breaking news
-
నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణం
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేస్తున్న 38 ఏళ్ల ఇంజినీర్ ఆత్మహత్య కేసులో బెంగళూరు నగర పోలీసులు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్‌తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. యాజమాన్యం వేధింపుల కారణంగానే తన సోదరుడు చనిపోయినట్లు అశ్విన్ కన్నన్ ఫిర్యాదు చేశాడు. ఆ ఆరోపణలకు బలం చేకూరేలా మృతుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.మృతుడిని బెంగళూరులోని చిక్కలసంద్రకు చెందిన కె. అరవింద్‌గా గుర్తించారు. అతను 2022 నుంచి ఓలా ఎలక్ట్రిక్‌లో హోమోలోగేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 28న అరవింద్ మృతి చెందగా అతని సోదరుడు అశ్విన్ కన్నన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 6న కేసు నమోదైంది.బీఎన్ఎస్ సెక్షన్ 108భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లో భవీష్ అగర్వాల్‌తో పాటు వెహికల్ హోమోలోగేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ హెడ్ సుబ్రత్ కుమార్ దాష్, ఇతరులను కేసులో చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు, మృతుడి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. అరవింద్ తన 28 పేజీల సూసైడ్ నోట్లో దాష్, అగర్వాల్ తనను పనిలో వేధిస్తున్నారని తెలిపారు. అలాగే జీతాలు, ఇతర ప్రోత్సాహకాలు కూడా సక్రమంగా చెల్లించలేదని చెప్పారు. ఇది అరవింద్‌ను తీవ్ర నిరాశకు గురిచేసిందని మృతుడి సోదరుడు అశ్విన్ పేర్కొన్నారు. పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.మరణం తర్వాత అనుమానాస్పద లావాదేవీలుఅశ్విన్ కన్నన్ ఫిర్యాదు ప్రకారం అరవింద్ మరణించిన రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 30న నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(NEFT) ద్వారా అతని బ్యాంకు ఖాతాలో రూ.17,46,313 జమ చేశారు. ‘అతని బ్యాంకు ఖాతాలో ఇంత భారీ డబ్బు జమ కావడంతో నాకు అనుమానం వచ్చింది. సుబ్రత్ కుమార్ దాష్‌ను విచారించిన తరువాత అతను హెచ్ఆర్ (HR)ను సంప్రదించాలని కోరాడు. వారిని కలిసిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధులు కృతేష్ దేశాయ్, పరమేష్, రోషన్ అందరూ ఇంటికి వచ్చి డబ్బు లావాదేవీల గురించి వివరించారు. కంపెనీ ఏదో సమాచారాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’ అని అశ్విన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.కొనసాగుతున్న దర్యాప్తుఈ కేసును తొలుత అసహజ మరణంగా నమోదు చేసినట్లు డీసీపీ (సౌత్ వెస్ట్) అనితా బి హద్దన్నవర్ తెలిపారు. అయితే డెత్ నోట్ వెలుగులోకి వచ్చిన తరువాత మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఆమె చెప్పారు. ‘మేము ఈ కేసును పరిశీలిస్తున్నాం. దర్యాప్తు జరుగుతోంది’ అని తెలిపారు. ఈ విషయంలో భవీష్ అగర్వాల్, దాష్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. -
‘చంద్రబాబు.. దీనినే క్రెడిట్ చోరీ అంటారు’
కాకినాడ: 2019 నుంచి 2024 కాలంలో దేశంలో ఎక్కడా జరగని విప్లవాత్మక సంస్కరణలను మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తే.. దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. దీనినే క్రెడిట్ చోరీ అంటారు.. చంద్రబాబు అని కురసాల ఎద్దేవా చేశారు. ‘గత మరచిపోయిన చంద్రబాబు.. అన్నీ తానే చేశాను అంటున్నారు.వైఎస్ జగన్ చేసిన మంచిని కూటమీ ప్రభుత్వం చోరి చేస్తుంది. చంద్రబాబుకు తోడు ఆయన కొడుకు లోకేష్ నలభై ఆబద్దలు చెబుతున్నాడు. నోరు తెరుస్తే నిజం చెప్పకుండా తండ్రి కొడుకులు పచ్చి ఆబద్దలు ఆడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ,డేటా సెంటర్,పోర్టు లను తామే కొబ్బరి కొట్టి ప్రారంభించినట్లు చెబుతున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనీసం గత చంద్రబాబు పాలనలో భూసేకరణ చేయ్యలేదు. *సెజ్ భూములను తిరిగి ఇవ్వడం కూడా తనదే క్రెడిట్ గా చెప్పుకున్నారు. *దీనికి వంత పాడుతున్న ఎల్లో మీడియా.. సెజ్ భూములను తిరిగి ఇస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ మంత్రిగా ఉన్న నన్ను సెజ్ భూములు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమీటికి ఛైర్మన్‌గా నియమించారు.ఆనాడు జీవో నెం : 158 ద్వారా 2180 ఎకరాల సెజ్ భూములను వెనక్కి ఇచ్చేశారు. సెజ్ భూములు తిరిగి ఇవ్వడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ మోమో ఇచ్చింది. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన జీవోను అమలు చేయ్యమని ఆ మోమో లో ఉంది. గత టిడిపి పాలనలో సెజ్ పోరాట కమీటి నాయకులను గృహనిర్భం చేశారు. ఉద్యమకారులపై పోలీసులతో దమణకాండ చేసి... అక్రమ కేసులు పెట్టించారు. జైళ్ళల్లో నిర్బందించి రైతులను, ఉద్యమకారులను వేధించారు. 2014కు ముందు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములని తిరిగి ఇచ్చేస్తానని హమీ ఇచ్చారు చంద్రబాబు. సెజ్ కోసమే భూసేకరణ ముఖ్యం.. గ్రామలు ఎలా పోయిన పర్వాలేదని ఆనాడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ లో వదిలేయగా లేనిది..మా భూములు ఇవ్వాలని 16 రాష్ట్రాలకు సంబంధించిన సెజ్ భూముల కేసులు సుప్రీం కోర్టులో నడుస్తున్నాయి. 158 జీవో ద్వారా స్ధానికులకు 78% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాం...దానిని అమలు చేయ్యండి. సెజ్ రైతులపై చంద్రబాబు సర్కార్ బనాయించిన అక్రమ కేసులను జగన్ ఎత్తివేశారు.వాటిలో ఇంకా ఉన్న కొన్ని కేసుల ఇప్పుడు ఎత్తివేయ్యండి. దీవీస్ తీసుకున్న ఎస్సైన్డ్ భూములు ఎకరాకు రూ.10 లక్షలు రైతులకు ఇప్పించారు. జిఎంఆర్ రూ. 300 కోట్లు, కేవీ రావ్ 600 కోట్లు రుణాలు తెచ్చారు. శ్మసానాలు,చెరువులను కూడా సేకరించారు. వాటిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపరు. క్రెడిట్ చోరి తప్పా...మరో ఆలోచన చంద్రబాబుకు లేదు. సెజ్ లో జరిగిన తప్పులపై చర్యలు తీసుకోండి. కూటమి ప్రభుత్వం లో పబ్లిసిటీ పీక్...పనిలో వీక్. కార్పోరేట్ కంపెనీలు అంటే...జీ హుజీర్ అంటూ చంద్రబాబు సాగిలపడిపోతాడు’ అని ధ్వజమెత్తారు కురసాల కన్నబాబు.విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు -
నువ్వో డ్రగ్ డీలర్
పామ్ బీచ్(అమెరికా): అగ్రరాజ్యాధినేతననే అహంకారంతో తనకు నచ్చని ప్రతి దేశంపై ఆంక్షలు, నిషేధాజ్ఞల కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు. కొలంబియాలో తయారైన మాదకద్రవ్యాలు అమెరికాలోకి పోటెత్తుతున్నాయని, ఇందుకు గుస్తావోనే కారణమని ఆయనపై అంతెత్తున లేచారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్ చేశారు. ‘‘గుస్తావో ఒక పెద్ద అక్రమ మాదకద్రవ్యాల డీలర్. పేరు ప్రఖ్యాతలు లేని, అసలు ప్రాముఖ్యతే లేని రాజకీయనేత. కొలంబియా డ్రగ్స్ దందాను వెంటనే ఆపేయాలి. లేదంటే మిమ్మల్ని బాధపెడుతూ మేమే బలవంతంగా ఆపుతాం. కొలంబియా వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ స్థాయిలో మాదకద్రవ్యాల తయారీని గుస్తావో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దేశీయంగా డ్రగ్స్‌ను ఆయన అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అమెరికా నుంచి భారీస్థాయిలో నగదు సబ్సిడీలు, వెసులుబాట్లు పొందుతూ కూడా గుస్తావో డ్రగ్స్ ఉరవడికి అమెరికాలోకి రాకుండా ఆపలేకపోతున్నారు. ఇది నిజంగా అమెరికాను మోసంచేయడమే. ఇకపై కొలంబియాకు అమెరికా చేసే సాయం ఆపేస్తా’’అని ట్రంప్ హెచ్చరించారు. -
అనన్య నాగళ్ల దీపావళి సెలబ్రేషన్స్.. అమ్మ శారీలో హీరోయిన్ నభా నటేశ్!
భర్తతో కలిసి మౌనీరాయ్ దీపావళి పూజలు.. పచ్చ ఓణిలో అనన్య నాగళ్ల దీపావళి లుక్స్.. దీపావళి వెలుగుల్లో వితికా శేరు హోయలు.. అమ్మ చీరలో మెరిసిన హీరోయిన్ నభా నటేశ్.. గ్రీన్ డ్రెస్‌లో నిక్కీ గార్లానీ దివాళీ లుక్.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) -
Pakistan: శుభాకాంక్షలకు ‘ఏఐ’.. ప్రధానిపై నెటిజన్ల ఆగ్రహం
న్యూఢిల్లీ: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి సందర్భంగా హిందువులకు అందించిన శుభాకాంక్షలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విమర్శలతో విరుచుకు పడుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్‌లోని మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతుండగా, మరోవైపు ఈ రకంగా ఈ శుభాకాంక్షలు చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రధాని షరీఫ్ ‘ఏఐ’ వినియోగించారని ఆరోపిస్తున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ఒక గుర్తు. ఈ పండుగ శాంతి, సామరస్యం, కరుణలను మనలో పెంపొందించి, ఉమ్మడి శ్రేయస్సు వైపు నడిపించాలి’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రధాని షరీఫ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో హిందువులు ఎదుర్కొంటున్న హింసను గుర్తు చేస్తూ, ప్రధాని అందించిన ఈ సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025ఒక యూజర్ ‘అసలు పాకిస్తాన్లో హిందువులెవరైనా మిగిలి ఉన్నారా? అని ప్రశ్నించగా, మరొకరు అక్కడి బలవంతపు మతమార్పిడులు, దేవాలయాలపై దాడుల ఘటనలను ప్రస్తావించారు. ‘పహల్గామ్లో హిందువులను హత్య చేశాక ఇలా దీపావళి శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటంటూ మరొకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక యూజర్ ‘ఇది దౌత్యమా? లేక చాట్ జీపీటీ మీ ఖాతాను హ్యాక్ చేసిందా?’ అని ప్రశ్నించారు. On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025 -
విమాన ప్రమాదం.. అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లి..
