వరంగల్‌కు సుచిరిండియా! | Warangal to sucirindiya | Sakshi
Sakshi News home page

వరంగల్‌కు సుచిరిండియా!

Apr 3 2015 11:36 PM | Updated on Sep 2 2017 11:48 PM

వరంగల్‌కు సుచిరిండియా!

వరంగల్‌కు సుచిరిండియా!

ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరుల్లో స్థిరాస్తి ప్రాజెక్ట్‌లను చేపట్టిన సుచిరిండియా తొలిసారిగా తెలంగాణ రెండో

హైదరాబాద్: ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరుల్లో స్థిరాస్తి ప్రాజెక్ట్‌లను చేపట్టిన సుచిరిండియా తొలిసారిగా తెలంగాణ రెండో రాజధానిగా పేరుగాంచిన వరంగల్ పట్టణంలోకి అడుగుపెట్టనుంది. ప్రభుత్వం సహకారం అందిస్తే ఈ ఏడాది ముగింపు నాటికి రూ.10 కోట్ల పెట్టుబడులతో వరంగల్‌లో అర్బన్ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ రిసార్ట్, మెగా షాపింగ్ మాల్ కం మల్టీప్లెక్స్ రెండు ప్రాజెక్ట్‌లను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుచిరిండియా ఇన్‌ఫ్రాటెక్ ప్రై.లి. సీఈఓ లయన్ కిరణ్ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ తర్వాత వరంగలే ఆయువు పట్టు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్-వరంగల్ మార్గం పైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మార్గంలో స్థిరాస్తి ప్రాజెక్ట్‌లూ చేపడితే అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. అందుకే వరంగల్ హైవేలోని యమ్నంపేటలో 8 ఎకరాల్లో సుచిర్ ఒడిస్సీ డ్యూప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 99 డ్యూప్లెక్స్‌లొస్తాయి. 1,200 చ.అ. విల్లా రూ.36 లక్షలు, 1,500 చ.అ. అయితే రూ.40 లక్షలు. శంషాబాద్‌లో 25 ఎకరాల్లో టింబర్ లీఫ్ విల్లా ప్రాజెక్ట్‌నూ నిర్మిస్తున్నాం. మొత్తం 123 విల్లాలు. 3,800 చ.అ. విల్లా ధర రూ.1.5 కోట్లుగా నిర్ణయించాం.

ఈనెలాఖరులోగా తుమ్ముకుంటలో 100 ఎకరాల్లో ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ఇందులో 25 శాతం ఓపెన్ ప్లాట్లు, 75 శాతంలో విల్లాలను నిర్మిస్తాం. 200 గజాల ప్లాట్ రూ.12 లక్షలు, 1,500 చ.అ. విల్లా ధర రూ.40 లక్షలు, 2,000 చ.అ. అయితే రూ.50 లక్షలు. వచ్చే నెలాఖరులోగా పుప్పాల్‌గూడలో 4.5 ఎకరాల్లో మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం. ఇందులో మొత్తం 220 ఫ్లాట్లొస్తాయి. 1,000 చ.అ. ఫ్లాట్ ధర రూ. 35-40 లక్షల మధ్య ఉంటుంది. గతేడాది రూ.65 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. ఈ ఏడాది రూ.100 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నాం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement