బాబు సర్కార్‌ ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా కారుచౌకగా కళాశాలలను కైవసం చేసుకునే వ్యక్తులు వైద్య విద్యారంగంలోనూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వీలుగా ప్రభుత్వ కోటాలోని 110 సీట్లను యాజమాన్య కోటాకు మళ్లించి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు.  

ఒక్కో కళాశాలలో 11 చొప్పున.. 
దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలల్లో 15 శాతం ఎంబీబీఎస్‌ సీట్లు ఆలిండియా కోటాకు కేటాయిస్తారు. పీపీపీకి ఇస్తున్న 10 వైద్య కళాశాలల్లో ఆల్‌ ఇండియా కోటా ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈ కళాశాలలు వంద శాతం ప్రైవేట్‌ వ్యక్తుల అజమాయిïÙలోనే నడుస్తాయనే విషయాన్ని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఆల్‌ ఇండియా కోటా ఎత్తేయడం వల్ల మన విద్యార్థులు ఒక్కో కళాశాలలో 11 చొప్పున కన్వినర్‌ కోటా సీట్లను నష్టపోనున్నారు. 

ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం అంటే 22 సీట్లు ఆలిండియా కోటాకు, మిగిలిన 128 సీట్లలో సగం (64) రాష్ట్ర స్థాయిలో కనీ్వనర్‌ కోటాకు, 45 సెల్ఫ్‌ ఫైనాన్స్, 19 ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే ఆలిండియా, రాష్ట్ర కనీ్వనర్‌ కోటా కలిపి 86 సీట్లు ప్రభుత్వ కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లకు రూ.15 వేలు మాత్రమే ఫీజు ఉంటుంది. ఆలిండియా కోటా రద్దుచేసి ప్రైవేట్‌ వైద్య కళాశాలల తరహాలో 150 సీట్లలో సగం కన్వినర్‌ కోటాకు, మిగిలిన సగం యాజమాన్య కోటా (బీ, సీ) కింద భర్తీ అవుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. 

అంటే ప్రస్తుత విధానంలో ప్రభుత్వ కోటా కింద 86 సీట్లు కొత్త వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉండగా.. వాటిని ప్రైవేట్‌కు కట్టబెట్టడం వల్ల ఒక్కో కళాశాలలో 11 సీట్లకు గండి పడనుంది. 8 బీ కేటగిరీకి, మూడు ఎన్‌ఆర్‌ఐ కోటా కిందకు వెళతాయి. తద్వారా ఏడాదికి బీ కేటగిరి సీటుకు రూ.13.20 లక్షలు, సీ కేటగిరి సీటుకు రూ.39.60 లక్షలు చొప్పున ప్రైవేట్‌ వ్యక్తులకు ఆదాయం సమకూరనుంది.

ఈ లెక్కన 10 వైద్య కళాశాలల్లో 110 సీట్లు యాజమాన్య కోటాకు మళ్లించి ఏడాదికి బీ కేటగిరి సీట్ల రూపంలో రూ.10.56 కోట్లు, సీ కేటగిరి సీట్ల రూపంలో రూ.11.88 కోట్ల చొప్పున విద్యార్థుల నుంచి ప్రైవేట్‌ వ్యక్తులు ముక్కుపిండి వసూలు చేసుకోవడానికి లైసెన్స్‌ ఇచ్చేస్తున్నారు.  

విద్యార్థులకు తీరని ద్రోహం 
ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎంబీబీఎస్‌ చదివేవారు మెడికల్‌ పీజీ కోర్సులు చదవాలంటే.. అడ్మిషన్ల సమయంలో స్థానికేతరులుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో మార్పు వస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్, ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు వస్తే తప్ప.. మిగిలిన సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చదవడానికి ఇష్టపడటం లేదు. 

నీట్‌ యూజీలో టాప్‌ స్కోర్‌ సాధించిన విద్యార్థులు ఆలిండియా కోటా కింద రాష్ట్ర కళాశాలల్లోనే చేరుతున్నారు. ఈ పోకడ రానురాను ఇంకా పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులపై ఫీజుల భారం మోపుతుండటమే కాకుండా.. ఏకంగా 110 సీట్లను యాజమాన్య కోటాకు మళ్లించడంపై విద్యార్థి లోకం మండిపడుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement