రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్‌సీపీ ట్రాక్టర్ ర్యాలీ : అంబటి రాంబాబు | Ysrcp takes over Tractor ralley for State integration: Ambati rambabu | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్‌సీపీ ట్రాక్టర్ ర్యాలీ : అంబటి రాంబాబు

Sep 22 2013 2:38 AM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్‌సీపీ ట్రాక్టర్ ర్యాలీ : అంబటి రాంబాబు - Sakshi

రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్‌సీపీ ట్రాక్టర్ ర్యాలీ : అంబటి రాంబాబు

రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగే వరకూ ఉధృతంగా పోరాటం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపు నిచ్చింది.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగే వరకూ ఉధృతంగా పోరాటం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపు నిచ్చింది. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశంలో తాజా పరిస్థితులను సమీక్షించారు. వచ్చే అక్టోబర్ 1 నుంచి ఆందోళనను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆ వివరాలను ఆ తర్వాత విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు నిచ్చిందని తెలిపారు. 13 జిల్లాల్లో ఎంత ఉద్యమం జరుగుతున్నా విభజనపై ముందుకు వెళుతున్నామని, తెలంగాణ ఏర్పాటుపై నోట్ తయారవుతోందని పదే పదే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా సరే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతామన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరూ తమ ఆందోళనలో భాగస్వాములై ఉద్యమ ఉధృతికి తోడ్పడాలని అంబటి విజ్జప్తి చేశారు. పార్టీ నిర్ణయించిన ఉద్యమ కార్యాచరణ వివరాలు..
 
 అక్టోబర్ 01: గుంటూరు నుంచి విజయవాడ వరకూ రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ
 అక్టోబర్ 02: శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర నేతలు నిరవధిక నిరాహారదీక్షల ప్రారంభం, ఆ తరువాత రిలే నిరాహారదీక్షలు
 అక్టోబర్ 07: మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామాలు చేయాలని కోరుతూ వారి నివాసాల ఎదుట శాంతియుత ధర్నా లు, ఆయా ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులు పూలు అందజేసి నిరసన
 అక్టోబర్ 10: అన్ని మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలు
 అక్టోబర్ 17: శాసనసభా నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీ
 అక్టోబర్ 21: నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో నిరసన కార్యక్రమాలు, మానవహారాలు
 అక్టోబర్ 24: అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువజనులతో బైక్ ర్యాలీలు
 అక్టోబర్ 26: జిల్లాల్లోని సర్పంచ్‌లు, సర్పంచ్‌కు పోటీ చేసిన అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో ఒక రోజు దీక్ష
 అక్టోబర్ 29: అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు
 నవంబర్ 01: అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ, సమైక్యాంధ్రను కోరుతూ తీర్మానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement