భారత క్రికెట్ చూసిన గొప్ప క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడు
140 కోట్ల మంది అభిమానులు యువీ అని ముద్దుగా పిలుచుకొనే ఈ ఆల్ రౌండర్ పుట్టిన రోజు నేడు
43వ వసంతంలోకి యువరాజ్ అడుగుపెట్టాడు
యువీ 2000లో టీమిండియా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్నర్‌గా భారత్ ఎన్నో అద్బుత విజయాలను అందించాడు
2002లో నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో యువీ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో చారిత్రత్మకంగా నిలిచిపోతుంది
లార్డ్స్‌లో 63 బంతుల్లో 69 పరుగులు చేసి హీరోగా మారిపోయడు
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సులను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది.
ఓ వైపు క్యాన్సర్ తో పోరాడుతూనే వన్డే ప్రపంచకప్(2011)ను భారత్ అందించిన యోదుడు
రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు
తన కెరీర్‌లో భారత్ తరపున 402 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 11,778 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి
బౌలింగ్‌లోనూ 148 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు


