
విజయవాడ: మహాత్మాగాంధీ రోడ్డులోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో సోమవారం నిర్వహించిన ఫెట్ – 2024 ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది

రీల్ టు రియల్, మిస్ ట్రెడిషనల్, ఫ్యాషన్ షో, కిడ్స్‌షో, ర్యాంప్‌వాక్, డాగ్ షో, వెల్‌బేబీ షో వంటి పోటీలతో కళాశాలలో పండుగ వాతావరణం నెలకొంది

ఆయా పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు

ఈ ఫెట్‌లో కళాశాలలో చదివే విద్యార్థులు వివిధ స్టాల్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పోటీల్లో సైతం పాల్గొన్నారు

మిస్ ఫెట్‌గా బి.పూజ్య భవ్యశ్రీ నిలవగా, మిస్ సిద్ధార్థగా ఎస్‌కే అయేషా సిద్ధిక మొదటి స్థానం, ఆర్.మేఘన రెండో స్థానంలో నిలిచారు
















