ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్
అఫ్గాన్ విజయంలో ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్‌ది కీలక పాత్ర
ఈ మ్యాచ్‌లో జద్రాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు
అర్చర్, మార్క్ వుడ్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను జద్రాన్ ఊతికారేశాడు
146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 177 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన ఇబ్రహీమ్
ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా రికార్డులకెక్కిన జద్రాన్
అంతకుముందు వన్డే వరల్డ్‌కప్-2023లోనూ జద్రాన్ శతక్కొట్టాడు
వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ రెండింటిలోనూ సెంచరీ చేసిన తొలి అఫ్గాన్‌గా రికార్డు
గాయం కారణంగా దాదాపు 6 నెలల పాటు దూరంగా ఉన్న ఇబ్రహీమ్
తన రీఎంట్రీలోనే అద్బుత శతకం
గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ పొజిషేన్‌లో నిలిచిన జద్రాన్


