కశ్మీర్ ప్రజల హక్కులేవి? | where is kashmir people rights | Sakshi
Sakshi News home page

కశ్మీర్ ప్రజల హక్కులేవి?

Apr 24 2015 1:39 AM | Updated on Jul 25 2018 1:49 PM

భారత అభ్యంతరాలను తోసిరాజని అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ మరోసారి ప్రస్తావించింది.

జకార్తా: భారత అభ్యంతరాలను తోసిరాజని అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ మరోసారి ప్రస్తావించింది. కశ్మీర్ ప్రజల స్వీయ నిర్ణయాధికారం ఇప్పటికీ నెరవేరకపోవడం విచారకరమని, అది ఆమోదనీయం కాదని వ్యాఖ్యానించింది. ఇండోనేసియాలోని జకార్తాలో జరుగుతున్న ఆసియాన్-ఆఫ్రికన్ సదస్సులో పాక్ ప్రతినిధిగా పాల్గొన్న సర్తాజ్ అజీజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అధ్యక్షతన గురువారం ఈ సదస్సు జరిగింది. అజీజ్ వ్యాఖ్యలపై భారత్ ఇదే సదస్సులో స్పందించింది. కశ్మీర్ ప్రస్తావనను అంతర్జాతీయ వేదికపై లేవనెత్తడం దురదృష్టకరమని విదేశాంగ శాఖ ప్రతినిధి అనిల్ వెంటనే బదులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement