వైఎస్‌ఆర్‌ పాదయాత్ర స్ఫూర్తిదాయకం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy tweets on ysr's padayathra | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ పాదయాత్ర స్ఫూర్తిదాయకం: వైఎస్‌ జగన్‌

Apr 9 2017 8:35 PM | Updated on Jul 25 2018 4:42 PM

వైఎస్‌ఆర్‌ పాదయాత్ర స్ఫూర్తిదాయకం: వైఎస్‌ జగన్‌ - Sakshi

వైఎస్‌ఆర్‌ పాదయాత్ర స్ఫూర్తిదాయకం: వైఎస్‌ జగన్‌

ప్రజల కోసం, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సరిగ్గా 14 ఏళ్ల కిందట దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన మహాత్తరమైన పాదయాత్ర స్ఫూర్తిని ఆయన తనయుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.

హైదరాబాద్‌: ప్రజల కోసం, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సరిగ్గా 14 ఏళ్ల కిందట దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన మహాత్తరమైన పాదయాత్ర స్ఫూర్తిని ఆయన తనయుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ప్రజల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్న ఆయన ప్రజాప్రస్థాన పాదయాత్ర ఎల్లప్పుడూ గుర్తు ఉంటుందని, ఎల్లవేళలా స్ఫూర్తిని పంచుతుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

’14 ఏళ్ల కిందట మండే ఎండలో ఆయన తన ప్రజల కోసం గొప్ప పాదయాత్రను చేపట్టారు. ప్రజల ప్రేమాభిమానాల్ని పొందారు. ఆయన పాదయాత్ర ఎల్లప్పుడూ గుర్తుంటుంది. ఆయన ఎల్లవేళలా స్ఫూర్తి పంచుతూనే ఉంటారు’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement