వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్ర మంగళవారం ముగిసింది.
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన మూడో విడత రైతు భరోసా యాత్ర సోమవారం ముగిసింది. అప్పులబాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించి, వారికి అండగా ఉంటామని ఓదార్చారు. రైతులు బలవన్మరణాలను ఆశ్రయించడం సరి కాదంటూ వారికి భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ ఈ యాత్ర చేపట్టారు.
అనంతపురం జిల్లాలో వారం రోజుల్లో వైఎస్ జగన్ 725 కిలో మీటర్ల మేర పర్యటించినట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు తలశిల రఘరాం, శంకర్ నారాయణ చెప్పారు. కళ్యాణదుర్గం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. 17 మంది అన్నదాతల కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ ఇప్పటిదాకా మూడు విడతల్లో 42 రైతు కుటుంబాలకు భరోసా కల్పించారు. వైఎస్ జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 26వ తేదీ వరకు తొలి విడత, మే 11వ తేదీ నుంచి 18 వరకు రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు.