ఎక్కడైనా సరే పోలిక అనేది కొంత మంచిది కొంత చెడ్డది అని చెప్పొచ్చు.
మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో పోలికలు పెట్టారంటే నిలబడం చాలా కష్టం.
అలాంటి ఓ బ్యూటీనే స్నేహా ఉల్లాల్. ఈమె పుట్టినరోజు నేడు (డిసెంబర్ 18)
ఒమన్‌లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2005లో సల్మాన్ ఖాన్ మూవీతో నటిగా పరిచయమైంది.
2008లో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో హిట్ కొట్టి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
2022 వరకు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటించింది. కానీ స్టార్ అయితే కాలేకపోయిందని చెప్పొచ్చు.
కెరీర్ ప్రారంభం నుంచి ఐశ్వర్య రాయ్‌లా నీలి కళ్లు ఉన్నాయని పోల్చి చూడటం ఈమెకు ఓ రకంగా మైనస్సే
ఈ పోలిక కారణంగా తెలుగులో కొన్ని సినిమాలతో హిట్ కొట్టినా సరే స్టార్ హీరోయిన్ కాలేకపోయిందేమో?
ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. దీంతో ఇన్ స్టాలో యాక్టివ్‌గా ఉంటోంది.


