ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించి.. తల్లి ఆత్మహత్య | Woman kills self along with two minor daughters | Sakshi
Sakshi News home page

ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించి.. తల్లి ఆత్మహత్య

Aug 19 2013 1:59 PM | Updated on Nov 6 2018 7:53 PM

రాజస్థాన్లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ కుమార్తెలపై కిరోసని్ పోసి నిప్పంటించిన ఓ మహిళ.. ఆ తర్వాత తానూ అదే మంటల్లో నిలువునా కాలిపోయింది.

రాజస్థాన్లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ కుమార్తెలపై కిరోసని్ పోసి నిప్పంటించిన ఓ మహిళ.. ఆ తర్వాత తానూ అదే మంటల్లో నిలువునా కాలిపోయింది. ఈ ఘోర సంఘటన రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో జరిగింది. కాలి పహాడి ప్రాంతానికి చెందిన సుమన్ అనే మహిళ ఎందుకు ఈ ఘోరానికి పాల్పడిందో తెలియరాలేదు. తనతో పాటు మూడేళ్ల మనీషా, ఆరునెలల చేతన అనే ఇద్దరు చిన్నారి కుమార్తెలపై కూడా కిరోసిన్ పోసి.. నిప్పంటించుకుంది.

ఆమె భర్త అశోక్ రోజుకూలీగా పనిచేస్తాడు. ముందుగా ఓ గదిలోకి వెళ్లి, లోపలి నుంచి గడి పెట్టుకుని తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు అశోక్ చెప్పాడు. తాను తలుపు బద్దలుకొట్టి చూడగా అప్పటికే మొత్తం పొగ ఆవరించినట్లు తెలిపాడని పోలీసు అధికారి బగర్ గోపీరాం చెప్పారు.

అయితే.. ఇది స్పష్టంగా హత్య తప్ప ఆత్మహత్య కానే కాదని సుమన్ బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాలను బట్టి మాత్రం అది ఆత్మహత్యగానే తాము భావిస్తున్నామన్నారు. అయితే, ఆత్మహత్యకు కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement