breaking news
-
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీ ఆగిపోయిందా?.. అసలు నిజమెంత?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్‌నీల్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ పాన్ ఇండియా చిత్రంపై నెట్టింట కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మధ్య కంటెంట్ సృజనాత్మక విషయంలో విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నారట. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతోనే ఈ మూవీ ఆగిపోయిందని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కానీ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 జూన్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే వెల్లడించారు. Who’s the culprit behind spreading fake news on #NTRNeel ?Some Paid Agenda working behind.... https://t.co/q16nhnWksa— prashanth Neel (@Prashant_neell) October 21, 2025 -
‘నో’ చెప్పడం ఎలాగో!?
జీవితం ఒకేసారి నాలుగు బంగారు అవకాశాలను ఇచ్చి అందులో కొన్నింటినే ఎంచుకోవాలనే పరిస్థితి తలెత్తితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించండి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన పరిస్థితే 20 ఏళ్ల టెక్కీకి ఎదురైంది. ఉద్యోగ వేటలో ఉన్న తనకు ముందుగా రెండు ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. ఆ రెండూ ఎంఎన్సీ సంస్థలు కావడంతో వాటికి అంగీకారం తెలిపి సంతకాలు చేశాడు. ఉన్నట్టుండి మరో రెండు కంపెనీల ఆఫర్లు వచ్చాయి. ఈసారి ఆఫర్ చేసినవి మునుపటి కంపెనీల కంటే టాప్ సంస్థలు. దాంతో ఇప్పటికే సంతకం చేసిన కంపెనీలకు ‘నో’ చెప్పడం ఎలాగో తెలియక తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్‌గా మారింది.ఈ టెక్కీ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. తన పరిస్థితి గమనించిన నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఆచరణాత్మకంగా ఆలోచించమని చెబుతున్నారు. ‘ఉద్యోగుల తొలగింపుల సమయంలో కంపెనీలు పెద్దగా పట్టించుకోవు. కాబట్టి మీరు కంపెనీ ఆఫర్‌ను తిరస్కరించడం పెద్ద విషయం కాదు’ అని ఒకరు సూచించారు. మర్యాదపూర్వకంగా ఒక ఈమెయిల్ పంపాలని కొందరు సలహా ఇచ్చారు. చివరి నిమిషంలో కంపెనీలు ఆఫర్ లెటర్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నందున ఆ యువకుడు చేరాలనుకుంటున్న సంస్థ గురించి కచ్చితంగా తెలిసే వరకు ఏ నిర్ణయం తీసుకోరాదని కొందరు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు -
డీఏ పీఆర్సీ అలవెన్స్ పేమెంట్స్ - తుస్స్
డీఏ పీఆర్సీ అలవెన్స్ పేమెంట్స్ - తుస్స్ -
అమిత్ షా కామెంట్స్.. నితీశ్‌కు టెన్షన్!
బిహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. మొదటి దశ పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రధాన కూటములు ఎన్డీఏ, మహాఘఠ్బందన్ గెలుపు వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిష్టిస్తారనే అనుమానం తాజాగా మొదలయింది. బిహార్‌కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన 74 ఏళ్ల నితీశ్ కుమార్‌కు మరో చాన్స్ ఉంటుందా, లేదా అనే చర్చ నడుస్తోంది. నితీశ్ మద్దతుదారులు మాత్రం ఆయనే మళ్లీ సీఎం అంటూ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే, ఎవరు సీఎం అవుతారనే దానిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలతో నితీశ్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక టీవీ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. "నితీష్ మా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ముందుగా తమ తమ పార్టీ నాయకులను ఎన్నుకుంటారు. తర్వాత వారు కలిసి కూర్చుని తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తారు" అని అన్నారు.నితీశ్‌కు బీజేపీ ధోకాఅమిత్ షా వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. నితీశ్ కుమార్‌కు బీజేపీ ధోకా ఇవ్వడం ఖాయమన్నట్టుగా ప్రచారం మొదలు పెట్టాయి. నితీశ్ మరోసారి సీఎం కాలేరని అమిత్ షా స్పష్టంగా చెప్పారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని ఎక్స్‌లో బీజేపీ వీడియో షేర్ చేసింది. అమిత్ షా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని, స్వప్రయోజనాల కోసం బిహార్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కమలనాథులు కౌంటర్ ఇచ్చారు.షాకు చిరాగ్ మద్దతు!అమిత్ షాకు మద్దతుగా బీజేపీ కీలక మిత్రుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. "ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ఎన్నుకునే సాధారణ ప్రక్రియ గురించి అమిత్ షా ప్రస్తావించారు. ఐదు పార్టీలతో కూడిన మా కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను గౌరవించాలి" అని అన్నారు. కాగా, సీట్ల పంపిణీ వ్యవహారంలో చిరాగ్ గట్టిగా పట్టుబట్టి లోక్ జన్ శక్తి పార్టీకి 29 సీట్లు సాధించుకున్న సంగతి తెలిసిందే.ముందే ప్రకటించాలిహిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మాత్రం భిన్నంగా మాట్లాడారు. కూటమిలో క్లారిటీ, యునిటీ కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించాలన్నారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అంటూ రాష్ట్రీయ లోక్‌మంచ్ (RLM) జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. నితీశ్ నాయకత్వంలో ఎన్నికల్లో గెలుస్తామని, మళ్లీ అధికారంలోకి వస్తామని మీడియాతో అన్నారు.పీకే జోస్యం ఫలిస్తుందా?నితీశ్ కుమార్‌కు ఈసారి అధికార యోగం లేదని జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చెబుతూ వస్తున్నారు. జేడీయూకి పరాభవం తప్పదని, 25 సీట్లు కూడా రావని ఆయన అంటున్నారు. శారీరకంగా అలసిపోయి, మానసికంగా బలహీనపడిన నితీశ్ కుమార్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించలేరని పేర్కొన్నారు. జేడీయూ సంప్రదాయ ఓట్లకు జన్ సురాజ్ పార్టీ గండి కొడుతుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేస్తున్నారు.చదవండి: 3 కోట్ల లగ్జరీ కారు.. 35 లక్షల బంగారంనల్లేరు మీద నడక కాదుబిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ ఫేస్‌గా నితీశ్ కుమార్ ప్రస్తుతం ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితుల గురించి అమిత్ షా సూచనప్రాయంగా వెల్లడించడంతో చర్చ మొదలైంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలు సాధించి, జేడీయూకు తక్కువ సీట్లు వస్తే నితీశ్‌కు సీఎం పదవి కట్టబెడతారా, లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 14న వెలువడే ఎన్నికల ఫలితాలపై నితీశ్ భవితవ్యం ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి: విక్రమ్ వారసుడు
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్(Dhruv Vikram) నటించిన కొత్త సినిమా బైసన్(Bison Kaalamaadan) . ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ధృవ్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాని మారి సెల్వరాజ్ తెరకెక్కించగా.. పా.రంజిత్ సమర్పించారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కోసం ధ్రువ్ చాలానే కష్టపడ్డాడు. తమిళ్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బైసన్ ఈనెల 24న తెలుగులో కూడా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో బైసన్ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. అయితే, టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ధ్రువ్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'మీతో మాట్లాడటానికి మూడేళ్లు వెయిట్ చేశాను.. ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. మా నాన్న విక్రమ్ మాదిరే నేను చాలా కష్టపడతాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి. నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. నాకు తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.' అంటూ తెలుగులోనే స్పీచ్ అదరగొట్టారు. ఏదో ఒక రోజు నాకు కొడుకు పుట్టి ఇలాగే సూట్‌కేస్ కొనడానికి వెళ్తే షాప్ ఓనర్ మీ నాన్న #Dhruv అంటే నాకు చాలా ఇష్టం అనిపించుకోవాలి... రాసుకొచ్చి తెలుగులో ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చిన Hero #DhruvVikram 👌👏 pic.twitter.com/ZthsjHBCks— Rajesh Manne (@rajeshmanne1) October 21, 2025 -
పాకిస్థాన్‌లో కేజీ టమాటా రూ.700
నిత్యావసర కూరగాయల్లో ముఖ్యమైన టమాటా ధర పాకిస్థాన్‌లో సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. అక్కడ కిలో టమాటా ధర రూ.700 పలుకుతుందంటే ఆ దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది నెలలుగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులన్నీ కలిసి టమాటా ధరలను ఆకాశానికి చేర్చాయి. టమాటా ధరల పెరుగుదలకు ప్రధానంగా ఈ క్రింది కారణాలు దోహదపడుతున్నాయి.ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, వాతావరణ మార్పులు)పాకిస్థాన్‌లో చుట్టూ ఉన్న సింధ్, బలూచిస్థాన్, దక్షిణ పంజాబ్ ప్రాంతాల్లో గతంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో టమాటా పంట నాశనమైంది. దీని ఫలితంగా దేశీయ మార్కెట్లోకి టమాటా సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. వరదలు, వాతావరణ మార్పుల వల్ల రహదారులు దెబ్బతినడం, రవాణా ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల కూడా పంట ఉన్న ప్రాంతాల నుంచి మార్కెట్లకు సరుకు చేరడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంపాకిస్థాన్ రూపాయి విలువ(భారత రూపాయితో పోలిస్తే పాక్ రూపాయి విలువ 0.31 పైసలుగా ఉంది) ఇతర కరెన్సీలతో పోలిస్తే భారీగా పడిపోతోంది. దీనివల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయంగా పంట నష్టం జరగడంతో టమాటా కొరతను తీర్చడానికి పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే పాక్ రూపాయి విలువ తగ్గడం, సరిహద్దుల్లో అనిశ్చితులు పెరగడం వల్ల దిగుమతి చేసుకునే టమాటా ధరలు అధికమయ్యాయి. గతంలో టమాటాకు సరైన ధరలు లభించకపోవడం, వాతావరణ మార్పుల వల్ల తరచుగా పంట నష్టాలు వాటిల్లడం వంటి కారణాల వల్ల రైతులు పంట సాగును తగ్గించారు.సీజనల్ కొరతటమాటా ధరలు సీజన్‌ను బట్టి తరచుగా మారుతుంటాయి. ముఖ్యంగా రెండు ప్రధాన పంటల సీజన్ల మధ్య కొద్దిపాటి కొరత ఏర్పడటం సర్వసాధారణం. అయితే ప్రస్తుత ఆర్థిక, వాతావరణ పరిస్థితులు ఈ సాధారణ కొరతను మరింత తీవ్రతరం చేశాయి. సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు కొంతమంది వ్యాపారులు పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా తీసుకుని కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రమోషన్ రావాలంటే 4 చిట్కాలు.. -
Income tax: కొత్త చట్టం వస్తోంది కానీ...
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఆదాయపన్ను చట్టం 1922, ఆ తరువాత చట్టం 1961 ... ఇప్పుడు కొత్తం చట్టం 2025 పేరుతో వస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన ఈ చట్టం 1.4.2026 నుంచి అమల్లోకి రానుంది. కొత్త చట్టం అత్యంత సరళీకృతంగా ఉంది. నిడివి, సెక్షన్లు తగ్గించారు. ‘పన్ను సంవత్సరం’ అనే కొత్త నిర్వచనంతో వర్చువల్ డిజిటల్ ఆస్తులను కూడా కలుపుతూ, సెర్చ్, సీజర్ అధికారాలను విస్తృత పరుస్తూ, ఎన్నో సంస్కరణలతో రూపుదిద్దుకొని ఇది ముస్తాబయింది.ఈ సంవత్సరంలో అన్నీ పూర్తయినా, అమలు మాత్రం 1.4.2026 నుండే ఉంటుంది. అయితే 2025 బడ్జెట్లో తెచ్చిన మార్పులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో వర్తిస్తాయి. 2026లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని మార్పులు రావడం సహజం. ముఖ్యంగా బేసిక్ లిమిట్, మినహాయింపులు, శ్లాబులు, రేట్లు, ఇవి రావచ్చు. లేదా రాకపోవచ్చు. వచ్చేవి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. కొత్త విధానాన్ని ప్రతిపాదించినప్పటి నుంచే ప్రభుత్వం దాన్ని సమర్థిస్తూ, వెనకేసుకొస్తోంది. మధ్య తరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని శ్లాబులు, రేట్లు తెచ్చారు. దీని ప్రకారం రూ.12,00,000కు పన్ను ఉండదు. శ్లాబులు మార్చారు. రేట్లు మారాయి.రూ.12,00,000 ఆదాయాల విషయంలో శ్లాబులను మార్చకుండా రిబేటును 87 అ ప్రకారం రూ.60వేల వరకు పెంచి ఎంతో ఉపశమనం ఇచ్చారు. నికర ఆదాయం పెరిగితే వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడినట్లే. శ్లాబుల వారీగా పన్ను కట్టాల్సి వస్తోంది. సాండర్డ్ డిడక్షన్ని కొత్త విధానంలో రూ.75వేలకు పెంచారు.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తులు రెండు సొంత ఇళ్ల మీద పన్ను కట్టాల్సిన అవసరం లేదు. గతంలో ఒక ఇంటికే ఉన్నా.., ఇప్పుడు మినహాయింపుని రెండో ఇంటికీ కల్పించారు.కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షను మినహాయింపుని రూ.25వేలకు పెంచారు. గతంలో ఇది రూ.13,000గా ఉండేది. ఈ విధంగా కొత్త విధానాన్ని సమర్ధిస్తూ.., ఉపశమనం ఇచ్చారు. కొత్త విధానం కొంగు బంగారం అయ్యింది. ఆర్థికపరంగా ఎందరో చిన్న చిన్న అస్సెస్సీలకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. టాక్స్ ప్లానింగ్ పేరుతో ఎటువంటి అక్రమ మార్గాలకు పాల్పడకుండా రాచమార్గంలో రాజహంసలాగా రాజీ పడకుండా, రాంగ్ రూటు వెళ్లకుండా రైట్వే ఇది. యూలిప్ ద్వారా వచ్చే మొత్తాలను క్యాపిటల్ గెయిన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి రూ.25వేలకు మినహాయింపు ఉంది. టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ సోర్స్) వర్తించే విషయాల్లో పరిమితిని పెంచారు. దానివల్ల కొంతమంది టీడీఎస్‌కి గురికారు. విదేశాల చెల్లింపుల్లో వర్తించే టీసీఎస్(టాక్స్ కలెక్టెడ్ సోర్స్) విషయంలో పరిమితి పెంచారు.కొన్ని వస్తువుల అమ్మకపు విషయంలో పరిమితి రూ.50,00,000 ఇక నుంచి లేదు.అప్డేటెడ్ రిటర్నులను ఫైల్ చేసుకోవడానికి 24 నెలల నుంచి 48 నెలలకు వెనక్కి వెళ్లవచ్చు. ఇది మంచి అవకాశం. అయితే షరతులకు లోబడి మాత్రమే.రిటర్నులు వేయనివారిని నాన్ఫైలర్స్ అంటారు. గతంలో ఎక్కువ టీడీఎస్/టీసీఎస్ రేట్లు వేసేవారు. ఇప్పుడు ఆ వివక్ష లేదు.భాగస్వాములకు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ ప్రవేశపెట్టారు. నాన్ రెసిడెంట్లకి సంబంధించి కొన్ని డిజిటల్ వ్యవహారాల మీద వేసే పన్ను 6% ఎత్తివేశారు. ఈ మార్పులను పెట్టుకొని టాక్స్ ప్లానింగ్ వైపు అడుగులు వేయండి. -
పేరు మార్చుకున్న రిషబ్ శెట్టి.. ఎందుకు? అసలు పేరు ఏంటి?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే పేరు హాట్ టాపిక్. కేవలం రెండంటే రెండే సినిమాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోనయి, జాతీయ అవార్డు సహా కలెక్షన్ల రికార్డులు కూడా అందుకుంటూ ఒక్కసారిగా భారతీయ సినిమా ప్రభంజనానికి కేంద్ర బిందువుగా నిలిచిందా పేరు. ప్రస్తుతం ప్రతీ సినీ అభిమాన ప్రేక్షకుడికీ చిరపరిచితమైన ఆ పేరు రిషబ్ శెట్టి(Rishab Shetty). అయితే నిజానికి అది ఆయన అసలు పేరు కాకపోవడం విశేషం. మన భారతదేశ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, భక్తి, విశ్వాసాలు, దైవ బలం ఇలాంటివి తన కాంతారా, కాంతారా చాప్టర్ 1(kantara: Chapter 1) చిత్రాల ద్వారా బలంగా చాటి చెప్పిన రిషబ్ ఆ సినిమాకు కేవలం కధానాయకుడు మాత్రమే కాదనీ అన్నీ తానే అయి నడిపించిన దర్శకుడు కూడా అనేది మనకు తెలుసు. అయితే కోస్తా కర్ణాటకలోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అతను నటుడిగా చిత్ర నిర్మాతగా అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. ప్రతిభావంతుడైన నట దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమాల ద్వారా ప్రవచించిన ఆధ్యాత్మిక విశ్వాసాలు కేవలం వ్యాపార మెళకువలు అనుకుంటే పొరపాటు. ఆయన తూచ తప్పకుండా నమ్మే, అనుసరించేవి కూడా. అది ఆయన స్వంత ఇంటి అలంకరణ దగ్గర నుంచి ఆయన తన వంటిని అలంకరించుకునే తీరు, వస్త్రధారణలో కూడా అది ప్రస్ఫుటమవుతుంది. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 విజయాన్ని సవినయంగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తున్న రిషబ్ పేరు మార్పు వెనుక కూడా ఆయన నమ్మే జ్యోతిష్యశాస్త్ర ప్రభావం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘నేను నా పేరు ఎందుకు మార్చుకున్నాననే దాని వెనుక ఓ కథ ఉంది. నా అసలు పేరు ప్రశాంత్ శెట్టి. అదే పేరుతో సినిమా పరిశ్రమకు ప్రవేశించాను. అయితే సినిమా ఇండస్ట్రీలో తొలి నాళ్లలో నాకు ఎలాంటి విజయం లేదా సినిమాలు రాలేదు‘ అని చెప్పాడు. అదే సమయంలో తనను పేరు మార్చుకోమని అలా చేస్తే విజయాలు, మంచి అవకాశాలు వస్తాయని తన తండ్రి సూచించాడని ఆయన వెల్లడించాడు. అప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్లు తమ పేర్లు మార్చుకున్నారనే విషయం కూడా తాను విన్నానని చెప్పాడు. దాంతో తాను కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నానని రిషబ్ శెట్టి తెలిపాడు. పేరు మార్పు తన కెరీర్లో మంచి విజయాన్ని తెస్తుందని తన తండ్రి గట్టిగా నమ్మారని ఆయనే తన పేరును రిషబ్గా మార్చమని సూచించినట్టు వివరించాడు. విశేషం ఏమిటంటే రిషబ్ షెట్టి గా పేరు మార్చిన తండ్రే ప్రశాంత్ షెట్టి అనే పేరు కూడా పెట్టడం. మరో విశేషం రిషబ్ తండ్రి స్వయంగా జ్యోతిష్కుడు కావడం. ఏదేమైనా ప్రతిభా సామర్ధ్యాలకు తోడైన పేరు మార్పు కూడా తనను ఇలా శిఖరాగ్రానికి చేర్చిందని రిషబ్ షెట్టి నమ్ముతున్నాడనేది నిస్సందేహం. -
ముహూరత్ ట్రేడింగ్ షురూ.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం ముహూరత్ ట్రేడింగ్‌ను పురస్కరించుకొని లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ సెషన్ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1:50 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు పెరిగి 25,905కు చేరింది. సెన్సెక్స్(Sensex) 182 పాయింట్లు పుంజుకుని 84,546 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.73బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 60.79 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.96 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.07 శాతం పెరిగింది.నాస్డాక్ 1.37 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి... కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హర్మన్.. మరో సీనియర్ ప్లేయర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. మొత్తంగా 70 బంతులు ఎదుర్కొన్న కౌర్.. 10 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. మంధానతో కలిసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు బాట వేసింది. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేయండంతో భారత్ పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.హర్మన్ సాధించిన రికార్డులు ఇవే..👉మహిళల ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ప్లేయర్‌గా ఆమె నిలిచింది. ఆమె కెరీర్లో ఇది ఐదవ ప్రపంచకప్. ఇప్పటివరకు హర్మన్ 31 మ్యాచ్‌లలో 1017 పరుగులు సాధించింది. ఇందులో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫీట్ హర్మన్ కంటే మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సాధించింది. ఓవరాల్‌గా ఈ జాబితాలో హర్మన్ ఏడో స్దానంలో ఉంది.👉అదేవిధంగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో నెంబర్ 4 లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 1000 పరుగుల మైలురాయిని చేరిన తొలి ప్లేయర్‌గా ప్రపంచరికార్డు హర్మన్ నెలకొల్పింది.👉మహిళల వన్డేల్లో నాలుగో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో (4289) అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హర్మన్‌ప్రీత్ అగ్రస్థానంలో ఉంది. నాట్ స్కైవర్ 4205 పరుగులతో రెండవ స్థానంలో ఉంది.చదవండి: మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్