breaking news
woman ablaze
-
బతికి ఉండగానే మహిళకు నిప్పంటించారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. బతికి ఉండగానే ఓ మహిళకు ఇద్దరు వ్యక్తులు నిప్పటించారు. ఈ ఘటనలో ఆమె శరీరం 60 శాతం మేర కాలిపోయింది. ప్రస్తుతం సీతాపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. సోదరులైన రాము, రాజేశ్‌లు గత కొంతకాలంగా సదరు మహిళను వేధిస్తున్నారు. కొన్ని రోజుల ముందు ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడగా ఆమె తప్పించుకుంది. ఆమె వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. కానీ అక్కడ పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. దీంతో బాధితురాలి బంధువులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే.. వారు కూడా అదే పోలీసు స్టేషన్‌కు వెళ్లమని సూచించారు. మరోసారి పోలీసు స్టేషన్ వెళ్లిన కూడా ఆమెకు నిరాశే ఎదురయింది. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. తమపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ప్రయత్నిస్తుండటంతో నిందితులు ఆమెపై కోపాన్ని పెంచుకున్నారు. ఆదివారం రోజున ఆ మహిళ బాత్రూమ్కు వెళ్లిన సమయంలో నిందితులు ఆమెకు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖంతోపాటు, పై భాగం కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ పోలీస్ అధికారి సుర్జీత్ పాండే ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి బంధువులతో మాట్లాడారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు లైంగిక వేధింపులతో పాటు, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన స్పందించకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని పాండే తెలిపారు. -
ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించి.. తల్లి ఆత్మహత్య
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ కుమార్తెలపై కిరోసని్ పోసి నిప్పంటించిన ఓ మహిళ.. ఆ తర్వాత తానూ అదే మంటల్లో నిలువునా కాలిపోయింది. ఈ ఘోర సంఘటన రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో జరిగింది. కాలి పహాడి ప్రాంతానికి చెందిన సుమన్ అనే మహిళ ఎందుకు ఈ ఘోరానికి పాల్పడిందో తెలియరాలేదు. తనతో పాటు మూడేళ్ల మనీషా, ఆరునెలల చేతన అనే ఇద్దరు చిన్నారి కుమార్తెలపై కూడా కిరోసిన్ పోసి.. నిప్పంటించుకుంది. ఆమె భర్త అశోక్ రోజుకూలీగా పనిచేస్తాడు. ముందుగా ఓ గదిలోకి వెళ్లి, లోపలి నుంచి గడి పెట్టుకుని తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు అశోక్ చెప్పాడు. తాను తలుపు బద్దలుకొట్టి చూడగా అప్పటికే మొత్తం పొగ ఆవరించినట్లు తెలిపాడని పోలీసు అధికారి బగర్ గోపీరాం చెప్పారు. అయితే.. ఇది స్పష్టంగా హత్య తప్ప ఆత్మహత్య కానే కాదని సుమన్ బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాలను బట్టి మాత్రం అది ఆత్మహత్యగానే తాము భావిస్తున్నామన్నారు. అయితే, ఆత్మహత్యకు కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.