హాంకాంగ్: హాంకాంగ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Hong Kong Airport) కార్గో విమానం రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హాంకాంగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంలో(cargo Flight Accident) సోమవారం తెల్లవారుజామున 3.50 సమయంలో బోయింగ్ 747-481 మోడల్‌కి చెందిన కార్గో విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకొన్న ఎమిరేట్స్ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్‌వేపై దిగి అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందారు. విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.New footage of the Air ACT 747 that ran off the runway at Hong Kong International Airport this morning. pic.twitter.com/3tHlBwruwu— OSINTtechnical (@Osinttechnical) October 20, 2025ప్రమాదం కారణంగా విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. బోయింగ్ 737 శ్రేణికి చెందిన EK9788 విమానాన్ని ఎమిరేట్స్ నుంచి తుర్కియే సంస్థ ఏసీటీ ఎయిర్ లైన్స్ లీజుకు తీసుకొని నడుపుతోంది. ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.‼️Sortie de piste d’un Boeing 747 Cargo à Hong Kong🔸L’appareil de la compagnie turque Air Act opérait un vol depuis Dubaï pour le compte d’Emirates🔸Le Boeing était à l’atterrissage piste 07L, quand il a fait une sortie latérale de piste et a terminé sa course dans la mer… pic.twitter.com/1LRFBnzv24— Aero Gazette ✈️ (@AeroGazette) October 20, 2025 -
ఐదేళ్లుగా బహ్రెయిన్ మార్చురీలో మృతదేహం
మెట్పల్లి: సుమారు పదిహేడేళ్ల క్రితం.. ఎన్నో ఆశలతో ఆ యువకుడు ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అతడికి అప్పటికే వివాహమైంది. భార్య, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఏడారి దేశానికి వలసవెళ్లాడు. అక్కడకు వెళ్లిన రెండేళ్ల వరకు తరచూ ఫోన్ చేసిన అతడు.. అనంతరం ఆచూకీ లేకుండాపోయాడు. అప్పటినుంచి ప్రతిరోజు అతని ఫోన్ కోసం.. ఇంటికి వస్తాడనే ఆశతో గుమ్మం వైపు చూసీచూసీ కుటుంబ సభ్యులు అలసిపోయారు. ఎక్కడో బతికి ఉంటాడని, ఎప్పుడైనా ఇంటికొస్తాడని అనుకుంటున్న వారికి రెండురోజుల క్రితం అతడు సజీవంగా లేడనే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని తెలియడంతో వారంతా ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాంనగర్‌కు చెందిన భారతి, అశోక్ దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే వారు మరణించారు. వారి చిన్న కుమారుడు నరేశ్‌ను అతని చిన్నమ్మ శ్రీపాద లక్ష్మీ దత్తత తీసుకుంది. 2007లో అతడికి కథలాపూర్ మండలానికి చెందిన యువతితో వివాహమైంది. కొంతకాలానికే ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లాడు. రెండేళ్ల వరకు కుటుంబసభ్యులు, బంధువులకు తరచూ ఫోన్ చేస్తూ ఉండేవాడు. తర్వాత చాలాకాలం పాటు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. అక్కడ ఉంటున్న ఈ ప్రాంతం వారిని ఆరా తీసినప్పటికీ సమాచారం లభించలేదు. పాస్‌పోర్ట్ గడువు ముగిస్తే ఇంటికి వస్తాడని భావించారు. అయినా రాకపోవడంతో నరేశ్ (39) ఆచూకీ కోసం అతని భార్య కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏళ్లు గడుస్తున్నా అతని ఆచూకీ దొరకకున్నా.. ఎక్కడో సజీవంగా ఉంటాడని భావిస్తున్న కుటుంబసభ్యులకు రెండు రోజుల క్రితం గుండెలను పిండేసే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే నరేశ్ మృతి చెందాడని, అతని మృతదేహం బహ్రెయిన్‌లోని ఓ మార్చురీలో ఉందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాస్‌పోర్టు గడువు ముగిసినప్పటికీ నరేశ్ అక్కడే ఉండిపోవడం.. మరణించిన తర్వాత అతని వివరాలు తెలియకపోవడంతో ఇంతకాలం మృతదేహాన్ని అక్కడి మార్చురీలోనే భద్రపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతని వివరాలు తెలియడంతో భారత ఎంబసీ అధికారులు.. వాటిని బహిర్గతం చేయడం ద్వారా కుటుంబసభ్యులకు చేరింది. నరేశ్ సోదరుడు ఆనంద్ మృతదేహాన్ని తెప్పించి తమకు అప్పగించాలని మంగళవారం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ద్వారా సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. 17 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన నరేశ్ కొంతకాలానికే ఆచూకీ లేకుండా పోవడం.. చివరకు అక్కడే అసువులు బాయడం స్థానికులను కలచివేసింది. -
బిహార్ ఎన్నికల్లో ‘వెరైటీ’ ఫ్రెండ్లీ ఫైట్!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య లుకలుకలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకంపై స్పష్టమైన ప్రకటనేదీ చేయకుండానే రాష్ట్రీయ జనతాదళ్(RJD), కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు.. తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేశాయి. దీంతో మహాఘట్ బంధన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. పైగా కీలకమైన 11 స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు తలపడబోతుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఈ పోటీని ఫ్రెండ్లీ ఫైట్‌గా అభివర్ణించుకున్నప్పటికీ.. బీజేపీ, జేడీయూ, ఇతర ఎన్డీయే మిత్రపక్షాలు మాత్రం విపక్ష కూటమిని ఎద్దేవా చేస్తున్నాయి. ఈలోపు.. ఊహించని పరిణామం ఒకటి అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే.. తన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ప్రచారం చేయాల్సి రావడం!.గౌర బౌరమ్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి అఫ్జల్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్ అఫ్జల్ తరఫున కాకుండా వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(VIP Candidate) సంతోష్ సాహ్నికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు.గౌర బౌరమ్ నియోజకవర్గంలో పోటీకి ఆర్జేడీ తరఫున అఫ్జల్ అలీ ఖాన్‌ను తొలుత అధిష్టానం ఎంచుకుంది. ఆ పార్టీ అధినేత లాలూ తన నివాసానికి పిలిచి మరీ అఫ్జల్‌కు పార్టీ గుర్తు (లాంతరు)తో క్లియరెన్స్ ఇస్తూ సీల్డ్ కవర్ అందజేశారు. ఆ సంతోషంలో.. ఆలస్యం చేయకుండా ప్రచారంలోకి దిగిపోయారు. ఆ వెంటనే నామినేషన్ దాఖలు చేశారు.ఈలోపు.. లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఎంట్రీతో సీన్ మారింది. సీట్ల పంపకంలో భాగంగా.. గౌర బౌరమ్ను వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి అప్పగించినట్లు లాలూకు వివరించారు. ఆపై నామినేషన్ వెనక్కి తీసుకోవాలని అఫ్జల్‌ను కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించాడు. ఈలోపు నామినేషన్ల గడువు ముగిసిపోయింది. దీంతో ఎన్నికల అధికారులను ఆర్జేడీ ఆశ్రయించింది. అయితే రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లో అభ్యంతరాలు లేవని చెబుతూ.. పోటీ నుంచి తొలగించలేమని చేతులెత్తేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈవీఎం మీద ఆర్జేడీ లాంతర్ గుర్తుతో అఫ్జల్ అలీ అధికారికంగా పోటీ చేయబోతున్నారు. అలా మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకాల గ్యాప్ వల్ల తన పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థికి వ్యతిరేకంగా తేజస్వి ప్రచారం చేసే అరుదైన పరిస్థితి ఏర్పడింది(Gaura Bauram RJD Fight).2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌర బౌరమ్ స్థానం వీఐపీ పార్టీకి చెందిన స్వర్ణ సింగ్‌కు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నెగ్గిన ఆమె తర్వాత బీజేపీలో చేరారు. అంతకు ముందు.. 