మలయాళీ బ్యూటీ సాయి పల్లవి తాజాగా అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గ్లామర్ పాత్రల కన్నా గ్రామర్ పాత్రలకే ప్రయారిటీ ఇస్తూ సత్తా చాటుతుంది.
ప్రేమమ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచిన ఈమె ఆ తర్వాత తెలుగులో 'ఫిదా'లో భానుమతిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నయనతార,త్రిష, సమంత, వంటి వారికి కూడా సాధ్యం కాని రికార్డ్ సాయి పల్లవికి సొంతం.
సౌత్ ఇండియాలో అత్యధిక ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న హీరోయిన్‌గా సాయి పల్లవి (6) రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాతి స్థానాల్లో నయనతార(5),త్రిష (5) ఉన్నారు.
సాయి పల్లవి ఈ ఆరు చిత్రాలకు గాను ఫిలిం ఫేర్ అవార్డ్స్ దక్కించుకుంది.
ప్రేమమ్ సినిమా – ఉత్తమ నటి (డెబ్యూ)
ఫిదా – ఉత్తమ నటి
లవ్ స్టోరీ – ఉత్తమ నటి
శ్యామ్ సింగరాయ్ – ఉత్తమ నటి (క్రిటిక్స్)
గార్గి – ఉత్తమ నటి
విరాటపర్వం – ఉత్తమ నటి (క్రిటిక్స్)


