ఒడిషాలో దారుణం జరిగింది. పాతికేళ్ల మహిళపై దారుణంగా అత్యాచారం చేసి, ఆపై ఆమెను హతమార్చారు.
ఒడిషాలో దారుణం జరిగింది. పాతికేళ్ల మహిళపై దారుణంగా అత్యాచారం చేసి, ఆపై ఆమెను హతమార్చారు. ఆమె మృతదేహాన్ని జాజ్పూర్ జిల్లా వ్యాస్ నగర్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె శరీరం మీద గాయాలైన గుర్తులున్నాయి. ఆమె ధరించిన చీరనే మెడచుట్టూ మూడు నాలుగు చుట్లు చుట్టినందువల్ల ఆమె ఊపిరాడక మరణించి ఉంటుందని జాజ్పూర్ రోడ్ డీఎస్పీ జేకే దాస్ తెలిపారు.
ఆమె మృతదేహాన్ని బట్టి చూస్తే హత్యకు ముందు ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోందని, అయితే ఇంకా పోస్టుమార్టం నివేదిక మాత్రం వెల్లడి కావాల్సి ఉందని చెప్పారు. సమీపంలోని రాంపాస్ గ్రామానికి చెందిన ఆ మహిళ.. తన తల్లితో కలిసి నివసిస్తుంటుంది. గురువారంనాడు సమీపంలోని ఓ మార్కెట్కు వెళ్లిన తర్వాతి నుంచి ఆమె కనిపించకుండా పోయింది.