breaking news
-
Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..!
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (India vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్ 23) తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్‌లో 4 బంతుల డకౌట్‌ను నమోదు చేశాడు.కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ డబుల్ డక్ కోహ్లి కెరీర్లో చెరగని మరకలా మిగిలిపోతుంది. కెరీర్ చరమాంకంలో రికార్డుల రారాజుకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం దురదృష్టకరం.టెస్ట్‌లకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి, ఏడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన కోహ్లి మునుపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. రెండో వన్డేలో ఔటైన తర్వాత అతని ప్రవర్తన ఈ సిరీస్‌తో కెరీర్ ముగింపును సూచించింది. తమ ఆరాధ్య ఆటగాడు కెరీర్ చరమాంకంలో వరుస డకౌట్లు కావడాన్ని కోహ్లి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.డబుల్ డక్ తర్వాత కోహ్లి వన్డే సగటు కూడా పడిపోయింది. కోహ్లి ఫామ్‌లో ఉన్నప్పుడే రిటైరయ్యుంటే గౌరవంగా ఉండేదని అతని అభిమానులు అనుకుంటున్నారు. మరోపక్క కోహ్లిలాగే కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) మాత్రం రెండో వన్డేలో హిట్ అయ్యాడు.రోహిత్ కూడా తొలి వన్డేలో నిరాశపరిచినా రెండో వన్డేలో మాత్రం బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (73) జట్టును ఆదుకున్నాడు. ఈ ప్రదర్శనతో రోహిత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. హిట్‌మ్యాన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (61), అక్షర్ పటేల్ (44) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ (264/9) చేసింది. ఆఖర్లో హర్షిత్ రాణా (24 నాటౌట్), అర్షదీప్ సింగ్ (13) అమూల్యమైన పరుగులు జోడించారు.ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతుంది. 54 పరుగులకే ఓపెనర్లు మిచెల్ మార్ష్ (11), ట్రవిస్ హెడ్ (28) వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (32), మ్యాట్ రెన్షా (23) క్రీజ్‌లో ఉన్నారు. 19 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 96/2గాఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆసీస్ మరో 169 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.చదవండి: కొత్త బ్యాటర్.. ఆరంభంలోనే అదుర్స్! -
మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని వల్ల రానున్న మరో నాలుగు, ఐదు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) ప్రఖర్ జైన్ గురువారం తెలిపారు. శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో అల్ప పీడనం వల్ల రానున్న నాలుగు, ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 120.5మిల్లీ మీటర్లు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 85.5మిమీ, నెల్లూరు జిల్లా రాపూర్‌లో 78.5మిమీ వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. కాగా, ప్రస్తుత అల్పపీడనం వాయుగుండంగా బలపడి తుపానుగా మారే సూచనలు ఉన్నాయని, ఈ తుపాను దక్షిణ కోస్తా లేదా తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
బుమ్రాను భయపెడుతున్న పాకిస్తాన్ బౌలర్
టీమిండియా స్టార్ బౌలర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను (Jasprit Bumrah) పాకిస్తాన్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ (Noman Ali) భయపెడుతున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నౌమన్ బుమ్రాకు అతి సమీపంగా వచ్చాడు. గత వారం అద్భుత ప్రదర్శన కారణంగా నౌమన్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకాడు. టాప్ ర్యాంక్‌లో ఉన్న బుమ్రాకు నౌమన్‌కు కేవలం 29 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.గత వారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో నౌమన్ తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు సహా 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.39 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన నౌమన్ గత కొంతకాలంగా టెస్ట్‌ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. చివరి 5 టెస్ట్‌ల్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు సహా 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కెరీర్లో 21 టెస్ట్‌లు ఆడిన నౌమన్ 95 వికెట్లు తీశాడు.బుమ్రా విషయానికొస్తే.. ఇతను ఈ నెలలో వెస్టిండీస్‌తో ఆడిన రెండు టెస్ట్‌ల్లో పెద్దగా వికెట్లు తీయలేకపోయాడు. తొలి టెస్ట్‌లో 3, రెండో టెస్ట్‌లో 4 వికెట్లు మాత్రమే తీశాడు.ఈ వారం ర్యాంకింగ్స్‌లో నౌమన్తో పాటు మరో బౌలర్ భారీగా లబ్ది పొందాడు. సౌతాఫ్రికాకు చెందిన సెనూరన్ ముత్తుసామి పాక్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 11 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఏకంగా 38 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతను 55 స్థానంలో ఉన్నాడు. ఈ రెండు భారీ మార్పులు మినహా ఈ వారం ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్, జడేజా 12, 14, 18 స్థానాల్లో కొనసాగుతున్నారు.టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. రూట్, బ్రూక్, కేన్ టాప్-3లో కొనసాగుతుండగా.. టీమిండియా ఆటగాళ్లు జైస్వాల్, పంత్, గిల్ 5, 8, 12 స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఎవరికీ అందనంత ఎత్తులో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ స్పిన్నర్.. 92 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
సెమీఫైనల్లో స్థానం కోసం...
సొంతగడ్డపై మహిళల వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా బరిలోకి దిగిన భారత్ ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా ఇంకా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోలేకపోయింది. వరుసగా మూడు ఓటములతో దెబ్బతిన్న టీమిండియా ముంగిట ఇప్పుడు మరో అవకాశం నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే హర్మన్‌ప్రీత్ బృందానికి అధికారికంగా సెమీఫైనల్లో చోటు ఖాయమవుతుంది. మరోవైపు బలహీన జట్లతో గెలిచే అవకాశం ఉన్న రెండు వరుస మ్యాచ్‌లు వానబారిన పడటంతో వెనుకబడిన న్యూజిలాండ్ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో నిలిచింది. నవీ ముంబై: వన్డే వరల్డ్ కప్‌లో కీలక పోరుకు భారత మహిళల బృందం సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి ఉత్సాహంతో కనిపించిన భారత్ ఆ తర్వాత అనూహ్యంగా మూడు ఓటములను ఎదుర్కొంది. మూడు సందర్భాల్లోనూ మెరుగ్గానే ఆడి మ్యాచ్‌ను నియంత్రణలోనే ఉంచుకున్నా... చివరికొచ్చేసరికి చేతులెత్తేసింది. అయితే పరిస్థితి ఇంకా భారత్ చేయిదాటిపోలేదు. కివీస్‌పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. అయితే పటిష్ట ప్రత్యర్థి, మాజీ చాంపియన్‌తో పోరు అంత సులువు కాదు. ఓడితే సెమీస్ అవకాశాలు కోల్పోనున్న కివీస్ పట్టుదలగా పోరాడుతుందనడంలో సందేహం లేదు. 2022 నుంచి కివీస్‌తో 9 వన్డేలు ఆడిన భారత్ 6 మ్యాచ్‌లలో ఓడింది. మార్పు చేస్తారా! వరుసగా నాలుగు మ్యాచ్‌ల తర్వాత గత పోరులో భారత్ ఒక కీలక మార్పు చేసింది. ఆరో బౌలర్‌తో బౌలింగ్‌ను పటిష్ట పర్చుకోవడంలో భాగంగా రేణుకా సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌పై వేటు పడింది. అయితే ఇంగ్లండ్‌పై అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. రేణుక ఒక్క వికెట్ కూడా తీయకపోగా, విజయానికి చేరువగా వచి్చన జట్టు చివర్లో బ్యాటింగ్ తడబాటుతో చేజేతులా ఓడింది. స్మృతి కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. ఈ నేపథ్యంలో మళ్లీ జెమీమాకు అవకాశం కల్పిస్తారా చూడాలి. గత పోరులో ప్రధాన బ్యాటర్లు స్మృతి, కెప్టెన్ హర్మన్‌లతో పాటు మరో సీనియర్ దీప్తి శర్మ కూడా అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. ఇలాంటి తడబాటును అధిగమించి టాప్ ప్లేయర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. ఇతర బ్యాటర్లలో ప్రతీక, హర్లీన్ మినహా మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా జట్టు వద్ద లేదు. రిచా ఘోష్ తనదైన శైలిలో దూకుడుగా ఆడితే జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. టోర్నీ ఆరంభంలో ఆకట్టుకున్న పేసర్ క్రాంతి గౌడ్ పదును మ్యాచ్ మ్యాచ్‌కూ తగ్గుతూ వచ్చింది. అమన్‌జోత్ మీడియం పేస్ కూడా అంతగా ప్రభావం చూపడం లేదు. గత మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మన స్పిన్నర్లు ప్రత్యర్థిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. సోఫీ డివైన్ మినహా... మహిళల క్రికెట్లో పటిష్టమైన జట్లలో ఒకటైన న్యూజిలాండ్ ఈసారి ప్రభావవంతంగా కనిపించడం లేదు. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన కివీస్ ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచింది. పాక్, శ్రీలంకలతో మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. టోరీ్నలో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు సాధించిన కెపె్టన్ సోఫీ డివైన్‌పైనే జట్టు బ్యాటింగ్ ఆధారపడుతోంది. ఓపెనర్లు సుజీ బేట్స్, ప్లిమ్మర్ పూర్తిగా విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌తోపాటు స్పిన్నర్ కార్సన్ కూడా ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. గత మ్యాచ్ ఆడని ప్రధాన పేసర్ తహుహు ఈ మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగుతోంది. మిడిలార్డర్లో హ్యాలిడే, గ్రీన్, ఇసాబెల్లా బ్యాటింగ్‌లో రాణిస్తేనే కివీస్ చెప్పుకోదగ్గ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. పిచ్, వాతావరణం నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం పిచ్ ప్రధానంగా బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోరుకు అవకాశం ఉంది. భారత జట్టు సభ్యులందరికీ ఇక్కడ ఎక్కువగా ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు.సెమీస్ సమీకరణం ఇదీ... → న్యూజిలాండ్‌పై గెలిస్తే భారత్ 6 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది. → ఒకవేళ భారత్ ఓడితే తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాల్సి ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్‌పై నెగ్గితే మనకు సెమీస్ స్థానం ఖాయమవుతుంది. → ఇంగ్లండ్‌పై కివీస్ నెగ్గి 6 పాయింట్లతో సమమైనా... అది కివీస్‌కు 2వ విజయం అవుతుంది. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినందుకు భారత్ (3) ముందంజ వేస్తుంది. → కివీస్‌తో మ్యాచ్ రద్దయితే బంగ్లాదేశ్‌ను భారత్ ఓడిస్తే చాలు. ఒకవేళ మనం బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైనా...న్యూజిలాండ్, శ్రీలంక తమ తర్వాతి మ్యాచ్‌లు ఓడిపోవాల్సి ఉంటుంది. → భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లూ రద్దయినా... కివీస్‌ను ఇంగ్లండ్ ఓడిస్తే సరిపోతుంది. -
రష్యా ముడి చమురుకు కత్తెర
వాషింగ్టన్: భారతీయులతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్, అమెరికాల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని మోదీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో మంగళవారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు. సంప్రదాయ చమురు దీపాన్ని స్వయంగా వెలిగించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం అధికంగా ముడిచమురు కొనుగోలు చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా చమురు విషయంలో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలును పూర్తిగా ఆపేస్తామంటూ భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పరిమితంగానే కొనుగోలు చేస్తుందంటూ తాజాగా వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీపావళి వేడుకల్లో ఆహా్వనితులను ఉద్దేశించి ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ ‘‘మీ ప్రధానమంత్రి మోదీతో ఇప్పుడే మాట్లాడాను. మా మధ్య చక్కటి సంభాషణ జరిగింది. వాణిజ్యం సహా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆ అంశంపై మోదీకి ఎక్కువ ఆసక్తి ఉంది. మోదీ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన నాకు చాలాఏళ్లుగా మంచి మిత్రుడు. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం. భారత్–పాకిస్తాన్ సంబంధాలపైనా మోదీతో చర్చించాను. పాకిస్తాన్‌తో యుద్ధాలు వద్దన్న అభిప్రాయం మా సంభాషణలో వ్యక్తమైంది. భారత్, పాకిస్తాన్లతో అమెరికాకు ఎలాంటి యుద్ధాలు, విభేదాలు లేకపోవడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. కీలక ఒప్పందాలపై కలిసి పని చేస్తున్నాంవైట్హౌస్ వేడుకల అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారతీయులను ఎంతగానో అభిమానిస్తున్నానని చెప్పారు. మోదీతో ఫోన్లో మాట్లాడానని, ఆయనతో తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారత్ అధికంగా(టూ మచ్) ముడి చమురు కొనుగోలు చేయబోదని ఉద్ఘాటించారు. కొన్ని కీలక ఒప్పందాలపై భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని వివరించారు. తనలాగే మోదీ కూడా ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవడాన్ని కళ్లారా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ భారీగా కత్తెర వేస్తుందని తాను భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చాలావరకు తగ్గిపోవడం తథ్యమని అన్నారు. ముడిచమురు దిగుమతుల తగ్గింపు ప్రక్రియ చాలాకాలం కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు ఎంతగానో తోడ్పాడు అందిస్తున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలకు భారత్–అమెరికన్లు సారథ్యం వహిస్తున్నారని, వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అదే మనకు దారిదీపం వైట్‌హౌస్‌లో దీపావళి పండుగకు అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్, మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మోహ్రోత్రా, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, అమెరికాలో భారత రాయబారి వినయ్‌మోహన్ క్వాత్రా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ దీపావళి సందేశాన్ని విడుదల చేశారు. ‘‘చీకటిపై వెలుగు విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపం వెలిగిస్తున్నాం. దీపావళి సమయంలో ప్రాచీన గాథలను గుర్తుచేసుకోవాలి. శత్రువులు పరాజయం పాలైన, అవరోధాలు తొలగిపోయిన, సామాన్యులకు విముక్తి లభించిన గాథలను మనం తెలుసుకోవాలి. నిండుగా వెలుగులు విరజిమ్ముతున్న దీపం మనకు దారి చూపిస్తుంది. జ్ఞానమార్గంలో నడవాలని, శ్రద్ధతో పనిచేయాలని, మనకు లభించే ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేయాలని బోధిస్తుంది’’ అని ట్రంప్ వివరించారు. మోదీకి ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు ఫోన్ చేసి మాట్లాడి, దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు కలిసికట్టుగా పనిచేయాలని, ప్రపంచాన్ని వెలిగిస్తూనే ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదంపై భారత్, అమెరికాలు ఉమ్మడిగా పోరాటం చేయాలన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్, మోదీ సంభాషణలో పాకిస్తాన్ ప్రస్తావన రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఆన్లైన్ దర్బార్ భక్తి!
ఆధ్యాత్మిక సందేహాలు, సంప్రదింపులు; వేద పండితుల మార్గదర్శకత్వం, పూజా సామగ్రి కొనుగోలు వంటి అవసరాల కోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్న భక్త వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆధ్యాత్మిక స్టార్టప్‌లకు ఆదరణ పెరిగింది. మతపరమైన ఆచార వ్యవహారాలు, వాటి పాటింపు విధానాలను ప్రామాణికంగా తెలియజెప్పేందుకు ఈ ఆధ్యాత్మిక ఆన్లైన్ వేదికలు వేద పారంగతులను నియమించుకుంటున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్గత ఏడాదితో పోలిస్తే తమ వినియోగదారుల్లో 2.5 రెట్లు, డిజిటల్ సంప్రదింపుల్లో 3 రెట్ల పెరుగుదల కనిపించిందని ఆధ్యాత్మిక ఆన్లైన్ సంస్థ ‘ఆస్ట్రోయోగి’వెల్లడించింది. సుదీర్ఘ ప్రయాణాలు, పొడవాటి క్యూలు లేని ‘డిజిటల్ యాక్సెస్’ సౌలభ్యతే ఈ పెరుగుదలకు కారణం. ప్రధానంగా యువత, ఎన్నారైలు ఈ సంస్థలను సంప్రదిస్తుండటం, పండుగ సీజన్లో అవి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించటం కూడా వాటి అభివృద్ధికి తోడ్పడుతోంది. వేలాదిమంది పండితులు ‘ఆస్ట్రోయోగి’తన నెట్‌వర్క్‌లో.. జ్యోతిషు్కలు, టారో కార్డ్ రీడర్లు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మిక కోచ్‌లు సహా కనీసం 10,000 మంది నిపుణులతో అనుసంధానమై ఉంది. వినియోగదారులకు ఆన్లైన్లో ఆధ్యాత్మిక సేవలను ఒక్క ‘క్లిక్కు’తో అందించటానికి ఈ పండితుల అనుభవం తమకెంతగానో ఉపయోగపడుతోందని ఆస్ట్రోయోగి నిర్వాహకులు అంటున్నారు. ఆధ్యాత్మిక కౌన్సెలింగ్ మరొక సంస్థ ‘ఆస్ట్రోసేజ్ ఏఐ’కూడా భక్తి విశ్వాసాల ఆధారిత సేవల్ని నెట్ యూజర్లకు అందిస్తోంది. పండుగలు, ఇతర సమయాలలో నెటిజన్ల సందేహాలకు ఈ సంస్థ తన కౌన్సెలర్ల ద్వారా సమాధానాలు ఇప్పిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే తమను సంపద్రించేవారి సంఖ్య 300 శాతం పెరిగిందని ఆస్ట్రోసేజ్ నిర్వాహకులు చెబుతున్నారు. లక్షల్లో భక్త యూజర్లు 2025లో ప్రారంభమైన ‘ఆస్ట్రోష్యూర్ ఏఐ’కు నెలవారీ వినియోగదారులు 3 లక్షలకు పైగా ఉన్నారు. రోజువారీగా కనీసం 15 వేల మంది సంప్రదింపులు జరుపుతున్నారు. ఆస్ట్రోష్యూర్ ఏఐ యాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓస్‌లు కలిపి 10 లక్షల డౌన్లోడ్లకు చేరుకుంది. ఒకప్పుడు లక్షా 50 వేలుగా ఉన్న యూజర్ల సంఖ్య దాదాపు 8 లక్షలకు పెరిగిందట. పూజా సామగ్రి కిట్లు వినియోగదారులు ప్రధానంగా తమ భవిష్యత్తు, అదృష్ట సంఖ్యలు, పంచాంగం, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, రాహు కాలాలు వంటి వాటి కోసం ‘ఆస్ట్రో’సైట్లను బ్రౌజ్ చేస్తున్నారు. ఇందుకోసం కొందరు డబ్బు చెల్లించి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటున్నారు. కేవలం సంప్రదింపుల కోసమే కాకుండా, ముందుగా ప్యాక్ చేసి ఉంచిన రెడీ మేడ్ పూజా సామగ్రి కిట్ కోసం యూజర్లు వీటి వైపు వస్తున్నారు. సేవలను, వస్తువులను పొందుతున్నారు. గత ఏడాది ఈ వేదికల్లో పూజా సామగ్రి కిట్లు, రత్నాల కోనుగోళ్లు 25 నుంచి 30 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. సదా ‘ఆధ్యాత్మిక’సేవలో.. ఆస్ట్రోయోగి : ఆన్లైన్ సంప్రదింపులు, జాతకాలు, డిజిటల్ ఆధ్యాత్మిక సేవలను అందించే భారతీయ ఆన్లైన్ జ్యోతిష్య శాస్త్ర వేదిక. ఆస్ట్రోసేజ్ ఏఐ : వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక సలహాలు, జాతక చక్రాలు, జ్యోతిష్యం, ఆన్లైన్ సంప్రదింపులు; పూజా విధానం, వివాహ ఆచారాలు, వివరణల వెబ్సైట్. ఆస్ట్రోటాక్ : జ్యోతిష్కులు, పండితులు, పురోహితులతో లైవ్ చాట్లు; ఫోన్ సంప్రదింపులు, జ్యోతిష్య శాస్త్ర సేవలతో అనుసంధానం. దేవ్ధామ్: వర్చువల్ ఆలయ దర్శనాలు. ఆన్లైన్ పూజలు, డిజిటల్ విరాళాల భారతీయ ఆధ్యాత్మిక సాంకేతిక వేదిక. వామా: ఇంటి నుంచే పూజలు, దర్శనాలు, మతాచారాల విషయమై సంప్రదింపులకు ఆన్లైన్ యాక్సెస్‌ను అందించే ఆధ్యాత్మిక సేవల కేంద్రం. -
ఇడ్లీ బ్రేక్ ఫాస్ట్ ప్రయోజనాలేమిటి? సాంబార్,చట్నీతో తింటే లాభమా? నష్టమా?
ఇడ్లీ అనేది చాలా మంది భారతీయులకు అలవాటైన అల్పాహారం. దక్షిణాదిలో అయితే ఇడ్లీ ఇంటింటి వంటగానే చెప్పొచ్చు. అల్పాహారానికి అసలైన అర్ధంలా తేలికగా అనిపించడంతో పాటు ఇంట్లోనే ఇడ్లీని సులభంగా రుచిగా తయారు చేసుకోగలిగే వీలు దీని ప్రాధాన్యాన్ని పెంచుతోంది.అంతేకాక ఇది అన్నిరకాల జీవనశైలికి అనుకూలంగా ఉంటుంది. మరి ప్రతి రోజూ ఉదయం ఇడ్లీ తినడం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది? దీని గురించి పోషకాహార నిపుణులు ఏమంటున్నారు..?జీర్ణక్రియకు మేలు..ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహారాలు మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, ఇది సజావుగా జీర్ణక్రియ జరిగేందుకు దారితీస్తుంది. ఇది ఆవిరిలో ఉడికించబడి ఉంటుంది కాబట్టి విచ్ఛిన్నం కావడం సులభం అందువల్ల దానిని ప్రాసెస్ చేయడానికి మన కడుపు అతిగా కష్టపడాల్సిన అవసరం రాదు. ఇది ఆమ్లత్వం, బరువు లేదా తరచుగా కడుపు ఉబ్బరంతో పోరాడుతున్న వారికి మేలైన ఎంపికగా ఉంటుంది. సాంబారుతో తినడం వల్ల ప్రేవుల ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే ఫైబర్‌ను కూడా జోడించినట్టు అవుతుంది.దీర్ఘకాల శక్తిఇడ్లీలో సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి శక్తిని నెమ్మదిగా దశలవారీగా విడుదల చేస్తాయి, దాంతో ఎక్కువసేపు మనల్ని చురుగ్గా ఉంచుతాయి. ఇది ఆకస్మిక ఆకలి పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది బిజీగా ఉండే ఉదయం సమయంలో పనులపై దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. ప్రోటీన్ కూరగాయలతో జత చేసినప్పుడు, ఇడ్లీ తినే ఆలోచనను నియంత్రించే సమతుల్య ప్రారంభాన్ని అందిస్తుంది. స్థిరమైన శక్తి విడుదల తో మధ్యాహ్నం పూట స్నాక్స్‌గా జంక్ ఫుడ్ తీసుకునే అవసరాన్ని నివారిస్తుంది.గుండె ఆరోగ్యానికి మద్దతుఇడ్లీని ఆవిరిలో ఉడికించినందున, సహజంగానే కొవ్వు తక్కువగా ఉంటుంది గుండెపై భారం కలిగించే అదనపు నూనె లేకుండా ఉంటుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ 2018లో జరిపిన ఒక అధ్యయనంలో అధిక కొవ్వు గల బ్రేక్‌ఫాస్ట్‌లను తక్కువ కొవ్వు ఎంపికలతో భర్తీ చేయడం గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుందని కనుగొంది. ఇడ్లీని సాంబార్‌తో జత చేసినప్పుడు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ లు గుండె పనితీరును మెరుగ్గా నిర్వహించడానికి మరింత సహాయపడతాయి.అధిక బరువుకు చెక్...ఒక మీడియం ఇడ్లీలో దాదాపు 35 నుంచి 50 కేలరీలు ఉంటాయి, అందుకే ఇది తక్కువ కేలరీలు కోరుకునేవారికి సరైన అల్పాహారం ఎంపికగా మారుతుంది. దీని తేలికపాటి రూపం.. కడుపును మాత్రం నిండుగా ఉంచుతుంది. ఇడ్లీని సాంబార్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీతో కలిపినప్పుడు, రుచితో పాటు సంతృప్తి స్థాయి పెరుగుతుంది ఆకలి తగ్గుతుందిరోగనిరోధక శక్తిపులియబెట్టిన ఆహారాలు పేగుకు మేలు చేస్తాయని అంటారు పేగు ఆరోగ్యం రోగనిరోధక శక్తిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇడ్లీ జీర్ణం కావడం సులభం పేగు బాక్టీరియా వృద్ధికి అవసరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మెరుగైన మొత్తం శ్రేయస్సు, మెరుగైన పోషక శోషణ బలమైన సహజ రక్షణ వ్యవస్థకు దారితీస్తుంది. సమతుల్య ఉదరం ప్రశాంతమైన మానసిక స్థితి, కాంతివంతమైన చర్మం రోగనిరోధక శక్తిని అందిస్తుంది.ఇడ్లీ కొంత ప్రోటీన్ కలిగి ఉంటుంది, కానీ సాంబార్, వేరుశెనగ వంటి పప్పులతో కూడిన చట్నీలు జోడించడం వల్ల ప్రోటీన్ పరిమాణం మరింత పెరుగుతుంది.బియ్యంతో తయారైన ఇడ్లీ పులియబెట్టినది కావడం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిది, అదే సమయంలో రవ్వ ఇడ్లీ తక్కువ ప్రోబయోటిక్ ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి సాంబార్ ఫైబర్ లేదా ప్రోటీన్ అధికంగా ఉండే చట్నీలతో దీన్ని జత చేయడం మేలు.మరిన్ని పోషకాల కోసం రాగులు, ఓట్స్ లేదా మల్టీగ్రెయిన్ ఇడ్లీ పిండిని కూడా ప్రయత్నించవచ్చు.(చదవండి: Young Talent: వయసు 19 భాషలు 400..! జస్ట్ ఒక్క గంటలో 20 భాషల్లో..) -
సీఎం అభ్యర్థి తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో విపక్ష మహాగఠ్‌బంధన్ (మ హాకూటమి) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఊహాగానాలకు తెరది ంచుతూ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గా రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) యువనేత తేజస్వీ యాదవ్ పేరును కూటమి పక్షాలు ఏకగ్రీవంగా ఖరారు చేశాయి. తమ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్‌శీల్ ఇన్సాన్ పారీ్ట(వీఐపీ) అధినేత ముఖేష్ సహానీ పేరును ప్రకటించాయి. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజుపాటు జరిగిన చర్చోపచర్చలు ఎట్టకేలకు ముగిశాయి. కూటమి నేతలు గురువారం పటా్నలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిహార్‌లో మార్పు కోసం ఏడు పారీ్టల మహాగఠ్‌బంధన్ ఐక్యంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. తేజస్వీనే మా సీఎం: అశోక్ గహ్లోత్ కూటమి ముఖ్యమంత్రి అభ్యరి్థగా యువనేత తేజస్వీ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ చెప్పారు. ఆయన నవ యువకుడు అని, ఏది చెబితే అది చేస్తారని, ఇచ్చిన హా మీలకు కట్టుబడి ఉంటారని వెల్లడించారు. కూటమిలో కీలక నేత ముఖేష్ సహానీ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టకొని ఆయనను డిప్యూటీ సీఎం అభ్యరి్థగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బిహార్‌లో సామాజిక నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకొని సీఎం, డీప్యూటీ సీఎం అభ్యర్థులను ఖరారు చేశామని వెల్లడించారు. తమ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీతోపాటు కూటమి నేతలను సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా మరికొందరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమిస్తామని స్పష్టంచేశారు. కొత్త రాష్ట్రాన్ని నిర్మిస్తాం: తేజస్వీ ఎన్డీఏ ప్రభుత్వంపై తేజస్వీ యాదవ్ నిప్పు లు చెరిగారు. బిహార్‌లో ఓ కొత్త రాష్ట్రాన్ని నిర్మించేందుకు తామంతా ఏకమయ్యామని చెప్పారు. పనికిమాలిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు సంకల్పం తీసుకున్నామని ఉద్ఘాటించారు ‘‘ఎన్డీఏ నేత లు నకలీ్చ(కాపీక్యాట్లు). మేం ఏ హామీ ఇ స్తే, వాళ్లు దాన్నే కాపీ కొడుతున్నారు. వాళ్ల కు సొంత ఏజెండా లేదు. బిహార్‌లో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తారో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ చెప్పలేదు. ఎన్డీఏ నేతలంతా అలసిపోయిన నేత లు. బిహార్‌ను మోసం చేయడంలో వారంతా నిమ గ్నమయ్యారు. సీఎం నితీశ్ కుమా ర్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోంది. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యరి్థగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి? ఇది నితీశ్ కుమార్‌కు జరుగుతున్న అన్యాయం’’ అని తేజస్వీ ధ్వజమెత్తారు. ఎన్డీఏ పాలనలో రా ష్ట్రంలో అవినీతి, నేరాలు విచ్చలవిడిగా పెరి గిపోయాయని ఆరోపించారు. ‘‘రూ.70 వే ల కోట్ల కాగ్ స్కామ్, సృజన్ కుంభకోణం, బాలికా గృహ్ ఘటనలపై చర్యల్లేవు. వంతెనలు కూలుతున్నాయి, ఎలుకలు మద్యం తాగుతున్నాయి, రోజూ కాల్పులు జరుగుతున్నాయి. అవినీతి, ఆఫీసర్ల దౌర్జన్యంతో ప్రజలు విసిగారు’’ అని పేర్కొన్నారు. హామీల వర్షం మహాకూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యో గం, మాయీ–బహిన్ మాన్ యోజన (మహిళలకు ఆర్థిక సాయం), గ్యాస్ సిలిండర్ రూ.500కే అందిస్తామని తేజస్వీ యా దవ్ హామీ ఇచ్చారు. జీవికా దీదీలకు(స్వ యం సహాయక బృందాల మహిళలు) నె లకు రూ.30 వేల జీతంతో శాశ్వత ఉద్యో గం కల్పిస్తామని, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబదీ్ధకరిస్తామని వాగ్దానం చేశారు. బీజేపీని వదలం: ముఖేష్ సహానీ ఈ రోజు కోసం మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నామని డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ వ్యాఖ్యానించారు. బీజేపీని విచ్ఛిన్నం చేసే వరకు వదిలిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశామని, ఆ సమయం ఇప్పుడు వచి్చందని స్పష్టంచేశారు. -
ఆ సినిమా డిజాస్టర్.. తీవ్ర నిరాశకు గురయ్యా: అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బైసన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా వస్తోన్న బైసన్ మూవీ తెలుగులోనూ రిలీజవుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం బైసన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన తన మూవీ పరదా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.తెలుగులో తాను నటించిన పరదా మూవీ బాక్సాఫీస్ రిజల్ట్ తనను తీవ్రంగా నిరాశపర్చిందని తెలిపింది. ఇలాంటి ఫలితం తాను ఊహించలేదని వెల్లడించింది. పరదా మూవీ రెస్పాన్స్ చూసి చాలా బాధపడ్డానని పేర్కొంది. ఈ ఏడాది తాను నటించిన ప్రాజెక్టులు ఆశించిన విజయాన్ని సాధించలేదన్నారు. ఈ విషయాన్ని అంగీకరించక తప్పడం లేదని వివరించింది. ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. అనుపమ మాట్లాడుతూ..'మనం చేసే ప్రతి చిత్రానికి అది బాగానే వస్తుందని అనుకుంటాం. ప్రేక్షకులందరూ మన సినిమా ఇష్టపడతారని ఆశిస్తున్నాం. అది తప్పనిసరిగా బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోయినా.. నేను ప్రతి చిత్రంలో విభిన్న పాత్రలను పోషించడానికి ప్రయత్నిస్తున్నా. కిష్కింధపురి పాత్ర.. బైసన్ రోల్ ఒకటి కాదు. ఏదైనా నా సినిమా విజయం సాధించినప్పుడు.. మంచి సినిమాలు చేయడానికి.. స్క్రిప్ట్‌లను తెలివిగా ఎంచుకోవడానికి తోడ్పడుతుంది' అని పంచుకుంది. కాగా.. రూ. 15 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన పరదా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 1.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది.ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన పరదా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని ఈ సినిమాకు..ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో సంగీత, దర్శనా రాజేంద్రన్, రాగ్ మయూర్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. చాలా కాలంగా ఉన్న ఆచారంలో భాగంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఓ గ్రామానికి చెందిన యువతి కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
క్లైమాక్స్‌లో ఆపరేషన్ కగార్?!
సాక్షి, చత్తీస్‌గఢ్: మావోయిస్టుల లొంగుబాటు యాత్ర చివరి అంకానికి చేరిందా?. ఆపరేషన్ కగార్‌లో సంచలన పరిణామం చోటు చేసుకోబోతోందా?. మావోయిస్టు పార్టీ కీలక నేత, మోస్ట్‌వాంటెడ్, మావోయిస్టు పార్టీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా(madavi Hidma) లొంగిపోబోతున్నారా??. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ ప్రచారంపై స్పందించడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా లొంగిపోతున్నారనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుమారు 200 మంది అనుచరులతో కలిసి హిడ్మా లొంగుబాటు కానున్నారనేది ఆ ప్రచార సారాంశం. ఈ ప్రచారంపై ఛత్తీస్‌గఢ్ పోలీసులు స్పందించారు. హిడ్మా లొంగుబాటు విషయంపై జరిగేదంతా ఉత్త ప్రచారమేనని కొట్టిపారేశారు. అయితే.. హిడ్మా లొంగిపోతే మంచి పరిణామమేనని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పధకం కింద ఆయనకు రావాల్సిన రివార్డ్ నగదును ఆయనకే అందజేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆశన్న తమ దళాలతో లొంగిపోయారు. దీంతో వాళ్లను ఉద్యమ ద్రోహులుగా మావోయిస్టు పార్టీ అభివర్ణిస్తూ ఓ లేఖ రాసింది. నిజంగానే.. హిడ్మా గనుక లొంగిపోతే మావోయిస్టు పార్టీ కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు.ఎవరీ హిడ్మా.. మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ వన్ కమాండర్‌గా ఉన్నారు. ఆయన స్వస్థలం ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామం. ఇప్పుడున్న మావోయిస్టులలో.. అత్యధిక దళ సభ్యులు(మల్లా, నిషాద్ వర్గాల ప్రజలు) ఈ గ్రామ పరిధి నుంచే ఉన్నారనే అంచనా ఒకటి ఉంది. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా పేరు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంది. గతంలో భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడులకు హిడ్మా నాయకత్వం వహించినట్టు సమాచారం. 2023లో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఫొటో రిలీజ్ చేసి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టారు. అప్పటి నుంచి మావోయిస్టుల మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు హిడ్మా కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.సంబంధిత కథనం: చదివింది ఐదో తరగతి! పాతికేళ్లకే తుపాకీ పట్టి..
