రైతు మృతి.. మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత | farmer died in  Enumamula market yard | Sakshi
Sakshi News home page

రైతు మృతి.. మార్కెట్‌ యార్డులో ఉద్రిక్తత

Feb 8 2018 11:45 AM | Updated on Oct 1 2018 4:01 PM

వరంగల్‌లోని ఏనమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో విషాదం చోటు చేసుకుంది.

సాక్షి, వరంగల్: వరంగల్‌లోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో విషాదం చోటు చేసుకుంది. పత్తిని అమ్మేందుకు మార్కెట్‌కు వచ్చిన రైతును లారీ ఢీకొట్టింది. దీంతో రైతు మృతిచెందాడు. పాలకుర్తికి చెందిన బానోతు రవి అనే రైతు పత్తిని విక్రయించేందుకు నిన్న సాయంత్రం మార్కెట్‌కు వచ్చాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న రైతు కాళ్లపై నుంచి మిర్చి లారీ దూసుకెళ్లింది.

తోటి రైతులు అతడిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతి చెందడంతో మార్కెట్‌, ఎంజీఎం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement