breaking news
-
3 కోట్ల లగ్జరీ కారు.. 35 లక్షల బంగారం..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. టిక్కెట్లు దక్కించుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన భోజ్‌పురి సూపర్‌స్టార్ ఖేసరి లాల్ యాదవ్ తాజాగా నామినేషన్ వేశారు. సరన్ జిల్లాలోని చాప్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థిగా పోటీకి దిగారు.నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''నా హృదయం ఎప్పుడూ ఆర్జేడీతోనే ఉంద''ని అన్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ఆయన తన భార్య చందాతో కలిసి ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) సాదరంగా ఖేసరి లాల్ యాదవ్, ఆయన భార్యను పార్టీలోకి ఆహ్వానించారు. వారికి స్వయంగా పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.కాగా, తన ఆస్తుల విలువ ₹24.81 కోట్లు అని ఖేసరి లాల్ యాదవ్ (Khesari Lal Yadav) ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ₹16.89 కోట్ల విలువైన చరాస్తులు, ₹7.91 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. భార్య చందా యాదవ్ కు ₹90.02 లక్షల విలువైన చరాస్తులు, ₹6.49 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. తన అసలు పేరు శత్రుఘ్న యాదవ్‌గా అఫిడవిట్లో పేర్కొన్నారు. తన వద్ద ₹5 లక్షల నగదు.. తన సతీమణి వద్ద ₹2 లక్షల నగదుతో పాటు ₹35 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 2023–24లో ఖేసరి లాల్ యాదవ్ వార్షిక ఆదాయం ₹73.5 లక్షలుగా ఉంది. 2022–23లో ₹95.02 లక్షలు, 2020–21లో ₹1.01 కోట్లుగా ఉంది. ఖేసరి లాల్ యాదవ్ ఆస్తుల్లో 2023లో కొనుగోలు చేసిన ₹3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ కారు కూడా ఉంది.పాలు అమ్మి.. స్టార్‌గా ఎదిగిసామాన్య కుటుంబంలో పుట్టిన ఖేసరి లాల్ యాదవ్ తన ప్రతిభతో సెలబ్రిటీగా ఎదిగారు. ఆయన తండ్రి మంగరు యాదవ్ ఒకప్పుడు ఉదయం వీధి వ్యాపారిగా, రాత్రిళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. తన బాల్యంలో తమ గ్రామంలో పశువులను మేపుతూ పాలు అమ్మేవాడినని ఖేకరీ పలు సందర్బాల్లో చెప్పారు. నటుడిగా, గాయకుడిగా ఎదిగిన ఆయన వందకు పైగా భోజ్‌పురి చిత్రాలలో నటించారు. 5 వేలకు పైగా పాటలు పాడారు. తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నారు.చదవండి: బిహార్ ఎన్నికల్లో 'వెరైటీ' ఫ్రెండ్లీ ఫైట్!యువతలో ఫాలోయింగ్భోజ్పురిలో ఖేసరి లాల్ యాదవ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత, వలస కార్మికులు ఆయనను బాగా ఇష్టపడతారు. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన సరన్ జిల్లాలో ఖేసరి లాల్ యాదవ్ ప్రభావం ఉంటుందని ఆర్జేడీ అంచనా వేస్తుంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో దశ పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి. -
దీపావళి జోష్..తర్వాత రోజు తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేద్దాం ఇలా..!
దీపావళి వేడుకలతో రాత్రంతా ఆహ్లాదంగా ఆడిపాడి గడుపుతారు అందరు. ముఖ్యంగా ఈ వేడుక పుణ్యామా అని రకరకాల స్వీట్లు, విందులతో పొట్టపగిలేలా ఆరగించేస్తాం. మరోవైపు బంధు మిత్రులతో కలిసి టపాసులు కాల్చి..ఆడిపాడి ఎప్పుడో పడుకుంటాం. పొద్దున లేచాక..ఏదో నిద్ర లేనట్లుగా పొట్టంతా ఉబ్బరంగా, ఒకటే తలనొప్పిగా భారంగా ఉంటుంది. శరీరమంతా ఏదో తెలియని బరువులా ఇబ్బందిగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే పండుగ హ్యాంగోవర్‌తో ఇబ్బంది పడుతుంటాం. నార్మల్ స్థితికి వచ్చి యథావిధిగా యాక్టివ్‌గా ఉండాలంటే ఈ నేచురల్ పానీయమే మేలంటున్నారు నిపుణులు. దీపావళి తర్వాత ఉత్సాహంగా ఉండటానికి ఇది అల్టిమేట్ రికవరీ పానీయంగా చెబుతున్నారు. మరి అదెంటో చూసేద్దామా..!.హ్యాంగోవర్ ఎందుకు వస్తుందంటే..దీపావలి పండుగ పేరుతో అతిగా తిని, బాగా ఎంజాయ్ చేస్తాం. పైగా శరీరం అలిసిపోతున్న బంధు మిత్రులను చూసి ఎక్కడలేని ఉత్సాహాన్ని కొనితెచ్చుకుంటాం. దాంతో మరుసటి రోజు డీహైడ్రేషన్‌కి గురయ్యే నీరసంతో విలవిలాడుతుంటాం. దీన్నే దీపావళి హ్యాంగోవర్ లేదా పండుగ హ్యాంగోవర్ అంటారు. దీన్నుంచి తక్షణమే రీలిఫ్ ఇచ్చే అద్భుత పానీయం నిమ్మ కొబ్బరి నీరు అని చెబుతున్నారు నిపుణులు. ఇది సహజసిద్ధమైన డిటాక్స్‌లా పనిచేస్తుందట. ఏవిధంగా అంటే..రీహైడ్రేట్ చేసి శరీరాన్ని యాక్టివ్ చేస్తుందట. అలాగే కొబ్బరి నీరులో 94% నీరు, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీనికి నిమ్మకాయను జోడించడంతో రుచిపెరగడమే కాకుండా ఖనిజ శోషణ కూడా మెరుగుపడుతుందట. ముఖ్యంగా పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ప్రేగుకి ఉపశమనం అందించి, జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. కొబ్బరినీళ్లల్లో ఉండే మెగ్నీషియం జీర్ణకండరాలను సడలించి.. ఆమ్లత్వం, మలబద్ధకం, అసౌకర్యాన్ని నివారిస్తుంది. అలాగే జలుబు, అలసట వంటి వాటిని నివారిస్తుంది. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ రోగనిరోధక శక్తిని అందించి..యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ వంటి వాటిని అందించి శరీరం తక్షణమే కోలుకునేలా చేస్తుంది. వేయించి పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే పేగువాపుని తగ్గిస్తుందట. ఆక్సీకరణ ఒత్తిడిని దూరం చూస్తుందట. దీంతోపాటు చర్మాన్ని గ్లో అప్ చేసి, హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుందట. ఈ నిమ్మకాయ కొల్లాజెన్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుందట. అలాగే కొబ్బరిలో ఉండే సహజ చక్కెరలు స్థిరమైన శక్తిని అందించి, ఆకస్మికంగా చక్కెర లెవల్స్ పడిపోవడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు నిపుణులుతయారీ విధానం:ఇంట్లో దీన్ని ఎలా తయారు చేయాలంటే..కావలసినవి: 1 కప్పు తాజా కొబ్బరి నీరు (240 మి.లీ)2 టేబుల్ స్పూన్లు తాజా నిమ్మరసం 1 టీస్పూన్ తేనె లేదా బెల్లం సిరప్చిటికెడు నల్ల ఉప్పు లేదా కొన్ని పుదీనా ఆకులు తయారీ: కొబ్బరి నీటిలో నిమ్మరసం వేసి బాగా కలపండి. కావాలనుకుంటే తేనె లేదా బెల్లం కూడా కలుపుకోవచ్చు. చల్లగా కావాలనుకుంటే కొంచెం ఐస్, పుదీనా రెమ్మతో సర్వ్ చేసుకోవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల కోసం 1/2 టీస్పూన్ తురిమిన అల్లం కూడా జోడించొచ్చు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తి గత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డు
శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్ చమరి ఆతపట్టు అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి శ్రీలంక ఉమెన్ క్రికెటర్‌గా ఆతపట్టు చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా సోమవారం ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఫీట్ సాధించింది.మహిళల వన్డేల్లో ఈ రికార్డు సాధించిన నాలుగో ఆసియా బ్యాటర్‌గా ఆతపట్టు నిలిచింది. ఈ శ్రీలంక ఉమెన్ క్రికెటర్‌గా ఆమె దారిదాపుల్లో లేరు. లంక తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శశికళ సిరివర్ధనే 2029 పరుగులతో రెండో స్థానంలో ఉంది.కాగా ఈ మ్యాచ్‌లో ఆతపట్టు దూకుడుగా ఆడింది. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 46 పరుగులు చేసి ఔటైంది. బౌలింగ్‌లో అయితే ఆమె సత్తాచాటింది. చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. ఆతపట్టు బంతితో మ్యాజిక్ చేసింది.ఓ రనౌట్‌తో పాటు వరుసగా నాలుగు వికెట్లు సాధించింది. మధ్యలో రనౌట్ ఉండడంతో ఆమె హ్యాట్రిక్ పొందే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె సంచలన బౌలింగ్ కారణంగా బంగ్లాపై 7 వికెట్ల తేడాతో లంక విజయం సాధించింది.టోర్నీ నుంచి ఔట్..కాగా ఈ టోర్నీలో శ్రీలంక జట్టు మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. శ్రీలంక మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలవ్వగా.. మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ప్రస్తుతం ఆతపట్టు సేన పాయింట్ల పట్టికలో ఆరో స్దానంలో ఉంది. లంక జట్టు సెమీస్‌కు చేరడం దాదాపు ఆసాధ్యం అనే చెప్పాలి. ఈ జట్టుకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.చదవండి: IND vs SA: అగార్కర్‌తో విభేదాలు.. మహ్మద్ షమీకి ఊహించని షాక్ -
మరోసారి తుస్సుమన్న బాబర్.. ఎలా భరిస్తున్నార్రా సామీ..!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) మరోసారి విఫలమయ్యాడు. రావల్పిండి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో (Pakistan Vs South Africa) 16 పరుగులకే ఔటయ్యాడు. బాబర్ వరుస వైఫల్యాలు చూసి సొంత అభిమానులే విసుగెత్తిపోయారు. మిగతా దేశ క్రికెట్ అభిమానులైతే.. వీడిని ఎలా భరిస్తున్నార్రా సామీ అంటూ తలలు బాదుకుంటున్నారు. పాక్ క్రికెట్ బోర్డుకు గతిలేక ఈ జింబాబర్ను పట్టుకొని వేలాడుతుందని కామెంట్లు చేస్తున్నారు.రెండేళ్లైపోయింది..!బాబర్ అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసి రెండేళ్లైపోయింది. అతను చివరిగా 2023 ఆగస్ట్ 30న పసికూన నేపాల్‌పై వన్డే సెంచరీ చేశాడు. అప్పటి నుంచి 73 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్ ఒక్కసారి కూడా మూడంకెల మార్కును తాకలేకపోయాడు. మధ్యలో అడపాదడపా అర్ద సెంచరీలు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆల్ ఫార్మాట్ కెప్టెన్సీని కోల్పోయిన బాబర్ ప్రస్తుతం జట్టులో చోటు కూడా ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. అతన్ని పొట్టి ఫార్మాట్ నుంచి ఇదివరకే పక్కన పెట్టేశారు. వన్డేల్లో, టెస్ట్‌ల్లో గత్యంతరం లేక పాక్ క్రికెట్ బోర్డు అతన్ని కొనసాగిస్తుంది. రెండేళ్లకు పైగా ఫామ్ కోల్పోయిన బాబర్‌ను పాక్ అభిమానులు ఓ దశలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో పోల్చారు. ఇప్పుడు కూడా కొందరు పాకీలు బాబర్ ఆజమ్ విరాట్ కంటే మెరుగైన బ్యాటర్ అని నిస్సిగ్గుగా చెప్పుకుంటుంటారు. సోషల్‌మీడియాలో బాబర్ అభిమానుల ఓవరాక్షన్‌కు కొందరు చురుకలంటిస్తుంటారు. అయినా వారి తంతు అలాగే కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బాబర్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో (23, 42) విఫలమయ్యాడు. తాజాగా రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అదే తంతు కొనసాగింది. ఇవాళే (అక్టోబర్ 20) మొదలైన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 69 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులుగా ఉంది. అబ్దుల్లా షఫీక్ (57), ఇమామ్ ఉల్ హక్ (17), బాబర్ ఆజమ్ (16) ఔట్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (85), సౌద్ షకీల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: సాల్ట్, బ్రూక్ విధ్వంసం.. రషీద్ మాయాజాలం.. ఇంగ్లండ్ ఘన విజయం -
క్యాబ్ డ్రైవర్‌గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..
విదేశాల్లో సెటిల్ అవ్వడం చాలామంది యువత డ్రీమ్. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ అలాంటి ఆలోచన చేసే ముందు అక్కడ నియమ నిబంధనలు గురించి క్షణ్ణంగా తెలుసుకోవాలి లేదంటే..తీరా కోర్సు పూర్తి చేశాక ఉద్యోగం చేసేందుకు వీలు లేకపోతే పరిస్థితి అగమ్యగోచరం. అందుకు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి అంటోంది ఈ బెంగళూరు మహిళ. అసలేం జరిగిందంటే..కెనడాలో క్యాబ్ నడుపుతున్న ఒక వైద్యుడిని కలిసిన బెంగళూరుకి చెందిన మేఘన శ్రీనివాస్ అందుకు సంబంధించిన వీడియో సంభాషణను నెట్టింట షేర్ చేశారు. మిస్సిసాగా నుంచి టొరంటోకు ట్రావెల్ చేస్తుండగా ఆ డ్రైవర్ని కలిశారామె. అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఆ డ్రైవరర్ తాను కెనడాలో డిగ్రీ చదువుతున్నట్లు తెలిపాడు. తన ఖర్చుల కోసం అని క్యాబ్నడుపుతున్నట్లు ఆమెతో చెప్పాడు. క్యాబ్ నడపుతూ తాను రూ. 3 లక్షల వరకు సంపాదిస్తున్నానని, అందులో కేవలం సింగిల్ బెడ్రూం కోసమే ఏకంగా రూ 2 లక్షలు పైనే ఖర్చు చేస్తున్నట్లు మేఘనతో వాపోయాడు. తాను గతంలో అమెరికా, కెనడా సైనిక వైద్యుడిగా పనిచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కెనడాలో ప్రజప్రతినిధిగా ఉన్నట్లు తెలిపారు. తాను కెనడాలో తన వైద్య వృత్తిని కొనసాగించడానికి, వైద్య లైసెన్సు పొందేందుకు నానా తిప్పలు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చివరగా ఆ వీడియోలో మేఘన దయచేసి కెనడాలో సెటిల్ అవ్వాలనుకుంటే అన్ని విషయాలను తెలుసుకుని సరైన విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో ఇక్కడకు రావాలనుకునే విద్యార్థులు కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ తీరు తెన్నులు..జీవిత వాస్తవాలు గుర్తించి పూర్తిగా తెలుసుకుని రావడం మంచిదని చెప్పుకొచ్చింది మేఘన. చివరగా ఆమె ఈ దేశం మనకు అద్భతమైన అవకాశాలను ఇస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు కానీ అందుకు అచంచలమైన ఓర్పు చాలా అవసరమని అన్నారామె. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి..అంతర్జాతీయ వైద్య గ్రాడ్యుయేట్లకు సంబంధించి.. నియమాలు, చట్టాల మారాయి. స్థానికత లభించడం దాదాపు అసాధ్యం అని ఒకరు, విదేశీ వైద్యులు అక్కడ ఉద్యోగం పొందడం చాలా కష్టం అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Meghana Srinivas | Realtor, Windsor ON (@meghana.srinivasa_) (చదవండి: 'కూతుళ్లు మన ఇంటి లక్ష్మీ దేవతలు'..! వారి రాకతోనే..: నీతా అంబానీ) -
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదని, పౌరులు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే పోలీసుల అత్యాగాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. మంగళవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా. దేశం కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన వచ్చినా పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు అమరులయ్యారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీస్ అమరవీరులకు నాలుగు కోట్ల ప్రజల పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలోనే ప్రాణాలు పొగొట్టుకున్నారు. ప్రమోద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇంటి స్థలం మంజూరు చేస్తున్నాం. అమరవీరుల కుటుంబాలకి ఇచ్చే ఎక్స్ గ్రేషియాను భారీగా పెంచి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం... రోజు రోజుకు నేరాల స్వభావం మారుతోంది. కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాల్‌గా మారుతున్నాయి. శాంతి భద్రతల కట్టడికి పోలీసులకు ఫ్రీహ్యాండ్ ఇచ్చాం. అందుకే అసాంఘిక కార్యకలాపాలు కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా పని చేస్తోంది. డ్రగ్స్ రహిత తెలంగాణే మా ధ్యేయం. దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ ప్రథమ స్థానంలో ఉంది. సాంకేతికతలో తెలంగాణ పోలీసులు ముందు ఉన్నారు. సైబర్ క్రైమ్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులు మంచి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం. విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాం. ఇటీవల కొందరు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలంటే శాంతిభద్రతలు బాగుండాలి. తెలంగాణ అభివృద్ధిలో వారి వంతు తోడ్పాటు అందించాలి. అలాగే.. పోలీసుల గౌరవం పెరిగితేనే ప్రభుత్వ గౌరవం కూడా పెరుగుతుంది. సోషల్ మీడియా ప్రభావం బాగా ఉన్న ఈ రోజుల్లో.. పోలీసుల ప్రతీ అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి అని సీఎం రేవంత్ సూచించారు.తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రసంగిస్తూ.. పోలీస్ అధికారులు అవినీతికి, నిర్లక్ష్యానికి తావు లేకుండా నిధులు నిర్వహించాలి. దేశంలోనే తెలంగాణ పోలీసులు అద్భుత ప్రతిభ చూపిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను ఒకరోజు గుర్తు చేసుకుంటే సరిపోదు. వాళ్ళ కుటుంబాన్ని పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ పై ఉంది. ఉగ్రవాదులు, తీవ్రవాదుల చేతిలో చనిపోయిన కుటుంబాలకు అధిక ఎక్స్‌గ్రేషియా కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అని అన్నారు. -
హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడి
లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో నబాతియే (Nabatieh) ప్రాంతంలోని కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి.ఈ దాడులపై ఐడీఎఫ్ ప్రతినిధి స్పందిస్తూ.. ఉత్తర కమాండ్ నేతత్వంలో ఐడీఎఫ్.. లెబనాన్‌లోని నబతియే ప్రాంతంలో హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిందని తెలిపారు. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ లెబనాన్ అంతటా ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తోందని.. హిజ్బుల్లా కార్యకలాపాలు.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఐడీఎఫ్ పేర్కొంది. -
Stock Market: ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
దీపావళి సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు దలాల్ స్ట్రీట్‌లో టపాసుల్లా పేలాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు అర శాతానికి పైగా ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 661 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 84,614 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 50 సూచీ 191 పాయింట్లు లేదా 0.74 శాతం పెరిగి 25,901 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బాన్, బజాజ్ ట్విన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అయితే క్యూ 2 ఫలితాల తరువాత పెట్టుబడిదారులు స్టాక్ లో లాభాలను బుక్ చేయడంతో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ లూజర్‌గా నిలిచింది. అల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం స్టాక్స్ కూడా నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. ఇతర రంగాల సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 0.7 శాతం దాకా పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు
టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర స్టార్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇకపై ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లలో భారత్‌కు వహిస్తున్న నితీశ్ .. తాజాగా వన్డేల్లోకి కూడా అడుగుపెట్టాడు.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా నితీశ్ భారత్ తరపున 50 ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తేడాది నవంబర్ 22వ తేదీ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ డెబ్యూ క్యాప్ అందుకున్న ఈ తెలుగు కుర్రాడు.. ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదగా వన్డే క్యాప్‌ను తీసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన నితీశ్..93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో పెర్త్ వేదికగా టెస్ట్, వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 1932 నుంచి భారత్ క్రికెట్ ఆడుతున్నప్పటికి ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. 2024/25 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పెర్త్ వేదికగా టెస్టుల్లో డెబ్యూ చేసిన నితీశ్.. యాదృఛ్చికంగా ఏడాది తర్వాత అదే మైదానంలో వన్డే అరంగేట్రం చేశాడు.ఇంతకముందు పెర్త్ వేదికగా బరిందర్ శ్రణ్, సుబ్రోతో బెనర్జీలు భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేయగా.. హర్షిత్ రాణా, వినయ్ కుమార్‌లు టెస్టుల్లో అరంగేట్రం చేశారు. కానీ నితీష్ ఒక్కడే రెండు వైట్ బాల్ ఫార్మాట్లలోనూ పెర్త్‌లో డెబ్యూ చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), కోహ్లి(0), గిల్(10) తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్ వుడ్, ఈల్లీస్ తలా వికెట్ సాధించారు. అయితే వర్షం కారణంగా ఆట ఆగిపోయింది.చదవండి: Virat Kohli: రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే? -
చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో వెలుగులు లేని దీపావళిపై సోమవారం (అక్టోబర్ 20) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. చంద్రబాబు మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా?1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్, నెల నెలా రూ.4వేలు.4.ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట5.ఎంతమంది పిల్లలు ఉన్నా, ఆ పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15,0006.ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు7.అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం…8.ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలుఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? లేక మీరు రాకముందు వరకూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా?. వీటితోపాటు స్కూళ్లు, ఆస్పత్రులు, విద్యా, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత ఇవన్నీకూడా వెలగని దీపాలే కదా.మా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2019-24 మధ్య… ఇంటింటికీ అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు, ఇంటింటా నెలకొన్న చీకటికి ప్రతినిధులు’ అంటూ ధ్వజమెత్తారు. .@ncbn గారూ… మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా, మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా? 1.నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి2.ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,0003.50 ఏళ్లకే పెన్షన్,…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025