2015, 2010 ఎన్నికల్లో జేడీయూ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కొసమెరుపు.. పైన చెప్పుకున్న సందర్భం మొదటిసారేం కాదు. కిందటి ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ రాజస్థాన్ బన్స్వారా నియోజకవర్గంలో ఇదే తరహ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అరవింద్ దామోత్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆపై మనసు మార్చుకున్న హైకమాండ్ భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ రౌత్‌కు సీటు కేటాయిస్తూ.. తన అభ్యర్థిని సింబల్ రిటర్న్ చేయమని కోరింది. అయితే పార్టీకి మస్కా కొట్టి నామినేషన్ ఉపసంహరణ గడువు దాకా దామోత్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో.. కాంగ్రెస్‌కు తన అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆ ఎన్నికల్లో రౌత్ విజయం సాధించినప్పటికీ.. దామోత్కు 60 వేల ఓట్లు పోలయ్యాయి. -
పాక్ స్మగ్లర్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు
ఇరాన్ నుండి యెమెన్‌లోని హౌతీలకు బాలిస్టిక్ క్షిపణి భాగాలను అక్రమంగా రవాణా చేసినందుకు పాకిస్తాన్ పౌరుడు ముహమ్మద్ పహ్లావన్‌కు అమెరికాలోని వర్జీనియా కోర్టు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అరేబియా సముద్రంలో అమెరికా సైనిక ఆపరేషన్ సందర్భంగా పహ్లావన్‌ను అరెస్టు చేశారు. గతేదాడి అమెరికా సైనిక ఆపరేషన్ చేపట్టగా, తాజాగా పాక్ పౌరుడు పహ్లావన్‌కు బుక్ అయ్యాదు. హౌతీలకు బాలిస్టిక్ క్షిప;ణులన అందించే క్రమంలో పహ్లావన్ సిబ్బంది తాము మత్స్యకారులుగా నమ్మించి అధికారుల్ని బురిడీ కొట్టించారు. ఎర్ర సముద్రం, అడెన్ గల్ఫ్‌లోని అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని, వారు గాజా ప్రజలకు మద్దతుగా వ్యవహరిస్తూ ఆయధాల ఆక్రమ రవాణా చేసేవారు. అయితే తాము హౌతీలకు ఆయుధాలు సరఫరా చేయలేదని ఇరాన్ పదే పదే ఖండిస్తూ వచ్చింది. పహ్లావాన్ పడవలో దొరికిన ఆయుధాల అక్రమ రవాణాను కోర్టు ముందుకు తీసుకొచ్చిన యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు.. ఆయుధ వ్యవస్థలోని అత్యంత శక్తిమంతమైన ఆయధాలుగా నిరూపణ చేశారు. దాంతో పహ్లావన్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ యూఎస్ కోర్టు తీర్పు చెప్పింది. -
జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు..కన్సల్టెంట్‌గా అడ్వొకేట్ ఉమేష్ సాల్వి
న్యూఢిల్లీ: జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వివాదంలో భాగంగా ఆ కేసును విచారించే జడ్డిల కమిటీకి సహాయం చేయడానికి న్యాయవాది కరణ్ ఉమేష్ సాల్వి కన్సల్టెంట్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా.. ఉమేష్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ వర్మపై అభిశంసన ప్రక్రియలను ప్రారంభించడానికి లోక్‌సభలో మద్దతు ఇచ్చిన తీర్మానం తర్వాత ఈ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా సదర కమిటీకి న్యాయ సహాయం అందించడానికి కరణ్ ఉమేష్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమించారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలన్న ప్రతిపాదనపై ఆగస్టు నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో 146 మంది ఎంపీలు సంతకాలు చేశారు. దీనిలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జిల ప్యానల్‌ను నియమించగా, తాజాగా కరణ్ ఉమేవ్ సాల్విని కన్సల్టెంట్‌గా నియమించారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ మోహన్ శ్రీవాస్తవ్, సీనియర్ న్యాయవాది బి.వి. ఆచార్యలు సభ్యులుగా ఉన్నారు. ఇదీ చదవండి: పాక్‌ను వణికించిన దీపావళి.. యాంటీ స్మోగ్ గన్లతో తక్షణ చర్యలు